సాక్షి, విజయవాడ: బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. సెక్షన్ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలికను లైంగికంగా వేధించిన వినోద్‌జైన్.. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు.
రూ. 3 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం.. బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు.
స్పెషల్ పీపీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘‘లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్‌లో బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురి చేశారు. ఎవరికి చెప్పలేని విధంగా బాలికను లైంగికంగా వేధించారు. సూసైడ్ నోట్‌లో వినోద్ జైన్ వేధింపులను బాలిక స్పష్టంగా రాసింది. రెండు పేజీల లేఖలో నిందితుడి అకృత్యాలను వెల్లడించింది. బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారు.’’ అని పేర్కొన్నారు.
చదవండి: 2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను
‘‘2021 ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్‌గా వినోద్ జైన్ పోటీ చేసి ఓడిపోయారు.సమాజంలో పెద్ద మనిషిగా తిరుగుతూ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.పోలీసులు కేసును ఛాలా సిరియస్ గా తీసుకున్నారు.సైన్టిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడికి శిక్ష పడింది’’ అని నాగిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment