Muni
-
తనువు చాలించిన విద్యాసాగర్ మహారాజ్ .. ప్రధాని మోదీ నివాళి!
ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ శనివారం తనువు చాలించారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు తన దేహాన్ని విడిచిపెట్టారు. దీనికి ముందు ఆయన ఆచార్య పదవిని వదులుకున్నారు. మూడు రోజులపాటు ఉపవాసం ఉంటూ, మౌనం పాటించారు. అనంతరం ప్రాణాలు విడిచారు. విద్యాసాగర్ మహారాజ్ మరణవార్త తెలియగానే జైన సమాజానికి చెందిన పలువురు చంద్రగిరి జైన దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. My thoughts and prayers are with the countless devotees of Acharya Shri 108 Vidhyasagar Ji Maharaj Ji. He will be remembered by the coming generations for his invaluable contributions to society, especially his efforts towards spiritual awakening among people, his work towards… pic.twitter.com/jiMMYhxE9r — Narendra Modi (@narendramodi) February 18, 2024 -
భయపడటానికి రెడీ అవ్వండి
హారర్ మూవీ సిరీస్ ‘ముని’ ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టిందనే చెప్పాలి. అందుకే ఈ సిరీస్కు స్పెషల్ క్రేజ్. ఇప్పుడు ఈ సిరీస్లో వస్తున్న నాలుగో చిత్రం ‘కాంచన 3’. రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. తమిళ బిగ్బాస్ ఫేమ్ ఓవియా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వేదిక కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని రచించి, దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. -
నేటి ముళ్ళబాటే రేపటి పూలబాట కాదా?
మునీశ్వరులకు ఎన్నో మాయలూ మంత్రాలూ తెలుసుననే ఉద్దేశంతోనూ నమ్మకంతోనూ ఓ యువకుడు ఒకరి దగ్గరకు వెళ్ళాడు. మునిని చూడడంతోనే ఆయనకు నమస్కరించి ‘‘స్వామీ’’ అంటూ మాటలు సాగించాడు. తాను పోయే దారంతా ఎప్పుడూ వెలుగుతో నిండి ఉండేలా వరం ప్రసాందించాలని కోరాడు. ముని తన మాటలు విని మాయతో వీధి దీపాల్లాంటిది ఇచ్చి తాను చీకట్లో వెళ్ళేటప్పుడల్లా ఉపయోగపడేలా చేస్తాడని అనుకున్నాడు యువకుడు. కానీ అతననుకున్నది వేరు. మునీశ్వరుడు ఇచ్చింది వేరు. మునీశ్వరుడు ఓ లాంతరు ఇచ్చి దీన్ని పుచ్చుకో అన్నాడు. మునీశ్వరుడు తనకున్న శక్తియుక్తులతో అద్భుతమైన ఓ దీపాన్ని ఇస్తాడనుకుంటే ఓ మామూలు లాంతరు ఇవ్వడమేమిటని ఆ యువకుడిలో నిరాశ కలిగింది. దాంతో మనసులోని మాటను చెప్పాడు... ‘‘స్వామీ, మీరు మాయతో కూడిన ఓ విచిత్రమైన దీపాన్ని ఇస్తారనుకున్నాను. కానీ ఓ లాంతరు ఇచ్చారు, ఇది ఓ పది అడుగుల దూరం మించి వెలుగు చూపదు కదండీ’’ అన్నాడు. అప్పుడు మునీశ్వరుడు ‘‘అలాగనుకుంటున్నావా... నేను తలచుకుంటే నాకున్న మాయాశక్తితో నువ్వు వెళ్ళే దారంతా వెలుగు నిండేలా చేయగలను. కానీ అది లాభం లేని పని. అయినా నీ కళ్ళు కూడా దాదాపు పది అడుగుల మేరకే చూడగలదు. కనుక ఆ మేరకు నీకు వెలుగుంటే చాలుగా. ఈ లెక్కన నువ్వు పోయే కొద్దీ తెల్లవారేసరికి అడవి మార్గాన్ని దాటి పొరుగున ఉన్న పల్లెకు చేరుకోగలవు. ఆ ఉద్దేశంతోనే నీకు లాంతరు ఇచ్చాను. కనుక ఏ సమస్యా లేకుండా నువ్వనుకున్న గమ్యస్థానానికి చేరుకోగలవు’’ అని అన్నాడు. ఓ విధంగా ఇది నిజమేగా... మనలో చాలా మంది ఆ యువకుడిలాంటివారే. ఎంతసేపూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోరు. మన ముందరున్న కాలం ఏమిటో తెలుసుకోరు. ఉన్న కాలం గురించి ఆలోచించరు. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. అందుకే అనుభవజ్ఞులనే మాట ఇదే... ఈరోజు ఈ క్షణంలో చెయ్యవలసిన దానిని ఆచితూచి చెయ్యడంలో చైతన్యవంతులై ఉండాలి. – యామిజాల జగదీశ్ -
తమిళ నటుడు 'కాదల్' దండపాణి ఇకలేరు!
కాదల్, ముని, వేలాయుధం చిత్రాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న 'కాదల్' దండపాణి గుండెపోటుతో ఆదివారం ఉదయం చెన్నైలో మరణించారు. కాదల్ చిత్రంతో తమిళ చిత్రసీమలో ప్రవేశించిన దండపాటి చితిరమ్ పెసుతాడి, విట్టారం, ముని, వేలాయుధం, తెలుగులో రాజు భాయ్, ఆంజనేయులు, కృష్ణ, ప్రేమిస్తే చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ నటిస్తున్న సందమారుతం చిత్రంలో నటిస్తున్నారు. మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా దండపాణి నటించారు. కాదల్ దండపాణి మరణవార్తను శరత్ కుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు. దండపాణి అంత్యక్రియలు స్వస్థలం దిండిగల్ లో నిర్వహించనున్నారు. దండపాణి మృతి వార్తతో తమిళ చలన చిత్రసీమ దిగ్బ్రాంతికి గురైంది. My deepest condolences to friend and colleague who worked with me yesterday Kadal Dhandapani has left this world to the heavenly abode RIP — R Sarath Kumar (@realsarathkumar) July 20, 2014