దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు చేరి ‘అరెస్ట్’ పేరిట హడాడివి చేశారు. అయితే.. వర్మ తాను ఫిజికల్‌గా హాజరయ్యేందుకు సమయం కోరిన విషయాన్ని ఆయన లాయర్ బాల మీడియాకు వివరించారు.
‘‘విచారణకు రెండు వారాల సమయం కోరాం. ఈలోపు వర్చువల్‌గా విచారణకు తాను హాజరవుతానని వర్మ ఇదివరకే చెప్పారు. ఫిజికల్‌గా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలన్నారు అని న్యాయవాది తెలిపారు. అయితే.. ఇప్పటివరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ కాపీ అందించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. తమకు ఇచ్చిన నోటీసుల్లోనూ ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారు.
ఆర్జీవీ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని.. అందువల్లే డిజిటల్ విచారణకు హాజరవుతామని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని న్యాయవాది స్పష్టం చేశారు. అయితే.. ఈలోపే ఏపీ ప్రకాశం జిల్లా పోలీసులు ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి వచ్చారు. ఆయన కోసం వేచిచేస్తూ.. మీడియాలో హడావిడి ప్రదర్శించాక అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment