3డీ.. లారెన్స్‌ రెడీ | Raghava Lawrence Next Titled Kaala Bhairava | Sakshi
Sakshi News home page

3డీ.. లారెన్స్‌ రెడీ

Published Sun, Apr 28 2019 10:27 AM | Last Updated on Sun, Apr 28 2019 10:27 AM

Raghava Lawrence Next Titled Kaala Bhairava - Sakshi

నృత్యదర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు రాఘవలారెన్స్‌ హర్రర్‌ చిత్రాలకు చిరునామాగా మారారు. ఆయన నటించి, తెరకెక్కించిన ముని సీక్వెల్స్‌ నాలుగు సక్సెస్‌ కావడం, తన హీరోగా మాత్రమే నటించిన మరో చిత్రం శివలింగ కూడా హర్రర్‌ నేపథ్యంలోనే తెరకెక్కడంతో లారెన్స్‌ హర్రర్‌ చిత్రాల హీరోగా ముద్ర వేసుకున్నారు. కాగా ఇటీవల తెరపైకి వచ్చిన ముని–4 (కాంచన 3) చిత్రం వసూళ్ల పరంగా కుమ్మేస్తోంది. దీంతో లారెన్స్‌ హర్రర్‌ను వదిలేలా లేరు.

తాజాగా కాంచన–2 చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. కాగా తమిళంలో శరత్‌కుమార్‌ పోషించిన హిజ్రా పాత్రను బిగ్‌బీ అమతాబ్‌ బచ్చన్‌తో నటింపజేస్తున్నట్లు తాజా సమాచారం. ప్రభుదేవా తరువాత కోలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు దర్శకుడిగా వెళుతున్న నృత్యదర్శకుడు లారెన్సే కావటం విశేషం.

అయితే ప్రభుదేవా బాలీవుడ్‌లో విజయదుందుబి మోగించారు. దీంతో లారెన్స్‌ ఎలాంటి విజయాన్ని సాధిస్తారో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. కాగా మరో తాజా వార్త ఏమిటంటే హిందీ చిత్రం తరువాత లారెన్స్‌ చేసే తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి కోలీవుడ్‌లో నెలకొంది. అలాంటి వారికి లారెన్స్‌ తదుపరి కాలభైరవా అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారనే టాక్‌ సామాజక మాధ్యమాల్లో తాజాగా వైరల్‌ అవుతోంది.

కాలభైరవా అనే ఈ పవర్‌ఫుల్‌ టైటిల్‌తో మరోసారి హర్రర్‌ కథా చిత్రంతో వస్తాడా? లేక కమర్శియల్‌ ఫార్ములాతో కూడిన యాక్షన్‌ కథా చిత్రం చేస్తారా అన్న ఉత్సకత నెలకొంది. అయితే లారెన్స్‌ కాలభైరవా చిత్రాన్ని 3డీ ఫార్మెట్‌లో చేసి ప్రేక్షకులను థ్రిల్‌ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. ప్రస్తుతం లారెన్స్‌ హిందీ కాంచన–2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement