‘ఆర్థికాంశాలు మహిళలకు అంత త్వరగా అర్థం కావు’ అనే దురభిప్రాయం ఒకటి మన సమాజంలో స్థిరపడిపోయింది. ఆర్థిక మంత్రిగా మహిళలు సమర్థంగా బాధ్యతలు నిర్వహించడాన్ని చూస్తూ కూడా తాము పెంచి పోషించుకుంటున్న అపోహను వీడడానికి ఇష్టపడదు సమాజం. చార్టెడ్ అకౌంటెన్సీలో ఎంత మంది మహిళలు ఉన్నప్పటికీ సమాజం మాత్రం తన కళ్లకు కట్టుకున్న గంతలు విప్పడానికి సుముఖంగా ఉండదు. వీటన్నింటినీ పటాపంచలు చేయడానికి కంకణం కట్టుకుంది సాక్షి జైన్. జార్ఖండ్ రాష్ట్రం, రాంచీకి చెందిన సాక్షి సీఏ పూర్తి చేసి ఒక సంస్థలో ఉద్యోగంలో చేరింది. తన జ్ఞానాన్ని తన ఎదుగుదలకే పరిమితం చేసుకోకుండా మహిళాసమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలనుకుందామె.
ఫాలోవర్స్ ΄పొలోమన్నారు!
‘‘కొత్తతరం విద్యార్థులకు ఆర్థికాంశాల్లో మెళకువలు నేర్పించే క్రమంలో నాలో ఎన్నో కొత్త ఆలోచనలు వచ్చాయి. మనదేశంలో మహిళలకు అక్షరాస్యత ఉంది, కానీ ఆర్థిక అక్షరాస్యత తగినంతగా లేదనిపించింది. అయితే వారిలో ఆర్థికాంశాల పట్ల అనేకానేక సందేహాలున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయగలిగితే ప్రతి ఇంట్లో ఒక ఆర్థిక వేత్త తయారవుతారనిపించింది. అప్పుడు మొదలు పెట్టిన ప్రయత్నమే : @ca.sakchijain ఇన్‌స్టాగామ్‌కి నాలుగు నెలల్లోనే పదిహేడు లక్షల ఫొలోవర్లు వచ్చారు. ఫిన్‌ఫ్లూయెన్సర్ (ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లూయెన్సర్)గా సోషల్ మీడియాతో నేను గుర్తింపు పోందాను. నా పరిజ్ఞానంతో వేలాది మహిళలు తమ ఆర్థికాంశాలపై స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన స్థితికి చేరారు.
కంటెంట్ క్రియేటర్‌నయ్యాను!
నేను అకౌంటెన్సీలో లోతుగా పాఠాలు చెప్పే ప్రయత్నమేదీ చేయలేదు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని ఎన్ని రకాలుగా మదుపు చేయవచ్చో వివరించాను. జీవిత బీమా పథకాల గురించి చెపాను. ఫైనాన్షియల్ ΄ాలసీలతో పాటు రుణాలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి అవసరాలకు తీసుకోవాలి, తీసుకున్న రుణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి... అనే మెళకువలు నేర్పించాను. భారీ పదజాలాన్ని ఉపయోగిస్తే ఇది మనకు అర్థమయ్యే విషయం కాదని తెలుసుకోవడం మానేస్తారు. అందుకే నేను సామాన్య మహిళ మేధస్థాయికి దిగి అలతి అలతి పదాలతో, వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో పోలుస్తూ వివరించాను. మా రాష్ట్రంలోని గ్రామాల్లో చదువుకున్న మహిళలంటే స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన మహిళలే. వాళ్లను దృష్టిలో పెట్టుకుని వీడియోలు చేయడం మొదలుపెట్టాను.
ఆశ్చర్యకరంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మహిళలు కూడా నా వీడియోలను చూస్తూ అనేక సందేహాలను వ్యక్తం చేసేవారు. ఒక విధంగా చె΄్పాలంటే నా వీక్షకుల నుంచి వచ్చే కామెంట్స్ నాకు దిశానిర్దేశం చేశాయంటే అతిశయోక్తి కాదు. వీక్షకుల కామెంట్స్ చూసి వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ వివరాలతో వీడియోలు చేశాను. నా వీక్షకులకు అవసరమైన సమాచారాన్ని ఆర్థిక నియమాల చట్రంలో వివరించడానికి నేను చేసిన ప్రయత్నం నన్ను కంటెంట్ క్రియేటర్‌ని చేసింది. ఇప్పుడిది నా ఫుల్‌టైమ్ జాబ్‌గా మారింది. మొదట్లో రోజుకో వీడియో పోస్ట్ చేశాను. కామెంట్ బాక్స్‌లో వస్తున్న రిక్వెస్ట్‌లను చేరాలంటే ఒకటి సరిపోవడం లేదని ఇప్పుడు రోజుకు రెండు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. నేను చెప్తున్న విషయాలు మరీ భారీస్థాయిలో ఉండకూడదని, పెద్ద పెట్టుబడులు పెట్టే వారికి సలహాలనివ్వడానికి ఆర్థిక నిపుణులు ఎందరో ఉన్నారు. మహిళలను చైతన్యవంతం చేయాలంటే వారు సులువుగా అందుకోగలిగిన మెళకువలతో మొదలు పెట్టాను.
లక్ష్యాలు ఉన్నతంగా ఉంటున్నాయి
నేటి రోజుల్లో దాదాపుగా మహిళలందరూ తమకంటూ ఒక ఉపాధిమార్గాన్ని వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు. మరికొందరు గృహిణిగా భర్త సం΄ాదనతో కుటుంబాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించగలుగుతున్నారు. సరాసరిన చూస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటున్నారు. వారికి ఆర్థిక అక్షరాస్యత తెలిస్తే డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఎలా మదుపు పెట్టాలి అనే విషయాలు అర్థమవుతాయి. దాంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరు నెలల అనుభవంలో నాకు అర్థమైనదేమిటంటే... ఒక చిన్న ఆసరా లేక΄ోవడం వల్లనే ఆర్థికాంశాల్లో మహిళలు ఒక అడుగు వెనుకగా ఉండి΄ోయారని! సందేహాల రూపంలో వాళ్ల ఆసక్తులు, ఆలోచనలు, లక్ష్యాలు పెద్ద వ్యా΄ారులకు ఏ మాత్రం తీసి΄ోని స్థాయిలో ఉంటున్నాయి. తాము, తమ కుటుంబం ఆర్థికంగా మెరుగుపడాలనే ఆలోచనతో΄ాటు సమాజంలో మరికొందరికి ఉపయోగపడే పరస్పర సహకార ధోరణి కనిపిస్తోంది. నా ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోందని నాకూ సంతోషంగా ఉంది’’ అని వివరించారు సాక్షి జైన్.
ఒక చిన్న ఆసరా లేకపోవడం వల్లనే ఆర్థికాంశాల్లో మహిళలు ఒక అడుగు వెనుకగా ఉండిపోయారు. సందేహాల రూపంలో వాళ్ల ఆసక్తులు, ఆలోచనలు, లక్ష్యాలు పెద్ద వ్యా΄ారులకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment