సూర్యకు జోడీగా... | Andrea next movie with surya | Sakshi
Sakshi News home page

సూర్యకు జోడీగా...

Published Thu, Sep 10 2020 2:29 AM | Last Updated on Thu, Sep 10 2020 2:29 AM

Andrea next movie with surya - Sakshi

ఆండ్రియా

‘ఆకాశమే నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’) విడుదల కోసం వేచి చూస్తున్నారు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలు కమిట్‌ అయ్యారు. హరి దర్శకత్వంలో ఓ సినిమా. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు సూర్య. వెట్రిమారన్‌తో చేయబోతున్నది సూర్య కెరీర్‌లో 40వ సినిమా.

కలైపులి యస్‌ థాను నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాడివాసల్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తారట. అందులో పల్లెటూరి రైతు పాత్ర ఒకటని సమాచారం. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఆండ్రియా నటిస్తారట. వెట్రిమారన్‌ తీసిన ‘వడ చెన్నై’లో ఓ కీలక పాత్ర చేశారు ఆండ్రియా. ‘వాడివాసల్‌’లో సూర్య, ఆండ్రియా పాత్రలు పోటాపోటీగా ఉంటాయని కోలీవుడ్‌ సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement