‘‘లక్ష్మీబాంబ్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను నాకు చెప్పకుండానే రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ డిజైన్ కూడా నచ్చలేదు.. దర్శకుడిగా నాకు సరైన గౌరవం లభించలేదు’’ అంటూ ‘లక్ష్మీబాంబ్’ సినిమా (‘కాంచన’ చిత్రం హిందీ రీమేక్) దర్శకత్వ బాధ్యతల నుంచి రాఘవలారెన్స్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘లక్ష్మీబాంబ్’. ఈ చిత్రాన్ని తిరిగీ తానే దర్శకత్వం వహించబోతున్నట్లు లారెన్స్ పేర్కొన్నారు. ‘‘అభిమానులు కోరుకున్నట్లే ‘లక్ష్మీబాంబ్’ చిత్రాన్ని నేనే డైరెక్ట్ చేయబోతున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నా మనోభావాలను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన అక్షయ్‌కుమార్‌సార్‌కి, మా నిర్మాత షబీనాఖాన్‌కు ధన్యవాదాలు. నన్ను గౌరవించిన ఈ ఇద్దరికీ థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్‌తో మళ్లీ అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది’’ అని లారెన్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment