కళవాణి సీక్వెల్‌కు రెడీ | Vimal is ready to act in the movie Kaviavani 2. | Sakshi
Sakshi News home page

కళవాణి సీక్వెల్‌కు రెడీ

Published Sat, Sep 2 2017 3:36 AM | Last Updated on Tue, Sep 19 2017 1:00 PM

కళవాణి సీక్వెల్‌కు రెడీ

కళవాణి సీక్వెల్‌కు రెడీ

 – విమల్‌
తమిళసినిమా:  యువ నటుడు విమల్‌ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం కళవాణి. ఆ చిత్ర దర్శకుడు సర్గుణం, నటి ఓవియాకు ఇది తొలి చిత్రం అన్నది గమనార్హం. కళవాణి చిత్రం తరువాత విమల్‌ వరుసగా పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల చిన్న గ్యాప్‌ వచ్చింది. విమల్‌ చిత్రం తెరపైకి వచ్చి ఏడాదిన్నర పైనే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో విమల్‌ నిర్మాతగా మారి మన్నర్‌ వగైయారు అనే చిత్రాన్ని నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నారు. దీనికి భూపతి పాండియన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం  వెట్రివేల్‌ చిత్రం ఫేమ్‌ వసంతమణి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు.

దీనికి డి.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా కళవాణి–2 చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. దీనికి సర్గుణం దర్శకత్వం వహించనున్నారు. ఈయన ప్రస్తుతం మాధవన్‌ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఇది పూర్తి అయిన తరువాత కళవాణి–2 చిత్రం ప్రారంభమవుతుందని నటుడు విమల్‌ వెల్లడించారు. మొత్తం చిన్న గ్యాప్‌ తరువాత విమల్‌ మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారన్నమాట. కళవాణి చిత్రంలో నటించిన సూరి, గంజాకరుప్పు దానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న  కళవాణి–2లో నటించనున్నారు. మరి నటి ఓవియా కూడా నాయకిగా నటిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement