ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే ట్రెండ్ నడుస్తోంది: ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్ | Tollywood Director Ram Gopal Varma about Demonte Colony 2 movie | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఇప్పుడు సినిమాలకు కేవలం అది ఉంటే చాలు: రాంగోపాల్ వర్మ

Published Wed, Aug 21 2024 8:03 PM | Last Updated on Wed, Aug 21 2024 8:37 PM

Tollywood Director Ram Gopal Varma about Demonte Colony 2 movie

అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న హారర్‌ థ్రిల్లర్‌ డీమాంటీ కాలనీ-2. ఈ సినిమాకు అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 2015లో వచ్చిన డీమాంటీ కాలనీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ కోలీవుడ్‌ మూవీని శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్‌పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ సంచలన డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ, అజయ్ భూపతి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. 'నేను ఇరవై ఏళ్ల క్రితం భూత్ అనే సినిమా చేశా. అది అంతా అపార్ట్ మెంట్‌లో జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అపార్ట్‌మెంట్స్‌లోకి వెళ్లేందుకు కొంతకాలం భయపడి చాలామంది వెళ్లలేదు. డీమాంటీ కాలనీ రిలీజ్ తర్వాత ఆ కాలనీ పేరు పెట్టినందుకు కాంట్రవర్సీ అయిందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నాతో చెప్పారు. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ ఫుల్. ఇప్పుడు మరో భాషలోకి వస్తోంది అంతే. నేను ఈ మూవీ ప్రీమియర్ చూడలేదు. కానీ ఇక్కడ ప్రీమియర్ చూసిన వాళ్ల నుంచి మంచి టాక్ వచ్చింది. ఇవాళ కంటెంట్‌ ఉంటే చిన్న సినిమాలు పెద్దవి అవుతున్నాయి. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు చూసే ట్రెండ్ నడుస్తోంది. అలాగే  తెలుగులోనూ డీమాంటీ కాలనీ 2 ఆదరిస్తారని కోరుకుంటున్నా' అన్నారు. కాగా.. డీమాంటీ కాలనీ 2 చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement