న్యూ ఇయర్ సందర్భంగా రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త ఏడాది అనేది కేవలం అప్పటి వరకు మాత్రమే ఉంటుందని పోస్ట్ చేశారు. ఈ రోజు 31 రాత్రి నుంచి జనవరి 1 మధ్యాహ్నాం వరకు మాత్రమేనని రాసుకొచ్చారు. మీరు మీ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి వచ్చాక అసలు విషయం అర్థమవుతుందన్నారు. గతేడాదిలో వెంటాడిన సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయని.. హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. రాంగోపాల్ వర్మ టాలీవుడ్‌లో సంచలన డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జున నటించిన శివ మూవీతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. ఆ తర్వాత ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆర్జీవీ డెన్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
శారీ మూవీ..
తాజాగా ఆర్జీవీ ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌గా శారీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్‌జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు.
శారీ కథేంటంటే..
ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది.
HAPPY NEW YEAR will last only from 31st night till 1st afternoon , when u wake up from ur hangover and realise that all the OLD YEAR’S problems are still there in the NEW YEAR 😎 #HappyOldYear
— Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2024
Comments
Please login to add a commentAdd a comment