సమాజం పట్ల చైతన్యం రావాలి
హన్మకొండ అర్బన్ : ప్రస్తుతం మహిళల్లో అక్ష్యరాస్యత శాతం పెరిగింది. చదువు, ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అయితే కేవలం చదువు, సంపాదన మాత్రమే కాకుండా సమాజంపై చైతన్యం అవసరం. తద్వారా మహిళల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అప్రమత్తంగా ఉండటంతో పాటు తోటి మహిళా లోకాన్ని చైతన్య పరిచేస్థాయిని గ్రామీణ మహిళలు ఎదగాల్సి ఉంది.
ప్రభుత్వ పథకాలు, చట్టాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే స్థాయిలో చైతన్యం రావాలి. పరిస్థితులకు అనుగుణంగా మహిళలు స్వయం నిర్ణయాధికారం తీసుకుంటే విజయం సొంతమవుతుంది.
– అమ్రపాలి కాట, కలెక్టర్, వరంగల్ అర్బన్ జిల్లా