శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి | Bigg Boss 18 Fame Edin Rose Declares Love For Shreyas Iyer | Sakshi
Sakshi News home page

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి

Jun 7 2025 7:29 PM | Updated on Jun 7 2025 8:42 PM

Bigg Boss 18 Fame Edin Rose Declares Love For Shreyas Iyer

హిందీ బిగ్ బాస్ 18 ఫేమ్ ఎడిన్ రోజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత క్రికెటర్‌ శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్నానంటూ షాక్‌ ఇచ్చింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఎడిన్ రోజ్ హిందీలో రెండు సినిమాలు చేసింది. ఆపై తెలుగులో రవితేజ నటించిన 'రావణాసుర' చిత్రంలో ఒక స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం నయనతార నిర్మిస్తున్న కొత్త సినిమా LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. అయితే, తాజాగా ఫిల్మిగ్యాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

బిగ్ బాస్ 18తో భారీగా పాపులారిటీ తెచ్చుకున్న ఎడిన్ రోజ్, క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌తో తనకున్న అనుబంధాన్ని ఇలా చెప్పుకొచ్చింది. 'నా మనసులో, నేను ఇప్పటికే అతనిని ( శ్రేయాస్ అయ్యర్‌) వివాహం చేసుకున్నాను. నేను అతని పిల్లలకు తల్లిని అని నేను నమ్ముతున్నాను. అతను నాకు నచ్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అతను మంచి హైట్‌తో పాటు చామని ఛాయ రంగులో ఉంటాడు. ఎప్పుడూ తను గడ్డంతో కనిపిస్తూ మంచి కండలతో ఉంటాడు.భవిష్యత్‌లో భారత జట్టుకు కెప్టెన్‌ తప్పకుండా అవుతాడు. నా తండ్రిలాగే శ్రేయాస్ కూడా దక్షిణ భారతీయుడు.' అంటూ సంతోషంతో చెప్పుకొచ్చింది. తన తండ్రి ఒక తమిళయన్‌ అని చెప్పిన ఈ బ్యూటీ.. శ్రేయాస్ అయ్యర్‌ కూడా తమిళయన్‌ అంటూ పేర్కొంది. అయితే, ప్రస్తుతం వారు ముంబైలో స్థిరపడ్డారని చెప్పుకొచ్చింది. అయితే, ఇలా మనుసులో అనేసుకుంటే పెళ్లిళ్లు కావంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట అంటే తనకు చాలా ఇష్టమని ఎడిన్‌ రోజ్‌ చెప్పుకొచ్చింది. వారిద్దరూ ఆదర్శ దంపతులు అంటూ పేర్కొంది. 'వారు నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తారు. వారు చాలా పరిపూర్ణ జంట, చాలా అందంగా ఉండాలని కోరుకుంటాను. వారికి ఎప్పుడూ చెడు జరగకూడదని నేను ఆశిస్తున్నాను. వారు ఇలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.' అని కోరుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement