బాలీవుడ్‌కు లారెన్స్ | Raghava Lawrence with Kanchana remake of Hindi | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు లారెన్స్

Jun 3 2014 11:25 PM | Updated on Sep 2 2017 8:16 AM

బాలీవుడ్‌కు లారెన్స్

బాలీవుడ్‌కు లారెన్స్

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ బాలీవుడ్‌పై కన్నేశారు. ఇప్పటికే ప్రభుదేవా బాలీవుడ్‌లో దర్శకుడిగా దుమ్ము రేపుతున్నారు. ఆయన దర్శకత్వం వహించి, విజయం సాధించిన

 ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ బాలీవుడ్‌పై కన్నేశారు. ఇప్పటికే ప్రభుదేవా బాలీవుడ్‌లో దర్శకుడిగా దుమ్ము రేపుతున్నారు. ఆయన దర్శకత్వం వహించి, విజయం సాధించిన పోకిరి చిత్రంతోనే బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రం అక్కడ వాంటెడ్ పేరుతో విడుదలై సక్సెస్ అయ్యింది. అదేవిధంగా లారెన్స్ తన దర్శకత్వంలో తెరకెక్కిన కాంచన చిత్రంతో హిందీకి పరిచయం కానుండటం విశేషం. దీని గురించి ఆయన మాట్లాడుతూ, కాంచన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. తాను నటించిన పాత్రను హిందీలో అజయ్ దేవగన్ నటించనున్నారని చెప్పారు.
 
 శరత్ కుమార్ పాత్ర పోషణకు అమితాబ్ బచ్చన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ముని-3 చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. అదే విధంగా త్వరలో తమిళంలో హీరోగా ఒక చిత్రం చేయనున్నానని ఈ చిత్రానికి ఒక నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తారని లారెన్స్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement