టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. తాను చేసిన ఒక్క పోస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదికి సూచించింది.
కేసులకు భయపడటం లేదు: ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment