
ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కొత్త బైక్ కొన్నాడు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తన కలల బైక్‌ను సొంతం చేసుకున్నాడు. లగ్జరీ బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూకు చెందిన హైస్పీడ్ సూపర్ బైక్‌ను తన ఇంటికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ బైక్ ధర దాదాపు 18 లక్షల రూపాయలపైనే ఉంటుందని తెలుస్తోంది.
కాగా వెట్రిమారన్ అసురన్, పొల్లధవన్, వడ చెన్నై వంటి పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఆయన 'విడుతాలై' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీని తర్వాత సూర్యతో 'వడివాసల్' సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో పలు ప్రాజెక్టులు పట్టాలెక్కించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment