పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలతో నటుడు విమల్, సూరి
పెరంబూరు: ఎంత పని చేశావే కరోనా అని నటుడు విమల్, సూరి తలపట్టుకుంటున్న పరిస్థితి. ఎరక్క పోయి వచ్చి ఇరుక్కు పోయినట్టుంది ఈ ఇద్దరు నటుల పరిస్థితి. నటుడు విమల్, హాస్య నటుడు సూరి కరోనా కాలంలో ఇంట్లో కూర్చుని ఏమీ తోచక ఈ ఇద్దరూ కలిసి ఇటీవల కోడైకెనాల్‌కు జాలీ ట్రిప్ వేశారు. వెళితే వెళ్లారు లాక్‌డౌన్ నిబంధనలను పాఠించారా అంటే అదీ లేదు ఈ పాస్ లాంటివి తీసుకోకుండా అదీ కొడైకెనాల్‌లోని నిషేధిత ప్రాతానికి వెళ్లారు. అక్కడ ఒక కొలనులో చేపలను పట్టి సరదా తీర్చుకున్నారు. అయితే ఈ నటుల ఎంట్రీ గురించి సమాచారం అందిన అటవీ శాఖ అధికారులు అక్కడకు వచ్చి నాలుగు చివాట్లు పెట్టడంతో పాటు అపరాధం కూడా విధించారు.
పోన్లే అపరాధమే కదా అని అదేదో కట్టేసి వచ్చేశారు ఈ నట ద్వయం. అయితే కథ అక్కడితే ఆగలేదు. తాజాగా కొడైకెనాల్ పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలను పాటించకుండా, ఈ పాస్ పొందకుండా ప్రయాణం చేసిన నేరం కింద నటుడు విమల్, సూరీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు. ముందుగా కొడైకెనల్‌కు వచ్చిన వీరికి సహకరించింది ఎవరు, కార్లను సరపరా చేసింది ఎవర్నది విచారించారు. దీంతో కొడైకెనల్‌కు చెందిన ఖాదర్ బాషా అనే వ్యక్తి విమల్, సూరి అక్కడ పర్యటించడానికి కారును, జీప్‌ను, బస చేయడానికి వస తి ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీంతో కారును, జీప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నటుడు విమల్, సూరితో పాటు ఖాదర్‌బాషాపైనా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment