Literacy of women
-
ఆర్థిక అక్షరాస్యత
‘ఆర్థికాంశాలు మహిళలకు అంత త్వరగా అర్థం కావు’ అనే దురభిప్రాయం ఒకటి మన సమాజంలో స్థిరపడిపోయింది. ఆర్థిక మంత్రిగా మహిళలు సమర్థంగా బాధ్యతలు నిర్వహించడాన్ని చూస్తూ కూడా తాము పెంచి పోషించుకుంటున్న అపోహను వీడడానికి ఇష్టపడదు సమాజం. చార్టెడ్ అకౌంటెన్సీలో ఎంత మంది మహిళలు ఉన్నప్పటికీ సమాజం మాత్రం తన కళ్లకు కట్టుకున్న గంతలు విప్పడానికి సుముఖంగా ఉండదు. వీటన్నింటినీ పటాపంచలు చేయడానికి కంకణం కట్టుకుంది సాక్షి జైన్. జార్ఖండ్ రాష్ట్రం, రాంచీకి చెందిన సాక్షి సీఏ పూర్తి చేసి ఒక సంస్థలో ఉద్యోగంలో చేరింది. తన జ్ఞానాన్ని తన ఎదుగుదలకే పరిమితం చేసుకోకుండా మహిళాసమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలనుకుందామె.ఫాలోవర్స్ ΄పొలోమన్నారు! ‘‘కొత్తతరం విద్యార్థులకు ఆర్థికాంశాల్లో మెళకువలు నేర్పించే క్రమంలో నాలో ఎన్నో కొత్త ఆలోచనలు వచ్చాయి. మనదేశంలో మహిళలకు అక్షరాస్యత ఉంది, కానీ ఆర్థిక అక్షరాస్యత తగినంతగా లేదనిపించింది. అయితే వారిలో ఆర్థికాంశాల పట్ల అనేకానేక సందేహాలున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయగలిగితే ప్రతి ఇంట్లో ఒక ఆర్థిక వేత్త తయారవుతారనిపించింది. అప్పుడు మొదలు పెట్టిన ప్రయత్నమే : @ca.sakchijain ఇన్స్టాగామ్కి నాలుగు నెలల్లోనే పదిహేడు లక్షల ఫొలోవర్లు వచ్చారు. ఫిన్‌ఫ్లూయెన్సర్ (ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్)గా సోషల్ మీడియాతో నేను గుర్తింపు పోందాను. నా పరిజ్ఞానంతో వేలాది మహిళలు తమ ఆర్థికాంశాలపై స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన స్థితికి చేరారు. కంటెంట్ క్రియేటర్నయ్యాను! నేను అకౌంటెన్సీలో లోతుగా పాఠాలు చెప్పే ప్రయత్నమేదీ చేయలేదు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని ఎన్ని రకాలుగా మదుపు చేయవచ్చో వివరించాను. జీవిత బీమా పథకాల గురించి చెపాను. ఫైనాన్షియల్ ΄ాలసీలతో పాటు రుణాలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి అవసరాలకు తీసుకోవాలి, తీసుకున్న రుణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి... అనే మెళకువలు నేర్పించాను. భారీ పదజాలాన్ని ఉపయోగిస్తే ఇది మనకు అర్థమయ్యే విషయం కాదని తెలుసుకోవడం మానేస్తారు. అందుకే నేను సామాన్య మహిళ మేధస్థాయికి దిగి అలతి అలతి పదాలతో, వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో పోలుస్తూ వివరించాను. మా రాష్ట్రంలోని గ్రామాల్లో చదువుకున్న మహిళలంటే స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన మహిళలే. వాళ్లను దృష్టిలో పెట్టుకుని వీడియోలు చేయడం మొదలుపెట్టాను.ఆశ్చర్యకరంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మహిళలు కూడా నా వీడియోలను చూస్తూ అనేక సందేహాలను వ్యక్తం చేసేవారు. ఒక విధంగా చె΄్పాలంటే నా వీక్షకుల నుంచి వచ్చే కామెంట్స్ నాకు దిశానిర్దేశం చేశాయంటే అతిశయోక్తి కాదు. వీక్షకుల కామెంట్స్ చూసి వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ వివరాలతో వీడియోలు చేశాను. నా వీక్షకులకు అవసరమైన సమాచారాన్ని ఆర్థిక నియమాల చట్రంలో వివరించడానికి నేను చేసిన ప్రయత్నం నన్ను కంటెంట్ క్రియేటర్‌ని చేసింది. ఇప్పుడిది నా ఫుల్‌టైమ్ జాబ్‌గా మారింది. మొదట్లో రోజుకో వీడియో పోస్ట్ చేశాను. కామెంట్ బాక్స్‌లో వస్తున్న రిక్వెస్ట్‌లను చేరాలంటే ఒకటి సరిపోవడం లేదని ఇప్పుడు రోజుకు రెండు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. నేను చెప్తున్న విషయాలు మరీ భారీస్థాయిలో ఉండకూడదని, పెద్ద పెట్టుబడులు పెట్టే వారికి సలహాలనివ్వడానికి ఆర్థిక నిపుణులు ఎందరో ఉన్నారు. మహిళలను చైతన్యవంతం చేయాలంటే వారు సులువుగా అందుకోగలిగిన మెళకువలతో మొదలు పెట్టాను. లక్ష్యాలు ఉన్నతంగా ఉంటున్నాయి నేటి రోజుల్లో దాదాపుగా మహిళలందరూ తమకంటూ ఒక ఉపాధిమార్గాన్ని వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు. మరికొందరు గృహిణిగా భర్త సం΄ాదనతో కుటుంబాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించగలుగుతున్నారు. సరాసరిన చూస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటున్నారు. వారికి ఆర్థిక అక్షరాస్యత తెలిస్తే డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఎలా మదుపు పెట్టాలి అనే విషయాలు అర్థమవుతాయి. దాంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరు నెలల అనుభవంలో నాకు అర్థమైనదేమిటంటే... ఒక చిన్న ఆసరా లేక΄ోవడం వల్లనే ఆర్థికాంశాల్లో మహిళలు ఒక అడుగు వెనుకగా ఉండి΄ోయారని! సందేహాల రూపంలో వాళ్ల ఆసక్తులు, ఆలోచనలు, లక్ష్యాలు పెద్ద వ్యా΄ారులకు ఏ మాత్రం తీసి΄ోని స్థాయిలో ఉంటున్నాయి. తాము, తమ కుటుంబం ఆర్థికంగా మెరుగుపడాలనే ఆలోచనతో΄ాటు సమాజంలో మరికొందరికి ఉపయోగపడే పరస్పర సహకార ధోరణి కనిపిస్తోంది. నా ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోందని నాకూ సంతోషంగా ఉంది’’ అని వివరించారు సాక్షి జైన్.ఒక చిన్న ఆసరా లేకపోవడం వల్లనే ఆర్థికాంశాల్లో మహిళలు ఒక అడుగు వెనుకగా ఉండిపోయారు. సందేహాల రూపంలో వాళ్ల ఆసక్తులు, ఆలోచనలు, లక్ష్యాలు పెద్ద వ్యా΄ారులకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉంటున్నాయి. -
అక్షరాస్యతలో ఆంధ్రా అమ్మాయిలు టాప్
జీవితంలోనే కాదు.. సమాజంలోనూ విద్య విలువైన సాధనం. ముఖ్యంగా స్త్రీ విద్య స్వేచ్ఛ, సంక్షేమంతో పాటు సామాజిక ప్రయోజనాలను అందిస్తుంది. సహజంగా ఆలోచించే శక్తి కలిగిస్తుంది. ఒకప్పుడు బాలికల్ని పాఠశాలలకు బదులు.. పనులకు పంపడం లేదంటే ఇంట్లోనో ఉంచేసేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. బాలికల అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా దేశంలో బాలికా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచింది. సాక్షి, విశాఖపట్నం: మహిళలు విద్యావంతులైతేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. బాలికల అక్షరాస్యత శాతం పెరిగితే.. మాతా శిశు మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఎందుకంటే కౌమార దశలో దాంపత్య బంధంలోకి అడుగుపెడుతున్న బాలికల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతానికి చెందినవారే. చదువుకు దూరమైన కారణంగా గర్భ నిరోధక పద్ధతులు, గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకునే అవగాహన లేకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. బాలికల్లో అక్షరాస్యత పెంచడం ద్వారానే ఈ పరిస్థితిని అధిగమించవచ్చని స్పష్టం చేసింది. ఈ విషయాలను అవగాహన చేసుకుని బాలికా విద్యకు పెద్దపీట వేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. 2019–20 సంవత్సరంలో ఈ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఏపీలో 100 శాతం అక్షరాస్యత ‘ది టీన్ ఏజ్ గర్ల్స్ (టీఏజీ)’ ప్రాజెక్టులో భాగంగా పరిశోధన నిపుణులు, లింగ నిష్పత్తి గణాంక నిపుణులు, సామాజిక, మానవ శాస్త్ర అధ్యయన నిపుణులు, న్యాయవాదులు, మానసిక ఆరోగ్య నిపుణులతో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వే జరిపించాయి. దేశంలోని 600కుపైగా జిల్లాల్లో 74 వేల మంది టీనేజీ బాలికల్ని సర్వేలో భాగం చేశారు. మార్పు తెస్తున్న అమ్మఒడి, నాడు–నేడు.. రాష్ట్రంలో బాలికా విద్యకు శాపంగా ఉన్న అనేక అంశాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పిల్లల చదువు కుటుంబానికి భారంగా మారకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం పేరుతో తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేశారు. ఈ పథకం కారణంగా తమ పిల్లల్ని బడికి పంపించాలన్న ఆసక్తి ప్రతి తల్లిలోనూ పెరిగింది. అదేవిధంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో టాయిలెట్లు, రక్షణ గోడలు, తరగతి గదుల నిర్మాణం మొదలైన సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. దీంతో బాలికా విద్యకు ప్రాధాన్యం మరింతగా పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది. - 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించి ముందంజలో ఉన్నాయి. - ఏపీ బాలికల్లో 96.6 శాతం మందికి 19 ఏళ్లలోపు వివాహాలు చేయకుండా చదివిస్తుండగా.. పశ్చిమ బెంగాల్లో ఈ శాతం 88.9గా నమోదైంది. - 86.6 శాతం మంది టీనేజ్ బాలికలు 21 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. - రాష్ట్రంలో 71 శాతం మంది ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షిస్తున్నారు. - 81.5 శాతం ఏపీ బాలికలు ఇంగ్లిష్, కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకోవాలని అనుకుంటున్నారు. - 69.4 శాతం మంది ఏపీకి చెందిన టీనేజీ బాలికలు తాము చదువుకుంటున్న విద్యకు అనుగుణంగా ఉపాధి పొందాలని భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. - మన రాష్ట్రంలో 82.8 శాతం బాలికలు బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకుండా సరైన పద్ధతులు పాటిస్తున్నారు. - 56.4 శాతం మంది టీనేజీ బాలికలు రుతుక్రమం సమయంలో పరిశుభ్రమైన పద్ధతులు పాటిస్తున్నారు. -
సమాజం పట్ల చైతన్యం రావాలి
హన్మకొండ అర్బన్ : ప్రస్తుతం మహిళల్లో అక్ష్యరాస్యత శాతం పెరిగింది. చదువు, ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అయితే కేవలం చదువు, సంపాదన మాత్రమే కాకుండా సమాజంపై చైతన్యం అవసరం. తద్వారా మహిళల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అప్రమత్తంగా ఉండటంతో పాటు తోటి మహిళా లోకాన్ని చైతన్య పరిచేస్థాయిని గ్రామీణ మహిళలు ఎదగాల్సి ఉంది. ప్రభుత్వ పథకాలు, చట్టాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే స్థాయిలో చైతన్యం రావాలి. పరిస్థితులకు అనుగుణంగా మహిళలు స్వయం నిర్ణయాధికారం తీసుకుంటే విజయం సొంతమవుతుంది. – అమ్రపాలి కాట, కలెక్టర్, వరంగల్ అర్బన్ జిల్లా