
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఈరోజు (మంగళవారం) పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఆదినాథుని నిర్వాణ లడ్డూ పండుగ సందర్భంగా మానస్తంభ్ కాంప్లెక్స్‌లో నిర్మించిన చెక్క నిర్మాణం కూలిపోయింది. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన గురించి బాగ్‌పత్ పోలీసు అధికారి అస్మితా లాల్ మాట్లాడుతూ ‘బరౌట్‌లో జైన సమాజ ఉత్సవం జరుగుతుండగా, ఒక చెక్క నిర్మాణం కూలిపోయింది. ఫలితంగా 40 మంది గాయపడ్డారు. చికిత్స తర్వాత 20 మందిని వారి ఇళ్లకు పంపించారు. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడుగురు మృతి చెందారు’ అని తెలిపారు.

ఈ ప్రమాదం మంగళవారం ఉదయం బరౌత్‌లోని గాంధీ రోడ్డులో జరిగింది. ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పోలీసులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే డిఎం అస్మితా లాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గియా ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.
#बागपत l भगवान आदिनाथ के निर्वाण लड्डू पर्व पर मान स्तम्भ परिसर में बना लकड़ी से बना पैड ढह गया। इसमें सात श्रद्धालुओं की मौत की खबर है। जबकि 75 से अधिक घायल हैं। मृतकों की संख्या में इजाफा हो सकता है। #baghpat #upnews pic.twitter.com/0BHLOjFYdE
— Sudhir Chauhan (@sudhirstar) January 28, 2025
బాగ్‌పత్‌లో జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుసుకున్నారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే
Comments
Please login to add a commentAdd a comment