అంబానీ రిలయన్స్ కంపెనీ ఎదగటానికి కారకులైన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి 'మనోజ్ మోడీ'. ఈయన మాత్రమే కాకుండా సంస్థ ఎదుగుదలకు పాటుపడిన వ్యక్తి, ముకేశ్ అంబానీ స్నేహితుడు ఒకరు ఉన్నారు. ఆయనే 'ఆనంద్ జైన్'. ధీరూభాయ్ అంబానీ మూడవ కొడుకుగా పిలువబడే ఆనంద్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
1975లో జన్మించిన ఆనంద్ జైన్.. జై కార్ప్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్‌లలో మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఈయనను అందరూ ముద్దుగా ఏజే అని పిలుచుకుంటారు. ఆనంద్ జైన్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో విడదీయరాని అనుబంధం ఉంది. వీరిరువురు చిన్నపాటి ఫ్రెండ్స్ కావడం గమనార్హం. ముంబైలోని హిల్ గ్రాంజ్ హైస్కూల్‌లో వీరు కలిసి చదువుకున్నారు.
నిజానికి ఆనంద్ జైన్ ఒకప్పటి బిలినీయర్. 2007లో ఈయన 4 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో 11వ సంపన్న భారతీయుడిగా ఉన్నారు. 2023 మార్చి నాటికి జైన్ ఆదాయం రూ. 600.7 కోట్లు. ఈయన కంపెనీ సుమారు 13 ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జిస్తోంది.
ఇదీ చదవండి: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
జైన్ ముఖేష్ అంబానీకి వ్యూహాత్మక సలహాదారుగా.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో, ప్రధాన క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అతను ముంబై పోర్ట్ ట్రస్ట్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టీల బోర్డులో కూడా పనిచేశారు.
ఆనంద్ జైన్ ముంబై యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు. ఈయన భార్య సుష్మ. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 కో-ఫౌండర్ 'హర్ష్ జైన్'. ఆనంద్ జైన్ మంచి స్నేహితుడిగా, వ్యాపారవేత్తగా అన్ని రంగాల్లోనూ రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment