Jain
-
సోషల్ మీడియా గెలిపించింది..!
కోవిడ్ లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింప చేసింది. కానీ కోవిడ్ కాలం కొందరికి కెరీర్ బాటను వేసింది. ఆ బాటలో నడిచిన ఓ సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ముస్కాన్ జైన్. ఇంట్లో టైమ్‌పాస్ కోసం చేసిన డోనట్ ప్రయత్నం ఆమెను డోనటేరియా ఓనర్ని చేసింది. ముస్కాన్ జైన్ ఎంబీఏ చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో యూట్యూబ్‌లో చూసినవన్నీ వండడం మొదలు పెట్టింది ముస్కాన్. ఆమె అప్పటికే యూ ట్యూబ్ స్టార్. ఆమె డాన్స్ కొరియోగ్రఫీ చానెల్‌కు యాభై వేలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వంటగదిలో అడుగుపెట్టిన ముస్కాన్ చేసిన డోనట్స్ ఇంట్లో అందరికీ నచ్చాయి. ఇదే నీకు సరైన కెరీర్ అని ప్రోత్సహించారు. కానీ ముస్కాన్ వెంటనే మొదలు పెట్టలేదు. ‘ఇంట్లో వాళ్లు అభిమానం కొద్దీ ప్రశంసల్లో ముంచేస్తున్నారు. అది చూసి బిజినెస్ ప్రారంభిస్తే కష్టం అనుకున్నాను. కొన్నాళ్లకు ఒకామె ‘‘ఇప్పుడు కూడా డోనట్స్ చేస్తున్నారా, ఆర్డర్ మీద చేసిస్తారా’’ అని అడిగింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అలా 2023లో ‘డోనటేరియా’ స్టార్టప్‌ను ప్రారంభించాను. తక్కువ పెట్టుబడితో ఇంటి కిచెన్లోనే మొదలు పెట్టాను. డోనట్‌ని పరిచయం చేయడానికి బేకరీలు, స్టాల్స్‌కి మొదట ఫ్రీ సాంపుల్స్ ఇచ్చాను’’ అంటూ తన స్టార్టప్ తొలినాళ్ల కష్టాలను వివరించారు ముస్కాన్.ముస్కాన్ జైన్‌ను సూరత్తోపాటే ప్రపంచం కూడా గుర్తించింది. అందుకు కారణం సోషల్ మీడియా. ‘‘నా ప్రతి ప్రయత్నాన్నీ ఇన్‌స్టాలో షేర్ చేసేదాన్ని. డోనట్ల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతిదీ షేర్ చేయసాగాను. ఇన్‌స్టా ద్వారా కూడా ఆర్డర్లు రాసాగాయి. ఇప్పుడు రోజుకు మూడు వందల ఆర్డర్లు వస్తున్నాయి’’ అని సంతోషంగా చెప్పారు ముస్కాన్. ఆమె డోనట్ తయారీ గురించి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు యూఎస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వాళ్లకు కూడా ఆన్లైన్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. తన డోనటేరియాను జాతీయస్థాయి బ్రాండ్‌గా విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. (చదవండి: ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!) -
ముకేశ్ అంబానీ ఫ్రెండ్.. 'ఆనంద్ జైన్' గురించి తెలుసా?
అంబానీ రిలయన్స్ కంపెనీ ఎదగటానికి కారకులైన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి 'మనోజ్ మోడీ'. ఈయన మాత్రమే కాకుండా సంస్థ ఎదుగుదలకు పాటుపడిన వ్యక్తి, ముకేశ్ అంబానీ స్నేహితుడు ఒకరు ఉన్నారు. ఆయనే 'ఆనంద్ జైన్'. ధీరూభాయ్ అంబానీ మూడవ కొడుకుగా పిలువబడే ఆనంద్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.1975లో జన్మించిన ఆనంద్ జైన్.. జై కార్ప్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఈయనను అందరూ ముద్దుగా ఏజే అని పిలుచుకుంటారు. ఆనంద్ జైన్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో విడదీయరాని అనుబంధం ఉంది. వీరిరువురు చిన్నపాటి ఫ్రెండ్స్ కావడం గమనార్హం. ముంబైలోని హిల్ గ్రాంజ్ హైస్కూల్లో వీరు కలిసి చదువుకున్నారు.నిజానికి ఆనంద్ జైన్ ఒకప్పటి బిలినీయర్. 2007లో ఈయన 4 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో 11వ సంపన్న భారతీయుడిగా ఉన్నారు. 2023 మార్చి నాటికి జైన్ ఆదాయం రూ. 600.7 కోట్లు. ఈయన కంపెనీ సుమారు 13 ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జిస్తోంది.ఇదీ చదవండి: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?జైన్ ముఖేష్ అంబానీకి వ్యూహాత్మక సలహాదారుగా.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో, ప్రధాన క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అతను ముంబై పోర్ట్ ట్రస్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టీల బోర్డులో కూడా పనిచేశారు.ఆనంద్ జైన్ ముంబై యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ఈయన భార్య సుష్మ. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 కో-ఫౌండర్ 'హర్ష్ జైన్'. ఆనంద్ జైన్ మంచి స్నేహితుడిగా, వ్యాపారవేత్తగా అన్ని రంగాల్లోనూ రాణించారు. -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
ఆర్థిక అక్షరాస్యత
‘ఆర్థికాంశాలు మహిళలకు అంత త్వరగా అర్థం కావు’ అనే దురభిప్రాయం ఒకటి మన సమాజంలో స్థిరపడిపోయింది. ఆర్థిక మంత్రిగా మహిళలు సమర్థంగా బాధ్యతలు నిర్వహించడాన్ని చూస్తూ కూడా తాము పెంచి పోషించుకుంటున్న అపోహను వీడడానికి ఇష్టపడదు సమాజం. చార్టెడ్ అకౌంటెన్సీలో ఎంత మంది మహిళలు ఉన్నప్పటికీ సమాజం మాత్రం తన కళ్లకు కట్టుకున్న గంతలు విప్పడానికి సుముఖంగా ఉండదు. వీటన్నింటినీ పటాపంచలు చేయడానికి కంకణం కట్టుకుంది సాక్షి జైన్. జార్ఖండ్ రాష్ట్రం, రాంచీకి చెందిన సాక్షి సీఏ పూర్తి చేసి ఒక సంస్థలో ఉద్యోగంలో చేరింది. తన జ్ఞానాన్ని తన ఎదుగుదలకే పరిమితం చేసుకోకుండా మహిళాసమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలనుకుందామె.ఫాలోవర్స్ ΄పొలోమన్నారు! ‘‘కొత్తతరం విద్యార్థులకు ఆర్థికాంశాల్లో మెళకువలు నేర్పించే క్రమంలో నాలో ఎన్నో కొత్త ఆలోచనలు వచ్చాయి. మనదేశంలో మహిళలకు అక్షరాస్యత ఉంది, కానీ ఆర్థిక అక్షరాస్యత తగినంతగా లేదనిపించింది. అయితే వారిలో ఆర్థికాంశాల పట్ల అనేకానేక సందేహాలున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయగలిగితే ప్రతి ఇంట్లో ఒక ఆర్థిక వేత్త తయారవుతారనిపించింది. అప్పుడు మొదలు పెట్టిన ప్రయత్నమే : @ca.sakchijain ఇన్స్టాగామ్కి నాలుగు నెలల్లోనే పదిహేడు లక్షల ఫొలోవర్లు వచ్చారు. ఫిన్‌ఫ్లూయెన్సర్ (ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్)గా సోషల్ మీడియాతో నేను గుర్తింపు పోందాను. నా పరిజ్ఞానంతో వేలాది మహిళలు తమ ఆర్థికాంశాలపై స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన స్థితికి చేరారు. కంటెంట్ క్రియేటర్నయ్యాను! నేను అకౌంటెన్సీలో లోతుగా పాఠాలు చెప్పే ప్రయత్నమేదీ చేయలేదు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని ఎన్ని రకాలుగా మదుపు చేయవచ్చో వివరించాను. జీవిత బీమా పథకాల గురించి చెపాను. ఫైనాన్షియల్ ΄ాలసీలతో పాటు రుణాలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి అవసరాలకు తీసుకోవాలి, తీసుకున్న రుణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి... అనే మెళకువలు నేర్పించాను. భారీ పదజాలాన్ని ఉపయోగిస్తే ఇది మనకు అర్థమయ్యే విషయం కాదని తెలుసుకోవడం మానేస్తారు. అందుకే నేను సామాన్య మహిళ మేధస్థాయికి దిగి అలతి అలతి పదాలతో, వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో పోలుస్తూ వివరించాను. మా రాష్ట్రంలోని గ్రామాల్లో చదువుకున్న మహిళలంటే స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన మహిళలే. వాళ్లను దృష్టిలో పెట్టుకుని వీడియోలు చేయడం మొదలుపెట్టాను.ఆశ్చర్యకరంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మహిళలు కూడా నా వీడియోలను చూస్తూ అనేక సందేహాలను వ్యక్తం చేసేవారు. ఒక విధంగా చె΄్పాలంటే నా వీక్షకుల నుంచి వచ్చే కామెంట్స్ నాకు దిశానిర్దేశం చేశాయంటే అతిశయోక్తి కాదు. వీక్షకుల కామెంట్స్ చూసి వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ వివరాలతో వీడియోలు చేశాను. నా వీక్షకులకు అవసరమైన సమాచారాన్ని ఆర్థిక నియమాల చట్రంలో వివరించడానికి నేను చేసిన ప్రయత్నం నన్ను కంటెంట్ క్రియేటర్‌ని చేసింది. ఇప్పుడిది నా ఫుల్‌టైమ్ జాబ్‌గా మారింది. మొదట్లో రోజుకో వీడియో పోస్ట్ చేశాను. కామెంట్ బాక్స్‌లో వస్తున్న రిక్వెస్ట్‌లను చేరాలంటే ఒకటి సరిపోవడం లేదని ఇప్పుడు రోజుకు రెండు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. నేను చెప్తున్న విషయాలు మరీ భారీస్థాయిలో ఉండకూడదని, పెద్ద పెట్టుబడులు పెట్టే వారికి సలహాలనివ్వడానికి ఆర్థిక నిపుణులు ఎందరో ఉన్నారు. మహిళలను చైతన్యవంతం చేయాలంటే వారు సులువుగా అందుకోగలిగిన మెళకువలతో మొదలు పెట్టాను. లక్ష్యాలు ఉన్నతంగా ఉంటున్నాయి నేటి రోజుల్లో దాదాపుగా మహిళలందరూ తమకంటూ ఒక ఉపాధిమార్గాన్ని వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు. మరికొందరు గృహిణిగా భర్త సం΄ాదనతో కుటుంబాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించగలుగుతున్నారు. సరాసరిన చూస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటున్నారు. వారికి ఆర్థిక అక్షరాస్యత తెలిస్తే డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఎలా మదుపు పెట్టాలి అనే విషయాలు అర్థమవుతాయి. దాంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరు నెలల అనుభవంలో నాకు అర్థమైనదేమిటంటే... ఒక చిన్న ఆసరా లేక΄ోవడం వల్లనే ఆర్థికాంశాల్లో మహిళలు ఒక అడుగు వెనుకగా ఉండి΄ోయారని! సందేహాల రూపంలో వాళ్ల ఆసక్తులు, ఆలోచనలు, లక్ష్యాలు పెద్ద వ్యా΄ారులకు ఏ మాత్రం తీసి΄ోని స్థాయిలో ఉంటున్నాయి. తాము, తమ కుటుంబం ఆర్థికంగా మెరుగుపడాలనే ఆలోచనతో΄ాటు సమాజంలో మరికొందరికి ఉపయోగపడే పరస్పర సహకార ధోరణి కనిపిస్తోంది. నా ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోందని నాకూ సంతోషంగా ఉంది’’ అని వివరించారు సాక్షి జైన్.ఒక చిన్న ఆసరా లేకపోవడం వల్లనే ఆర్థికాంశాల్లో మహిళలు ఒక అడుగు వెనుకగా ఉండిపోయారు. సందేహాల రూపంలో వాళ్ల ఆసక్తులు, ఆలోచనలు, లక్ష్యాలు పెద్ద వ్యా΄ారులకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉంటున్నాయి. -
బౌద్ధవాణి.. మట్టికుండ నేర్పిన పాఠం
విదిశా నగర సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం సువర్ణపురి. ఆ పట్టణం లో ప్రజోతుడు పేరున్న ధనిక వ్యాపారి. ప్రజోతునికి మణిమాలుడు అనే కుమారుడు. అతనూ పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి వ్యాపారంలో తోడుగా ఉండేవాడు. మణిమాలుడు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచాడు. ప్రజోతుడు వృద్ధుడయ్యాడు. కుమారునికి వ్యాపార పద్ధతులు, సుదూర రాజ్యాల ప్రజల తీరు తెన్నులు చెప్పుతూ... కాలం గడపసాగాడు. అప్పుడప్పుడూ జైన సాధువుల్ని, బౌద్ధ భిక్షువుల్ని పిలిచి దానాలు ఇచ్చేవాడు. నగరం లో కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు.కొన్నాళ్ళకు మణిమాలుడు కూడా పెద్ద వ్యాపారి అయ్యాడు. ధనం పెరిగిన కొద్దీ అతనికి ధనదాహం కూడా పెరిగింది. అక్రమ వ్యాపారాలు సాగించాడు. దానితో ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దానధర్మాలు మానాడు. ధనంతోపాటు మానసిక అశాంతీ పెరిగింది. నిద్ర సుఖానికి దూరం అయ్యాడు. భయానికీ, ఉలికిపాటుకూ చేరువయ్యాడు. తండ్రి తన కుమారునిలో పెరిగిపోతున్న అశాంతిని గమనించాడు. ఒకరోజున పిలిచి– ‘‘నాయనా! నీవు నైతికతకి దూరమవుతున్నావు. మనోవేదనకి దగ్గరవుతున్నావు. నీవు ఇక నాతోపాటు బుద్ధ సందేశాలు వినడానికి రా.. ప్రస్తుతం భగవాన్ బుద్ధుడు ఇక్కడకు సమీపంలోనే ఉంటున్నారు’’ అని అనునయంగా చెప్పాడు. అలా... తనతో రెండు మూడుమార్లు మణిమాలుణ్ణి బుద్ధుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ప్రజోతుడు. ఆ తర్వాత తానే స్వయంగా బుద్ధుని దగ్గరకు వెళ్ళసాగాడు మణిమాలుడు. ఒకరోజు మణిమాలుడు బుద్ధునితో ‘‘భగవాన్! నేను నా తండ్రిలా దానాలు చేయలేదు. సాధువుల్ని గౌరవించలేదు. వారిని సత్కరించలేదు. వ్యాపారాన్నీ ధర్మబద్ధంగా చేయనూ లేదు. ఇప్పుడే నా తప్పు తెలుసుకున్నాను. కానీ... నాకు ఒక బెంగ ఉంది. మరణానంతరం నా తండ్రికి గానీ, నాకు గానీ స్వర్గం లభిస్తుందా?’’ అని అడిగాడు.అతని ఆంతర్యం గ్రహించాడు బుద్ధుడు. ‘‘మణిమాలా! రేపు వచ్చేటప్పుడు ఒక మట్టికుండ, కొంత వెన్నపూస, కొన్ని గులకరాళ్ళు తీసుకుని రా’’ అన్నాడు. మరునాడు అవి తీసుకువచ్చాడు మణిమాలుడు. కుండలో గులకరాళ్ళు పోయించి, వాటిమీద వెన్నముద్ద పెట్టించి,‘‘మణిమాలా! దగ్గరలో ఉన్న తటాకం దగ్గరకు తీసుకుపోయి ఈ కుండను నీటిమీద ఉంచి, కర్రతో పగలగొట్టు. వెన్న మునిగితే నీ తండ్రికి స్వర్గ్రపాప్తి, రాళ్ళు తేలితే నీకు స్వర్గ్రపాప్తి..’’ అని చెప్పి పంపాడు. మణిమాలుడు గబగబా వెళ్ళి నీటిపై కుండను ఉంచి కర్రతో పగలగొట్టాడు. వెన్న తేలింది. రాళ్ళు మునిగాయి. దానితో ఆందోళనపడుతూ బుద్ధుని దగ్గరకు పరుగున వచ్చి పడ్డాడు. విషయం చెప్పి...‘‘మా ఇద్దరికీ స్వర్గం దక్కే మార్గం ఏమిటి భగవాన్’’ అని అడిగాడు. ‘‘నాయనా నీటిలో రాళ్ళు మునగడం వాటి ప్రకృతిధర్మం. నీటిపై తేలడం వెన్న సహజ ధర్మం. అవి వాటి సహజ ధర్మాల్ని తప్పి ఎప్పుడూ ప్రవర్తించవు. అలాగే... మంచి పనులు చేస్తే మనిషికి మనశ్శాంతి. సుఖ నిద్ర, సుఖ జీవనం. అదే స్వర్గం. చెడ్డపనులు చేస్తే మనస్సుకు అశాంతి. దుఃఖం. నిద్రకు దూరం. మనోవ్యధ. అదే నరకం. మంచిగా మానవునిగా, మానవతతో జీవించు. దుఃఖాన్ని ఇచ్చే అకుశల కర్మలు ఆచరించకు. అదే స్వర్గం. ...’’ అని చెప్పాడు.మణిమాలుని మనస్సు తేటపడింది. మట్టికుండ మహోపదేశాన్ని అందించింది. ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకున్నాడు. దానాలు చేస్తూ, ధర్మకార్యాలు నెరవేరుస్తూ జీవితం ఆనందంగా కొనసాగించారు. – డా. బొర్రా గోవర్ధన్ -
200 కోట్ల ఆస్తిని దానం చేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు
గాంధీ నగర్ : వాళ్లిద్దరూ భార్యభర్తలు. వ్యాపార సామ్రాజ్యం. వందల కోట్లలో ఆస్తులు. సమాజంలో బోలెడంత పలుకుబడి. కానీ పైవేవి వాళ్లిద్దరికి సంతృప్తినివ్వలేదు. అందుకే ఇప్పటికే సన్యాసం స్వీకరించిన కొడుకు, కుమార్తెల బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ కుబేరుల నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ సబర్కాంత జిల్లా వాసి భావేష్ భండారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొద్ది మొత్తం పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారం ఊపందుకుంది. ఊహించనంత లాభాల్ని కళ్ల జూశారు. ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు. కానీ ఈ ఆస్తి పాస్తులు, వ్యాపారం ఆ దంపతులకు ఏ మాత్రం సంతృప్తి నివ్వలేదు. పిల్లల బాటలో తల్లిదండ్రులు చివరికి భావేష్ బండారి దంపతులిద్దరి 19 ఏళ్ల కుమార్తె , 16 ఏళ్ల కుమారుడు బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పిల్లలిద్దరూ 2022లో సన్యాసం తీసుకున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన భావేష్ బండారి దంపతులు.. తమ పిల్లలులాగే తాము కూడా భౌతిక అనుబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 200 కోట్లు విరాళం సన్యాసానికి సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో భావేష్ భండారి, అతని భార్య తమ సంపద రూ.200 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగే కార్యక్రమంలో అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు. మోక్షం పొందేదుకు యాత్రకు బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నారు. చెప్పులు లేకుండా భండారీ దంపతులు, మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపుగా బయలు దేరనున్నారు. అక్కడ వారు తమ యావదాస్తుల్ని వదిలేయనున్నారు. ఆ తర్వాత రెండు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. భిక్ష కోసం ఒక గిన్నె తీసుకుని దేశం అంతటా చెప్పులు లేకుండా ప్రయాణిస్తారు. భిక్షతో మాత్రమే జీవిస్తారు. -
తనువు చాలించిన విద్యాసాగర్ మహారాజ్ .. ప్రధాని మోదీ నివాళి!
ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ శనివారం తనువు చాలించారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు తన దేహాన్ని విడిచిపెట్టారు. దీనికి ముందు ఆయన ఆచార్య పదవిని వదులుకున్నారు. మూడు రోజులపాటు ఉపవాసం ఉంటూ, మౌనం పాటించారు. అనంతరం ప్రాణాలు విడిచారు. విద్యాసాగర్ మహారాజ్ మరణవార్త తెలియగానే జైన సమాజానికి చెందిన పలువురు చంద్రగిరి జైన దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. My thoughts and prayers are with the countless devotees of Acharya Shri 108 Vidhyasagar Ji Maharaj Ji. He will be remembered by the coming generations for his invaluable contributions to society, especially his efforts towards spiritual awakening among people, his work towards… pic.twitter.com/jiMMYhxE9r — Narendra Modi (@narendramodi) February 18, 2024 -
ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం
‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్‌పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్ అండ్ ఎర్న్ ప్లాట్‌ఫామ్ ‘ఇంట్రాక్ట్’తో వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు... ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్‌చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్’ ప్లాట్‌ఫామ్‌కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్ని నిర్మించాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఇంట్రాక్ట్ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్ టాస్కుల ద్వారా బ్లాక్ చెయిన్, క్రిప్టో, వెబ్3 టెక్నాలజీతో యూజర్లను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్ అభిషేక్.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్’ విజయం సా«ధించింది. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్లకు క్రిప్టో, ఎన్ఎఫ్టీ, లాయల్టీ పాయింట్స్ రూపంలో ప్రోత్సాహకాలు’ అందిస్తోంది. ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్లతో ‘ఇంట్రాక్ట్’ వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్’ ఇన్వెస్టర్లలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్ పే, వెబ్ 3 స్టూడియోస్, కాయిన్ బేస్...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వెబ్3 టెక్నాలజీపై మార్కెటింగ్ నిపుణులు, కంపెనీల ఫౌండర్లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్3 క్రియేట్ చేసిన సరికొత్త ఆర్థిక అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్ జైన్. -
ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!
ఆర్ట్ సైంటిస్ట్ ఆర్ట్, ఫ్యాషన్‌ను కలిపి తనదైన కళను ఆవిష్కరించింది ఢిల్లీకి చెందిన పాయల్ జైన్. ఫ్యాషన్ రంగంలో పేరుగాంచిన పాయల్ జైన్ మంచి ఆర్టిస్ట్ కూడా. ఆమె తాజా ఎగ్జిబిషన్....సోల్ ఆఫ్ ఏ ఉమెన్. ఎగ్జిబిషన్లో కనిపించే 30 పీస్‌లలో ప్రతిదాంట్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చరిత్ర నుంచి కవిత్వం వరకు ఏదో ఒక అంశ ధ్వనిస్తుంది. ‘ఆర్ట్‌లో సైన్స్ ఉంటుంది. సైన్స్‌లో ఆర్ట్ ఉంటుంది’ అనే పాయల్ జైన్‌ను ఆర్ట్ సైంటిస్ట్‌గా పిలుచుకోవచ్చు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తన మూడు దశాబ్దాల ప్రయాణానికి ‘సోల్ ఆఫ్ ఏ ఉమెన్’ ప్రతిబింబం అంటుంది పాయల్. ఈ ఎగ్జిబిషన్‌లోని ముప్ఫై పీస్‌లలో ప్రతి పీస్‌కు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మెక్సికన్ పెయింటర్ ప్రీదా ఖాలోను స్ఫూర్తిగా తీసుకొని ‘ఫర్బిడెన్ లవ్’ కలెక్షన్ రూపొందించింది. పాయల్ అభిమానించే ఖాలో పెయింటర్, మ్యాజికల్ సర్రియలిస్ట్, ఫెమినిస్ట్, రెవల్యూషనరీ. పాయల్ ఆర్కిటెక్చర్ నుంచి ఫ్యాషన్ రంగంలోకి రావడానికి కారణం చిత్రకళ పట్ల తనకు ఉన్న అనురక్తి. స్కెచ్చింగ్ తనకు ఇష్టమైన పని. ఆమె తల్లి కూడా ఆర్టిస్టే. సితార్ అద్భుతంగా వాయించేది. తన కలల గురించి తల్లిదండ్రులకు చెప్పిప్పుడు ‘ ఏదో ఒక డిగ్రీ నీ చేతిలో కనిపించాలి. ఆ తరువాతే ఏదైనా’ అన్నారు. అలా బీకామ్ పూర్తి చేసింది. పాయల్ స్కెచ్చింగ్ నైపుణ్యాన్ని చూసి ‘నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రయత్నించవచ్చు’ అని సలహా ఇచ్చారు సన్నిహితులు. మొదట ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించి పుస్తకాలు, మ్యాగజైన్స్ విరివిగా చదివేది. అలా ఫ్యాషన్ కూడా తన ప్యాషన్‌గా మారింది. శాన్ఫ్రాన్సిస్కోలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ‘ఫ్యాషన్‌కు ఆర్ట్, సైన్స్ అనే రెండు కోణాలు ఉంటాయి. ఆర్ట్ అనేది సృజనాత్మకతకు సంబంధించిన కోణం, సైన్స్ అనేది సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన కోణం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నా దృష్టిని విశాలం చేసింది. ప్యాటర్న్మేకింగ్, డ్రాపింగ్, గ్రేడింగ్, ఇలస్ట్రేషన్, ఫ్యాషన్ మార్కెటింగ్...ఇలా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను’ అంటున్న పాయల్ ఎన్నో కార్పొరేట్ హోటల్స్‌కు ఆకట్టుకునేలా ‘హోటల్ యూనిఫామ్’ను డిజైన్ చేసి ఇచ్చింది. ‘డిజైనర్స్ అంటే గొప్ప ఏమీ కాదు. గ్లోరిఫైడ్ టైలర్స్ మాత్రమే’ అని చాలామంది అనుకొని అపోహపడే కాలంలో డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించింది పాయల్. ఆమె వెస్ట్రన్ క్లాతింగ్ మొదలుపెట్టినప్పుడు దానికి మార్కెట్ లేదు. అయితే ఆ తరువాత మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. పాయల్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆమె మాటల్లోనే చెప్పాలంటే...‘చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే ధోరణిలో కాకుండా మనం చేస్తున్న పనిని మనసారా ప్రేమించాలి. నిద్ర, శ్వాస, కలలో మన లక్ష్యం కనిపించాలి. ఫెయిల్యూర్‌కు చోటివ్వకుండా సాంకేతిక జ్ఞానంపై గట్టి పట్టు సంపాదించాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనల్లో కొత్తదనం వచ్చేలా చూసుకోవాలి. ప్రశంసలు ఆస్వాదించడానికి మాత్రమే పరిమితమైపోకుండా అన్ని కోణాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. మార్పులు చేర్పులు చేసుకోవాలి. సానుకూల శక్తి, సంకల్పబలం ఎప్పటికీ మనకు తోడుగా ఉండాలి’ కెరీర్ తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది పాయల్. చేదుజ్ఞాపకాలుగా కాదు...ఆ సమయంలోనూ తాను ఎంత ధైర్యంగా ఉందో మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి. ‘విజయం ధైర్యవంతులను వెదుక్కుంటూ వస్తుంది’ అని చెప్పడానికి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆమె తెచ్చుకున్న పేరే నిదర్శనం. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
కాంగ్రెస్‌లోకి ప్రముఖ న్యాయవాది దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ దామోదర్‌రెడ్డి సేవలను వినియోగించుకుంటామని, పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కొడంగల్, చేవెళ్ల, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. -
సహజ జీవన గమనం! అదే అత్యంత శుభదాయకం
మనిషి ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి. ఏవిధంగా ప్రవర్తించాలి అని తెలిపే జైన్ కథలు మానావళి ఓ గోప్ప వరం. అవి మనిషి బుద్ధిని వికసింప చేసి ఆలోచింప చేసేవిగా ఉంటాయి. ధర్మా ధర్మాలని చాలా చక్కగా విపులీకరించి ఎంతటి చిన్నపిల్లవాడికైన సులభంగా అర్థమవుతాయి. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఈ కథలు మనస్సు ప్రశాంతతకు ఓ చక్కటి ఔషధంలా ఆహ్లాదాన్ని ఇస్తాయి ఈ జైన్ కథలు. ఈ రోజు చెప్పే జైన్ కథ దేని గురించి తెలుసా..! అసలైన మహత్యం అంటే.. జెన్ గురువు ‘బన్‌కెయి’ ఓ నాడు బౌద్ధ విహారంలో ప్రవచనం చేస్తుండగా వేరే బౌద్ధ శాఖకు చెందిన ఒకాయన అక్కడకు వచ్చి సభలో పెద్దగా మాట్లాడుతూ అలజడి సృష్టించాడు. బన్కెయికి వచ్చిన మంచిపేరంటే అతడికి అసూయ. బన్‌కెయి మాట్లాడటం ఆపి గొడవకు కారణం ఏమిటని అడిగాడు. వచ్చిన ఆ ఆగంతకుడు అన్నాడు: ‘మా శాఖను స్థాపించిన గురువు ఎటువంటి గొప్ప మాహాత్మ్యాలు చెయ్యగలడంటే, నదికి ఇవతల గట్టు మీద కుంచె పుచ్చుకొని ఉండి, అవతల గట్టుమీద ఎవరైనా అట్ట పుచ్చుకొని ఉంటే, దానిమీద ఆ కుంచెతో బొమ్మ గీయగలడు. నీవు అలాంటి మహత్తు చెయ్య గలవా?’ బన్‌కెయి సమాధానం చెప్పాడు: ‘అలాంటి తంత్రం మీ గురువు చెయ్యగలడేమో కాని, అది జెన్ పద్ధతి కాదు. నేను చేసే మహత్తు ఏమిటంటే, నాకు ఆకలైనప్పుడు తింటాను. దాహమైనప్పుడు తాగుతాను.’ అదే అత్యంత శుభదాయకం ఓ ధనవంతుడు, జెన్ గురువు ‘సెన్‌గయి’ని అడిగాడు, తన వంశాభివృద్ధికి శుభదాయకమైన వాక్యం ఒకటి వ్రాసివ్వమనీ, దాన్ని తరతరాలుగా దాచి ఉంచుకొంటామనీ! సెన్‌గయి పెద్ద కాగితం ఒక దాన్ని తెప్పించుకొని, దాని మీద ఇలా రాశాడు: ‘తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మన వడు చనిపోతాడు. ’ధనవంతుడికి కోపం వచ్చింది. ‘నేను నిన్ను నా కుటుంబం ఆనందంగా ఉండటానికి ఏదైనా రాసివ్వమని అడిగాను. నీవేంటి ఇలా నన్ను ఎగతాళి పట్టిస్తున్నావు?’ ‘ఇందులో ఎగతాళి ఏం లేదు’ వివరించాడు సెన్‌గయి. ‘నీవు చనిపోకముందే నీ కొడుకు చనిపోయినాడనుకో. అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది. నీకంటే, నీ కొడుకు కంటే ముందే, నీ మనవడు చనిపోయినాడనుకో, మీ ఇద్దరి గుండె పగిలిపోతుంది. అలా కాకుండా, నీ కుటుంబం తరతరాలుగా నేను పేర్కొన్న వరుసలో గతించినారనుకో, అది సహజమైన జీవన గమనం అవుతుంది. దీన్ని నేను శుభదాయకం అంటాను.’ – దీవి సుబ్బారావు -
టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష
సాక్షి, విజయవాడ: బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. సెక్షన్ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలికను లైంగికంగా వేధించిన వినోద్‌జైన్.. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు. రూ. 3 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం.. బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. స్పెషల్ పీపీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘‘లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురి చేశారు. ఎవరికి చెప్పలేని విధంగా బాలికను లైంగికంగా వేధించారు. సూసైడ్ నోట్లో వినోద్ జైన్ వేధింపులను బాలిక స్పష్టంగా రాసింది. రెండు పేజీల లేఖలో నిందితుడి అకృత్యాలను వెల్లడించింది. బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారు.’’ అని పేర్కొన్నారు. చదవండి: 2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను ‘‘2021 ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్‌గా వినోద్ జైన్ పోటీ చేసి ఓడిపోయారు.సమాజంలో పెద్ద మనిషిగా తిరుగుతూ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.పోలీసులు కేసును ఛాలా సిరియస్ గా తీసుకున్నారు.సైన్టిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడికి శిక్ష పడింది’’ అని నాగిరెడ్డి అన్నారు. -
బాసరలో చక్రేశ్వరి విగ్రహం గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బాసరలో అరుదైన జైన శిల్పాన్ని గుర్తించారు. ఇది జైన మతంలో ప్రాధాన్యమున్న శాసనదేవత చక్రేశ్వరి విగ్రహం కావటం విశేషం. బాసరలో ఇంద్రతీర్ధంగా పిలుచుకునే కుక్కుటేశ్వరాలయంలో ఈ విగ్రహం ఉంది. సుఖాసనస్థితిలో ఉన్న ఈ చతుర్భుజి విగ్రహం వెనక హస్తాలలో శంఖం, అకుశం ఉండగా.. ముందు కుడి చేయి అభయహస్తంగా, ఎడమచేయి ఫలంతో ఉంది. తలపై కిరీట మకుటం, తల వెనక ప్రభావళి, చెవి కుండలాలు, జైన తీర్థంకరులకు ఉండే త్రివళితాలు, మెడలో కంఠిక, హారం, కాళ్లకు కడియాలు, చేతులకు కంకణాలు ఉన్నాయని, ఇది 9 లేదా 10 శతాబ్దాలకు చెందిన రాష్ట్రకూట శైలి విగ్రహమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. తమ బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ దీన్ని గుర్తించారని చెప్పారు. -
మట్టిపుట్టలో మహావీరుడు
సాక్షి, హైదరాబాద్: దట్టంగా పెరిగిన ముళ్లచెట్టు.. దాని దిగువన మట్టిపుట్ట.. అందులో మహావీరుడితోపాటు మరో జైనవిగ్రహం. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న రెండు విగ్రహాలు ఇలా మట్టిపుట్టలో వెలుగుచూశాయి. సిద్దిపేట శివారు పుల్లూరులో వీటిని గుర్తించారు. పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బుధవారం వాటిని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో గిరన్న దిబ్బగా పిలుచుకుంటున్న ప్రాంతంలో వేములవాడ చాళుక్యుల కాలంలో జైన బసది ఉండేది. కాలక్రమంలో అది ధ్వంసం అయింది. దేవాలయ శిథిల రాళ్లు తరలిపోగా మిగిలిన 24వ జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు, మాతంగ యక్షుని శిల్పాలు పక్కనే పడిపోయి క్రమంగా మట్టిలో కూరుకుపోయాయి. కాలక్రమంలో వాటి చుట్టూ పుట్ట పెరిగిపోయింది. వాటి జాడ స్థానికుల ద్వారా తెలుసుకున్న కరుణాకర్, నసీరుద్దీన్ తదితరులు శివనాగిరెడ్డి దృష్టికి తేగా అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. 10వ శతాబ్దికి చెందిన విగ్రహాలుగా గుర్తించారు. నల్ల శానపు రాతిపై చెక్కిన ఈ విగ్రహాల్లో.. మహావీరుడి భంగిమ పద్మాసనంలో ధ్యాన ముద్రతో ఉంది. ఇప్పటికీ అక్కడ ఆలయ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మిగిలిన ఈ విగ్రహాలు ఇంకా ధ్వంసం కాకుండా కాపాడాలని వారు గ్రామ స్తులను కోరారు. జైన ఆరాధకులు ముందుకొస్తే ఆలయ పునర్నిర్మాణానికి సహకరిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. -
టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూ జైన్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: ఇటీవల మరణించిన టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొని ఇందూ జైన్‌కు నివాళులు అర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందూ జైన్(84) కరోనా మహమ్మరి బారినపడి ఈ నెల 13న కన్నుమూశారు. భారతదేశంలో మీడియా రంగంలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1999లో గ్రూప్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన జైన్, సంస్థ స్థాయిని పెంచడంలో కృషి చేశారు. 2000లో టైమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్జీవోగా తీర్చిదిద్దారు. 1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్‌గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్ జైన్ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 2016లో కేంద్రం ఆమెను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 84 ఏళ్ల ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. చదవండి: Cyclone Yaas: ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష ఉచిత పంటల బీమా నగదు జమ చేసిన సీఎం జగన్ -
మీ దగ్గర శిష్యుడిగా ఉండటానికొచ్చాను
ఆయన ఓ గొప్ప సాధువు. ఆయనకంటూ ఓ ఆశ్రమం. ఆయన వద్ద ఎందరో శిష్యులున్నారు. ఓరోజు ఓ వ్యాపారి వచ్చాడు. అతను ధనవంతుడు. సాధువుకు నమస్కరించి ‘నేను మీ దగ్గర శిష్యుడిగా ఉండటానికొచ్చాను‘ అన్నాడు. సాధువు అతని వంక చూసి ‘నిన్ను చూస్తుంటే విలాసవంతుడిలా ఉన్నావు. మా ఆశ్రమం లో ఆడంబరాలకు తావు లేదు. చాలా సామాన్యమైనది. మా జీవన పద్ధతులు నీకు సరిపోతాయనిపించడం లేదు. అన్నింటినీ త్యజించి ఓ నిరాడంబర సాధువులాబతగ్గలవా అని అనిపిస్తోంది. నీవల్ల కాదేమో అని నా ప్రశ్న. నిజంగానే నువ్వు అన్నింటినీ వదులుకోగలవా?’ అడిగారు. ‘తప్పకుండా స్వామీ’ చెప్పాడు ధనవంతుడు. ‘నేనీ క్షణమే పట్టు వస్త్రాలు తీసేసి మామూలు నూలు వస్త్రాలు ధరిస్తాను. మామూలు భోజనం చేస్తాను. నా ధనమంతా ధర్మ కార్యాలకు రాసేస్తాను. మీరెలా చెప్తే అలాగే బతుకుతాను. నాకు జ్ఞానం మాత్రం లభిస్తే చాలు’ అన్నాడు ధనవంతుడు. అప్పటికీ సాధువుకి అతని మాటలు తృప్తి కలిగించలేదు. ‘సరేగానీ, నేను నిన్ను కొన్ని రోజులు పరిశీలిస్తాను. ఆ తర్వాత ఓ నిర్ణయానికొస్తాను‘ చెప్పాడు సాధువు. ఆరోజు నుంచి ఆ ధనవంతుడు సాధువు ఆశ్రమంలోనే ఉంటూ వచ్చాడు. సాధువుకి మాట ఇచ్చినట్లే చాలా నిరాడంబరమైన జీవితాన్నే గడుపుతూ వచ్చాడు. సాధువు అనుకున్న పదిహేనురోజులు ముగిశాయి. ఓరోజు పొద్దున్నే సాధువు అతనిని పిలిచి ‘నీకు ఈ ఆశ్రమ జీవితం సరిపోదు. నువ్విక ఇంటికి వెళ్ళిపోవచ్చు‘ అన్నాడు. ‘ఏమిటి స్వామీ అలా అంటున్నారు? నేను మీకోసం డబ్బుని వదులుకున్నాను. ఆస్తిపాస్తులు వదులుకున్నాను. సకల వసతులూ వదులుకున్నాను. ఇవేవీ సరిపోవా?‘ అడిగాడు ధనవంతుడు. సాధువు ఓ నవ్వు నవ్వారు. ‘నేను వేరుని నరకమన్నాను. నువ్వు కొన్ని కొమ్మలను మాత్రమే నరికావు. ఆ నరికేసిన కొమ్మల గురించి గొప్పలు చెప్తున్నావు. పైగా నాకోసం వదిలేశాను... నాకోసం వదిలేశాను అంటున్నావు... ఇది సరికాదు. నువ్వు దయ చేయొచ్చు. నీలో ఇంకా నేనూ నాకోసం వంటి ఆలోచనలున్నాయి. అవి నిన్నొదలవు‘ అన్నారు సాధువు. – యామిజాల జగదీశ్ -
జైన సన్యాసిని జీవసమాధి
టీ.నగర్(తమిళనాడు): ఏడు రోజులపాటు సల్లేఖన వ్రతం చేపట్టిన 65 ఏళ్ల జైన సన్యాసిని శుక్రవారం జీవసమాధి పొందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. సల్లేఖన వ్రతంలో భాగంగా జైనులు క్రమంగా ఆహర స్వీకరణ తగ్గించి, చివరకు అన్నపానీయాల పూర్తిగా మానివేసి ప్రాణాలు విడుస్తారు. జైన సాంప్రదాయంలో ఈ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంది. కర్ణాటక రాష్ట్రం హవారి ప్రాంతానికి చెందిన శ్రీ సుబ్రబావుమతి 2012 సంవత్సరంలో కుటుంబ జీవనాన్ని విడనాడి సన్యాసం చేపట్టారు. తర్వాత మాతాజీగా దీక్ష పొంది శ్రీసుబ్రబావుమతి మాతాజీగా వ్యవహరించబడ్డారు. పలు ప్రాంతాల్లో ఉన్న జైన ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించిన ఈమె జైనుల ప్రధాన కేంద్రమైన మేల్‌సిత్తామూరులోని మఠంలో సల్లేఖన వ్రతం చేపట్టి జీవసమాధి పొందేందుకు నిర్ణయించారు. దీంతో ఒకటిన్నర నెల క్రితం మాతాజి ఇద్దరు దిగంబరస్వాములు, 9 మంది మాతాజీల తో విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోగల మేల సిత్తామూరు మఠం చేరుకున్నారు. ఈమె ఏప్రిల్ 27నుంచి ఆహారం, నీరు సేవించకుండా శుక్ర వారం రాత్రి 8.50 గంటలకు జీవసమాధి పొందారు. మాతాజీ అంత్యక్రియలు శనివారం జరిగాయి. అనేక మంది భక్తులు పూలమాలలు, నెయ్యితో పూజలు నిర్వహించారు. -
పురాతన జైన విగ్రహం అపహరణ!
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో పురాతన కాలానికి చెందిన జైన విగ్రహం చోరీకి గురైంది. పాత పంచాయతీ కార్యాలయం ఎదుట కూడలిలో ఉండే ఈ విగ్రహాన్ని స్థానికులు రోజూ దర్శించుకునే వారు. కాని శనివారం ఉదయం నుంచి అది కనపడకుండా పోయింది. అనేక ఏళ్లుగా అక్కడ ఉన్న విగ్రహం కనబడకుండా పోయిందనే వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించింది. ఆ విగ్రహాన్ని భారీ మొత్తానికి అమ్ముకున్నారనే ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు కొందరు జైన భక్తులు ఆ విగ్రహాన్ని తమకు ఇవ్వాలని స్థానిక పెద్దలను ఆశ్రయించారని తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున కొన్ని పూజలు చేసి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లినట్లు చెప్తున్నారు. దీని వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. విగ్రహం చరిత్ర ఇది.. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చోరీకి గురైన విగ్రహం జైన తీర్థంకరుడిదిగా భావిస్తున్నారు. దాదాపు 1400 ఏళ్ల కిందటి విగ్రహంగా చెబుతున్నారు. ఏక శిలపై దిగంబర జైన్ విగ్రహాన్ని చక్కగా తీర్చిదిద్దారు. 1015–1042 సంవత్సరాల మధ్య కళ్యాణీ చాళుక్య జయసింహ మహారాజు పటాన్ చెరును రాజధానిగా చేసుకుని పాలించాడని ఆధారాలు ఉన్నాయి. ఆ రాజు కాలంలో జైన మతం ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో పటాన్చెరులో ఏడు వందల జైన దేవాలయాలు ఉండేవని చరిత్రకారులు గ్రంథస్తం చేశారు. నేటికీ పెద్ద పెద్ద జైన విగ్రహాలు, దేవాలయాలు పటాన్చెరులో కనిపిస్తాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో కనిపించే పెద్ద జైన విగ్రహం ఇక్కడ లభించిందే. పటాన్చెరులో జైన ఆరామాలు ఉండేవని చెప్తున్నారు. ఇప్పటికీ జైన సాధువులు పటాన్‌చెరుకు వచ్చి వెళ్తుంటారు. ఆ కాలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాని భావిస్తున్నారు. కాగా, ఈ విషయమై స్థానిక డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాలయ్యను వివరణ కోరగా.. ఆ విగ్రహం సంగతి తమకు తెలియదని చెప్పారు. తమ శాఖ ఆ విగ్రహాన్ని ఎక్కడికీ తరలించలేదని స్పష్టం చేశారు. దాన్ని తరలించాల్సిన అవసరం తమకు లేదన్నారు. -
నకిలీ వార్తలకు చెక్ పెట్టే టెక్నాలజీ
సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వెల్లువెత్తుతున్న నకిలీ వార్తల వల్ల కలుగుతున్న నష్టాలేమిటో అందరికీ తెలిసిందే. ఫేస్‌బుక్‌లోనో లేదా ట్విట్టర్లోనో వచ్చిన వార్త నిజమో కాదో తెలుసుకునే అవకాశం ఇంత వరకు లేకపోవడం వల్ల ఆ వార్తలను నిజమని నమ్మిన కొందరు భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు అసలీనా నకిలీనా అన్ని నిగ్గుతేల్చే సాంతికేక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. బ్రిటన్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న భారత సంతతికి చెందిన లిరిక్ జైన్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్త నిజమైనదో కాదో నిర్థారించే పరిజ్ఞానాన్ని అభివద్ధి చేశాడు. ఈ పరిజ్ఞానం(ఫ్లాట్‌ఫాం) సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను వడబోసి నిజమైన వార్తలను నిర్థారిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా కథనం లేదా సమాచారం రాగానే ఈ ఫ్లాట్‌ఫాం 70వేలకు పైగా డొమైన్ల నుంచి వాటికి సంబంధించిన కథనాల్ని సేకరిస్తుంది. ప్రతి కథనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఆ కథనం హేతుబద్ధంగా ఉందా... దాని వెనుక రాజకీయ ప్రయోజనాలేమైనా ఉన్నాయా? కథనంలో ఇచ్చిన గణాంకాలన్నీ సరైనవేనా? అన్నది పరిశీలించి ఆ వివరాలను బహిర్గతం చేస్తుంది. దానిని బట్టి వినియోగదారుడు ఆ కథనం నమ్మదగినదో కాదో నిర్థారించుకుంటాడు. ఈ పరిజ్ఞానం ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని,వచ్చే సెప్టెంబర్‌లో అమెరికా, బ్రిటన్లలో అందుబాటులోకి వస్తుందని లిరక్ జైన్ తెలిపారు. అక్టోబర్‌లో ఈ పరిజ్ఞానం భారత్‌లో ప్రవేశపెడతామని ఆయన అంటున్నారు.వార్తలు, కథనాల్లో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కత్రిమ మేథను కూడా ఉపయోగించుకుంటామని జైన్ చెప్పారు. భారత దేశంలో 20 కోట్ల మందికిపైగా వాట్సాప్ వినియోగదారులున్నారు.ఇటీవల వాట్సాప్‌లో వస్తున్న అసత్య ప్రచారాలు, నకిలీ కథనాలు అల్లర్లకు, హత్యలకు దారితీస్తున్నాయి. ‘వాట్సాప్‌లో వస్తున్న కథనాలు, వార్తలు ఉద్రేకపూరితంగా, భావోద్వేగాలను రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం ఆ కథనాలు అసలైనవో కాదో తెలుసుకోవడానికి, అవాస్తవ కథనాలను నియంత్రించడానికి చాలా సమయం పడుతోంది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ లోపాన్ని అధిగమించడం కోసం సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని అప్పటి కప్పుడే వడపోసే అవకాశాల కోసం మేం అన్వేషిస్తున్నాం. ఈ ఏడాది చివర్లో దీనికి సంబంధించిన మా ప్రణాళికల్ని ప్రకటిస్తాం’ అని జైన్ అంటున్నారు. మైసూరు నుంచి కేంబ్రిడ్జి వరకు.. మైసూరు చెందిన 21 ఏళ్ల లిరిక్ జైన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. గత ఏడాది లాజిక్ అలే పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశాడు. బ్రిటన్‌లో మొట్టమొదటి ఇంటెలిజెంట్ న్యూస్ ఫీడ్ కంపెనీ ఇదే. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను గుర్తించడం దీని పని. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన నిపుణులతో 10లక్షల పౌండ్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు. బ్రిటన్,అమెరికా, భారత్‌లలో ప్రస్తుతం ఈ కంపెనీకి 38 మంది సిబ్బంది ఉన్నారు. త్వరలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని ఆలోచిస్తున్నట్టు జైన్ తెలిపారు. -
ఆలయాలను ఫొటో తీస్తున్నారా?
హిందూ, జైన, బౌద్ధ దేవాలయాల సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడ తామూ ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతారు. వాటిని ఎవరికైనా చూపించడానికి ‘ఫలానా దేవాలయం ముందు ఫొటో దిగాం’ అని చెప్పుకుంటారు. కానీ, అంతకన్నా దేవాలయ నిర్మాణంపై దృష్టి పెట్టి తీసిన ఫొటోలతో ఎదుటివారి ముందు ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించవచ్చు. ముందుగా ఆలయం వెలుపలి నిర్మాణం అంతా ఫొటోలో వచ్చే విధంగా జాగ్రత్తపడాలి. తర్వాత నిర్మాణ కళకు సంబంధించిన వివరాలను తెలియజేసే ఒక్కో భాగాన్ని క్లోజప్ షాట్స్‌లో తీసుకోవాలి. ఆ తర్వాత దేవాలయాల లోపలి గదులను ఫొటోలకు ఎంచుకోవాలి. గదులు చీకటిగా ఉంటాయి. ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే కాంతి మార్గం, దీపాల వెలుగు ద్వారా లోపలి అద్భుతాన్ని చూపించగలగాలి. పూజారులు, బౌద్ధ సన్యాసులు, అఘోరాలు.. ఇలా ఆ ఆలయానికి ప్రత్యేకం అనిపించేవారిని ఫొటో తీసుకోవాలి. ఇవన్నీ వరుస క్రమంలో అమర్చి ఒక ఆల్బమ్ తయారుచేస్తే మీరు వెళ్లి, సందర్శించిన ఆలయం, అక్కడి శిల్ప సంపద, చారిత్రక వైభవం చక్కగా కళ్లకు కడతాయి. నోట్: ఆలయాలలో ఫొటోలకు అనుమతులు తప్పనిసరి. ఫొటో నిషేధిత ఆజ్ఞలను తప్పక పాటించాలి. -
ఇంద్రియాలను జయించిన మహావీరుడు
ఏప్రిల్ 13న మహావీరుడి జయంతి హిందూ, జైన, బౌద్ధ, సిక్కు వుతాల్లో బౌద్ధ, జైనమతాలు కొంచెం భిన్నమైనవి. అహింస, సత్యవాక్పాలన, ఆస్తేయం (దొంగతనం చేయకుండా ఉండటం), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (ఇతరుల ఆస్తిని కబళించకపోవటం) అనే ఐదు సూత్రాల ఆధారంగా ఏర్పడినదే జైనమతం. జినులు అంటే జయించినవారు అని అర్థం. వారు జయించింది ఇంద్రియాలను, ఆ తర్వాత జనుల హృదయాలను. జైనమత వ్యాపకుడైన వర్థమాన మహావీరుడు రాజుగా పుట్టాడు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వర్ధమానుడు. పెరిగి పెద్దవాడయ్యాక ఆయన ఇతర రాజ్యాల మీద దండెత్తి రాజులను జయించి ఉంటే అందరూ వీరుడని కొనియాడేవారేమో! అయితే వర్థమానుడు అలా చేయలేదు. రాగద్వేషాలను, అంతఃశత్రువులైన అరిషడ్వర్గాలను జయించి మహావీరుడయ్యాడు. క్రీ.పూ. 599లో నేటి బీహార్‌లోని విదిశ (నాటి వైశాలి) లో త్రిశల, సిద్ధార్థుడు అనే రాజదంపతులకు జన్మించిన వర్థమానుడు బాల్యం నుంచి ప్రాపంచిక విషయాల మీద ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదట. యశోధర అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రుల మరణానంతరం భార్యాబిడ్డలను వదిలి సన్యాసం స్వీకరించాడు. వృషభనాథుడు ప్రతిపాదించిన జైనమతాన్ని తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా బలోపేతం చేశాడు. వర్థమాన మహావీరుడిని ఆనాటి ప్రజలు సాక్షాత్తూ భగవంతుడి ప్రతిరూపంగా ఆరాధించారు. - డి.వి.ఆర్. వర్థమానుడి తత్వం ద్వైతం. ఆయన సిద్ధాంతం ప్రకారం రెండు రకాల పదార్థాలున్నాయి. ఒకటి జీవుడు, రెండు అజీవుడు. జీవుడంటే ఆత్మ, అజీవుడంటే పదార్థం. అజీవుడు అణునిర్మితమైతే, జీవుడు అమర్త్యం. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది. కర్మల కారణంగానే జన్మలు ఏర్పడతాయి. జన్మరాహిత్యం చేసుకోవాలంటే మోహవికారాదులను, ఇంద్రియానుభవాలను తగ్గించుకోవాలి. అందుకు సన్యాసం, తపస్సు రెండూ అవసరమవుతాయి. తిరిగి పుట్టని ఆత్మ నిర్వాణాన్ని పొందుతుంది. అంటే నిష్క్రియాత్మకమైన, నిర్మలమైన శాశ్వతానందం. నిర్వాణం లక్ష్యంగా ఉన్నవారు దుష్కర్మలను పరిహరించాలి. అంతేకాదు, నూతనకర్మలు చేయకుండా ఉన్న కర్మలను క్రమంగా నశింపజేసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అంటే సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన.