
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం 'లక్ష్మీ బాంబ్' మోషన్ పోస్టర్‌ను గురువారం రాత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టర్ విడుదల చేసిన 24 గంటల్లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను కలుపకుని 21 మిలియన్‌ల వ్యూస్ సంపాదించిన రికార్టు సృష్టించిన మోషన్ పోస్టరుగా నిలిచింది. అక్షయ్ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్న ఈ హార్రర్ చిత్రంపై ఆయన అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
(చదవండి: లక్ష్మీబాంబ్‌ని తీసుకొస్తున్నా)
అక్కి ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ... ‘ఈ దీపావళికి ‘లక్ష్మీ బాంబ్’తో మీ ఇంటికి రాబోతున్న’ అంటూ షేర్ చేశాడు. అయితే తెలుగు బాక్సాఫిస్ వద్ద బ్టక్‌బస్టర్‌గా నిలిచిన కాంచనను హిందీ రిమేక్ ‘లక్ష్మిబాంబ్’తో అక్కి లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. రాఘవా లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కియార అద్వానీ నటిస్తోంది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 9న హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.