Ovia
-
హర్భజన్ సింగ్,ఓవియా కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్ చూశారా..?
భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, నటి ఓవియా నటించిన తమిళ చిత్రం 'సేవియర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. వెండితెరపై హర్భజన్ మరోసారి కనిపించనున్నడంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం విడుదలైన పోస్టర్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.ఈ చిత్రంలో నటి ఓవియా క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు జోడీగా నటిస్తోంది. వీటీవీ గణేష్, జీబీ ముత్తు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జాన్ పాల్ రాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సెంటోవా స్టూడియో నిర్మిస్తుంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో తల్లి వర్ణ పాత్రలో నటి ఓవియా, డాక్టర్ జేమ్స్ మల్హోత్రాగా హర్భజన్ సింగ్ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో జిబి ముత్తు, గణేశన్ పాత్రలను కూడా దర్శకుడు రివీల్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రం పిల్లి-ఎలుక గేమ్‌ల సాగనుందని ప్రచారం జరుగుతుంది. ఒక రాత్రిలో జరిగే 12 హత్యల చుట్టూ సేవియర్ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఫ్రెండ్షిప్ సినిమా తర్వాత హర్భజన్, జాన్ పాల్ రాజ్‌ల కలయికలో ఇది రెండవ సినిమా కావడం విశేషం.తాజాగా నటి ఓవియా పర్సనల్ వీడియో అంటూ ఒకటి నెట్టింట వైరల్ అయింది. బిగ్‌బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఓవియా కొంత కాలం వరకు భారీగానే సినిమా ఛాన్సులతో బిజీగానే ఉండేది. ఆ తర్వాత పలు వివాదాల వల్ల అవకాశాలు తగ్గాయి. గత కొన్నాళ్లుగా సినిమా ఛాన్సులు లేకుండా ఉన్న ఓవియా ఇప్పుడు సేవియర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
ఇది యూత్ కోసమే
ఐదుగురమ్మాయిలు తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్’ ‘ఇది చాలా తక్కువ’ అనేది క్యాప్షన్. ఓవియా ప్రధాన పాత్రలో నటించారు. హీరో శింబు గెస్ట్ రోల్ చేసి, సంగీతం అందించారు. అనితా ఉదీప్ దర్శకత్వం వహించారు. కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై యిన్నం శ్రీనివాసరావు సమర్పణలో కృష్ణ కాకర్లమూడి నిర్మాణ సారథ్యంలో పఠాన్ చాంద్‌బాషా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, సురేశ్ కొండేటి సీడీను ఆవిష్కరించి మాట్లాడుతూ – ‘‘యూత్‌ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన చిత్రం ఇది. పాటలు, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఈ నెల 26న చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు పఠాన్ చంద్. ఈ వేడుకలో విజయరంగరాజు, మల్లికార్జున్, రంగనాయకులు, కరుణాకర్ రాము తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ లేకుంటే చనిపోయేవాణ్ణి
‘‘పాతికేళ్లుగా మా కుటుంబానికి లారెన్స్ చాలా సన్నిహితుడు. చిన్న డ్యాన్సర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి, ‘హిట్లర్’ సినిమాతో డ్యాన్స్ మాస్టర్‌గా మారాడు. ఇప్పుడు లారెన్స్ ఓ బ్రాండ్లా తయారయ్యాడు. అతని సినిమా వస్తోందంటే అందరూ ఎదురు చూస్తున్నారు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కోవై సరళ, శ్రీమాన్ ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘కాంచన 3’. లారెన్స్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్లో రాఘవ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలవుతోంది. తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్’ బ్రోచర్‌ను అల్లు అరవింద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సంపాదించిన దాన్ని పదిమందికీ పంచాలనుకుంటాడు లారెన్స్. అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవిగారు తన శిష్యుడ్ని అభినందిస్తూ 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు’’ అన్నారు. ‘‘అమెరికాలో సిల్వస్టర్ స్టాలోన్ తనని తాను హీరోగా తయారు చేసుకున్నాడు. అలాగే లారెన్స్ కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు’’ అన్నారు నిర్మాత ‘లగడపాటి’ శ్రీధర్. ‘‘లారెన్స్‌లో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ‘ఠాగూర్’ మధుగారికి థాంక్స్. లగడపాటి శ్రీధర్‌గారితో ‘స్టైల్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘స్టైల్ 2’ చేద్దామంటున్నారు.. తప్పకుండా చేస్తాను. డ్యాన్స్ సినిమా చేయాలంటే మంచి డ్యాన్సర్ కావాలి. ఇక్కడ బాగా డ్యాన్స్ చేసే వాళ్లలో బన్నీ, చరణ్, తారక్ ఉన్నారు. అన్నయ్యే (చిరంజీవి) అన్నింటికీ బాస్. ఆయన ‘హిట్లర్’ సినిమాలో డ్యాన్స్ మాస్టర్‌గా చాన్స్ ఇవ్వకుంటే.. నేను నంబర్ వన్ డ్యాన్స్‌మాస్టర్‌ని అయ్యేవాడినే కాను. నాగార్జునగారు డైరెక్షన్ చాన్స్ ఇచ్చేవారే కాదు. నన్ను ఆశీర్వదించిన రజనీకాంత్‌గారికి, చిరంజీవిగారికి, నన్ను డైరెక్టర్ని చేసిన నాగార్జునగారికి థాంక్స్. నేను డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగింది తెలుగు రాష్ట్రాల్లోనే కాబట్టి ఇక్కడ కూడా చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాను. ట్రస్ట్ ద్వారా మంచి పనులు చేస్తున్నానంటే కారణం మా అమ్మగారే. ఆమె లేకుంటే నేను బ్రెయిన్ ట్యూమర్‌తో ఎప్పుడో చనిపోయేవాణ్ణి. మా అమ్మే నాకు దేవత. అందుకే అమ్మకు గుడి కట్టించాను. ఓపెన్ హార్ట్ సర్జరీ సమస్య, ఆర్థికంగా వెనకబడి చదువుకోలేనివారు నన్ను సంప్రదించవచ్చు’’ అన్నారు. -
‘కాంచన 3’ మూవీ స్టిల్స్
-
1400 మంది డాన్సర్స్‌తో...
‘ముని, కాంచన, కాంచన–2’ వంటి హారర్ కామెడీ చిత్రాలతో దక్షిణాదిలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన రాఘవ లారెన్స్ ‘కాంచన 3’తో మరోసారి ప్రేక్షకులను వినోదంతో భయపెట్టేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన 3’. ఓవియా, వేదిక కథానాయికలుగా నటించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రాఘవ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘కాంచన 3’లో రాఘవ లారెన్స్ నట విశ్వరూపం చూపించాడు. దాదాపు 1400 మంది డాన్సర్స్‌తో అత్యద్భుతంగా ఓ పాటని చిత్రీకరించారు. 400 మంది అఘోరా పాత్రధారులు, 1000 మంది వైవిధ్యమైన లుక్‌తో 6 రోజుల పాటు ఈ సాంగ్ షూట్ చేశారు. ఈ పాట కోసం కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టడం విశేషం. ఈ సినిమా కోసం లారెన్స్ చాలా కష్టపడ్డాడు. తన కెరీర్లో ‘కాంచన 3’ ప్రత్యేకమైంది. ఇందులో కథ, కథనం, గ్రాఫిక్స్... ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మా బ్యానర్లో ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంటుందనే గట్టి నమ్మకం ఉంది’’ అన్నారు. మనోబాల, దేవదర్శిని, సత్యరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
ఇది చాలా తక్కువ!
తమిళ బిగ్‌బాస్ ఫేమ్ ఓవియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘90ఎంఎల్’. ‘ఇది చాలా తక్కువ’ అన్నది ట్యాగ్‌లైన్. అనితా ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు ప్రత్యేక పాత్రలో కనిపించి, సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో పఠాన్ చాంద్‌బాషా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సాయి వెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తమిళంలో హిట్ అయినట్టే తెలుగులోనూ హిట్ సాధించాలని అన్నారు. నిర్మాత చాంద్‌బాషా మాట్లాడుతూ – ‘‘తెలుగు హక్కుల కోసం చాలా పోటీ ఏర్పడింది. మేం దక్కించుకున్నాం. కామెడీ డ్రామాగా సాగే చిత్రమిది’’ అన్నారు. ‘‘ఐదుగురు అమ్మాయిలు.. వాళ్లకు ఎదురైన సమస్యల వల్ల మద్యపానం, ధూమపానానికి అలవాటు పడి ఎలా బయటపడ్డారన్నది కథ. శింబు స్పెషల్ రోల్, సంగీతం ఆకట్టుకుంటుంది’’ అన్నారు నిర్మాణ సారథి కృష్ణ కాకర్లమూడి. ఈ కార్యక్రమంలో డా. రంగనాయకులు, శ్రీధర్, వాసుదేవ్ వైజాగ్ దివాకర్ పాల్గొన్నారు. -
నేను డబుల్ మాస్
‘నాకేమైనా అయినా వదిలేస్తా.. మా వాళ్లకేమైనా అయితే నరికి పారేస్తాన్రా’ అని హీరో అంటే, ‘నువ్వు ఉన్న చోటు తెలియకుండా అంతం చేసేస్తా’ అని విలన్ అంటాడు. ‘నిప్పుని కూడా తాకొచ్చురా నలుపుని తాకొద్దు’ అని హీరో రాఘవ లారెన్స్ డైలాగ్ చెబితే, ‘నువ్వు నా మాస్ తెలీకుండా మాట్లాడుతున్నావ్’ అని విలన్ వార్నింగ్ ఇస్తాడు. ‘నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్’ అని లారెన్స్ చెబుతున్న డైలాగ్‌తో ‘కాంచన 3’ ట్రైలర్ సాగుతుంది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన 3’. ఓవియా, వేదిక కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. తెలుగులో లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్ఎల్పీ పతాకంపై ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రాఘవ లారెన్స్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం రిలీజ్ చేశారు. ‘‘కాంచన సిరీస్‌లో మూడు భాగాలను హిట్ చేశారు. ఇప్పుడు ‘కాంచన 3’ని కూడా ఆదరిస్తే ఓ పది భాగాలు తీయాలని ఉంది. నన్ను పెద్ద డ్యాన్స్ మాస్టర్ని చేసిన చిరంజీవిగారు హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. అలాగే నన్ను దర్శకుడిని చేసిన నాగార్జునగారితో మళ్లీ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు లారెన్స్. -
అంతకు మించి!
‘ముని’ ఫ్రాంచైజీలో వచ్చిన హారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘కాంచన 3’ రెడీ అవుతోంది. రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్ దుహన్ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తెలుగులో లైట్‌హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్లో రాఘవ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం డాల్బీ అట్మాస్ సౌండ్‌ని వినియోగించారు టీమ్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భాగా బి. మధు మాట్లాడుతూ– ‘‘రాఘవా లారెన్స్ స్వయంగా అందించిన హారర్ సినిమాలన్నీ సూపర్ హిట్లే. అందులో ‘ముని’ సీక్వెల్ చాలా స్పెషల్. ‘ముని’ సిరీస్‌లో ఇది నాలుగో చిత్రం. కాంచన పేరుతో స్టార్ట్ అయిన తర్వాత ఇది కాంచన–3. ఆయన ప్రతి చిత్రంలో తన గెటప్‌ని సామాన్య ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా చూసుకుంటారు. గత మూడు చిత్రాలకు మించి ‘కాంచన 3’ ఉండబోతుంది’’ అన్నారు. -
భయపడటానికి రెడీ అవ్వండి
హారర్ మూవీ సిరీస్ ‘ముని’ ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టిందనే చెప్పాలి. అందుకే ఈ సిరీస్‌కు స్పెషల్ క్రేజ్. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘కాంచన 3’. రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. తమిళ బిగ్‌బాస్ ఫేమ్ ఓవియా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వేదిక కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని రచించి, దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. -
సమ్మర్లో భయపెడతా
సమ్మర్లో చల్లని థియేటర్లో ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయ్యారు రాఘవ లారెన్స్. ఆయన దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘ముని’ చిత్రానికి సీక్వెల్స్‌గా ‘కాంచన (ముని 2), కాంచన 2 (ముని 3)’ చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కాంచన 3’ సెట్స్‌పై ఉంది. రాఘవ లారెన్స్‌నే దర్శకత్వం వహిస్తున్నారు. ఓవియా, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని వినికిడి. ఇంతకుముందు ‘ముని’ ఫ్రాంచైజీలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ‘కాంచన 3’పై అంచనాలు ఉన్నాయి. -
మాలో వాళ్లని చూసుకుంటారు – తరుణ్
‘‘చాలా గ్యాప్ తర్వాత ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. క్లీన్ లవ్‌స్టోరీ ఇది. సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. అబ్బాయిలు వాళ్లని నాలో.. అమ్మాయిలు హీరోయిన్లో వాళ్లని చూసుకుంటారు’’ అని హీరో తరుణ్ అన్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించిన ‘ఇది నా లవ్‌స్టోరీ’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. తరుణ్ మాట్లాడుతూ –‘‘రమేష్, గోపిలకు ఇది తొలి సినిమా అయినా చక్కగా డైరెక్ట్ చేశారు. క్రిస్టోఫర్ జోసెఫ్ అద్భుతమైన విజువల్స్, శ్రీనాథ్ విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఓవియా చక్కగా నటించారు. వీరిందరికీ తెలుగులో ఇది తొలి సినిమా. గోగినేని బాలకృష్ణగారు మా సినిమాని విడుదల చేస్తున్నారు’’ అన్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ లవ్‌స్టోరీ ఇది. సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారనే కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా ఎవర్నీ నిరుత్సాహపరచదు. అందరికీ నచ్చుతుంది. అడగ్గానే మంచు మనోజ్గారు అతిథి పాత్ర చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు దర్శకులు రమేష్, గోపి. ‘‘ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ బాగా నచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. తరుణ్‌కి మంచి సక్సెస్ రావాలి’’ అన్నారు మంచు మనోజ్. నిర్మాతలు డి.సురేశ్‌బాబు, కె.ఎల్.నారాయణ, చిత్రనిర్మాత ఎస్.వి.ప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనాథ్ విజయ్, హీరోలు శ్రీకాంత్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
మంచి ఫీల్‌తో...
‘నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు తరుణ్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇది నా లవ్ స్టోరీ’. రమేష్ గోపి దర్శకత్వంలో అభిరామ్ సమర్పణలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ ఫిల్మ్ ఇది. ట్రైలర్, సాంగ్ టీజర్‌కి సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వచ్చింది. యూత్‌తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘కుటుంబమంతా కలిసి చూడదగ్గ క్లీన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుంది. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఓవియా మా సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు’’ అన్నారు రమేష్ గోపి. ‘‘2018 ది బెస్ట్ మూవీస్‌లో ‘ఇది నా లవ్ స్టొరీ’ ఒకటిగా నిలుస్తుంది. ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ఎస్.వి.ప్రకాష్. -
ఓవియ తొలి చిత్రానికి సీక్వెల్
తమిళసినిమా: నటి ఓవియను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రం కలవాణి. విమల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని సర్గుణం తెరకెక్కించారు. ఆయనకి దర్శకుడిగా ఇది మొదటి చిత్రమే. 2010లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. ముఖ్యం గా నటి ఓవియకు మరిన్ని అవకాశాలను తెచ్చి పెట్టిన చిత్రం కలవాణి. కాగా ఆ తరువాత ఓవియకు సరైన సక్సెస్‌లు పడలేదనే చెప్పా లి. అంతే కాదు అవకాశాలు రాలేదు. అయితే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న ఓవియను ఆ గేమ్ షో మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. నటిగా అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, కథా నాయకుడిగా నటిస్తున్న కాంచన–3 చిత్రంలో ఓవియ కథా నాయకిగా నటిస్తోంది. ఇకపోతే సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో కలవాణి చిత్రానికి సీక్వెల్ తయారు అవుతోం ది. ఎనిమిదేళ్ల తరువాత కలవాణి–2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదే విమల్, ఓవియల జంట కలిసి నటిస్తున్నారు. కలవాణి చిత్ర దర్శకుడు సర్గుణం తన వర్ణన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇందులో నటించే ఇతర నటీనటులు, సంకేతిక వర్గాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు దర్శక నిర్మాత సర్గుణం తెలిపారు. ఈ కలవాణి జంట మరోసారి మ్యాజిక్ చేస్తారా? అన్నది చూడాల్సిందే. ఇక ఈ చిత్ర టైటిల్‌ను గురువారం సాయంత్రం నటుడు శివకార్తికేయన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం విశేషం. ఇప్పటికే సర్గుణం మాధవన్ హీరోగా ఒక చిత్రం చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నా రు. ఈ రెండు చిత్రాల షూటింగ్ మార్చిలో జరగనుందట. -
వేలంటైన్స్ డేకి ప్రేమకథ
‘‘నాగార్జునగారు ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమా టీజర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. టీజర్ పెద్ద హిట్ అయింది. నా పుట్టినరోజున (08.01.) ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో తరుణ్ అన్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేష్–గోపీ దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మించిన చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఇది రెగ్యులర్ ప్రేమకథ కాదు. ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తా. ట్రిపుల్ రోల్ చేశానా? మూడు షేడ్స్ ఉన్న పాత్ర చేశానా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. రమేష్–గోపీ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి, నువ్వే నువ్వే’ సినిమాలకంటే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. లవర్స్‌కు మంచి ట్రీట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 14న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ఎస్.వి.ప్రకాష్. సంగీత దర్శకుడు శ్రీనాథ్ విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జగదీశ్.ఎస్, అరుణ్ అజాద్, కో–ప్రొడ్యూసర్: ఎ.గణేశ్. -
తప్పుకోలేదు!
ఓవియా తప్పుకోలేదు. వచ్చిన వార్తలే తప్పు అంటున్నారు ‘కాంచన–3’ చిత్రబృందం. ఓవియా గురించి ఈ చిత్రబృందం ఎందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే.. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమె ఈ హారర్ మూవీ నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. సినిమా సగం పూర్తయింది. ఇప్పుడు హీరోయిన్ తప్పుకుందనే వార్త అంటే అనవసరమైన రచ్చే కదా. అందుకే, ‘నో నో.. ఓవియా ఈజ్ దేర్’ అన్నారు. హారర్ సినిమాల మాంత్రికుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న సినిమా ‘కాంచన–3’. లారెన్స్, ఓవియా, వేదిక కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ 55 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. ఇంతకీ ఈ ఓవియా ఎవరంటే.. తరుణ్ హీరోగా నటించిన ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాలో తనే కథానాయిక. అలాగే వేదిక తెలుగులో బాణం, విజయదశమి, దగ్గరగా దూరంగా వంటి చిత్రాల్లో నటించారు. 2006లో వచ్చిన ‘ముని’ ఫ్రాంచైజీ తొలి పార్ట్‌లో తనే కథానాయిక. మళ్లీ ఈ పార్ట్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో నైట్ షూట్ జరుగుతోంది. -
హలో హర్రర్...!
ఆత్మలకి ప్రేతాత్మలకీ వైరం పెట్టాడు. దెయ్యాల్లో మంచివి కూడా ఉంటాయనీ, వాటికి దేవుడి అండ ఉంటుందన్న కాన్సెప్ట్‌ను చూపించాడు. ఇలా కొత్త రకం ఘోస్ట్ స్టోరీలను తెరపైకి తెచ్చి హిట్స్ కొట్టేస్తున్నారు లారెన్స్. ‘ముని’, ‘కాంచన’, ‘కాంచన 2’ వంటి చిత్రాలతో ఆయన ప్రేక్షకులను భయపెట్టారు. ఇప్పుడు మరోసారి...భయపడ్డానికి రెడీనా? అంటూ కొత్త ఘోస్ట్ కాన్సెప్ట్‌తో ‘కాంచన 3’ షూట్‌ను స్టార్ట్ చేశారాయన. లారెన్స్, వేదిక, ఓవియా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. నైట్ సీన్స్ తీస్తున్నారు. ‘హలో హర్రర్. చెన్నైలో ‘కాంచన 3 ’నైట్ షూట్ చేస్తున్నాం’ అని వేదిక పేర్కొన్నారు. అన్నట్లు లారెన్స్ ఫస్ట్ హర్రర్ మూవీ ‘ముని’లో హీరోయిన్గా వేదిక చేశారు. ఇన్నేళ్ల తర్వాత లారెన్స్ సినిమాలో ఆమె మళ్లీ నటిస్తున్నారు. ‘విజయదశమి’, ‘బాణం’, ‘దగ్గరగా.. దూరంగా’ వంటి తెలుగు చిత్రాల్లోనూ మెరిసారామె. -
గీత రచయితతో ఓవియ
తమిళసినిమా: ప్రముఖ గీత రచయితతో రొమాన్స్ చేయడానికి నటి ఓవియ రెడీ అవుతోంది. ఒక మోస్తరు కథానాయకి ఓవియను బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో పెద్ద స్టార్‌ను చేసేసింది. ఇంతకు ముందు లేని మార్కెట్ ఒక్కసారిగా ఈ బ్యూటీ సొంతమైంది. ఇంకా చెప్పాలంటే దీపావళి వాణిజ్య ప్రకటనలో ఓవియనే ముందంజలో ఉంది. ఒక వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా అంగీకరించిన ఓవియ అందుకుగానూ ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం అందుకుందనే ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. ఇక బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో నుంచి బయటకొచ్చిన తరువాత నటి ఓవియకు సినీ అవకాశాలు వరుస కడుతున్నాయి. వాటిలో తాజాగా ఒక చిత్రం చేరింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో కథానాయకుడిగా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో చివరి వరకూ పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రముఖ గీత రచయిత స్నేహన్ నటించనున్నారు.ç మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఎంగేయుమ్ ఎప్పోదుమ్, తీయవేలై చేయనుమ్ కుమారు, నెడుంశాలై, ఇవన్‌వేరమాదిరి వంటి పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సి.సత్య నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. -
ఓవియాతో కోలీవుడ్‌కు..
తమిళసినిమా: టాలీవుడ్ యువ నటుడు ఆది నటి ఓవియాతో కలిసి కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తరువాత విపరీతంగా పాపులారిటీని పెంచుకున్న నటి ఓవియా. ప్రస్తుతం ఈ జాణకు అవకాశాలు వరుస కడుతున్నాయి. అందులో ఒకటి కాటేరి. ఇంతకు ముందు యామిరుక్క భయమే వంటి హర్రర్ కామేడీ కథా చిత్ర దర్శకుడు డీకే తాజాగా ఈ కాటేరి దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు. ఈ చిత్రాన్ని స్డూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి ఆయన వివరిస్తూ కాటేరి ఎడ్వెం చర్ కామెడీ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హర్రర్ థ్రిల్లర్ సన్నివేశాలు చోటుచేసుకుంటాయన్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు యువ నటుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఆది సీనియర్ నటుడు సాయికుమార్ కొడుకన్నది గమనార్హం. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒకరిగా నటి ఓవియాను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈయన ఇంతకు ముందు జీవా, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తొలి చిత్రం యామిరుక్క భయమే చిత్ర నేపథ్యం అయిన హర్రర్నే తన తాజా చిత్రానికి నమ్ముకున్నారనిపిస్తోంది. -
పోలీస్‌రాజ్యంలో ఓవియ
మిళసినిమా: బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తరువాత నటి ఓవియకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. తను ఆ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ గేమ్ షో రేటింగ్ పడిపోయిందనే ప్రచారం జరుగుతుందటే ఓవియ ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు నటిగానూ ఇంతకు ముందు కంటే ఓవియ క్రేజ్ పెరిగింది. తాజాగా తన నటుడు పృథ్వీరాజ్‌కు జంటగా నటించిన పోలీస్‌రాజ్యం చిత్రానికి వ్యాపారపరంగా ఊపు వచ్చింది. అన్నపూరిణి ఫిలింస్ పతాకంపై అరుణాచలం నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను బాబూరాజ్ నిర్వహించారు. జెమినికిరణ్, కళాభవన్మణి, సత్య, ఐశ్వర్య, జగదీశ్, సీమ, దేవ ముఖ్య పాత్రలను పోషించిన ఇందులో దర్శకుడు బాబూరాజ్ ప్రధాన పాత్ర పోషించారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఒక గ్రామంలో అమ్మనాన్న, పిల్లలు అంటూ హాయిగా జీవిస్తున్న ఒక కుటుంబంలో వరుసగా హత్యలు జరుగుతాయన్నారు. ఆ గ్రామంలోనే అసాంఘిక సంఘటనలు చోటు చేసుకుని స్థానిక పోలీసులకే అంత చిక్కని పరిస్థితుల్లో నటుడు పృధ్వీరాజ్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా వస్తారన్నారు. ఆయన తన ఇన్వెస్టిగేషన్లో హంతకుడెరన్నది కనుగొని అరెస్ట్ చేయగా, కొన్ని దిగ్బ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూస్తాయన్నారు. అవి ఏమిటన్నదే పోలీస్ రాజ్యం చిత్రంలో ఆసక్తికరమైన అంశాలని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాయకిగా ఓవియ చాలా గ్లామరస్ పాత్రలో నటించిందని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. నటి ఓవియకున్న క్రేజ్‌ను దృష్టిలో పట్టుకుని పోలీస్‌రాజ్యాం చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా 250 థియేటర్లలో విడుదల చేయనున్నామని చెప్పారు. అదే విధంగా ఓవియ కోరిక మేరకు ఈ చిత్ర ప్రీమియర్‌ను మలేషియాలో ఏర్పాటు చేయనున్నట్లు, ఆ ప్రీమియర్ షోల్లో నటి ఓవియ పాల్గొననున్నట్లు తెలిపారు. -
కళవాణి సీక్వెల్‌కు రెడీ
– విమల్ తమిళసినిమా: యువ నటుడు విమల్ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం కళవాణి. ఆ చిత్ర దర్శకుడు సర్గుణం, నటి ఓవియాకు ఇది తొలి చిత్రం అన్నది గమనార్హం. కళవాణి చిత్రం తరువాత విమల్ వరుసగా పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల చిన్న గ్యాప్ వచ్చింది. విమల్ చిత్రం తెరపైకి వచ్చి ఏడాదిన్నర పైనే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో విమల్ నిర్మాతగా మారి మన్నర్ వగైయారు అనే చిత్రాన్ని నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నారు. దీనికి భూపతి పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం వెట్రివేల్ చిత్రం ఫేమ్ వసంతమణి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా కళవాణి–2 చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. దీనికి సర్గుణం దర్శకత్వం వహించనున్నారు. ఈయన ప్రస్తుతం మాధవన్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఇది పూర్తి అయిన తరువాత కళవాణి–2 చిత్రం ప్రారంభమవుతుందని నటుడు విమల్ వెల్లడించారు. మొత్తం చిన్న గ్యాప్ తరువాత విమల్ మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారన్నమాట. కళవాణి చిత్రంలో నటించిన సూరి, గంజాకరుప్పు దానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న కళవాణి–2లో నటించనున్నారు. మరి నటి ఓవియా కూడా నాయకిగా నటిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
త్వరలో తెరపైకి ఓవియ విట్టా యారు
తమిళసినిమా: ఓవియ విట్టా యారు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. విశేషం ఏమిటంటే నటి ఓవియతో పాటు బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న పలువురు ఈ చిత్రంలో నటించారు. బిగ్‌బాస్ గేమ్ షోలో తన సహజ సిద్ధమైన నటనతో విశేష ప్రాచుర్యాన్ని పొందిన నటి ఓవియ కథానాయకిగా నటించిన ఇందులో నూతన నటుడు సంజీవి కథానాయకుడిగా నటించారు. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న నటుడు గంజాకరుప్పు, వైయాపురి ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు రాధారవి, సెంథిల్, శరవణన్, మనోజ్‌కుమార్ నటించారు. ఇందులో ఒక ఏనుగు ప్రధాన పాత్రగా ఉంటుందని దర్శకుడు రాజ్‌దురై తెలిపారు. సినీ పీఆర్ఓ మదురై ఆర్.సెల్వన్ నిర్మాతగా మారి వేలమ్మాళ్ సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ఓవియ విట్టా యారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మదురై ఆర్.సెల్వన్ మాట్లాడుతూ ఒక యువకుడు శ్రమను కాకుండా అదృష్టాన్ని నమ్ముకోవడంతో జరిగే పరిణామాలే చిత్ర ప్రధానాంశం అని తెలిపారు. ఇందులో ఓవియకు సాయం చేసే పాత్రలో ఏనుగు నటించిందని తెలిపారు. చిత్రంలో ఏనుగు పేరు సీనీ అని చెప్పారు. మొదట ఈ పేరునే చిత్రానికి అనుకున్నామని, ఆ తరువాత ఓవియ విట్టా యారు అని మార్చామని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.