Vetri Maaran
-
'హిట్ సినిమాకు సీక్వెల్.. వాయిదా ప్రసక్తే లేదు'
కోలీవుడ్ హాస్యనటుడు సూరి కథానాయకుడుగా పరిచయమైన చిత్రం 'విడుదలై'.. వెట్రిమారన్ దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో మెప్పించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విడుదలై–2 చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి, నటి మంజు వారియర్‌తో పాటు బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, కిషోర్, కెన్ కరుణాస్, రాజీవ్ మీనన్, గౌతమ్ మేనన్ బోస్ వెంకట్, భవాని శ్రీ, విన్సెంట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతాన్ని వేల్ రాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఇటీవలే చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలను చైన్నెలో ప్రారంభించినట్లు నిర్మాతల వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండవ భాగంలో నటి మంజు వారియర్, నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించిన ముఖ్యమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయన్నారు. వారి ప్రతిభావంతమైన నటన ఈ చిత్రంపై మరింత అంచనాలను పెంచిందన్నారు. అయితే, సినిమా వాయిదా పడుతుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని చిత్ర యూనిట్ పేర్కొంది. ముందుగా ప్రకటించిన తేదీలోనే మూవీని రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాగా వి.మణికంఠన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విడుదలై– 2 చిత్రాన్ని డిసెంబర్ 24 తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. -
కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా పేరు తెచ్చుకునేంత వరకు వెళ్లిన నటుడు సూరి. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇతడు గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. ఇప్పుడు 'గరుడన్'గా రాబోతున్నాడు. ఉన్ని ముకుందన్, సముద్రఖని, రేవతీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మే 31న థియేటర్లలోకి రాబోతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందించిన ఈ సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. 'గరుడన్' ఆడియో ఈవెంట్ తాజాగా జరగ్గా దీనికి తమిళ స్టార్ హీరోలు విజయసేతుపతి, శివకార్తీకేయన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'హాస్య నటులని చులకనగా చూడొద్దు. ఓ టైంలో హీరోగా చేయమని సూరికి సలహా ఇచ్చాను. కానీ ఆయన కాస్త భయపడ్డాడు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి.. వెట్రిమారన్ తనని హీరోగా పెట్టి మూవీ చేస్తున్నానని, కానీ కాస్త దడ పుడుతోందని అన్నాడు. అయితే కామెడీ నటులు సీరియస్ పాత్రల్లో నటించగలరు గానీ సీరియస్ నటులు కామెడీ పాత్రలు చేయలేరు. అందుకు సూరినే ఓ ఉదాహరణ' అని శివకార్తికేయన్ చెప్పాడు. తనని హీరోగా మార్చిన వెట్రిమారన్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని సూరి ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్
ధనుష్ హీరోగా వడచైన్నె- 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని దర్శకుడు వెట్రిమారన్ పేర్కొన్నారు. 2018లో పార్ట్-1 ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. తాజాగా తమిళ్ సినిమా చిత్ర పాత్రికేయుల సంఘం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు వెట్రిమారన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ కథా నాయకుడిగా వడచైన్నె - 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు రెండు చిత్రాలు చేయాల్సి ఉందన్నారు. (ఇదీ చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) అదే విధంగా నటుడు సూర్య కథా నాయకుడిగా ఆజన్బీ పుస్తకాన్ని చిత్రంగా తెరకెక్కించాలని అసురన్ చిత్ర షూటింగ్ సమయంలోనే నిర్ణియించానన్నారు. షూటింగ్‌కు ప్రారంభించాలనుకున్న సమయంలో కరోనా రావడంతో అది ఆగిపోయిందని చెప్పారు. పార్ట్-2 కథ రెడీగానే ఉంది. త్వరలో హీరో ధనుష్‌తో చర్చిస్తానని ఆయన పేర్కొన్నాడు. తాజాగా తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన 'విడుదల' సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో కమెడియన్ సూరి హీరోగా నటించగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషించాడు. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) -
Vidudhala Movie Review: వెట్రిమారన్ ‘విడుదల పార్ట్-1’ రివ్యూ
టైటిల్: విడుదల పార్ట్-1 నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి,భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులు నిర్మాత : ఎల్రెడ్ కుమార్ దర్శకత్వం: వెట్రిమారన్ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్ విడుదల తేది: ఏప్రిల్ 15, 2023 కథేంటంటే.. పోలీసులకు, ప్రజా దళం అనే ఒక రివల్యూషనరీ గ్రూప్ కి మధ్య నడిచే కథ ఇది. కుమరేశన్ (సూరి) పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ప్రజాదళం సభ్యులకు, పోలీసులకు నిత్యం ఎన్కౌంటర్ జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్ పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకుప్రైవేట్ కంపెనీతో కలిసి క్యాంపుని నిర్వహిస్తుంది పోలీసు శాఖ. ఇక డ్రైవర్ కుమరేశన్ అడవిప్రాంతంలో డ్యూటీ చేసే పోలీసులకు నిత్యం ఆహారం సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో అడవిలో నివసించే యువతి తమిళరసి అలియాస్ పాప(భవాని శ్రీ)తో ప్రేమలో పడతాడు. మరోవైపు తనపై అధికారికి తెలియకుండా కొండ ప్రాంతానికి చెందిన మహిళను కాపాడి అతని ఆగ్రహానికి గురవుతాడు. ఓసారి పెరుమాళ్ ఆచూకి కోసం కొండప్రాంతంలో నివసించేవారందరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటారు. అందులో కుమరేశన్ ఇష్టపడిన యువతి తమిళరసి కూడా ఉంటుంది. పోలీసులు పెట్టే చిత్ర హింసలు చూడలేక కుమరేశన్ ఏం చేశాడు? పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి పాత్ర పోషించాడు? డీఎస్పీ సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? చివరకు పెరుమాళన్ దొరికాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కల్ట్ కంటెంట్ తో సామాజిక మూలలలోకి వెళ్లి కథలని తెర పై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సమాజంలో అణచివేయబడుతున్న ఒక వర్గం వేదన కనిపిస్తుంది. మనం ఎక్కడో విన్న, చూసిన సంఘటలనే ఆయన సినిమాగా తెరకెక్కిస్తుంటాడు. విడుదల పార్ట్ 1 కూడా ఆ తరహా సినిమానే. 1987 ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం లోని ఒక ప్రాంతం లో జరిగే కథ. పోలీసులకు, ప్రజాదళం అనే ఒక విప్లవ పార్టీ కి మధ్య జరిగే సంఘర్షణ ఇది. ట్రైన్ యాక్సిడెంట్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. రైలు ప్రమాదపు దృశ్యాలను చాలా సహజంగా చూపించాడు. ఆ తర్వాత కథ మొత్తం కుమరేశన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిజాయితీగా ఉండే పోలీసులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? పై అధికారులు కిందిస్థాయి అధికారులతో ఎలా ప్రవర్తిస్తారనేది కుమరేశన్ పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. పోలీసులు, నక్సలైట్ల మధ్య పోరు కారణంగా సామాన్య ప్రజలు ఎలా నలిగిపోయారనే కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం లేదు. తమిళ నెటివిటీ మరీ ఎక్కువైంది. కాకపోతే ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. కొన్ని సన్నివేశాలు హృదయాలను కలిచివేస్తాయి. ముఖ్యంగా పెరుమాళ్ కోసం ఊర్లోని ఆడవాళ్లను పోలీసులు హింసించే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. అదే సమయంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పార్ట్ 2 కోసం కొన్ని అనవసరపు సన్నివేశాలను జోడించారనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఆట్టుకోవడంతో పాటు పార్ట్ 2పై ఆసక్తిని పెంచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. కమెడియన్‌గా ఇన్నాళ్లు నవ్వించిన సూరి.. ఇందులో కొత్త పాత్రను పోషించాడు. కుమరేశన్ పాత్రలో సూరి జీవించేశాడు. అసలు ఈ పాత్ర కోసం వెట్రిమారన్.. సూరిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కమెడియన్లో ఈ యాంగిల్ ఎలా పసిగట్టాడనిపిస్తుంది. ఈ చిత్రంతో సూరి కేరీర్ చేంజ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. ఆయన తెరపై కనిపించేంది కొన్ని నిమిషాలే అయితే.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పార్ట్ 2లో విజయ్ సేతుపతి పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కొండప్రాంతానికి చెందిన యువతి పాప అలియాస్ తమిళరసిగా భవాని శ్రీ అద్భుతంగా నటించింది. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరామెన్ పనితీరు అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్ : 2.75/5 -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తెలుగు లో సెన్సెషన్ క్రియేట్ చేయనున్న మరో కన్నడ సినిమా
-
ప్లాన్ చేంజ్చేసిన సూర్య.. ఒకే టైమ్‌లో రెండు చిత్రాలు
హీరో సూర్య, దర్శకుడు బాల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే దర్శకుడు వెట్రి మారన్‌తో సూర్య ఇప్పటికే ‘వాడివాసల్’ చిత్రానికి పచ్చజెండా ఊపారు. అయితే బాల సినిమా మేజర్ షూటింగ్ పూర్తయిన తర్వాతే ‘వాడివాసల్’ రెగ్యులర్ షూట్లో సూర్య పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే సూర్య ప్లాన్ చేంజ్ అయింది. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను ఒకే టైమ్‌లో పూర్తి చేసేట్లుగా సూర్య రెడీ అవుతున్నారట. ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కోలీవుడ్ టాక్. జల్లికట్టు నేపథ్యంలో ‘వాడివాసల్’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా టెస్ట్ షూటింగ్లో పాల్గొంటున్నారు సూర్య. ఈ సినిమా లొకేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. -
లగ్జరీ బైక్ కొన్న ప్రముఖ దర్శకుడు, ధర ఎంతంటే?
ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కొత్త బైక్ కొన్నాడు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తన కలల బైక్‌ను సొంతం చేసుకున్నాడు. లగ్జరీ బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూకు చెందిన హైస్పీడ్ సూపర్ బైక్‌ను తన ఇంటికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ బైక్ ధర దాదాపు 18 లక్షల రూపాయలపైనే ఉంటుందని తెలుస్తోంది. కాగా వెట్రిమారన్ అసురన్, పొల్లధవన్, వడ చెన్నై వంటి పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఆయన 'విడుతాలై' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీని తర్వాత సూర్యతో 'వడివాసల్' సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో పలు ప్రాజెక్టులు పట్టాలెక్కించనున్నాడు. -
ధనుష్ ఓ సెన్సేషన్
-
సెన్సార్షిప్ అడ్డుపుల్లలు.. భగ్గుమంటున్న మేకర్లు
న్యూఢిల్లీ/చెన్నై: కేంద్రం జారీ చేసిన సినిమాటోగ్రఫీ(సవరణ బిల్లు 2001)పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కొత్త సవరణల ప్రకారం.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) సర్టిఫై చేసిన సినిమాపై ఎవరైనా (ఒక్కరైనా సరే) అభ్యంతరం గనుక వ్యక్తం చేస్తే. మళ్లీ రీ సర్టిఫికేషన్ కోసం అడిగే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాదు పైరసీకి సంబంధించిన శిక్షలతో పాటు ఏజ్ బేస్డ్ సర్టిఫికేషన్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే సర్టిఫికెట్ గండం దాటేందుకు మేకర్లు నానా తంటాలు పడుతున్న టైంలో.. కొత్త సవరణలు పెద్దతలనొప్పిగా మారే అవకాశం ఉందని సినీ పెద్దలు భావిస్తున్నారు. ప్రముఖ ఫిల్మ్‌మేకర్ శ్యామ్ బెనగల్ నేతృత్వంలోని కమిటీ గతంలో కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. ఏదైనా సినిమాను చూసే సభ్యులు దానికి ఏజ్ సర్టిఫికేట్ ఇవ్వాలే తప్ప.. సినిమాను సెన్సార్ చేసే హక్కు ఉండకూడదని కమిటీ సూచించింది. కానీ, కేంద్రం దానిని పెడచెవిన పెట్టింది. ఇప్పటికీ అభ్యంతరకరం పేరుతో దృశ్యాలను తొలగించడం, డైలాగులను మ్యూట్ చేయడం నడుస్తోంది. ఇక సీబీఎస్సీ రెండు ప్యానెల్లు(ఎగ్జామైనింగ్ కమిటీ, రివైజింగ్ కమిటి) గనుక సర్టిఫికేషన్‌ను నిరాకరిస్తే.. ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పలేట్ ట్రిబ్యునల్’ ఫిల్మ్ మేకర్లకు ఊరట ఇచ్చేది. కానీ, ఏప్రిల్‌లో ఆ ట్రిబ్యునల్‌ను నిషేధిస్తున్నట్లు కేంద్రం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కత్తెరల పంచాయితీపై నిర్మాతలు ఇకపై కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కంట్రోల్ చేస్తున్నారా? ఇక సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952కు చేసిన తాజా సవరణలు చాలావరకు సినిమా రిలీజ్ టైంలో అడ్డుపడేందుకు వీలున్నవే. పైగా వ్యక్తిగత కక్క్ష్యలతో, రాజకీయ దురుద్దేశంతో అడ్డుతగిలే అవకాశం ఉందని పలువురు సినీ పెద్దలు భావిస్తున్నారు. ఓటీటీకీ సెన్సార్, ఫీచర్ ఫిల్మ్ సెన్సార్ నిబంధనలను సంక్లిష్టంగా మారుస్తూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరోసారి తీసుకున్న నిర్ణయం పై పలువురు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. కేరళ మూవీ అకాడమీ చైర్పర్సన్ కమల, కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఆనంద్ పట్వార్దాన్ తదితరులు తాజా నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ‘సినిమా తీసేవాళ్లను ఈవిధంగా నియంత్రించాలని చూస్తున్నారు.. ఇది రాజ్యాంగవిరుద్ధం’ అని కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ మండిపడ్డాడు. ఈ విషయంపై తమిళనాడు దర్శకుల అసోషియేషన్ కార్యదర్శి ఆరే సెల్వమణితో మాట్లాడిన వెటట్రి.. బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశాడు. యుబైఎలోనూ వయసువారీగా.. ప్రధానంగా సినిమాలను ‘యు’, ‘యు/ఎ’, ‘ఎ’ ‘ఆర్’ సర్టిఫికెట్లుగా ఇస్తూ వస్తున్నారు. ‘యు’ అంటే అందరూ చూడదగ్గ చిత్రం, ‘యు / ఎ’ అంటే పెద్దల సమక్షంలో పిల్లలు చూడదగ్గ చిత్రం, ‘ఎ’ అంటే 18 సంవత్సరాల పైబడిన వారు చూడదగ్గ చిత్రం. అయితే తాజా సవరణలతో ‘యు/ఎ’ సర్టిఫికెట్‌నూ మూడు కేటగిరీలుగా విభజించారు. యు /ఎ 7 ప్లస్, యు /ఎ 13 ప్లస్, యు /ఎ 16 ప్లస్ అని. అంటే పెద్దల సమక్షంలో కూడా ఏడు సంవత్సరాలు, పదమూడు సంవత్సరాలు, పదహారు సంవత్సరాల పైబడ్డ వారు చూసే చిత్రాలుగా విజభించారు. సెన్సార్షిప్ అడ్డుపుల్లలతో ఫిల్మ్మేకర్లను గిచ్చిగిల్లుతున్న కేంద్రం.. మరోవైపు కొత్తసవరణలపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలువు ఇవ్వడం కొసమెరుపు. చదవండి: సెన్సార్.. సెన్సార్.. సెన్సార్ -
సూర్యకు జోడీగా...
‘ఆకాశమే నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’) విడుదల కోసం వేచి చూస్తున్నారు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలు కమిట్ అయ్యారు. హరి దర్శకత్వంలో ఓ సినిమా. వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు సూర్య. వెట్రిమారన్‌తో చేయబోతున్నది సూర్య కెరీర్లో 40వ సినిమా. కలైపులి యస్ థాను నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాడివాసల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తారట. అందులో పల్లెటూరి రైతు పాత్ర ఒకటని సమాచారం. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా ఆండ్రియా నటిస్తారట. వెట్రిమారన్ తీసిన ‘వడ చెన్నై’లో ఓ కీలక పాత్ర చేశారు ఆండ్రియా. ‘వాడివాసల్’లో సూర్య, ఆండ్రియా పాత్రలు పోటాపోటీగా ఉంటాయని కోలీవుడ్ సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అవుతుంది. -
నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్ కథలు
బాలీవుడ్ అగ్ర దర్శకులు జోయా అక్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్‌లతో ‘లస్ట్ స్టోరీస్’ అనే యాంథాలజీ (ఇద్దరు ముగ్గురు దర్శకులు కలసి ఒక్కో భాగానికి దర్శకత్వం వహించడం) రూపొందించింది నెట్ఫ్లిక్. తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’ను తీసుకు రాబోతోంది. సందీప్‌రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి ఒక్కో భాగాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పుడు తమిళంలోనూ నెట్ఫ్లిక్ ఓ యాంథాలజీ ప్లాన్ చేసిందని సమాచారం. దర్శకులు గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్‌లు ఈ యాంథాలజీను డైరెక్ట్ చేయనున్నారట. ఇది తమిళ వెర్షన్ ‘లస్ట్ స్టోరీస్’ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
యువ రాక్షసుడు
సినిమా సినిమాకు లుక్స్ మార్చే హీరోల్లో తమిళ నటుడు ధనుష్ ఒకరు. ఒకే సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తుంటారు. ప్రస్తుతం ధనుష్ ‘అసురన్’ (రాక్షసుడు అని అర్థం) అనే సినిమా చేస్తున్నారు. వెట్రిమారన్ దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో ‘పొల్లాదవన్, ఆడుకళం, వడ చెన్నై’ సినిమాలు వచ్చాయి. ‘అసురన్’ సినిమాలో ధనుష్ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రెండు విభిన్న గెటప్స్‌లో ధనుష్ కనిపిస్తారు. యంగ్ ఏజ్‌లో లుక్ ఒకటి. ఓల్డ్ ఏజ్ లుక్ మరోటి. వృద్ధుడిగా ఉన్న లుక్‌ను ఇంతకుముందే రిలీజ్ చేసేశారు. ఆ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు రిలీజ్ చేసిన యంగ్ లుక్ కూడా బాగుందంటున్నారు. ‘వేక్కై’ అనే తమిళ నవల ఆధార ంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది. -
ఇంకొక్కడున్నాడు
సినిమా ముఖ్యంగా తమిళ సినిమా వైవిధ్యాన్ని వెతుక్కుంటూ పోతోందని చెప్పవచ్చు. కథానాయకులు, దర్శకులు కొత్తదనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. దర్శకుడు వెట్రిమారన్ వైవిధ్యానికి చిరునామా అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయన చిత్రాల్లో ఇతర చిత్రాలకు భిన్నంగా పాత్రలు చోటు చేసుకుంటాయి. నటులను అందుకు తగ్గట్టుగానే మార్చేస్తారు. వెట్రిమారన్ ఇంతకు ముందు తెరకెక్కించిన ఆడుగళం, పొల్లాదవన్, వడచెన్నై లాంటి చిత్రాలను గమనిస్తే ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మూడు చిత్రాల్లోనూ ధనుషే కథానాయకుడు. అందులో ఆయన పోషించిన పాత్రలు ఒకదానికి ఒకటి పోలికే ఉండదు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం అసురన్. ఇందులో ధనుష్‌కు జంటగా మలయాళ నటి మంజువారియర్ నటించడం మరో విశేషం. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది తాజా సమాచారం. అదే విధంగా ఇందులో ఆయన గెటప్ చూస్తుంటే రైతుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అసురన్ చిత్రంలో ధనుష్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇందులో 45 ఏళ్ల తండ్రి పాత్ర కొంచెం సేపే ఉన్నా దాని ప్రభావం కథపై చాలానే ఉంటుందని చెప్పారు. అదే విధంగా తండ్రీ కొడుకులుగా ధనుష్ చూపిస్తున్న వైవిధ్యభరిత నటన అందరినీ ఆకర్షిస్తుందని దర్శకుడు అన్నారు. ఇందులో ఒక కొండ ప్రాంతంలో జరిగే సన్నివేశాన్ని దాదాపు 6 గంటల పాటు చిత్రీకరించాం. అయినా ఎలాంటి అసహనం చెందకుండా ధనుష్ నటించారని దర్శకుడు వెట్రిమారన్ తెలిపారు. ధనుష్ ఈ చిత్రంతో పాటు దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలోనూ నటిస్తున్నారు. ఇందులోనూ ఆయన ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. ఇలా ఒకే సారి రెండు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేస్తున్న నటుడు ఈయనే అవుతారేమో. -
ధనుష్‌కు జోడీగా సీనియర్ హీరోయిన్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం అసురన్. ఇటీవల మారి 2తో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ధనుష్ అసురన్ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో అలరించనున్నాడు. ధనుష్ హీరోగా వడా చెన్నై సిరీస్‌ను తెరకెక్కిస్తున్న వెట్రీ మారన్ ఈసినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో ధనుష్‌కు జోడిగా ఓ సీనియర్ నటి కనిపించనుందట. వెక్కై నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్గా నటించనుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న మంజు.. తనకన్నా చిన్నవాడైన ధనుష్‌కు జోడిగా నటిస్తుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. -
అసురుడు
కొన్ని కాంబినేషన్లు ఎన్నిసార్లు కుదిరినా ఆడియన్స్ మొదటిసారిలానే ఎగై్జటింగ్‌గా ఫీల్ అవుతారు. తమిళంలో హీరో ధనుశ్, డైరెక్టర్ వెట్రిమారన్‌లది అలాంటి కాంబినేషనే. ‘పొల్లాదవన్, ఆడుకళమ్, వడ చెన్నై’తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న వీరు మరో సినిమాకు కలసి పని చేయనున్నారు. ‘అసురన్’ అనే టైటిల్‌తో రూపొందబోయే ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. వి. క్రియేషన్స్ బ్యానర్‌పై యస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిసున్నారు. అలాగే ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మారి 2’ తెలుగులో మంచి టాక్‌తో దూసుకుపోతుందని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన శ్రీరామ్ తెలిపారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు స్పందన బావుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు. అందుకే వచ్చే వారం నుంచి మరికొన్ని థియేటర్స్ యాడ్ చేయనున్నాం’’ అని శ్రీరామ్ అన్నారు. -
వన్స్‌మోర్
ఓ సినిమా హిట్ అయిందంటే ఆ కాంబినేషన్లో మరో చిత్రం ఎప్పుడు వస్తుందా? అనుకుంటుంటారు. ఆ కాంబినేషన్ మరోసారి కలసి పని చేస్తోందంటే ఇటు అభిమానులు, అటు ఇండస్ట్రీ కచ్చితంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అలా ఎన్నిసార్లు కలసి పని చేసినా వన్స్‌మోర్ అంటుంది. తమిళంలో అలాంటి యాక్టర్, డైరెక్టర్ కాంబినేషనే ధనుష్–వెట్రిమారన్. వీళ్ల కాంబినేషన్లో ‘పొల్లదావన్, ఆడుకుళం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘వడ చెన్నై’ అనే మూడు భాగాల గ్యాంగ్‌స్టర్ డ్రామాలోని ఫస్ట్ పార్ట్ ఈనెల 17న రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమా కోసం ఈ కాంబినేషన్ రిపీట్ కానుందట. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందట. సాహిత్య అకాడమీ అవార్డ్ పొందిన ‘వెక్కై’ అనే నవల అధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. -
మనీషాకు మరో చాన్స్..!
వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్. ఆయన నటుడు ధనుష్‌తో కలిసి నిర్మించిన విచారణై, కాక్కాముట్టై వంటి చిత్రాలు సామాజిక సమస్యలపై తెరకెక్కి మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. తాజాగా యువ దర్శకుడు రామ్‌నాథ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు వెట్రిమారన్. రామ్‌నాథ్ ఇంతకు ముందు జీవా, నయనతార జంటగా నటించిన తిరునాళ్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. తాజాగా ఇన్వెస్టిగేటివ్ కథాంశాన్ని తీసుకుని వెట్రిమారన్ గ్రాస్‌రూట్ సంస్థలో చిత్రం చేయనున్నారు. ఇందులో నటి మనీషా యాదవ్ కథానాయకిగా నటించనుంది. మోడ్రన్ పాత్రలకైనా, గ్రామీణ యువతిగానైనా నటించి మెప్పించగల నటి మనీషాయాదవ్. తొలి చిత్రం వళక్కు ఎన్ 18/9 చిత్రంతోనే తనదైన నటనతో ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, త్రిషా ఇల్లన్నా నయనతార వంటి చిత్రాల్లో నటించింది. త్రిషా ఇల్లన్నా నయనతార చిత్రంలో తనను అశ్లీలంగా చూపించారని ఆ చిత్ర దర్శకుడిపై ఆరోపణలు గుప్పించి సంచలన సృషించిన ఈ అమ్మడు నటనకు కొంత కాలం దూరమైంది. అలా అనడం కంటే ఈ జాణను చిత్ర పరిశ్రమ దూరంగా పెట్టిందనే చెప్పాలి. ఇటీవల ఒరు కుప్పెకథై చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఈ అమ్మడికి నిర్మాత వెట్రిమారన్ అవకాశం ఇచ్చారు. ఇందులో మనీషా యాదవ్ గ్రామీణ యువతి పాత్రలో నటించనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్ నవంబర్‌లో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో మనీషా యాదవ్ పాత్ర చాలా బలంగా ఉంటుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. దీనితో పాటు మరో చిత్రం మనిషాను వరించింది. కొత్త దర్శకుడు మిల్కా సెల్వకుమార్ చిత్రంలోనూ నటించడానికి మనీషాయాదవ్ పచ్చజెండా ఊపింది. ఇది హర్రర్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. -
ఒక్కడి చావుతో యుద్ధం ఆగదు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం వడ చెన్నై. ఆడుకాలం తర్వాత విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్లో ధనుష్ నటిస్తున్న చిత్రం కావటంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఒక్కడి చావుతో ఈ యుద్ధం ఆగదు....గెలుపైనా ఓటమైనా...యుద్ధం చేయక తప్పదు....మనం ప్రతిఘటించకపోతే....వారు మనల్ని అణగదొక్కుతూనే ఉంటారు......ఇది మన ఊరు....గుడిసెలైనా...చెత్త కుప్పలైనా....వాటిని కాపాడుకోవడం కోసం మనం పోరాడాల్సిందే....``అని ధనుష్ సింపుల్ గా చెప్పిన డైలాగ్స్...చాలా పవర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకున్నాయి. మొత్తం మూడు గెటప్స్‌లో ధనుష్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. క్యారమ్స్ ఛాంపియన్.. కత్తి పట్టి గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు?.. ఆ తర్వాత పరిస్థితులేంటి అన్నదే కథ. ఐశ్వర్య రాజేష్, ఆండ్రియా, కిషోర్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం మూడు పార్టులుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వడ చెన్నై టీజర్ రీలిజ్
-
ధనుష్ ‘వడ చెన్నై’ ఫస్ట్ లుక్
పొల్లాదవన్ , ఆడుగలం సినిమాలతో సక్సెస్ సాధించిన హీరో ధనుష్, దర్శకుడు వెట్రి మారన్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వడ చెన్నై. ధనుష్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా మరో కీలక పాత్రలో నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సంతోష్ నారాయణ్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ధనుస్ మాస్‌లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రంజాన్ కానుకగా జూన్ 14న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. #vadachennai first look !! #அன்பு it’s not just his name. pic.twitter.com/22J4wOOSkH — Dhanush (@dhanushkraja) 8 March 2018 -
వడాచెన్నై మొదలైంది
తమిళ స్టార్ హీరో ధనుష్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఎంతో ఆశపడి చేయాలనుకున్న వడాచెన్నై ట్రయాలజీ ఫైనల్‌గా మొదలైంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఆడుకాలం సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు వెట్రిమారన్, ఈ సినిమాకు దర్శకుడు. ఆడుకాలం రిలీజ్ తరువాత వెంటనే వడాచెన్నై సినిమాను చేయాలని ప్లాన్ చేసినా.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా తొలి భాగాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్గా సమంతను తీసుకున్నారు. అయితే సమంత ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పటంతో ధనుష్ లక్కీ హీరోయిన్ అమలాపాల్‌ను ఫైనల్ చేశారు. ఇప్పటికే తొడరి సినిమా షూటింగ్ పూర్తి చేసిన ధనుష్ వడాచెన్నైతో పాటు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. #vadachennai - trilogy.Started shooting for part 1 today. director of polladhavan,aadukalam @VetriMaaran .bless us pic.twitter.com/Sq1nKoOXAn — Dhanush (@dhanushkraja) 22 June 2016