థ్రిల్లింత.. నవ్వింత... | kanchana 3 released on april 19 | Sakshi
Sakshi News home page

థ్రిల్లింత.. నవ్వింత...

Published Sat, Apr 13 2019 12:49 AM | Last Updated on Sat, Apr 13 2019 12:51 AM

kanchana 3 released on april 19 - Sakshi

రాఘవా లారెన్స్‌

థ్రిల్, కామెడీ, హారర్‌ ఎమోషన్‌.. ఈ నాలుగు అంశాలతో సాగే ‘కాంచన’ సిరీస్‌కి మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో రాఘవా లారెన్స్‌ తీసిన ఈ సిరీస్‌లో ముని, కాంచన, కాంచన 2 మంచి హిట్‌. ఇప్పుడు ‘కాంచన 3’ రెడీ అయింది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాఘవ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత బి. మధు విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బి. మధు మాట్లాడుతూ – ‘‘హారర్‌ కామెడీ చిత్రాల్లో ‘కాంచన’ సిరీస్‌ ఓ ట్రెండ్‌సెట్టర్‌ అని చెప్పాలి. ప్రతి పార్ట్‌కి మంచి స్పందన లభించింది.

బేసిక్‌గా ఇది హారర్‌ మూవీ అయినప్పటికీ లారెన్స్‌ తీసుకునే పాయింట్‌ హార్ట్‌ టచింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సిరీస్‌కి కనెక్ట్‌ అయ్యారు. దివ్యాంగుల సమస్యని, థర్డ్‌ జెండర్‌ సమస్యల్ని సున్నితంగా హారర్‌ కామెడీలో చెప్పడం లారెన్స్‌ గొప్పతనం. ఇప్పుడు మరో బలమైన పాయింట్‌తో తీసిన ‘కాంచన 3’ కోసం లారెన్స్‌ అంతకు ముందుకన్నా ఎక్కువ కష్టపడ్డారు. దాదాపు 220 రోజులు వర్క్‌ చేశారు. కథ, కథనం, గ్రాఫిక్స్‌ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. లారెన్స్‌ నటన హైలైట్‌గా ఉంటుంది. తమన్‌ రీ–రికార్డింగ్‌ మరో హైలైట్‌. ఇంకో 10 భాగాలు తీస్తానని లారెన్స్‌ చెప్పటం విశేషం. ‘కాంచన 3’ సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement