భయపడటానికి రెడీ అవ్వండి | Bigg boss actress in Lawrence's Kanchana-3 | Sakshi
Sakshi News home page

భయపడటానికి రెడీ అవ్వండి

Published Sat, Dec 22 2018 2:58 AM | Last Updated on Sat, Dec 22 2018 2:58 AM

Bigg boss actress in Lawrence's Kanchana-3 - Sakshi

రాఘవ లారెన్స్‌

హారర్‌ మూవీ సిరీస్‌ ‘ముని’ ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టిందనే చెప్పాలి. అందుకే ఈ సిరీస్‌కు స్పెషల్‌ క్రేజ్‌. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘కాంచన 3’. రాఘవ లారెన్స్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఓవియా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వేదిక కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రాఘవ లారెన్స్‌ ఈ చిత్రాన్ని రచించి, దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement