
సెల్ఫీ దర్శకుడు జాక్‌పాట్ కొట్టారు. జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటించిసంగీతాన్ని అందించిన చిత్రం సెల్ఫీ. వర్ష బొల్లమ్మ కథానాయికగా దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతినాయకుడిగా ఇందులో నటించారు. కలైపులి ఎస్.థాను సమర్పణలో మాదిమారన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డీజీ ఫిలిం కంపెనీ పతాకంపై శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 1న విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందింది.
ఈ విజయాన్ని చిత్రయూనిట్ మంగళవారం సాయంత్రం చెన్నైలో మీడియాతో పంచుకున్నారు. సెల్ఫీ చిత్రానికి ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, భారీ ఎత్తున విడుదల చేసిన కలైపులి.ఎస్ థానుకు నిర్మాత శబరీష్ ధన్యవాదాలు తెలిపారు. కాగా దర్శకుడు మదిమారన్ తన సంస్థలో మరో చిత్రం చేయడానికి ఇదే వేదికపై అడ్వాన్స్‌గా రూ.10 లక్షల చెక్కును థాను అందించడం గమనార్హం.
చదవండి: పాన్ ఇండియా సినిమాల సక్సెస్, కలవరపడుతున్న కోలీవుడ్
Comments
Please login to add a commentAdd a comment