Suri
-
విజయ్ సేతుపతి ‘విడుదల 2’ మూవీ రివ్యూ
టైటిల్: విడుదల 2నటీనటులు: విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులునిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్, చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)దర్శకత్వం: వెట్రీమారన్సంగీతం: ఇళయరాజాసినిమాటోగ్రఫీ: వేల్ రాజ్ఎడిటింగ్: ఆర్. రామర్విడుదల తేది: డిసెంబర్ 20, 2024విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్లో వచ్చిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'విడుదల-2' తెరకెక్కింది. ఇళయారాజా సంగీతం అందించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 20) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మహారాజా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ సేతుపతి నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ప్రజాదళం నాయకుడు పెరుమాళ్(విజయ్ సేతుపతి) అరెస్ట్‌తో 'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్ విచారణతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు. మార్గమధ్యలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చెబుతాడు. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్) పరిచయం పెరుమాళ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి? ప్రజల కోసం పెరుమాళ్ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వెట్రిమారన్ సినిమాలు అంటేనే వాస్తవికానికి దగ్గరగా ఉంటుంది. అణచివేత, పెత్తందార్లపై పోరాటాలే ఆయన కథలు. విడుదల పార్ట్ 2 నేపథ్యం కూడా అదే. అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజలను ఎలా బయటపడేలా చేశారు అనేది ఈ సినిమా కథ. విడుదల పార్ట్ 1 చూసిన వారికి పార్ట్ 2 కథనం ఎలా ఉంటుందనేది అర్థమైపోతుంది. పార్ట్ 1లో సూరి పాత్రలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అమాయకత్వం, వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ గల సూరి స్టోరీ అందరి మనసులని కలిచి వేస్తుంది. అయితే పార్ట్ 2లో మాత్రం సూరి పాత్ర నిడివి చాలా తక్కువ. కథనం మొత్తం విజయసేతుపతి పాత్ర చుట్టే తిరుగుతుంది. చాలా తమిళ సినిమాల్లో చూసిన దళితభావానికి ఎర్రజెండా వాదాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెట్రిమారన్. ఎప్పటి ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా రీసెర్చ్ చేసి అందరికి అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దాడు. పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నిస్తూనే మావోయిస్ట్ ఆవిర్భావం, ఎర్రజెండా వాదం వెనుక ఉన్న ఉద్దేశం వివరించాడు. నక్సలైట్స్ ఎలా కలుసుకుంటారు? సమాచారాన్ని ఎలా చేరవేస్తారు? బడుగు బలహీన వర్గాలతో వారి సంబంధం.. ప్రతీది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఎక్కడా కూడా కృత్రిమత్వం లేకుండా.. నిజ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రతి విషయాన్ని చాలా డీటేయిల్డ్‌గా చూపించడంతో సాగదీతగా అనిపిస్తుంది. దళితులపై దాడి మొదలు పోలీసుల, నక్సల్స్ మధ్య జరిగే పోరు వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు చేస్తాయి. అయితే ఓ ఉద్యమ కథకి చక్కని ప్రేమ కథను జోడించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పెరుమాళ్, మహాలక్ష్మిల ప్రేమ కథ ఆకట్టుకుటుంది. కరుప్పన్ ఎపిసోడ్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ నక్సలైట్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులు తెరపై చూస్తున్నప్పడు.. ఆ పాత్రపై జాలీతో పాటు పెత్తందారి వ్యవస్థపై అసహ్యం కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం అక్కడడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పోలీసులకు, నక్సల్స్ మధ్య జరిగే ఎన్కౌంటర్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. ఒకనొక దశలో ఓ డాక్యూమెంటరీ ఫిల్మ్ చూసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. పార్ట్ 3 కోసం తీసుకున్న లీడ్ బాగుంది. వామపక్ష భావజాలం ఉన్నవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. విజయ్ సేతుపతి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా ఆయన జీవించేస్తాడు. పెరుమాళ్ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. పోలీసు స్టేషన్లో నగ్నంగా ఉండే సీన్ అయినా.. ఇంట్లో భార్య ముందు స్నానం చేసే సన్నివేశం అయినా.. ఎక్కడ కూడా ఆయన నటించనట్లు అనిపించదు. ఆయన నటన అంత సహజంగా ఉంది. మంజు వారియర్‌కి కూడా బలమైన పాత్ర లభించింది. అభ్యుదయ భావజలం గల మహాలక్ష్మి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. పోలీస్ డ్రైవర్ కొమరన్గా సూరి చక్కగా నటించాడు. అయితే పార్ట్ 2లో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన బలం. ఓ ఉద్యమ కథకి కావాల్సిన బీజీఎం అందించాడు. పాటలు పర్వాలేదు. డబ్బింగ్ బాగోలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెంకడాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
శ్రీ మురళి హీరోగా డా. సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బఘీర’. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు డా. సూరి మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ నీల్గారి ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల రైటింగ్ విభాగంలో నేనూ ఉన్నాను. శ్రీ మురళిగారితో నేను ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు కథ కుదర్లేదు. అప్పుడు తన దగ్గర కథ ఉందని ప్రశాంత్ నీల్గారు చెప్పడంతో ‘బఘీర’ చిత్రం ప్రారంభమైంది. సూపర్ హీరో అవ్వాలనుకున్న ఓ కుర్రాడి కథే ఈ చిత్రం. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి ప్రశాంత్ నీల్గారు హ్యాపీ ఫీలయ్యారు. శ్రీ మురళి బాగా నటించారు. ‘బఘీర’ను ‘కేజీఎఫ్’తో ΄ోల్చి మాట్లాడుతున్నారు. ‘బఘీర’ సినిమా ‘కేజీఎఫ్’ టోన్‌లో ఉండదు. ‘కేజీఎఫ్’ చరిత్రలాంటి సినిమా. ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పన్నెండేళ్ల క్రితం యశ్‌తో ఓ సినిమా చేశాను (‘లక్కీ’). ఆ తర్వాత యశ్‌తో ట్రావెల్ అయ్యాను. యశ్ కథలను నేనే వినేవాడిని. అయితే యశ్‌తో నేను అనుకున్న సినిమా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ‘కేజీఎఫ్’ వల్ల యశ్‌కు చాలా సమయం పట్టింది. దీంతో నేను శ్రీ మురళితో ‘బఘీర’ చేశాను’’ అని తెలి΄ారు. -
'హిట్ సినిమాకు సీక్వెల్.. వాయిదా ప్రసక్తే లేదు'
కోలీవుడ్ హాస్యనటుడు సూరి కథానాయకుడుగా పరిచయమైన చిత్రం 'విడుదలై'.. వెట్రిమారన్ దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో మెప్పించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విడుదలై–2 చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి, నటి మంజు వారియర్‌తో పాటు బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, కిషోర్, కెన్ కరుణాస్, రాజీవ్ మీనన్, గౌతమ్ మేనన్ బోస్ వెంకట్, భవాని శ్రీ, విన్సెంట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతాన్ని వేల్ రాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఇటీవలే చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలను చైన్నెలో ప్రారంభించినట్లు నిర్మాతల వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండవ భాగంలో నటి మంజు వారియర్, నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించిన ముఖ్యమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయన్నారు. వారి ప్రతిభావంతమైన నటన ఈ చిత్రంపై మరింత అంచనాలను పెంచిందన్నారు. అయితే, సినిమా వాయిదా పడుతుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని చిత్ర యూనిట్ పేర్కొంది. ముందుగా ప్రకటించిన తేదీలోనే మూవీని రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాగా వి.మణికంఠన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విడుదలై– 2 చిత్రాన్ని డిసెంబర్ 24 తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. -
ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!
సూరి కథానాయకుడిగా నటించిన చిత్రం గరుడన్. శశికుమార్, ఉన్ని ముకుందన్, వడివుక్కరసి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం గరుడన్. దర్శకుడు వెట్రిమారన్ కథను అందించి తన గ్రాస్‌రూట్ స్డూడియో కంపెనీ సంస్థ కె.కుమార్‌కు చెందిన లార్క్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దురై సెంథిల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ విడుదల కాగా.. స్థానిక నక్కలజాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించని ఘటన మరోసారి వివాదంగా మారింది. ఇంతకు ముందు ఇలాంటి ఘటనే చెన్నైలోని ఒక థియేటర్లో జరిగింది. తాజాగా గరుడన్ చిత్రాన్ని చూడడానికి వచ్చిన నక్కలజాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించక పోవడంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారుఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రాన్ని చూడటానికి నక్కలజాతికి చెందిన 20 మందికి పైగా ప్రజలు కడలూర్ సమీపంలోని అన్నాపాలంలోని థియేటర్‌కు వెళ్లారు. అయితే వారిని థియేటర్ నిర్వాహకుల థియేటర్లోకి అనుమతించలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కలగచేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నక్కలజాతి ప్రజలకు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో వారు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఆ థియేటర్ వద్ద కలకలం చెలరేగింది. దీంతో 20కి పైగా పోలీసులతో ఆ థియేటర్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వరదాపురం సూరి ఓవర్ యాక్షన్
ధర్మవరం: రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే వరదపురం సూరి ధర్మవరం పట్టణంలో గురువారం హైడ్రామాకు తెరలేపారు. రహదారి అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ అనుచరులను రెచ్చగొడుతూ నానా యాగి చేశారు. గత ఎన్నికల్లో వరదాపురం సూరి ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ధర్మవరం టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాదరణలో అత్యంత బలవంతుడైన కేతిరెడ్డిని ఢీకొట్టే సత్తా తనకు మాత్రమే ఉందని కలరింగ్ ఇచ్చేందుకు ఫీట్లు చేస్తున్నారు. టెండర్లు పూర్తయిన విషయం తెలుసుకుని డ్రామా 2019లో అప్పటి ఎమ్మెల్యే సూరి రూ.28 కోట్లతో ధర్మవరం పట్టణంలో రోడ్డు వేశారు. రోడ్డు పనులు అత్యంత నాసిరకంగా చేయడంతో పదినెలలు గడవకముందే శిథిలావస్థకు చేరింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించి రూ.4 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రహదారిని నిరి్మంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 5న జీఓ విడుదల చేశారు. ఈ క్రమంలో అధికారులు జనవరి 18న టెండర్ ప్రక్రియ సైతం పూర్తిచేశారు. గురువారం రోడ్డు పనులు ఎమ్మెల్యే కేతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్నాయి. కానీ వరదాపురం సూరి రాజకీయ లబ్ధి కోసం హంగామా చేశారు. తన సొంత నిధులతో రోడ్డు వేస్తానని అనుమతి ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులను కోరగా, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పలుమార్లు అధికారులను కలుస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే గురువారం రోడ్డు పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి సిద్ధమవుతున్న తరుణంలో వరదాపురం సూరి హైడ్రామాకు తెరలేపారు. ఉదయాన్నే మార్కెట్‌యార్డుకు రెండు టిప్పర్లు తీసుకువచ్చి పనులు చేస్తామంటూ అనుచర గణంతో బైఠాయించారు. డీఎస్పీ టీ. శ్రీనివాసులు, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు సూరి వద్దకు వెళ్లి రోడ్డు పనులకు ఆటంకం కల్గించవద్దని ఎంత సర్ది చెప్పినా వినకుండా పోలీసులపైకి దౌర్జన్యం చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పట్టణంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకం కల్గిస్తూ రహదారిపై ధర్నా, పోలీసులపై దౌర్జన్యం తదితర కారణాలతో వరదాపురం సూరితో పాటు అనుచరులు 29 మందిని పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐపీసీ 143, 145, 188, 341, రెడ్‌విత్ 149 కింద కేసులు పెట్టారు. సూరికి చెందిన రెండు వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ టీ. శ్రీనివాసులు తెలిపారు. -
పరిటాల వర్సెస్ వరదాపురం
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు వరదాపురం సూరి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్రశాంతంగా ఉంటున్న నియోజకవర్గంలో అశాంతి రాజేసేలా ఇరువర్గాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పటిదాకా బీజేపీలో ఉన్న వరదాపురం సూరి వర్గీయులు టీడీపీలో చేరుతున్నామనే సంకేతాలిచ్చేందుకు ముదిగుబ్బ మండల కేంద్రంలో సొసైటీ సర్కిల్ వద్ద చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే ప్రధానంగా ఘర్షణకు కారణమయ్యాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వరదాపురం సూరి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత నెల కూడా గడవక ముందే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరలో టీడీపీలోకి చేరతామని, ఆ పార్టీ టికెట్ తనకేనంటూ కొంత కాలంగా సూరి తన అనుచరులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, వరదాపురం సూరి రెండు రోజుల కిందట ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ పరిటాల కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఓ మాజీ మంత్రి అని, వారు ధర్మవరం, శింగనమల, పెనుకొండలకు వెళితే వైఎస్సార్సీపీకి పనిచేస్తారని, ఒక్క రాప్తాడులో మాత్రం టీడీపీకి పని చేస్తారని, ధర్మవరం చెరువుకు నీరు అందించేందుకు తాను సొంత నిధులతో కాలువ మరమ్మతులు చేయిస్తే.. వాటికి కూడా నాడు –నేడు కింద బిల్లులు చేసుకున్నారని పరోక్షంగా పరిటాల సునీతను విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. మీ పార్టీ నాయకుల ఫొటోలు వేసుకోండి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ముదిగుబ్బ మండలంలో వరదాపురం సూరి అనుచరులు పసుపు రంగు ఫ్లెక్సీల ఏర్పాటుకు పూనుకున్నారు. అందులో వరదాపురంతో పాటు చంద్రబాబు, నారా లోకేశ్ ఫొటోలు వేయించారు. దీనిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు బీజేపీలో ఉన్నందు వల్ల ఆ పార్టీ నాయకుల బొమ్మలు వేసుకోండి. అంతేగానీ చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు ఎలా వేస్తారు? అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం చెప్పులు విసురుకున్నారు. ముదిగుబ్బ ఎస్ఐ వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వివాదం ముదురుతుండటంతో సూరి వర్గీయులు వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించి వెనుదిరిగారు. -
సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. విజయ్ సేతుపతికి జోడీగా మలయాళ బ్యూటీ
మలయాళ నటి మంజు వారియర్‌కు కోలీవుడ్లోకి అవకాశాలు వరుస కడుతున్నాయి. మాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా రాణించిన ఈ భామ అక్కడ ఒక సమస్యలో ఇరుక్కోవడంతో నటనకు చిన్న గ్యాప్ వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడడంతో మళ్లీ నటనపై దృష్టి సారించింది. ఇలా ధనుష్‌కు జంటగా అసురన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో మంజు వారియర్ ఇక్కడ మంచి మార్కెట్ వచ్చింది. ఆ తరువాత తుణివు తదితర చిత్రాల్లో నటించిన ఈమె తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170 చిత్రం కాగా రెండోది విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న విడుదలై 2. హాస్య నటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. తొలి భాగంలో నటుడు సూరి పాత్రకు ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు వెట్రిమారన్ రెండో భాగంలో విజయ్ సేతుపతి పాత్రను హైలైట్ చేసి షూటింగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిసింది. కాగా ఇందులో ఆయనకు జంటగా నటి మంజు వారియర్‌ను ఎంపిక చేశారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా నటిస్తోంది. ఈ జంటకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. విడుదలై 2 చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
భారీ బడ్జెట్‌తో విజయ్ సేతుపతి ‘విడుదల’, రూ. 10 కోట్లతో రైలు సెట్
విజయ్ సేతుపతి ఉపాధ్యాయుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘విడుదలై’ (విడుదల). కానిస్టేబుల్ పాత్రను సూరి చేస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ రెండు భాగాలుగా నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మొదటి భాగం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కళా దర్శకుడు జాకీ నేతృత్వంలో రూ. 10 కోట్లతో రైలు, రైలు బ్రిడ్జి సెట్ రూపొందించాం. అలాగే సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యంలో భారీ సెట్ నిర్మించాం. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కొడైకెనాల్లో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. ఇందులో బల్గేరియా నుండి తమిళనాడుకి వచ్చిన స్టంట్ బృందం పాల్గొంటోంది’’ అన్నారు. భవాని శ్రీ, ప్రకాశ్‌రాజ్, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: వేల్రాజ్. -
నటులు విమల్, సూరిలపై కేసు నమోదు
పెరంబూరు: ఎంత పని చేశావే కరోనా అని నటుడు విమల్, సూరి తలపట్టుకుంటున్న పరిస్థితి. ఎరక్క పోయి వచ్చి ఇరుక్కు పోయినట్టుంది ఈ ఇద్దరు నటుల పరిస్థితి. నటుడు విమల్, హాస్య నటుడు సూరి కరోనా కాలంలో ఇంట్లో కూర్చుని ఏమీ తోచక ఈ ఇద్దరూ కలిసి ఇటీవల కోడైకెనాల్‌కు జాలీ ట్రిప్ వేశారు. వెళితే వెళ్లారు లాక్డౌన్ నిబంధనలను పాఠించారా అంటే అదీ లేదు ఈ పాస్ లాంటివి తీసుకోకుండా అదీ కొడైకెనాల్లోని నిషేధిత ప్రాతానికి వెళ్లారు. అక్కడ ఒక కొలనులో చేపలను పట్టి సరదా తీర్చుకున్నారు. అయితే ఈ నటుల ఎంట్రీ గురించి సమాచారం అందిన అటవీ శాఖ అధికారులు అక్కడకు వచ్చి నాలుగు చివాట్లు పెట్టడంతో పాటు అపరాధం కూడా విధించారు. పోన్లే అపరాధమే కదా అని అదేదో కట్టేసి వచ్చేశారు ఈ నట ద్వయం. అయితే కథ అక్కడితే ఆగలేదు. తాజాగా కొడైకెనాల్ పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలను పాటించకుండా, ఈ పాస్ పొందకుండా ప్రయాణం చేసిన నేరం కింద నటుడు విమల్, సూరీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు. ముందుగా కొడైకెనల్‌కు వచ్చిన వీరికి సహకరించింది ఎవరు, కార్లను సరపరా చేసింది ఎవర్నది విచారించారు. దీంతో కొడైకెనల్‌కు చెందిన ఖాదర్ బాషా అనే వ్యక్తి విమల్, సూరి అక్కడ పర్యటించడానికి కారును, జీప్‌ను, బస చేయడానికి వస తి ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీంతో కారును, జీప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నటుడు విమల్, సూరితో పాటు ఖాదర్‌బాషాపైనా కేసు నమోదు చేశారు. -
నటుడు సూరీకి జల్లికట్టుతో సంబంధం ఏంటి?
సినిమా: జల్లికట్టు తమిళ పారంపర్య క్రీడ. అంతే కాకుండా ఇది తమిళుల వీరత్వానికి చిహ్నం. ఈ జల్లికట్టును కేంద్రం నిషేధిస్తే తమిళులందరూ ఒకతాటిపై పోరాడి మళ్లీ సాధించుకున్న విషయం తెలిసిందే. అలాంటి జల్లికట్టుకు ప్రముఖ హాస్యనటుడు సూరికి సంబంధం ఏమిటి అన్నది ఇక్కడ చర్చనీయాంశం. ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడిగా రాణిస్తున్న సూరి త్వరలో కథానాయకుడిగా అవతారం ఎత్తనున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన జల్లికట్టు ఎద్దులతో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అవుతున్నాయి. ఇటీవల పలువురు కరోనా బాధితులను నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్న సూరి, తన పిల్లలతో కలిసి కరోనాపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. కాగా మదురై సమీపంలోని రాజాకూర్ గ్రామానికి చెందిన సూరి ఇటీవల స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ తమ జల్లికట్టు పందెపు ఎద్దుతో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి అందులో ఊరంతా లాక్డౌన్ లో ఉన్న సమయంలో ఊరంతా నిలవదు సూచించే మా జల్లికట్టు కరుప్పన్ అని ట్యాగ్‌లైన్ పోస్ట్ చేశారు. దీని గురించి సూరి పేర్కొంటూ తమ కరుప్పన్ (జల్లికట్టు ఎద్దు) ఇప్పటి వరకూ 40 జల్లికట్టు పోటీల్లో పాల్గొని అన్ని పోటీల్లో గెలుపొందిందని చెప్పారు. పందెంలో ఒక్కరూ కూడా తమ ఎద్దును టచ్ కూడా చేయలేక పోయారని చెప్పారు. తమ ఎద్దు సాధించిన బహుమతులు ఈ ఊళ్లో పెళ్లిళ్లు, వంటి విశేష వేడుకల్లో బహుమతిగా వారికి అందించడం జగుగుతుందని నటుడు సూరి తెలిపారు. ప్రస్తుతం తమ కరుప్పన్ బాధ్యతలను తన సోదరుడు చూసుకుంటున్నాడు అని ఆయన చెప్పారు. -
కిందటి జన్మలో రంగీలా తీశా!
‘‘లవ్‌స్టోరీ చిత్రాల్లో నా పేరు జోడించి కొన్ని యుగాలు అయిపోతుంది. కిందటి జన్మలో ‘రంగీలా’ తీశాను. ‘బ్యూటిఫుల్’ చిత్రం ఒక విధంగా ‘రంగీలా’కి సీక్వెల్లా ఉంటుంది. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది కేవలం పబ్లిసిటీ కోసం పెట్టింది కాదు’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆర్జీవీ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో నైనా గంగూలీ, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్’. టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహనిర్మాతలు. జనవరి 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ – ‘‘నాకు వచ్చిన ఆలోచనను మంజుతో పంచుకున్నాను. తను పూర్తి కథ చేసి సినిమా తెరకెక్కించాడు. సాధారణ కథల్లో మగవాళ్లు ఎదుగుతుంటారు. ఆడవాళ్లు ఇంట్లో ఉంటారు. కానీ ఇందులో రివర్స్‌లో జరుగుతుంది. హీరోయిన్ బాగా ఎదుగుతుంది. తన సక్సెస్‌ను చూసి హీరో తట్టుకుంటాడా లేదా అనేది కథాంశం. విలన్స్ ఉండరు. సింపుల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుంది. నైనా ఈ పాత్ర చేయడానికే పుట్టింది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వర్మగారు నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం బాగా కష్టపడ్డాను. నా పరిచయ గీతాన్ని వర్మగారే షూట్ చేశారు. 3 రోజుల్లో 11 కాస్ట్యూమ్స్‌తో షూట్ చేశాం’’ అన్నారు నైనా. ‘‘ఇదో ఇంటెన్స్ లవ్‌స్టోరీ. అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా గురించి మాట్లాడినా, చూసినా వర్మగారు కన్నీళ్లు పెట్టుకునేవారు. అంత ఎమోషనల్‌గా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు’’ అన్నారు సూరి. -
నా లైఫ్ బ్యూటిఫుల్
‘‘మనసుకి ఆహ్లాదం కలిగించి మనల్ని ఉద్రేకానికి గురి చేసే ఏ ఎమోషన్ అయినా బ్యూటిఫుల్. నా హిట్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా తీసుకుంటానో నా ఫ్లాప్‌ని కూడా అంతే బ్యూటిఫుల్‌గా తీసుకుంటాను. నా జీవితంలో ఎవరిపైనా ఫిర్యాదు చేయను.. నాకు ఎవరి మీదా కోపం రాదు. నేను బ్యూటిఫుల్ కాకపోవచ్చు.. కానీ నా లైఫ్ మాత్రం బ్యూటిఫుల్’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. నైనా గంగూలి, సూరి జంటగా రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది ఉపశీర్షిక. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘ఊర్మిళ లాంటి అమ్మాయి లేకుంటే నేను ‘రంగీలా’ సినిమా తీసుండేవాణ్ణి కాదు. ఇప్పుడు నైనా విషయంలోనూ అదే జరిగింది. కొంతమంది యాక్టర్స్ కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ కోసమే క్రియేట్ అయ్యారనిపిస్తుంది. నేను పదిహేనేళ్లుగా లవ్ స్టోరీ జోలికి వెళ్లలేదు. దానికి రెండు కారణాలు.. ఒకటి నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిన కథ రాలేదు. రెండోది అంతగా ఇన్స్పైర్ చేసిన యాక్టర్ దొరకలేదు.. అవి రెండూ కుదిరాయి కాబట్టే ఈ సినిమా మొదలుపెట్టాం’’ అన్నారు. అగస్త్య మంజు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ముంబైలో ఉన్న ధారావి అనే ప్రాంతంలో జరుగుతుంది. ఆ ప్రాంతం అంత ‘బ్యూటిఫుల్’ ప్లేస్ కాదు. కానీ అక్కడి మనుషులు బ్యూటిఫుల్‌గా ఉంటారు. అందుకే ఆ పేరు పెట్టాం’’ అన్నారు. ‘‘రాము త్వరలోనే ‘శివ’లాంటి సినిమా తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘మా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు టి.అంజయ్య. ఈ వేడుకలో రామ్‌గోపాల్ వర్మ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వేడుకలో నిర్మాతలు నట్టి కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు చంద్ర సిద్ధార్థ్, బీవీఎస్ రవి, హీరో ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఏడాది బ్యూటిఫుల్
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అన్నది ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కింది. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ప్రేమ కథాంశంతో వైవిధ్యభరితంగా రూపొందిన చిత్రమిది. సూరి, నైనాల అభినయం మనసులను హత్తుకుంటుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి శంకర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, రచన, కెమెరా, దర్శకత్వం: అగస్త్య మంజు. -
త్వరలో బ్యూటిఫుల్
నైనా, సూరి జంటగా నటించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ట్రిబ్యూట్ టూ రంగీలా అనేది చిత్రానికి ఉపశీర్షిక. అగస్త్య మంజు ఈ చిత్రానికి రచన, ఫొటోగ్రఫీతో పాటు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ రూపొందించగా టి.అంజయ్య సమర్పించారు. టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిది. హీరో హీరోయిన్లు బాగా నటించారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి పాటలు: సిరాశ్రీ. -
అందమైన ప్రేమకథ
సూరి, నైనా జంటగా నటించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది ట్యాగ్‌లైన్. రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి.అంజయ్య సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ‘లక్ష్మీస్ యన్టీఆర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకుడు. దర్శకత్వంతో పాటు రచన, ఫొటోగ్రఫీ బాధ్యతలు కూడా చేపట్టారు. టి. నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. ‘‘ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కి విశేష స్పందన లభించింది. రొమాంటిక్ ప్రేమ కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పాటలు మనసుని హత్తుకునేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్. ∙సూరి, నైనా -
అందమైన పాట
సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘బ్యూటీఫుల్’. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘రొమాంటిక్ కథాంశంతో వైవిధ్యభరితంగా ఉంటుందీ చిత్రం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. త్వరలో ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సిరాశ్రీ పాటలు రాశారు. రవిశంకర్ సంగీతం అందించారు. ∙నైనా, సూరి -
బ్యూటిఫుల్
రామ్‌గోపాల్ వర్మ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘బ్యూటిఫుల్’. ఆయన గతంలో తీసిన ఐకానిక్ మూవీ ‘రంగీలా’ కు ఇది ట్రిబ్యూట్. నైనా, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇదివరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని వర్మతో కలసి దర్శకత్వం వహించారు అగస్త్య మంజు. ప్రస్తుతం ‘బ్యూటిఫుల్’ చిత్రం రామ్‌గోపాల్ వర్మ టైగర్ ప్రొడక్షన్‌పై నిర్మాణం జరుపుకుంది. టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. ‘‘మా ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.. అందరూ వెరీ బ్యూటిఫుల్ అంటున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం:రవి శంకర్, సాహిత్యం: సిరా శ్రీ. -
మహిళను చెప్పుతో కొట్టమన్న టీడీపీ ఎమ్మెల్యే!
సాక్షి, అనంతపురం: ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బరితెగించారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న ఓ మహిళా రైతును చెప్పుతో కొట్టాలని తన అనుచరులను ఆదేశించారు. మహిళపై దాడిచేసిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని పోలీసులుకు సురీ హుకుం జారీ చేశారు. ఈ వ్యవహారమంతా పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే జరిగినా వారునోరు మెదపక పోవటం గమనార్హం. ఇకపై భూసేకరణను ఎవరు ఎదిరించినా వారిపై దాడులు చేయాలని అతని అనుచరులను సురీ అదేశించారు. శుక్రవారం జరిగిన ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎమ్మెల్యే తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓట్లేసి గెలిపించిన తమని ఇలా చెప్పులతో దాడి చేయిస్తారా అని నిలదీస్తున్నారు. -
మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు!
-
ఆ కాంబినేషన్‌ను కలిపింది నేనే
తమిళసినిమా: ఉదయనిధిస్టాలిన్, సూరి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్ కాంబినేషన్‌ను తొలుత కలిపింది తానేనని దర్శకుడు గౌరవ్ నారాయణన్ అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇప్పడై వెల్లుమ్. ఉదయనిధిస్టాలిన్, మంజిమామోహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరి, డానియేల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీ.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు గౌరవ్ నారాయణన్ మాట్లాడుతూ ఈ చిత్ర హీరో ఉదయనిధి స్టాలిన్, హాస్య నటుడు సూరి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్ల కాంబినేషన్‌ను తొలిసారిగా కలిపింది తానేనని చెప్పారు. ఇప్పడై వెల్లుమ్ చిత్ర షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే ఉదయనిధిస్టాలిన్ తన వద్దకు వచ్చి సార్ తాను రేపటి నుంచి వేరే షూటింగ్లో పాల్గొంటున్నాను అని చెప్పారన్నారు. తీరా చూస్తే సవరణన్ ఇరుక్కభయమేన్ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్, సూరి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్లు కలిసి పని చేశారన్నారు. ఆ తరువాత మరి కొన్ని రోజులకు వేరే చిత్రం చేస్తున్నానని ఉదయనిధి స్టాలిన్ చెప్పారన్నారు. ఆ చిత్రమే పొదువాగ ఎన్ మనసు తంగం అని చెప్పారు. ఈ చిత్రంలోనూ అదే కాంబినేషన్ అన్నారు. ఆ తరువాత తమ చిత్రం చేస్తున్నా, ఉదయనిధి స్టాలిన్ ఆ రెండు చిత్రాల గురించే మాట్లాడడంతో తాను ఈ చిత్ర నిర్మాతకు నెల రోజులు గ్యాప్ ఇచ్చి షూటింగ్ చేస్తానని చెప్పానన్నారు. అప్పటికి ఉదయనిధి స్టాలిన్ ఆ చిత్రాల మూడ్‌లోంచి బయట పడతారని భావించానన్నారు. అలా ఈ చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగిందని ఆయన వివరించారు. -
కళవాణి సీక్వెల్‌కు రెడీ
– విమల్ తమిళసినిమా: యువ నటుడు విమల్ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం కళవాణి. ఆ చిత్ర దర్శకుడు సర్గుణం, నటి ఓవియాకు ఇది తొలి చిత్రం అన్నది గమనార్హం. కళవాణి చిత్రం తరువాత విమల్ వరుసగా పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల చిన్న గ్యాప్ వచ్చింది. విమల్ చిత్రం తెరపైకి వచ్చి ఏడాదిన్నర పైనే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో విమల్ నిర్మాతగా మారి మన్నర్ వగైయారు అనే చిత్రాన్ని నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నారు. దీనికి భూపతి పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం వెట్రివేల్ చిత్రం ఫేమ్ వసంతమణి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా కళవాణి–2 చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. దీనికి సర్గుణం దర్శకత్వం వహించనున్నారు. ఈయన ప్రస్తుతం మాధవన్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఇది పూర్తి అయిన తరువాత కళవాణి–2 చిత్రం ప్రారంభమవుతుందని నటుడు విమల్ వెల్లడించారు. మొత్తం చిన్న గ్యాప్ తరువాత విమల్ మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారన్నమాట. కళవాణి చిత్రంలో నటించిన సూరి, గంజాకరుప్పు దానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న కళవాణి–2లో నటించనున్నారు. మరి నటి ఓవియా కూడా నాయకిగా నటిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
వైద్యదేవుడికి సలాం
తమిళసినిమా: వైద్య దేవుడికో సలాం అన్నారు నెంజిల్ తుణివిరుందాల్ చిత్ర యూనిట్. ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదైపోయింది. ఆస్పత్రికి వెళ్లి సగం సొత్తును వైద్యులు పిండేస్తున్న పరిస్థితి. అయితే వైద్యోనారాయణో అంటారు. దాన్ని నిజం చేసిన వైద్యుడొకరు ఉండేవారు. కోవైలోని రాజగణపతి నగర్‌కు చెందిన బాలసుబ్రమణియం వైద్యుడిగా తీసుకున్న తొలి ఫీజు రూ.2. ఆ తరువాత రూపాయి విలువ పడిపోతూ వస్తున్న పరిస్థితుల్లో ఆయన తీసుకున్న చివరి ఫీజు రూ.20.గత ఏడాదే బాల సుబ్రమణియం కన్నుమూశారు. ఆయన్ని అందరూ రూ.20 రూపాయల డాక్టర్ అని పిలిచేవారు. వైద్యమే దైవంగా భావించే బాలసుబ్రమణియం మరణించినప్పుడు ఆ ఊరు అంతా కన్నీటి అంజలి పోస్టర్లు వెలిశాయి. ఆ వైద్యుడి కూతురు, అల్లుడు, మనవడిని నెంజిల్ తుణివిరుందాల్ చిత్ర యూనిట్ సత్కరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ బాలసుబ్రమణియం కుటుంబసభ్యులను అతిథులుగా ఆహ్వానించి సత్కరించారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం నెంజిల్ తుణివిరుందాల్. సంధీప్కిషన్ కథానాయకుడిగా నటించిన ఇందులో విక్రాంత్ ముఖ్య పాత్రలో నటించారు.నటి లక్ష్మి నాయకిగా, సూరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అణ్నై ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఆంటోని నిర్మిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వైద్యం నేపథ్యంలో చిత్రం కావడంతో డాక్టర్ బాలసుబ్రమణియం కుటుంబ సభ్యులను ఆహ్వానించి సత్కరించినట్లు చిత్ర దర్శకుడు సుశీంద్రన్ పేర్కొన్నారు. ఇది ఆయన 10వ చిత్రం కావడం విశేషం.ఈ చిత్ర టైటిల్‌ను సుశీంద్రన్ తండ్రి నల్లసామి ఆవిష్కరించారు. -
నయన సమ్మతిస్తే..
తమిళసినిమా: నవ్వడం ఒక యోగం. నవ్వించడం ఒక భోగం అంటారు. అలా తనదైన హాస్యంతో లక్షలాది మందికి వినోదం అందిస్తున్న హాస్య నటుడు సూరి. పరోటా సూరిగా అందరి మనసుల్లోనూ గూడు కట్టుకున్న ఆయనిప్పుడు నటి నయనతారతో డ్యూయెట్ పాడాలని ఆశ పడుతున్నారు. ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం నటుడు సూరి అనే. అయితే ఆయనకీ నేమ్, ఫేమ్ అంత ఈజీగా రాలేదు. రెండున్నర దశాబ్దాల కఠిన శ్రమ ఉంది. కాలిన కడుపు, ఆకలిని తీర్చుకోవడానికి సినిమా సెట్లకు రంగులు దిద్దిన గతం ఆయనది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నటుడు సూరి ఒక ఉదాహరణగా నిలుస్తారు. ఆయన గురించి తెలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. 25ఏళ్ల తన సినీ పయనాన్ని హాస్యనటుడు సూరి ఒక్క సారి గుర్తుకు తెచుకున్నారు. అదేమిటో ఆయన మాటల్లోనే... తిçనడానికి అన్నం లేదు: 1996లో సినిమాల్లో నటించాలన్న ఆశతో మదురై సమీపంలోని ఒక గ్రామం నుంచి చెన్నై వచ్చాను. నిలవడానికి నీడలేదు. తినడానికి అన్నం లేదు. ఆకలి బాధ ఓర్చుకోలేక సినిమాల కోసం వేసే సెట్స్‌కు రంగులు వేసే పనిలో చేరాను. ఆ సమయంలో మిత్రులతో కలిసి చిన్న చిన్న నాటకాలు ఆడేవాడిని. అలా వీరప్పన్ ఇతివృత్తంతో ఆడిన నాటకం చూసిన పోలీసు అధికారులు నా నటనను ప్రశంసించి రూ.400 ఇచ్చారు. ఆ తరువాత కాదల్, దీపావళి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించాను. అప్పడు దీపావళి చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసిన సుశీంద్రన్ దర్శకుడయిన తరువాత వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. చిన్న పాత్ర అయిన అది ఆ తరువాత పెద్దగా పేరుతెచ్చింది. అందులోని పరోటా హాస్యం నన్నీ స్థాయికి చేర్చింది. వెన్నెలా కబడ్డీకుళు చిత్రం నాకు, నా భార్యకు చాలా నచ్చిన చిత్రం. మా పిల్లలు మాత్రం వెన్నెలా కబడ్డీకుళు, అరణ్మణై–2 చిత్రాల్లోని కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. నయన్‌తో డ్యుయెట్: నయనతారతో డ్యూయెట్ పాడాలని ఆశ ఉంది. అందుకు ఆమె సమ్మతించాల్సి ఉంటుంది. అంతకంటే హీరోగా నటించాలన్న కోరిక అస్సలు లేదు. కామెడీలో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నాన్నే స్ఫూర్తి: నా కామెడీకి నాన్నే స్ఫూర్తి. ఆయన చేసిన దాంట్లో నేను ఇప్పుటికి 10 శాతం కూడా చేయలేదు. నాన్న నిజ జీవితంలోనే అంత వినోదాన్ని పంచేవారు. అప్పట్లో ఆకలి ఉండేది. డబ్బు ఉండేది కాదు. ఇప్పుడు దేవుని దయ వల్ల డబ్బు ఉన్నా, తినలేని పరిస్థితి. 10 కాలాల పాటు హీరోలకు స్నేహితుడిగా నటించి మెప్పించాలంటే శారీరక భాష చాలా ముఖ్యం. అందుకు ఆహార కట్టుబాట్లు చాలా అవసరం. -
జీవిత ఖైదీ పరారీ
బుక్కరాయసముద్రం : రెడ్డిపల్లి వద్ద గల ఓపెన్‌ఎయిర్ జైలు నుంచి జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న పామిడి మండలానికి చెందిన సూరి పరారయ్యాడు. హత్య కేసులో ఇతనికి జీవిత ఖైదు శిక్ష పడింది. సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని కడప జిల్లా నుంచి మూడేళ్ల క్రితం రెడ్డిపల్లిలోని ఓపెన్‌ఎయిర్ జైలుకు తీసుకొచ్చారు. రోజు వారి కార్యక్రమాలలో భాగంగా ఖైదీలు వ్యవసాయ పనులకు వెళ్లారు. గురువారం సాయంత్రం సూరి బ్యారెక్‌కు రాకపోవడంతో జైలు సిబ్బంది ఓపన్ ఎయిర్ జైలు పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. శుక్రవారం ఉదయం కూడా గాలించారు. కనడపడకపోవడంతో ఓపన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి తెలిపారు. -
‘నేనూ హీరోగా నటించా’
అమలాపురం : ఆధునిక కాలంలో కూడా జానపదానికి ప్రాణం పోస్తున్నారు జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్. ‘ఏం పిల్లో, ఎల్దామొస్తవా..’ అంటూ తన పాటతో తెలుగు వారిని ఉర్రూతలూగించారు. కోనసీమలో షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అమలాపురంలో మాట్లాడారు. ప్రశ్న : ఉద్యమకారునిగా మీరు? జవాబు : 47 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాల్లో పాలుపంచుకున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమం, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపైన ప్రజలతో కలిసి పదం కలిపి ఉద్యమించాను. ప్రజాఉద్యమాల్లో పాటలు పాడాను. ఇలాంటి పాటలు సుమారు 300 రచించాను. రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ప్ర: మీ పాట గురించి..! జ : ముఖ్యంగా ‘ఏం పిల్లో, ఎల్దామొస్తవా..’ అనే పాట 50 భాషల్లో అనువాదమైంది. అలాగే ‘యంత్రమెట్ట నడుస్తున్నదంటే..’ పాట లండన్, అమెరికాలో ఇంగ్లిష్‌లో అనువాదం చేసుకుని పాడారు. ప్ర : సినీ రంగానికి రావడం? జ : ఇప్పుడు కాదు, 80వ దశకంలోనే నేను హీరోగా ఓ సినిమాలో నటించాను. అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాలో నలుగురు హీరోల్లో నేను ఒకడిని. ఆ తర్వాత అంతగా నచ్చిన పాత్రలు రాకపోవడంతో నటించలేదు. ‘సూరి’ చిత్రంలో ఉద్యమకారుడి పాత్ర ఉందని డెరైక్టర్ ఈఎస్ వెంకట్ చెప్పారు. నాకు నచ్చడంతో చేస్తున్నాను. ప్ర : మరి పాటలు రాయడానికి విరామమిస్తారా? జ : లేదు. ఇక మీదట కూడా జానపదాన్ని, జానపద సంస్కృతిని బలపరిచే పాటలు రాస్తా. ప్ర : రాజకీయాల్లోకి? జ : ప్రజా రాజకీయాలు చేస్తాను. ప్రజల కష్టసుఖాల్లో ఉండడమే రాజకీయం. ప్రజా పోరాటాలు ఎవరు చేసినా బలపరుస్తాను. ప్ర : జానపద సంస్కృతిని కాపాడాలంటే? జ : జానపదాన్ని ఆధునికీకరించి, ప్రజా సమస్యలను అందులో చొప్పించి ప్రజల్లోకి తీసుకువెళ్లడమే నా ఉద్దేశం. జానపదాన్ని నవతరం అర్ధం చేసుకుని జానపదతత్వం పోకుండా యువకులు ఆధునికీకరించాలి. యువత జానపదాన్ని కాపాడితేనే విషసంస్కృతిని ఆపగలం.