Kanchana remake
-
లక్ష్మీబాంబ్‌ని తీసుకొస్తున్నా
‘ఈ దీపావళికి లక్ష్మితో పాటు ఓ బాంబ్ కూడా మీ ఇంటికి రాబోతోంది’ అన్నారు అక్షయ్ కుమార్. ఆయన హీరోగా రాఘవా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. కియారా అద్వానీ కథానాయిక. దక్షిణాదిన లారెన్స్ చేసిన ‘కాంచన’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. ‘భూల్ బులయ్య’ తర్వాత 13 ఏళ్లకు మళ్లీ అక్షయ్ చేసిన హారర్ కామెడీ చిత్రం ఇది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 9న నేరుగా హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. -
మీ సినిమాలు మాకొద్దు!
లాక్ డౌన్‌తో థియేటర్స్ అన్నీ మూతబడ్డాయి. రిలీజ్ కి రెడీ అయిన సినిమాల పరిస్థితి అయోమయంలో పడింది. తాజాగా తమిళంలో ఓ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకముందే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోంది. జ్యోతిక ముఖ్య పాత్రలో ఫ్రెడ్రిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్ మగళ్ వందాల్’. ఇందులో జ్యోతిక న్యాయవాదిగా కనిపించనున్నారు. ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. అప్పటికే దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. తాజాగా ఈ సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మే మొదటివారంలో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కానుందట. ఈ వార్తలకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతికూలంగా స్పందించింది. ‘‘థియేటర్ లో రిలీజ్ చేయడం కోసం తయారు చేసిన సినిమాలను నేరుగా డిజిటల్ లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు’’ అని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్. పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. ‘‘అలా చేస్తే ఆ నిర్మాణ సంస్థ (ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, హీరో సూర్య నిర్మించారు) నుంచి వచ్చే తదుపరి సినిమాలను థియేటర్స్ లో ప్రదర్శించం. వాళ్ల సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేసుకోవచ్చు. మా థియేటర్స్‌కి వాళ్ల సినిమాలు అక్కర్లేదు’’ అని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. అక్షయ్ సినిమా కూడా? బాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న టాపిక్ ఏంటంటే.. అక్షయ్ కొత్త చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ కూడా థియేటర్ లో కాకుండా డిజిటల్ గా రిలీజ్ కానుందట. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ ‘కాంచన’కి రీమేక్. జూన్‌లో ఈ సినిమా విడుదల కావాలి. మరి డిజిటల్ రిలీజ్ వార్తలు ఎంత వరకు నిజమో? తెలియాలి. -
3డీ.. లారెన్స్ రెడీ
నృత్యదర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు రాఘవలారెన్స్ హర్రర్ చిత్రాలకు చిరునామాగా మారారు. ఆయన నటించి, తెరకెక్కించిన ముని సీక్వెల్స్ నాలుగు సక్సెస్ కావడం, తన హీరోగా మాత్రమే నటించిన మరో చిత్రం శివలింగ కూడా హర్రర్ నేపథ్యంలోనే తెరకెక్కడంతో లారెన్స్ హర్రర్ చిత్రాల హీరోగా ముద్ర వేసుకున్నారు. కాగా ఇటీవల తెరపైకి వచ్చిన ముని–4 (కాంచన 3) చిత్రం వసూళ్ల పరంగా కుమ్మేస్తోంది. దీంతో లారెన్స్ హర్రర్‌ను వదిలేలా లేరు. తాజాగా కాంచన–2 చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. కాగా తమిళంలో శరత్‌కుమార్ పోషించిన హిజ్రా పాత్రను బిగ్‌బీ అమతాబ్ బచ్చన్‌తో నటింపజేస్తున్నట్లు తాజా సమాచారం. ప్రభుదేవా తరువాత కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు దర్శకుడిగా వెళుతున్న నృత్యదర్శకుడు లారెన్సే కావటం విశేషం. అయితే ప్రభుదేవా బాలీవుడ్లో విజయదుందుబి మోగించారు. దీంతో లారెన్స్ ఎలాంటి విజయాన్ని సాధిస్తారో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. కాగా మరో తాజా వార్త ఏమిటంటే హిందీ చిత్రం తరువాత లారెన్స్ చేసే తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి కోలీవుడ్‌లో నెలకొంది. అలాంటి వారికి లారెన్స్ తదుపరి కాలభైరవా అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారనే టాక్ సామాజక మాధ్యమాల్లో తాజాగా వైరల్ అవుతోంది. కాలభైరవా అనే ఈ పవర్ఫుల్ టైటిల్‌తో మరోసారి హర్రర్ కథా చిత్రంతో వస్తాడా? లేక కమర్శియల్ ఫార్ములాతో కూడిన యాక్షన్ కథా చిత్రం చేస్తారా అన్న ఉత్సకత నెలకొంది. అయితే లారెన్స్ కాలభైరవా చిత్రాన్ని 3డీ ఫార్మెట్లో చేసి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. ప్రస్తుతం లారెన్స్ హిందీ కాంచన–2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
సహనం పాటించండి : రాఘవ లారెన్స్
పెరంబూరు: తొందర పడవద్దు.. సహనం పాటించండి అని నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన అభిమానులకు, దివ్యాంగులకు, హిజ్రాలకు విజ్ఞప్తి చేశారు. రాఘవ లారెన్స్‌కు, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాఘవలారెన్స్ శుక్రవారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో.. ‘కాంచన–3 చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు. నాపై ప్రేమాభిమానాలు కలిగిన వారికి ఒక విన్నపం. నా తరుపున కొందరు దివ్యాంగులు, హిజ్రాలు, పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో కొందరిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అలాంటిదేమీ చేయకండి. సహనాన్ని పాఠించండి. మనం మంచినే కోరుకుందాం. మంచినే చేద్దాం.వారిని వారి ఇష్టానికే వదిలేద్దాం. నాకు చిన్న సమస్య అని తెలియగానే పరిగెత్తుకొచ్చే మీ అందరికీ నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం నేను ముంబైలో కాంచన చిత్ర హిందీ రీమేక్ షూటింగ్లో ఉన్నాను. షూటింగ్ పూర్తి కాగానే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. భగవంతుడు మనకి మంచే చేస్తాడు. మనకు చెడు జరగాలని భావించేవారికీ మంచే జరగాలని మనం దేవుని ప్రార్థిద్దాం. మన గురించి అర్థం చేసుకునేలా వారికి ఆ భగవంతుడి కృప కలగడం’ అని పేర్కొన్నారు. -
అమ్మ లేకుంటే చనిపోయేవాణ్ణి
‘‘పాతికేళ్లుగా మా కుటుంబానికి లారెన్స్ చాలా సన్నిహితుడు. చిన్న డ్యాన్సర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి, ‘హిట్లర్’ సినిమాతో డ్యాన్స్ మాస్టర్‌గా మారాడు. ఇప్పుడు లారెన్స్ ఓ బ్రాండ్లా తయారయ్యాడు. అతని సినిమా వస్తోందంటే అందరూ ఎదురు చూస్తున్నారు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కోవై సరళ, శ్రీమాన్ ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘కాంచన 3’. లారెన్స్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్లో రాఘవ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలవుతోంది. తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్’ బ్రోచర్‌ను అల్లు అరవింద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సంపాదించిన దాన్ని పదిమందికీ పంచాలనుకుంటాడు లారెన్స్. అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవిగారు తన శిష్యుడ్ని అభినందిస్తూ 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు’’ అన్నారు. ‘‘అమెరికాలో సిల్వస్టర్ స్టాలోన్ తనని తాను హీరోగా తయారు చేసుకున్నాడు. అలాగే లారెన్స్ కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు’’ అన్నారు నిర్మాత ‘లగడపాటి’ శ్రీధర్. ‘‘లారెన్స్‌లో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ‘ఠాగూర్’ మధుగారికి థాంక్స్. లగడపాటి శ్రీధర్‌గారితో ‘స్టైల్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘స్టైల్ 2’ చేద్దామంటున్నారు.. తప్పకుండా చేస్తాను. డ్యాన్స్ సినిమా చేయాలంటే మంచి డ్యాన్సర్ కావాలి. ఇక్కడ బాగా డ్యాన్స్ చేసే వాళ్లలో బన్నీ, చరణ్, తారక్ ఉన్నారు. అన్నయ్యే (చిరంజీవి) అన్నింటికీ బాస్. ఆయన ‘హిట్లర్’ సినిమాలో డ్యాన్స్ మాస్టర్‌గా చాన్స్ ఇవ్వకుంటే.. నేను నంబర్ వన్ డ్యాన్స్‌మాస్టర్‌ని అయ్యేవాడినే కాను. నాగార్జునగారు డైరెక్షన్ చాన్స్ ఇచ్చేవారే కాదు. నన్ను ఆశీర్వదించిన రజనీకాంత్‌గారికి, చిరంజీవిగారికి, నన్ను డైరెక్టర్ని చేసిన నాగార్జునగారికి థాంక్స్. నేను డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగింది తెలుగు రాష్ట్రాల్లోనే కాబట్టి ఇక్కడ కూడా చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాను. ట్రస్ట్ ద్వారా మంచి పనులు చేస్తున్నానంటే కారణం మా అమ్మగారే. ఆమె లేకుంటే నేను బ్రెయిన్ ట్యూమర్‌తో ఎప్పుడో చనిపోయేవాణ్ణి. మా అమ్మే నాకు దేవత. అందుకే అమ్మకు గుడి కట్టించాను. ఓపెన్ హార్ట్ సర్జరీ సమస్య, ఆర్థికంగా వెనకబడి చదువుకోలేనివారు నన్ను సంప్రదించవచ్చు’’ అన్నారు. -
‘కాంచన 3’ మూవీ స్టిల్స్
-
1400 మంది డాన్సర్స్‌తో...
‘ముని, కాంచన, కాంచన–2’ వంటి హారర్ కామెడీ చిత్రాలతో దక్షిణాదిలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన రాఘవ లారెన్స్ ‘కాంచన 3’తో మరోసారి ప్రేక్షకులను వినోదంతో భయపెట్టేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన 3’. ఓవియా, వేదిక కథానాయికలుగా నటించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రాఘవ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘కాంచన 3’లో రాఘవ లారెన్స్ నట విశ్వరూపం చూపించాడు. దాదాపు 1400 మంది డాన్సర్స్‌తో అత్యద్భుతంగా ఓ పాటని చిత్రీకరించారు. 400 మంది అఘోరా పాత్రధారులు, 1000 మంది వైవిధ్యమైన లుక్‌తో 6 రోజుల పాటు ఈ సాంగ్ షూట్ చేశారు. ఈ పాట కోసం కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టడం విశేషం. ఈ సినిమా కోసం లారెన్స్ చాలా కష్టపడ్డాడు. తన కెరీర్లో ‘కాంచన 3’ ప్రత్యేకమైంది. ఇందులో కథ, కథనం, గ్రాఫిక్స్... ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మా బ్యానర్లో ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంటుందనే గట్టి నమ్మకం ఉంది’’ అన్నారు. మనోబాల, దేవదర్శిని, సత్యరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
థ్రిల్లింత.. నవ్వింత...
థ్రిల్, కామెడీ, హారర్ ఎమోషన్.. ఈ నాలుగు అంశాలతో సాగే ‘కాంచన’ సిరీస్‌కి మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో రాఘవా లారెన్స్ తీసిన ఈ సిరీస్‌లో ముని, కాంచన, కాంచన 2 మంచి హిట్. ఇప్పుడు ‘కాంచన 3’ రెడీ అయింది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాఘవ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత బి. మధు విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బి. మధు మాట్లాడుతూ – ‘‘హారర్ కామెడీ చిత్రాల్లో ‘కాంచన’ సిరీస్ ఓ ట్రెండ్‌సెట్టర్ అని చెప్పాలి. ప్రతి పార్ట్‌కి మంచి స్పందన లభించింది. బేసిక్‌గా ఇది హారర్ మూవీ అయినప్పటికీ లారెన్స్ తీసుకునే పాయింట్ హార్ట్ టచింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సిరీస్‌కి కనెక్ట్ అయ్యారు. దివ్యాంగుల సమస్యని, థర్డ్ జెండర్ సమస్యల్ని సున్నితంగా హారర్ కామెడీలో చెప్పడం లారెన్స్ గొప్పతనం. ఇప్పుడు మరో బలమైన పాయింట్‌తో తీసిన ‘కాంచన 3’ కోసం లారెన్స్ అంతకు ముందుకన్నా ఎక్కువ కష్టపడ్డారు. దాదాపు 220 రోజులు వర్క్ చేశారు. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. లారెన్స్ నటన హైలైట్‌గా ఉంటుంది. తమన్ రీ–రికార్డింగ్ మరో హైలైట్. ఇంకో 10 భాగాలు తీస్తానని లారెన్స్ చెప్పటం విశేషం. ‘కాంచన 3’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
కాంచన రీమేక్‌లో...
టికెట్టు కొనుక్కొని మరీ భయపడటానికి థియేటర్లకు వెళుతుంటారు హారర్ సినిమాల ప్రేమికులు. వాళ్లు ఏమాత్రం నిరుత్సాహపడకుండా భయపెట్టడానికి రెడీ అవుతున్నారు అక్షయ్ కుమార్, రాఘవా లారెన్స్. సౌత్‌లో హారర్ చిత్రాల సిరీస్ ‘కాంచనకు’ ఎంత క్రేజ్ ఉందో తెలుసు. ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా పాపులర్ అయ్యారు లారెన్స్. ఇప్పుడు నార్త్ ఆడియన్స్‌ను భయపెట్టడానికి సిద్ధం అయ్యారు. అక్షయ్ కుమార్ హీరోగా ‘కాంచన’ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా తెలుగమ్మాయి శోభిత ధూలిపాళ్ల ఎంపికైనట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘లక్ష్మీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. శోభిత ధూళ్లిపాళ్ల ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. -
భయపడటానికి రెడీ అవ్వండి
హారర్ మూవీ సిరీస్ ‘ముని’ ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టిందనే చెప్పాలి. అందుకే ఈ సిరీస్‌కు స్పెషల్ క్రేజ్. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘కాంచన 3’. రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. తమిళ బిగ్‌బాస్ ఫేమ్ ఓవియా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వేదిక కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని రచించి, దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. -
సమ్మర్లో భయపెడతా
సమ్మర్లో చల్లని థియేటర్లో ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయ్యారు రాఘవ లారెన్స్. ఆయన దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘ముని’ చిత్రానికి సీక్వెల్స్‌గా ‘కాంచన (ముని 2), కాంచన 2 (ముని 3)’ చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కాంచన 3’ సెట్స్‌పై ఉంది. రాఘవ లారెన్స్‌నే దర్శకత్వం వహిస్తున్నారు. ఓవియా, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని వినికిడి. ఇంతకుముందు ‘ముని’ ఫ్రాంచైజీలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ‘కాంచన 3’పై అంచనాలు ఉన్నాయి. -
తప్పుకోలేదు!
ఓవియా తప్పుకోలేదు. వచ్చిన వార్తలే తప్పు అంటున్నారు ‘కాంచన–3’ చిత్రబృందం. ఓవియా గురించి ఈ చిత్రబృందం ఎందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే.. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమె ఈ హారర్ మూవీ నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. సినిమా సగం పూర్తయింది. ఇప్పుడు హీరోయిన్ తప్పుకుందనే వార్త అంటే అనవసరమైన రచ్చే కదా. అందుకే, ‘నో నో.. ఓవియా ఈజ్ దేర్’ అన్నారు. హారర్ సినిమాల మాంత్రికుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న సినిమా ‘కాంచన–3’. లారెన్స్, ఓవియా, వేదిక కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ 55 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. ఇంతకీ ఈ ఓవియా ఎవరంటే.. తరుణ్ హీరోగా నటించిన ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాలో తనే కథానాయిక. అలాగే వేదిక తెలుగులో బాణం, విజయదశమి, దగ్గరగా దూరంగా వంటి చిత్రాల్లో నటించారు. 2006లో వచ్చిన ‘ముని’ ఫ్రాంచైజీ తొలి పార్ట్‌లో తనే కథానాయిక. మళ్లీ ఈ పార్ట్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో నైట్ షూట్ జరుగుతోంది. -
బాలీవుడ్‌కు లారెన్స్
ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ బాలీవుడ్‌పై కన్నేశారు. ఇప్పటికే ప్రభుదేవా బాలీవుడ్లో దర్శకుడిగా దుమ్ము రేపుతున్నారు. ఆయన దర్శకత్వం వహించి, విజయం సాధించిన పోకిరి చిత్రంతోనే బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రం అక్కడ వాంటెడ్ పేరుతో విడుదలై సక్సెస్ అయ్యింది. అదేవిధంగా లారెన్స్ తన దర్శకత్వంలో తెరకెక్కిన కాంచన చిత్రంతో హిందీకి పరిచయం కానుండటం విశేషం. దీని గురించి ఆయన మాట్లాడుతూ, కాంచన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. తాను నటించిన పాత్రను హిందీలో అజయ్ దేవగన్ నటించనున్నారని చెప్పారు. శరత్ కుమార్ పాత్ర పోషణకు అమితాబ్ బచ్చన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ముని-3 చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. అదే విధంగా త్వరలో తమిళంలో హీరోగా ఒక చిత్రం చేయనున్నానని ఈ చిత్రానికి ఒక నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తారని లారెన్స్ తెలిపారు.