తమిళ నటుడు 'కాదల్' దండపాణి ఇకలేరు!
కాదల్, ముని, వేలాయుధం చిత్రాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న 'కాదల్' దండపాణి గుండెపోటుతో ఆదివారం ఉదయం చెన్నైలో మరణించారు.
కాదల్, ముని, వేలాయుధం చిత్రాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న 'కాదల్' దండపాణి గుండెపోటుతో ఆదివారం ఉదయం చెన్నైలో మరణించారు.
కాదల్ చిత్రంతో తమిళ చిత్రసీమలో ప్రవేశించిన దండపాటి చితిరమ్ పెసుతాడి, విట్టారం, ముని, వేలాయుధం, తెలుగులో రాజు భాయ్, ఆంజనేయులు, కృష్ణ, ప్రేమిస్తే చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ నటిస్తున్న సందమారుతం చిత్రంలో నటిస్తున్నారు. మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా దండపాణి నటించారు.
కాదల్ దండపాణి మరణవార్తను శరత్ కుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు. దండపాణి అంత్యక్రియలు స్వస్థలం దిండిగల్ లో నిర్వహించనున్నారు. దండపాణి మృతి వార్తతో తమిళ చలన చిత్రసీమ దిగ్బ్రాంతికి గురైంది.