తనువు చాలించిన విద్యాసాగర్‌ మహారాజ్‌ .. ప్రధాని మోదీ నివాళి! | Acharya Vidyasagar Maharaj of Digambara Jain Muni took Samadhi | Sakshi
Sakshi News home page

Acharya Vidyasagar Maharaj: తనువు చాలించిన విద్యాసాగర్‌ మహారాజ్‌ .. ప్రధాని మోదీ నివాళి!

Published Sun, Feb 18 2024 12:44 PM | Last Updated on Sun, Feb 18 2024 1:23 PM

Acharya Vidyasagar Maharaj of Digambara Jain Muni took Samadhi - Sakshi

ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్  మహారాజ్ శనివారం తనువు చాలించారు. గత ఏడాది నవంబర్‌ ఐదున ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్  మహారాజ్ మృతి పట్ల ‍ప్రధాని నరేంద్ర మోదీ  సంతాపం వ్యక్తం చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు తన దేహాన్ని విడిచిపెట్టారు. దీనికి ముందు ఆయన ఆచార్య పదవిని వదులుకున్నారు. మూడు రోజులపాటు ఉపవాసం ఉంటూ, మౌనం పాటించారు. అనంతరం ప్రాణాలు విడిచారు. విద్యాసాగర్ మహారాజ్‌ మరణవార్త తెలియగానే జైన సమాజానికి చెందిన పలువురు చంద్రగిరి జైన దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement