Rural Women
-
వనంలో వనితలపై అనుచిత నిఘా
పెద్దపులులకు ఆవాసంగా, జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా అలరారుతున్న ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ వనంలో ఘోరం జరుగుతోంది. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు, జంతువుల సంఖ్యను లెక్కపెట్టేందుకు, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు అడవిలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు, డ్రోన్లను గ్రామీణ మహిళలపై అనుచిత నిఘాకు వాడుతున్న వైనం కలకలం రేపుతోంది. వంట చెరకు, అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లే గ్రామీణ మహిళలను దొంగచాటుగా చూసేందుకు కొందరు అధికారులు, స్థానికులు ఈ కెమెరాలు, డ్రోన్లు, వాయిస్ రికార్డర్లను వాడుతున్నారు. ఈ విస్మయకర విషయాలను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెలుగులోకి తెచ్చింది! అడవే వారికి జీవనాధారం ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌ను ఆనుకుని చాలా గ్రామాలున్నాయి. అక్కడి గ్రామీణ మహిళలకు అడవే ఆధారం. వంట చెరకు, తేనె, ఇతరత్రా అటవీ ఉత్పత్తుల కోసం అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. రోజుల పాటు అక్కడే గడుపుతారు. తాగుబోతు భర్తల హింస, వేధింపులు తాళలేక అడవి బాట పట్టే అతివలు ఎందరో. అడవి తల్లిని ఆశ్రయించే ఈ మహిళలకు వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలు, డ్రోన్లు తలనొప్పిగా తయారయ్యాయి. అడవిలో సెలయేర్లు, గట్ల వద్ద స్నానాలు చేసే, బహిర్భూమికి వెళ్లే మహిళలను డ్రోన్లు, నిఘా కెమెరా కళ్లు వెంటాడుతున్నాయని కేంబ్రిడ్జ్ అధ్యయనంలో తేలింది. ‘‘మహిళలు అటవీ సంపదను కొల్లగొట్టకుండా వారిని బయటకు తరిమేందుకు మొదట్లో కెమెరా ట్రాప్‌లు, డ్రోన్లను అధికారులు వాడేవారు. తర్వాత కొందరు అధికారులు ఇలా మహిళలను దొంగచాటుగా చూసేందుకు దుర్వీనియోగం చేశారు. ఒక మహిళకు సంబంధించిన వ్యక్తిగత వీడియో ఇటీవల ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. వాట్సాప్‌లోనూ షేర్ చేయడంతో విషయం గ్రామస్తుల దాకా చేరింది. చివరకు స్థానిక నిఘా కెమెరాలను తగలబెట్టే దాకా వెళ్లింది’’అని కేంబ్రిడ్జ్‌లో సోషియాలజీ విభాగ పరిశోధకుడు, నివేదిక ముఖ్య రచయిత త్రిశాంత్ సిమ్లయ్ చెప్పారు. నివేదిక వివరాలు ‘ఎన్విరాన్మెంట్, ప్లానింగ్ ఎఫ్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇదేం దిక్కుమాలిన పని! ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో అత్యంత విలువైన వనమూలికలుంటాయి. వాటిని సేకరించి పొ ట్ట నింపుకునేందుకు గ్రామీణ మహిళలు అడవుల్లోకి వెళ్తుంటారు. గుంపులుగా వెళ్లి కొద్ది రో జలు అక్కడే ఉంటారు. ‘‘అడవి తల్లితో మాకెంతో అనుబంధం. ఇంట్లో మాకు నిర్బంధం ఎక్కువ. పెళ్లి వంటి వేడుకలప్పుడు తప్పితే కనీసం నోరు తెరిచి పాడటం కూడా తప్పే. అందుకే వనదేవత ఒడికి చేరినప్పుడే అందరం కలిసి ఆనందంగా పాటలు పాడుతూ పనిలో నిమగ్నమవుతాం’’అని ఒక గ్రామీణురాలు తెలిపారు. తాజాగా కొన్ని చోట్ల నిఘా కెమెరాలను తగలబెట్టడంతో ఆ ప్రాంతాల్లో పులి సంచారంపై అధికారులకు నిఘా కరువైంది. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లిన ఒక మహిళపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో కెమెరాల దుర్వీనియోగం చివరకు మహిళ ప్రాణాలను బలి గొందని స్థానికుల్లో ఆగ్రహం రేగింది. ‘‘రెక్కా డితేగానీ డొక్కాడని పేద మహిళలు ఇప్పటికీ అడవిలోకి వెళ్తు న్నారు. కానీ ఏ చెట్టు కొమ్మకు ఏ కెమెరా ఉందోనన్న భయం వాళ్లను వెంటాడుతోంది. వాళ్ల గొంతులు మూగబోయాయి. అమాయక గ్రామీణుల జీవనశైలి మీదే ఇది ప్రభావం చూపుతోంది’’అని పర్యావరణవేత్తలు, సా మాజికవేత్తలు అంటున్నారు. జంతువులను చూడమంటే మహిళలను దొంగచాటుగా చూడటమేటని త్రిశాంత్ ప్రశ్నించారు.స్పందించని అధికారులు దీనిపై టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయాన్ని మీడియా సంప్రదించగా అధికారులు స్పందించలేదు. జిమ్ కార్బెట్ జాతీయవనం ఢిల్లీ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరాది అంతటి నుంచీ ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ఇక్కడ జీప్ సఫారీ సౌకర్యం కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘రూరల్ విమెన్స్ లీడర్షిప్ ’కార్యక్రమంలో నటి రెజినా (ఫొటోలు)
-
Nikita Kaushik: సిటీకి పల్లె కళ
గ్రామీణ మహిళా కళాకారులను ప్రోత్సహించడానికి, వారి వారసత్వ కళను, ఫ్యాబ్రిక్ క్రాఫ్ట్‌ను భారతదేశం అంతటా పరిచయం చేయడానికి ది వోవెన్ ల్యాబ్ పేరుతో కృషి చేస్తున్నారు భూపాల్ వాసి నిఖితా కౌశిక్. ముంబైలోని నిఫ్ట్ పూర్వవిద్యార్థి అయిన నిఖిత జీరోవేస్ట్ పాలసీతో పాతికమంది గ్రామీణ మహిళల చేత పట్టణ మహిళల కోసం ఆధునికంగా డ్రెస్‌లను డిజైన్ చేయించి, వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘స్టైల్ తత్త్వ’ ఎగ్జిబిషన్లో క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ క్లస్టర్స్‌కి వారధిగా ఉంటూ చేస్తున్న కృషిని వివరించారు. ‘‘ఈ రోజు మనం భారతీయులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నామంటే మన దేశంలోని విభిన్న సంస్కృతులూ, సంప్రదాయాలూ కారణం. వేటికవి సొంత మార్గాలలో ప్రత్యేకమైనవి. ఫలితంగా మన జీవితంలో దుస్తులు ముఖ్యమైన అంశంగా మారాయి. మన గ్రామీణ మహిళా కళాకారుల హస్తకళ శిల్ప నైపుణ్యాన్ని చేతితో నేసిన వస్త్రాలను మరింత మెరుగుపరచడంలో మా పని కీలకంగా ఉంటుంది. చిట్ట చివరగా ఉపయోగించే చిన్న ఫ్యాబ్రిక్ పీస్తో కూడా ‘కళ’ద్వారా అందంగా డిజైన్ చేస్తాం. ఇందుకోసం నిరంతరం పరిశోధన జరుగుతూనే ఉంటుంది. అందుకే, మా బ్రాండ్‌కు ‘ది వోవెన్ ల్యాబ్’ అని పేరు పెట్టాం.జీరో వేస్ట్ పాలసీ రాజస్థాన్, గుజరాత్ భోపాల్.. ్రపాంతాల్లోని గ్రామీణ, గిరిజన మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న మా దుస్తుల డిజైన్స్ బయట షాపుల్లో లభించవు. ఎగ్జిబిషన్లు, ఆన్లైన్ ద్వారా అమ్మకం చేస్తుంటాం. మన దేశీ కాలా పత్తితో పాటు టెన్సెల్, రీసైకిల్ ఫ్యాబ్రిక్స్, పర్యావరణ అనుకూలమైన క్లాత్‌తోనే డిజైన్ చేస్తున్నాం. అరుదైన కాటన్ ఫ్యాబ్రిక్, ్రపాచీన కళా వైభవం గల మోడర్న్ డిజైనరీ డ్రెస్సులు కాబట్టే వీటి ఖర్చు ఎక్కువే. కానీ, ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతుంటాయి.మహిళా సాధికారతమా సంస్థకు ఉన్న బలమైన స్తంభాలలో ఒకటి మహిళా సాధికారత. ఇప్పటికి పాతిక మంది గ్రామీణ మహిళలు ఈ డిజైన్స్ కోసం కృషి చేస్తున్నారు. కళ పట్ల ఆసక్తి ఉన్న గ్రామీణ బాలికలను ఎంపిక చేసుకొని, శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారి ్రపాథమిక విద్య కూడా సవ్యంగా జరిగేలా చూస్తున్నాం. ఒక డ్రెస్ కొనుగోలు చేస్తే ఆ మొత్తంతో ఆ కళాకారుల ఇల్లు నెలంతా ఏ ఇబ్బంది లేకుండా గడిచి΄ోతుంది. భవిష్యత్తు తరాలు ఆ కళావైభవాన్ని సొంతం చేసుకోవాలన్నదే నా కల. చాలావరకు సేకరించే కాటన్ ఫ్యాబ్రిక్ ఐవరీ, గ్రే కలర్ వే ఎంచుకుంటాం. కొన్నింటికి మాత్రం నేచురల్ రంగులతో డైయింగ్ ప్రక్రియ ఉంటుంది. వ్యర్థాలను నివారిస్తూ, పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను వెలుగులోకి తీసుకురావాలన్నదే మా ప్రయత్నం తప్ప ఫాస్ట్ ఫ్యాషన్ ΄ోటీ పరుగులో చేరం.రాబోయే తరాలకు మన కళప్రాచీన హ్యాండ్ వర్క్స్‌ని వదిలేస్తే అవి అంతే సులువుగా మరుగున పడి΄ోతాయి. క్రాఫ్ట్స్ క్లస్టర్స్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను కాబట్టి దేశంలోని హ్యాండ్లూమ్ క్లస్టర్స్తోనూ, ఈ మార్గంలో వచ్చే అంతరాలను పూడ్చేందుకు నిఫ్ట్‌లోని వివిధ కేంద్రాలతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను.ఫ్యాబ్రిక్ సేకరణ, డిజైన్స్ సృష్టి, వ్యర్థాలు మిగలకుండా జాగ్రత్తపడటం అనేది ఓ సవాల్‌గా ఉంటుంది. కానీ, పర్యావరణ హితంగా, మనసుకు నచ్చిన పని చేస్తుండటం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈ డిజైన్స్‌ని ఇష్టపడి కొనుగోలు చేసేవారి ద్వారా ప్రాణం పెట్టే కళాకారులకు ఉపాధి ΄÷ందేలా చేయడం మరింత సంతృప్తిని ఇస్తుంది’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
IWD2023: విలేజ్‌వనిత ఘనత
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ మహిళలు రూట్ మార్చారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ వ్యవసాయేతర కార్యకలాపాల వైపు మళ్లుతున్నారు.‘మోడల్ ఎంటర్ప్రైజెస్’ వీరికి చేదోడుగా నిలుస్తున్నాయి. చిన్న చిన్న యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్న మహిళలు తాము ఆదాయాన్ని పొందుతూ కుటుంబానికి ఆసరాగా నిలవడమే కాకుండా ఇతరులకూ ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో స్టార్టప్ విలేజ్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కింద విలేజ్ ఆర్గనైజేషన్స్ (గ్రామ సంస్థలు)లో ఈ ‘మోడల్ ఎంటర్ప్రైజెస్’ ఏర్పాటవుతున్నాయి. ఒక్కో విలేజ్ ఆర్గనైజేషన్‌లో 5–8 దాకా మోడల్ ఎంటర్ప్రైజెస్ ఉంటున్నాయి. గత రెండేళ్లలో 1.70 లక్షలకు పైగా మోడల్ ఎంటర్‌ప్రెజెస్‌ను ప్రమోట్ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద కూడా గ్రామ ప్రాంతాల్లో స్టార్టప్ ప్రమోషన్, ఎంటర్ప్రైజ్ ఫైనాన్సింగ్, ధాన్యం సేకరణ, తదితరాల ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. స్వయం సహాయక బృందాల్లో (ఎస్‌హెచ్‌జీల) సభ్యులుగా ఉంటున్న మహిళలు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి వాటిని ఉపయోగించుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నారు. 2022–23లో ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్ రైతుల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాయి. కమీషన్ల రూపంలో రూ.64 కోట్ల మేర ఆదాయం పొందాయి. నాడు వ్యవసాయ కూలీ.. ♦ మంచిర్యాల జిల్లా భీమారానికి చెందిన పండ్ల శ్రీలత స్కూల్ స్థాయిలోనే చదువు మానేశారు. వ్యవసాయ కూలీగా పనిచేసిన ఆమె.. శ్రీరామ విలేజ్ ఆర్గనైజేషన్‌లోని ఝాన్సీ ఎస్‌హెచ్‌జీలో సభ్యురాలు. ప్రస్తుతం భీమారంలోనే ఆదివాసీ విస్తరాకుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదు ర్కొన్నా.. బ్యాంకులు, ఇతర రూపాల్లో అందిన రుణాలతో మోదుగ, అడ్డాకులతో పర్యావరణహిత టేబుల్ ప్లేట్లు, బఫె ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, దొప్పలు తయారీకి సంబంధించి సొంత మెషిన్లను ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలత, ఆమె భర్త, పిల్లలు ఈ యూనిట్లోనే పనిచేస్తున్నారు. మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నారు. తాము ఆదాయం పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించడంతో పాటు బ్యాంకు రుణం కూడా తీరుస్తున్నారు. బిస్కెట్ల యూనిట్‌తో భరోసా.. ♦ వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన కొడంగల్ హజీరా బేగం గతంలోనే మహబూబ్ సుభానీ ఎస్‌హెచ్‌జీలో చేరారు. తర్వా త బిస్కెట్ల తయారీ, మార్కెటింగ్ యూనిట్ వైపు మళ్లారు. బ్యాంకులు, స్త్రీనిధి, ఇతర రూపాల్లో ఆర్థిక సహకారం అందడంతో బేకరీ ఉత్పత్తులతో పాటు పలురకాల తినుబండారాలు తయారు చేస్తూ తమ వ్యాపారాన్ని విస్తరింపజేశారు. వివిధ రకాల బిస్కెట్లు, బ్రెడ్డు, బన్ను, టోస్టులు, ఎగ్, కర్రీ పఫ్‌లు విక్రయిస్తున్నారు. కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాపారంలో నిమగ్నం కావడంతో పాటు మరో ఐదుగురు పనివారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేంద్ర మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సర్టఫికెట్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టఫికెట్ పొందారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50 వేల దాకా ఆదాయం మిగులుతోంది. అవుషా ఫుడ్స్ అదుర్స్.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని వివిధ స్వయం సహాయక బృందాలకు చెందిన 18 మంది మహిళా సభ్యులు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్‌గా ఏర్పడి ఎన్ఐఆర్డీలోని రూరల్ టెక్నాలజీ పార్క్‌లో శిక్షణ అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పా టు చేశారు. తమ తమ సంఘాల నుంచి రుణ రూపేణా తీసుకున్న మొత్తంతో ఆహార భద్రత, ప్రమా ణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ పొంది అవుషా ఫుడ్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ కారంపొడి, పసుపు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కోల్డ్‌ప్రెస్డ్ నూనెలు, రాగి, జొన్న ఇతర పిండి పదార్థాలు కలిపి మొత్తం 41 వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఈ యూనిట్ నెలవారీ టర్నోవర్ రూ.3 లక్షలుగా ఉంది. గ్రూపులోని మహిళలంతా సొంతకాళ్లపై నిలబడడమే కాకుండా ఎస్‌హెచ్‌జీలకు చెందిన మరో పది మంది మహిళలకు నెలకు రూ. 4 వేల చొప్పున ఉపాధి కల్పి స్తున్నారు. ఔత్సాహిక మహిళలకు ప్రోత్సాహం రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షలకు పైగా ఎంటర్‌ప్రెజెస్ ప్రమోట్ చేశాం. వాళ్లకు రూ.75 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఫండింగ్ సపోర్ట్ కల్పించాం. బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా అందిన రుణాలను ఈ ఔత్సాహిక మహిళలు తమ తమ యూనిట్లతో పొందే ఆదాయం ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌హెచ్‌జీ బృందాల్లోని ఉత్సాహవంతులు, సొంత వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారిని బ్యాంక్‌లతో టయ్యప్ చేయిస్తాం. 2021–22లో దీనిని మొదలు పెట్టాం. ఆ ఏడాది 65 వేల దాకా ఎంటర్‌ప్రెజెస్ గ్రౌండ్ చేశాం. 2022–23లో 1.34 లక్షలు టార్గెట్‌గా పెట్టుకుని 1.10 లక్షల దాకా సాధించాం. – రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) అధికారులు -
ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్
‘సబల’... మహిళకు భరోసానిచ్చే పదం ఇది. తన మీద తనకు అనిర్వచనీయమైన నమ్మకాన్ని కలిగించే పదం. తరతరాలుగా నువ్వు ‘అబలవి, బలహీనురాలివి’ అన్నది సమాజం. ‘నువ్వు సబలవి’ అని చెప్పడమే ఓ ముందడుగు. ‘ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ మహిళ మనసును తాకే నినాదం. తరతరాలుగా మన సమాజం ‘అబలవి, బలహీనురాలివి’ అనే భావాన్ని మహిళల నరనరాన ఇంకింప చేసింది. ‘నువ్వు అబలవి కాదు, సబలవి’ అని ఎంతగా నినదించినప్పటికీ ‘అబల’ అనే భావం మెదడు నుంచి తొలగిపోయేది కాదు. ఏ మాత్రం అవాంఛనీయం కానీ ఆ భావాన్ని ‘సబల’ అనే మూడక్షరాల పదం క్షణం సేపట్లోనే తుడిచేస్తోంది. తాను సబలననే భావనే మహిళను శక్తిమంతం చేస్తుంది. నామకరణంలోనే విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషన్ రూపొందించింది. మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగే కార్యాచరణ. కమిషనే మహిళ దగ్గరకు మహిళాకమిషన్ బాధ్యతలు రాజధానిలో ఆఫీస్‌లో కూర్చుంటే పూర్తయ్యేవి కావు. కమిషన్ దగ్గరకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తే సరిపోదు. బాధిత మహిళలందరూ రాజధానిలో ఉండే కమిషన్ కార్యాలయానికి వెళ్లలేకపోవచ్చు. అందుకే ‘తామే బాధిత మహిళల దగ్గరకు వెళ్లాలి. కష్టంలో నీకు మేము తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. నీ కష్టం నుంచి బయటపడడానికి దారి ఉంది అని చెప్పాలి, ఆ దారిని చూపించాలి’ అనే ఉద్దేశంతో రాష్ట్రమంతటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మహిళాకమిషన్. నిస్సహాయ మహిళ ‘ప్రభుత్వం అనే పెద్ద వ్యవస్థ నాకు తోడుగా ఉంది. నాకేం భయం అక్కరలేదు’ అనుకున్నప్పుడే కమిషన్ తన బాధ్యతలను విజయవంతం గా నిర్వహించినట్లు... అంటున్నారు చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. చైతన్య సమావేశాలు ‘సబల’ గురించి అవగాహన కల్పించడానికి రీజియన్ల వారీగా సెమినార్లు నిర్వహిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రీజియన్‌కు గుంటూరులో, కృష్ణ, గోదావరి జిల్లాలకు ఏలూరులో సమావేశాలు జరిగాయి. రాయలసీమ జిల్లాలకు కడపలో ఈ నెల 30వ తేదీన, ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నంలో ఏప్రిల్ ఆరవ తేదీన జరగనున్నాయి. ‘‘మహిళాచైతన్యం విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నామనే చెప్పాలి. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా పని చేయాల్సి ఉంటుందని భావించాం. కానీ ప్రభుత్వ ఉద్యోగినులకు చాలామందికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలో రిపోర్ట్ చేయవచ్చనే విషయం తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత ప్రభుత్వాలు ఆ మేరకు ఉద్యోగినులను డార్క్‌లో ఉంచేశాయని తెలిసినప్పుడు ఆవేదన కూడా కలిగింది. దాంతో ఈ సమావేశాలకు ఉద్యోగినుల తరఫున ప్రతినిధులుగా జిల్లా, మండల స్థాయి ఉమెన్ అసోసియేషన్ లీడర్లను ఆహ్వానిస్తున్నాం. ఈ ఉమెన్ లీడర్లు ఆయా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ‘పోష్ యాక్ట్ (పీఓఎస్‌హెచ్) 2013, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యట్ వర్క్ ప్లేస్ 2013’ గురించి ఉద్యోగినులను చైతన్యవంతం చేస్తారు’’ అని చెప్పారామె. క్యాంపస్ కాప్స్ కాలేజీలు, యూనివర్సిటీల్లో క్యాంపస్ కాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్టూడెంట్స్ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది సబల. ఈ కాప్స్ తమ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా పరిష్కరిస్తారు. వాళ్ల స్థాయిని మించిన అంశం అయితే ఉమెన్ కమిషన్‌కు నేరుగా తెలియచేయడానికి వీలుగా ఇందుకోసమే ఒక మెయిల్ఐడీ ఉంటుంది. అలాగే ప్రతి విద్యాసంస్థలో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ జాబితాను తప్పకుండా నోటిస్ బోర్డులో ఉంచాలి. గృహ హింస– గడపదాటని శక్తి రక్షణ కల్పించాల్సిన నాలుగ్గోడలే కత్తులబోనుగా మారితే ఇక ఆ మహిళ ఏం చేయాలి? సమాజంలోని హింసలో 30 శాతం గృహహింస కేసులేనంటే నమ్ముతారా? వరకట్న నిరోధక చట్టం ఉన్నప్పటికీ నేటికీ మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు. మహిళల భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించిన కనీస అవగాహన కూడా ఆ మహిళలకు లేకుండా జాగ్రత్త పడడం ఎంత అనైతికం? మహిళను చైతన్యవంతం చేయడం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు నైతిక విధి కూడా. ‘నువ్వు అబలవి కాబట్టి మేము ఆసరా ఇస్తాం’ అని చెప్పడం లేదు. ‘నువ్వు సబలవి, నీ శక్తి తెలుసుకో’ అని చెబుతోంది. గృహహింసకు వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ఆ యోధ చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది మహిళాకమిషన్. చర్యలు కఠినంగా ఉండక తప్పదు! పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి, భవిష్యత్తులో దాడులను నియంత్రించడానికి ఏకైక మార్గం... చర్యలు కఠినంగా తీసుకోవడమే. అలాగే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడమూ అవసరమే. లైంగిక వేధింపుల విషయంలో పోక్సో చట్టం గురించి వాళ్లకు తెలియచేసే ప్రయత్నం చేస్తోంది సబల. అలాగే మహిళకు ఎదురయ్యే వేధింపుల్లో తరాలుగా ఎదురవుతున్న సమస్యలిలా ఉంటే... ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా వంచనలు తోడయ్యాయి. ఈ సైబర్ నేరాలు, ప్రలోభాల బారిన పడకుండా మహిళలను రక్షించాలంటే ఆ నేరాల పట్ల అవగాహన కల్పించడమే అసలైన మార్గం. ఈ చట్టాల మీద, భద్రత మీద చైతన్యం కలిగించే పోస్టర్లను పంచాయితీ ఆఫీస్‌లో అతికించడంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్ల సహాయంతో గ్రామీణ మహిళలకు బుక్లెట్లు పంపిణీ చేస్తోంది ‘సబల’. మహిళలు చేతిలో ఉన్న ఫోన్ ద్వారా సమాచారాన్ని చేరవేయడానికి, సమస్యను తెలియాల్సిన చోటకు చేర్చడానికి సులువుగా వాట్సాప్ నంబర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అండగా నిలుద్దాం! సబల ద్వారా ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లడమే మహిళాకమిషన్ ఉద్దేశం. అత్యాచారం, లైంగికవేధింపులు, హింసను ఎదుర్కోవడానికి మహిళకు ఆసరాగా ఉన్న చట్టాలేమిటో తెలియచేస్తోంది. బాధితుల్లో, బాధిత కుటుంబాల్లో ౖధైర్యం నింపే బాధ్యతను తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ వంటి ప్రత్యేక చట్టం గురించి కూడా అవగాహన కల్పిస్తోంది సబల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆమె’కు అండగా నిలబడుతోంది. ‘ఆమె’ తన మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో సమాజంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా ‘ఆమె’కు అండగా నిలబడాలి. – వాకా మంజులారెడ్డి బాధితుల పక్షాన... పనిప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, బాధను దిగ మింగుకునే వారెందరో!. పైగా ఫిర్యాదిచ్చిన వారినే దోషిగా చిత్రీకరిస్తూ వేధింపులకు గురిచేస్తున్న వైనాలు అనేకం. ’సబల– ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ అభాగినులకు అండగా నిలుస్తుంది. ఐసీసీ కమిటీల ఏర్పాటుతో పాటు సబల వాట్సప్ నెంబర్ ను ఉద్యోగినులకు అందుబాటులోకి తేవడం సముచితం. – జి.నిరీష, జూనియర్ అసిస్టెంట్, గుంటూరు మహిళకు మనోధైర్యం లైంగిక వేధింపులు, అవమానాలతో కుంగిపోతున్న మహిళలకు ’సబల’ కొండంత అండ. మహిళా ఉద్యోగులకు మనోధైర్యాన్ని కల్పిస్తుంది. – బి. సుశీల, చైర్ పర్సన్, ఏపీజేఏసీ అమరావతి చైతన్యవారధి ‘సబల – అఅఅ’ ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ (ట్రిపుల్ ఏ) నినాదాన్ని బలంగా వినిపిస్తున్న సబల ప్రభుత్వానికి మహిళలకు మధ్య చైతన్యవారధి. సంక్షేమంతో పాటు రక్షణ, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోన్న తరుణంలో.. ఇంటర్నల్, లోకల్ కమిటీల ఏర్పాటు ఉద్యమంగా సాగుతోంది. – జి. నిర్మలా జ్యోతి, డిప్యూటీ కమిషనర్. (రాష్ట్ర జీఎస్టీ) విజయవాడ మహిళల బలం సబల సదస్సులు అర్ధవంతమైన చర్చలకు అవకాశమిచ్చాయి. లైంగిక వేధింపులు, హింసనే కాకుండా అనేక సమస్యల సత్వర పరిష్కారానికి సబల సదస్సులు దోహదపడతాయి. చట్టాల పై అవగాహన కల్పించడం మంచిదైంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని పోష్ చట్టం సబల వేదికల ద్వారా అందరికీ తెలిసి వస్తోంది. – రాజ్యలక్ష్మి, మెంబర్, ఆలిండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, గుంటూరు ‘సబల’ పోటీలు! ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ, దిశ చట్టం గురించి స్కూళ్లు, కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. పిల్లలకు ఒక విషయాన్ని పదిసార్లు పాఠం చెప్పినట్లు చెప్పడం కంటే ఒక పోటీ ద్వారా వాళ్ల మెదడులో ఆ అంశం ఎక్కువ కాలం నిక్షిప్తమై ఉంటుంది. ఈ పోటీలు అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాదు, అబ్బాయిలకు కూడా. రాబోయే తరాలు కూడా ఇదే విషయం మీద శక్తియుక్తులను ధారపోయకుండా ఈ సమస్య ఈ తరంతో ఆగిపోవాలంటే... అమ్మాయిలను చైతన్యవంతం చేయడంతోపాటు అబ్బాయిలను సెన్సిటైజ్ చేయడం కూడా అవసరం. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళాకమిషన్, ఆంధ్రప్రదేశ్ -
World Food Day: పాలకూర, పప్పు దినుసులు, బాదం..తింటే స్త్రీలలో ఆ సమస్యలు ..
మన దేశంలో అనేకమంది స్త్రీలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారనే విషయం అందరికీ విధితమే. దీనితో తాము అనారోగ్యంగా ఉండటమేకాకుండా, పోషకాహార లోపం ఉన్న రేపటి తరానికి జన్మనిస్తున్నారు. అందువల్ల మహిళలకు వారి పోషకాలలో వాటా అందేలా చూడడం అత్యవసరం. మన దేశంలో కేవలం ఆకలిని మాత్రమే నిర్మూలిస్తే సరిపోదు, బదులుగా, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉంచడమూ అవసరమేనని పోషకాహారనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకుందాం.. పాలకూర పాలకూరలో పోషకాలను తక్కువగా అంచనా వేయకండి. ఇది రోగనిరోధక శక్తి పెరుగుదలకు, ఎముకల పుష్టికి సహాయపడుతుంది. పాలకూరను మహిళల సూపర్‌ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో మాగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మహిళల గర్భధారణ సంమయంలో అవసరమైనంతమేరకు శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. చదవండి: పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!! పప్పు దినుసులు పప్పు దినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలకు అవసరమైన ప్రొటీన్లు అందించడంలో వీటి పాత్ర కీలకం. ప్రతి రకం పప్పుల్లో దానిదైన ప్రత్యేక పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఓట్స్ రోజువారీ శక్తికి అవసరమైన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ను అందించడంలో ఓట్స్ కీలకం. వీటిల్లో ఇతర ధాన్యాల కంటే ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమే. పాలు వర్కింగ్ ఉమెన్‌కు ఎముకల్లో పటుత్వం తగ్గి, ఎముకల నిర్మాణంలో మార్పులు సంభవించే ప్రమాధం ఉంది. ఇది ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐతే పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గ్లాస్ పాలు తాగితే రోజువారీ అవసరమైన కాల్షియంను తగుమోతాదులో అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, భాస్వరం, పొటాషియం, డి, బి విటమిన్లు కూడా ఉన్నాయి. బ్రోకోలీ మహిళలకు మేలుచేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బ్రోకోలీ అత్యంత కీలకమైనది. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఎంతో సహాయపడుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నివారణలో దీని పాత్ర కీలకం. గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది. బాదం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉత్పత్తికి బాదం ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పావు కప్పు బాదంలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీనిలో మెగ్నీషియం కూడా అధికంగానే ఉంటుంది. నిపుణులు సూచిస్తున్న ఈ ఆహారాలను తీసుకుంటే మహిళల్లో పోషకాహారలోపాన్ని అరికట్టవచ్చు. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
International Day of Rural Women: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రైతమ్మలు భేష్!
వ్యవసాయం, ఆహార శుద్ధి, వినియోగం, పంపిణీకి సంబంధిత పనులతోపాటు.. కుటుంబానికి/సమాజానికి ఆహారాన్ని సమకూర్చడంలో గ్రామీణ మహిళల పాత్ర అమోఘమైనది. పంటలు/తోటల సాగు, పశుపోషణ తదితర అనుబంధ పనుల్లో మహిళా రైతులు, కార్మికులు, బాలికల శ్రమ అంతా ఇంతా కాదు. యావత్ సమాజానికి ఆహార భద్రత కల్పించడంలో వీరిది కీలకపాత్ర. పురుషుల కన్నా అధిక గంటలు చాకిరీ చేసినా వీరి శ్రమకు తగినంత గుర్తింపు దొరకడంలేదన్నది వాస్తవం. అనుదినం గుర్తుచేసుకోవాల్సిన విశేష సేవలు అందిస్తున్న గ్రామీణ మహిళలు, బాలికలకు చేదోడుగా నిలవడం కోసం అక్టోబర్ 15వ తేదీని ‘అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. పితృస్వామిక వ్యవస్థలో గ్రామీణ మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అన్యాయాలను రూపుమాపే లక్ష్యంతో ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించే పనికి స్వచ్ఛంద కార్యకర్తలు 1995లో శ్రీకారం చుట్టారు. 2007లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ దీనికి ఆమోద ముద్ర వేసింది. పర్యావరణ సంక్షోభానికి కరోనా మహమ్మారి తోడై ప్రాణాలు తోడేస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అర్థాకలితో జీవించే వారి సంఖ్య గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 20% పెరిగింది. 2021లో ‘మన కోసం ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్న గ్రామీణ మహిళల’ శ్రమకు గుర్తింపునివ్వాలని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం పిలుపునిచ్చింది. ప్రపంచ జనాభాలో మహిళలు, పిల్లల సంఖ్య 75%. తాము నివశిస్తున్న సమాజంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ వాతావరణాన్ని రూపుదిద్దటంలో తమ ఆలోచనలు, దృష్టికోణం, నైపుణ్యాలు, అనుభవాలకు మరింత న్యాయమైన పాత్ర దక్కాలని వారు ఆశిస్తున్నారు. పొలాల్లో, పెరట్లో రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు చేయటంలో ఏపీలో గ్రామీణ మహిళా రైతులు, భూమి లేని మహిళా కార్మికులు ముందంజలో ఉన్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యదాకయమైన ఆహారాన్ని అందించడానికి అహరహం శ్రమిస్తున్న గ్రామీణ మహిళా రైతులకు వందనాలు. మన ఆకలి తీర్చి జవసత్వాలనిచ్చే ప్రతి ముద్దకూ మహిళా రైతులకు అందరం కృతజ్ఞులమై ఉండాలి. తొలి ఆర్గానిక్ గ్రీన్ స్టోర్‌ను నెలకొల్పుతున్న ఎఫ్.పి.ఓ.లు సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలను పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులతో నిల్వ చేసి, రవాణా చేసి ప్రజలకు అందించే లక్ష్యంతో రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్.పి.ఓ.లు) ప.గో. జిల్లా ఏలూరు నగరం అమీనపేటలో రాష్ట్రంలోనే తొలి హరిత వెజ్జీస్ మార్టును నెలకొల్పుతున్నాయి. ‘నాబ్‌కిసాన్’ ఎం.డి.– సీఈఓ సుశీల చింతల ఈనెల 18న ప్రారంభించే ఈ ఎకోఫ్రెండ్లీ గ్రీన్ స్టోర్ ప్రత్యేకత ఏమిటంటే.. 3 స్టార్టప్ సంస్థలు రూపొందించిన పర్యావరణ హిత సాంకేతికతలను వినియోగిస్తున్నారు. రుకార్ట్ టెక్నాలజీస్ రూపొందించిన (ఏ విద్యుత్తూ అవసరం లేకుండా కొద్దిరోజుల పాటు కూరగాయలు, పండ్లను నిల్వ ఉంచే) ‘సబ్జీ కూలర్’ను, టాన్ 90 థర్మల్ సొల్యూషన్స్ వారి కోల్డ్‌స్టోరేజ్ సదుపాయాన్ని, ఎకో తేజాస్ గ్రీన్ ఫ్యూయల్ ఆల్టర్నేటివ్స్ వారి ఎలక్ట్రిక్ వెహికల్‌ను ఉపయోగిస్తున్నారు. పెదవేగికి చెందిన హరిత మిత్ర ఎఫ్.పి.సి., ఎం.నాగులపల్లి వెజిటబుల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఈ గ్రీన్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తుండటం విశేషం. చదవండి: షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం! -
భారతీయులకు కొత్త సమస్య.. కారణాలేంటి?
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సరాసరి ఎత్తు పెరుగుతున్న తరుణంలో.. భారతీయుల ఎత్తు మాత్రం తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన నివేదికలోని అంశాలపై పరిశోధకుల సమీక్షలు, కారణాల అన్వేషణ మొదలైంది. భారతీయుల సరాసరి ఎత్తు తగ్గుతోందని తెలిపింది. JNU’s Centre of Social Medicine and Community Health నిర్వహించిన సర్వేలో.. 1998 నుంచి 2015 వరకు భారతీయ వయోజనుల ఎత్తుపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1998-99లో భారతీయుల ఎత్తు కొంచెం పెరిగిందని, అయితే 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో గణనీయమైన స్థాయిలో ఎత్తు తగ్గిందని వెల్లడించింది. కారణాలపై.. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని, దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించింది. భారతీయ జనాభాలో వివిధ సమూహాల మధ్య ఎత్తు అంతరాయంపై కూడా అధ్యయనం జరగాలని చెప్పింది. జన్యుపరమైన అంశాలే కాకుండా, వాటికి సంబంధం లేని కారకాలు కూడా ఎత్తుపై ప్రభావం చూపుతున్నాయని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. జీవన విధానం, పౌష్టికాహారం, సామాజిక, ఆర్థిక తదితర అంశాలు ఉన్నాయని చెప్పింది. కాలుష్యం కూడా ఓ కారణమై ఉంటుందా? అనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు. భారత్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వయోజనుల్లో సరాసరి ఎత్తులో తేడాలు ఉన్నాయని చెప్పింది. 15 నుంచి 25 ఏజ్ గ్రూపులో ఉన్న వారిలో ఎత్తు తగ్గుతోందని తెలిపింది. ఈ ఏజ్ గ్రూపులోని మహిళల సరాసరి ఎత్తు 0.42 సెంటీమీటర్లు, పురుషుల్లో 1.10 సెంటీమీటర్ల మేర సరాసరి ఎత్తు తగ్గించదని వెల్లడించింది. ముఖ్యంగా గిరిజన మహిళల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లు స్టడీ వెల్లడించింది. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే' -
మహిళా సాధికారతకు గూగుల్ తోడ్పాటు
న్యూఢిల్లీ: బాలికలు, మహిళల సాధికారత కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు 25 మిలియన్ డాలర్ల మేర గ్రాంటు ఇవ్వనున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్డాట్ఓఆర్జీ వెల్లడించింది. లాభాపేక్ష లేకుండా నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు మొదలైనవి దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ జాక్వెలిన్ ఫుల్లర్ తెలిపారు. ఎంపికయ్యే సంస్థలకు ఒకోదానికి దాదాపు 2 మిలియన్ డాలర్ల దాకా నిధులు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌లో తాము నిర్వహిస్తున్న ఇంటర్నెట్ సాథీ డిజిటల్ అక్షరాస్యత శిక్షణా కార్యక్రమంతో గణనీయ సంఖ్యలో మహిళలు లబ్ధి పొందినట్లు జాక్వెలిన్ వివరించారు. గడిచిన కొన్నేళ్లుగా భారత్‌లో ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నవకల్పనల ఆవిష్కర్తలు, లాభాపేక్ష లేని సంస్థలకు తోడ్పాటు అందించేందుకు దాదాపు 40 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశామని ఆమె వివరించారు. ఇంటర్నెట్ సాథీ ప్రోగ్రాం అనుభవాలతో ’ఉమెన్ విల్’ పేరిట వెబ్ ప్లాట్‌ఫాంని రూపొందించినట్లు గూగుల్ ఇండియా సీనియర్ కంట్రీ మార్కెటింగ్ డైరెక్టర్ సప్నా చడ్ఢా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టైలరింగ్, బ్యూటీ సర్వీసులు, హోమ్ ట్యూషన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన హాబీలను ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకునే మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు దీని ద్వారా అందగలవని ఆమె చెప్పారు. -
గ్రామీణ మహిళలకు డిజిటల్ నైపుణ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ మహిళల ఉపాధికి అవసరమైన డిజిటల్ నైపుణ్యం కల్పించేందుకు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నడుం బిగించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో (ఎన్ఎస్డీసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా 10 నెలల్లో దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది మహిళలకు డిజిటల్ నైపుణ్యం కల్పిస్తారు. డిజిటల్ అక్షరాస్యత, ఉపాధికి అవసరమైన నైపుణ్యం పెంపు, స్వయం ఉపాధి, సమాచార నైపుణ్యం వంటి అంశాల్లో 70 గంటలకుపైగా కోర్సు కంటెంట్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కమ్యూనిటీ ట్రైనింగ్ వేదికగా ఆన్లైన్లో లైవ్ క్లాసులు నిర్వహిస్తారు. తొలిసారి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న, అలాగే కోవిడ్–19 కారణంగా ఉపాధి కోల్పోయిన గ్రామీణ యువతులు, మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఒక లక్ష మంది యువతకు డిజిటల్ నైపుణ్యం కల్పించేందుకు ఇప్పటికే ఇరు సంస్థలు చేతులు కలిపాయి. కాగా, ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా 20,000 మంది యువతులను ఎంపిక చేసి ఎస్ఎస్డీసీ ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. -
గ్రామీణ మహిళలకు సరికొత్త రుణం!
సాక్షి, పాన్‌గల్: గ్రామీణ మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)అండగా నిలుస్తోంది. సంఘాల్లోని సభ్యులందరికీ తక్కువ వడ్డీరేటుకు రుణం అందిస్తోంది. సంఘాల ఆర్థిక స్వావలంభనకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో మహిళా సంఘంలోని సభ్యులకు అందించే రుణ సదుపాయంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా పొదుపు సంఘంలో సుమారు 10మంది నుంచి 15మంది వరకు సభ్యులుగా ఉంటారు. వీందరికి తీసుకున్న రుణం, వారి చెల్లింపు ఆధారంగా నిధులను బ్యాంకర్లు మంజూరు చేస్తారు. సంఘం సభ్యులు రుణం పొందినవారు కనీసం మూడేళ్లపాటు వాయిదాలు చెల్లిస్తుంటారు. చివరి వాయిదా చెల్లించే వరకు మరో రుణం అందదు. సంఘంలోని 15మందికి ఒకేసారి ఆర్థిక అవసరాలు వస్తే మరొకరి పేరిట రుణం తీసుకుని వాయిదాలు చెల్లిస్తుంటారు. సెర్ప్ లక్ష్యాలకు ఇది విరుద్ధం. వీటిని అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. ఇందుకు హౌస్ హోల్డ్ లైవ్లీ హుడ్ ప్లాన్(హెచ్ఎల్పీ) పేరిట పథకాన్ని రూపొందించింది. దీనిపై మహిళా సంఘాల సభ్యులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. మండలంలో 7219 మంది సభ్యులు మండలంలోని 28 పంచాయతీల పరిధిలోని గ్రా మాల్లో 631 మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో మొత్తం 7219 మంది సభ్యులు ఉన్నా రు. ఆయా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యం బ్యాంకుల ద్వారా రూ.8.20కోట్లకు ఇప్పటికీ రూ.5.68కోట్ల రుణాలు అందించారు. స్త్రీనిధి ద్వారా రూ.4.06కోట్ల లక్ష్యానికి ఇప్పటికి రూ.3.28కోట్ల రుణాలు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త విధానం ద్వారా ప్రతి çసభ్యురాలికి రుణం అందనుంది. రుణ సదుపాయం ఇలా.. సంఘంలోని సభ్యులను రెండు లేదా మూడు, అంతకుమించి గ్రూపులుగా విభజిస్తారు. మొదటి సంవత్సరంలో మొదటి గ్రూప్ సభ్యులకు రూ.5లక్షల వరకు రుణం అందించి మిగతా వారికి రెండో ఏడాదిలో అప్పు సదుపాయం కల్పిస్తారు. మొదటి సంవత్సరం రుణం తీసుకున్న సభ్యులు వాయిదాలు చెల్లిస్తే మరుసటి సంవత్సరం అదే సంఘానికి పరిమితిని మించి లేదా పరిమితికి లోబడి రెండో గ్రూప్ సభ్యులకు రుణాలు ఇస్తారు. దీంతో ప్రతి సభ్యురాలికి రుణం అందుతుంది. ప్రతి సంఘంలోని ప్రధాన బాధ్యులకు కొత్తరుణ విధానం గురించి అవగాహన కల్పిస్తారు. వీరు మిగతా మహిళలకు శిక్షణ ఇస్తారు. రుణం తీసుకోవడం, అవసరాలకు వినియోగించుకోవడం, తిరిగి చెల్లించడం వంటి అంశాలను వివరిస్తారు. సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారిలకు అవగాహన కల్పిస్తారు. దీంతో ప్రతి సభ్యురాలి ఆర్థిక అవసరాలు తీరనున్నాయి. -
పశువులంటే ప్రాణం... పొద్దుగాలే లేచి
సాక్షి, డెహ్రాడూన్ : అది అల్మోరా జిల్లా ప్రభుత్వాసుపత్రి.. ప్రతీ నాలుగైదు రోజులకోకసారి తీవ్ర గాయాలతో మహిళలు ఆస్పత్రిలో చేరుతున్నారు. వారంతా చిరుతల దాడుల్లోనే గాయపడి అక్కడ చేరటం విశేషం. వీరంతా తమ పశువుల మేత కోసం అడవుల్లోకి వెళ్లిన సమయంలోనే ఇలాంటి దాడులు చోటుచేసుకోవటం విశేషం. పది రోజుల క్రితం ఆల్మోరా జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిల్ఖా గ్రామానికి చెందిన పూజా దేవి పశువుల కోసం గడ్డి తెచ్చేందుకు సమీపంలోని అడవికి వెళ్లింది. అక్కడ ఓ చిరుతపులి ఆమెపై దాడి చేయగా.. అక్కడే ఉన్న ఉమా దేవి ఆమెను రక్షించే క్రమంలో గాయపడింది. వారి కేకలు విన్న చుట్టు పక్కల స్థానికులు పరిగెత్తుకుంటూ వెళ్లి చిరుతను తరిమారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడినప్పటికీ.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఇది తమకు చాలా ఏళ్లుగా అలవాటైపోయిందని ఉమా దేవి చెబుతున్నారు. మాకు పశువులంటే ప్రాణం. అవే మాకు జీవనాధారం. గడ్డి లేకపోతే అవి ఎలా బతుకుతాయి. అందుకే అడవికి వెళ్లక తప్పటం లేదు అని ఆమె చెప్పారు. కొండ ప్రాంతంలో జీవనాధరం లేకపోతే చాలా కష్టం. గిరిజనులు.. పైగా నిరక్షరాస్యులు. వేరే పని లేకపోవటంతో అక్కడ చాలా మట్టుకు పశు సంరక్షణ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వారి కుటుంబాలకు తిండి పెట్టే మూగ జీవాల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు అని జోయ్ హల్కే అనే మహిళా షూటర్ చెబుతున్నారు. సమస్య దశాబ్దం పైదే ... ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా 600 మంద చిరుతల బారిన పడి చనిపోగా, 3100 మంది గాయపడ్డారు. అంటే సగటున ఏడాదికి 35 మంది చిరుత పంజాకు బలవుతున్నారన్న మాట. వీరిలో 30 శాతం మంది పురుషులు, 20 శాతం మంది పిల్లలు, ఇక మిగిలిన 50 శాతం మహిళలే కావటం గమనార్హం. ఆల్మోరా, పౌరీ జిల్లాల్లో ఈ దాడులు ఏటా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటిదాకా 150 చిరుతలను మ్యాన్ ఈటర్లుగా గుర్తించి వాటిలో 40ని మట్టుపెట్టగలిగారు. మరో 40 చిరుతలను బంధించగలిగారు. గ్రామస్థులను అడవుల్లోకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నయ మార్గాలు లేకపోవటంతో వాళ్లు వాళ్ల జీవితాలను పణంగా పెడుతున్నారని దిగ్విజయ్ సింగ్ ఖటి అనే అటవీ అధికారి చెబుతున్నారు. -
సమాజం పట్ల చైతన్యం రావాలి
హన్మకొండ అర్బన్ : ప్రస్తుతం మహిళల్లో అక్ష్యరాస్యత శాతం పెరిగింది. చదువు, ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అయితే కేవలం చదువు, సంపాదన మాత్రమే కాకుండా సమాజంపై చైతన్యం అవసరం. తద్వారా మహిళల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అప్రమత్తంగా ఉండటంతో పాటు తోటి మహిళా లోకాన్ని చైతన్య పరిచేస్థాయిని గ్రామీణ మహిళలు ఎదగాల్సి ఉంది. ప్రభుత్వ పథకాలు, చట్టాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే స్థాయిలో చైతన్యం రావాలి. పరిస్థితులకు అనుగుణంగా మహిళలు స్వయం నిర్ణయాధికారం తీసుకుంటే విజయం సొంతమవుతుంది. – అమ్రపాలి కాట, కలెక్టర్, వరంగల్ అర్బన్ జిల్లా -
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగమంటూ.. మహిళాలోకం నినదిస్తోంది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ఇపుడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అటు సమాజాభివృద్ధికి పాటుపడుతూ.. ఇటు కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీ తదితర అత్యున్నత పదవులను అలంకరించిన నారీమణులు జిల్లా అభివృద్ధిలో తమ ముద్ర వేస్తున్నారు. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాలతో పాటు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లోనూ ఇంతులంతా ఇంతింతై...అన్న చందంగా ఎదుగుతున్నారు. సాగు సలహాల్లోనూ మగువే తడ్కల్, న్యూస్‌లైన్: దేశాభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తోన్న వ్యవసాయంలోనూ మగువలే ముందున్నారు. గ్రామీణ మహిళలు పురుషులతో పోటీ పడి వ్యవసాయ పనులు చేస్తుండగా, వ్యవసాయాధికారులుగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఆధునిక వ్యవసాయం గురించి రైతులకు వివరిస్తూ సాగుకు సాయం చేస్తున్నారు. పంటలకు సోకే చీడ, పీడల బాధ నుంచి రైతులకు విముక్తులను చేస్తున్నారు. రైతులతో పాటు ధీటుగా వ్యవసాయ క్షేత్రాల్లో అలుపు లేకుండా తిరుగుతూ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖలో కల్హేర్ ఏఓగా అరుణ, పెద్దశంకరంపేట ఏఓగా రత్న, కల్హేర్, కంగ్టి, మనూర్ వ్యవసాయ విస్తరణ అధికారులుగా స్వాతి, శ్రీదేవి, గీతలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు రైతుల పొలాలను సందర్శించడానికి తరచుగా ైరె తు శిక్షణ కేంద్రం నుంచి ఏడీఏ రమాదేవి, ఏఓ మీనా వ్యవసాయంలో మేముసైతం... అంటూ సేవలు అందిస్తున్నారు. ఖేడ్ వ్యవసాయ కార్యాలయంలో సహాయకురాలిగా సైతం సరిత అనే మహిళ విధులు నిర్వర్తిస్తున్నారు. వీటన్నింటికీ మించి జిల్లా వ్యవసాయాధికారిగా ఉన్న ఉమామహేశ్వరి రైతులకు విలువైన సూచనలు, సలహాలు చేస్తూ సాగుకు సాయం చేస్తున్నారు. ఆ ఇద్దరూ రథ సారథులై.. కలెక్టర్, ఎస్పీల సమర్థ పాలన జిల్లా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఆ ఇద్దరూ రథసారథులై నడిపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ మహిళే కావడం విశేషం. కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ జిల్లా పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తుండగా, ఇటీవల జిల్లాకు వచ్చిన జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ శాంతిభద్రతల పరిరక్షణలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం,ఆరోగ్యం, మహిళా సంక్షేమం, వ్యవసాయం, పారిశుధ్యం తదితర అంశాలపై కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక దృష్టి సారించారు. అంతేగాక వైద్యం విషయంలో ‘మార్పు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు సైతం విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ జిల్లా కలెక్టర్‌కే దక్కింది. ఈ కార్యక్రమం అమలు కోసం సామాజిక భద్రత నిధి నుంచి ప్రతి విద్యార్థికి రూ.6 రూపాయలు కేటాయించారు. అలాగే జిల్లా ఎస్పీగా శెముషీ బాజ్‌పాయ్ నేతృత్వంలో జిల్లాలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆమె ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల పరిరక్షణ గురించి తెలుసుకున్నారు. డివిజన్ల వారీగా సంబంధిత పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వీరిద్దరూ ఉత్తమ సేవలందిస్తూ జిల్లాలోని మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు. స్వశక్తితో ఎదగాలి మహిళా దినోత్సవ సభలో కలెక్టర్ కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్వశక్తిపై ఆధారపడి సమాజంలో గౌరవనీయమైన స్థానానికి చేరుకోవాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ మహిళా ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీఎన్జీఓల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దశాబ్దం క్రితం నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. బాలికలపై గతంలో మాదిరిగా వివక్షలేద న్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించడంలో మహిళలే ముందున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రత్యేక కృషి చేస్తున్నట్టు తెలిపారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మనోహర పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు.