‘వివాదాలు పరిష్కారమయ్యాయి’ | Raghava Lawrence Returns as Akshay Kumar Laxmmi Bomb Director | Sakshi
Sakshi News home page

‘వివాదాలు పరిష్కారమయ్యాయి’

Published Sun, Jun 2 2019 10:29 AM | Last Updated on Sun, Jun 2 2019 10:29 AM

Raghava Lawrence Returns as Akshay Kumar Laxmmi Bomb Director - Sakshi

కాంచన 2 రీమేక్‌ లక్ష్మీ బాంబ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయిన రాఘవ లారెన్స్‌, తరువాత చిత్రయూనిట్‌తో విబేధాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. తనకు చెప్పకుండా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేయటంతో పాటు షూటింగ్ సమయంలో తనకు సరైన మర్యాద ఇవ్వటం లేదంటూ ఆరోపిస్తూ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా బహిరంగ లేఖ విడుదల చేశారు.

దీంతో కాంచన 2 బాలీవుడ్ రీమేక్‌పై అనుమానాలు మొదలయ్యాయి. ఒక దశలో మరో దర్శకుడితో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వివాదానికి తెరపడినట్టుగా తెలుస్తోంది. అక్షయ్‌ స్వయంగా మాట్లాడటంతో కన్విన్స్‌ అయిన లారెన్స్‌ తిరిగి దర్శకత్వం వహించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

‘మీరు అందరూ ఆశిస్తున్నట్టుగా తిరిగి లక్ష్మీబాంబ్‌ సినిమాకు దర్శకుడిగా కొనసాగనున్నాను. నా భావాలను అర్ధం చేసుకొని అన్ని సమస్యలు పరిష్కరించినందుకు అక్షయ్‌ కుమార్‌ గారికి కృతజ్ఞతలు. నిర్మాత షబీనా ఖాన్‌కు కూడా కృతజ్ఞతలు. తిరిగి అక్షయ్‌ కుమార్‌తో కలిసి పనిచేయటం ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement