'హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. వాయిదా ప్రసక్తే లేదు' | Vijay Sethupathi Viduthalai Part 2 Release Date Locked, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Viduthalai Part 2 Release: 'హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. వాయిదా ప్రసక్తే లేదు'

Published Mon, Oct 14 2024 12:11 PM | Last Updated on Mon, Oct 14 2024 1:51 PM

Viduthalai Part 2 Release Date Locked

కోలీవుడ్‌ హాస్యనటుడు సూరి కథానాయకుడుగా పరిచయమైన చిత్రం 'విడుదలై'.. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఆర్‌ఎస్‌ ఇన్‌ ఫోటెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నటుడు విజయ్‌ సేతుపతి కీలకమైన పాత్రలో మెప్పించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విడుదలై–2 చిత్రంలో విజయ్‌ సేతుపతి, సూరి, నటి మంజు వారియర్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు అనురాగ్‌ కశ్యప్‌, కిషోర్‌, కెన్‌ కరుణాస్‌, రాజీవ్‌ మీనన్‌, గౌతమ్‌ మేనన్‌ బోస్‌ వెంకట్‌, భవాని శ్రీ, విన్సెంట్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 

ఇళయరాజా సంగీతాన్ని వేల్‌ రాజ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఇటీవలే చిత్ర డబ్బింగ్‌ కార్యక్రమాలను చైన్నెలో ప్రారంభించినట్లు నిర్మాతల వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండవ భాగంలో నటి మంజు వారియర్‌, నటుడు విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన ముఖ్యమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయన్నారు. వారి ప్రతిభావంతమైన నటన ఈ చిత్రంపై మరింత అంచనాలను పెంచిందన్నారు.  

అయితే, సినిమా వాయిదా పడుతుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ముందుగా ప్రకటించిన తేదీలోనే మూవీని రిలీజ్‌ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాగా వి.మణికంఠన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విడుదలై– 2 చిత్రాన్ని డిసెంబర్‌ 24 తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement