కోవిడ్ లాక్‌డౌన్ ప్రపంచాన్ని స్తంభింప చేసింది. కానీ కోవిడ్ కాలం కొందరికి కెరీర్ బాటను వేసింది. ఆ బాటలో నడిచిన ఓ సక్సెస్‌ఫుల్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ముస్కాన్ జైన్. ఇంట్లో టైమ్‌పాస్ కోసం చేసిన డోనట్ ప్రయత్నం ఆమెను డోనటేరియా ఓనర్‌ని చేసింది. ముస్కాన్ జైన్ ఎంబీఏ చేసింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో యూట్యూబ్‌లో చూసినవన్నీ వండడం మొదలు పెట్టింది ముస్కాన్.
ఆమె అప్పటికే యూ ట్యూబ్ స్టార్. ఆమె డాన్స్ కొరియోగ్రఫీ చానెల్‌కు యాభై వేలకు పైగా సబ్‌స్క్రైబర్‌లున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వంటగదిలో అడుగుపెట్టిన ముస్కాన్ చేసిన డోనట్స్ ఇంట్లో అందరికీ నచ్చాయి. ఇదే నీకు సరైన కెరీర్ అని ప్రోత్సహించారు. కానీ ముస్కాన్ వెంటనే మొదలు పెట్టలేదు. ‘ఇంట్లో వాళ్లు అభిమానం కొద్దీ ప్రశంసల్లో ముంచేస్తున్నారు. అది చూసి బిజినెస్ ప్రారంభిస్తే కష్టం అనుకున్నాను.
కొన్నాళ్లకు ఒకామె ‘‘ఇప్పుడు కూడా డోనట్స్ చేస్తున్నారా, ఆర్డర్ మీద చేసిస్తారా’’ అని అడిగింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అలా 2023లో ‘డోనటేరియా’ స్టార్టప్‌ను ప్రారంభించాను. తక్కువ పెట్టుబడితో ఇంటి కిచెన్‌లోనే మొదలు పెట్టాను. డోనట్‌ని పరిచయం చేయడానికి బేకరీలు, స్టాల్స్‌కి మొదట ఫ్రీ సాంపుల్స్ ఇచ్చాను’’ అంటూ తన స్టార్టప్ తొలినాళ్ల కష్టాలను వివరించారు ముస్కాన్.
ముస్కాన్ జైన్‌ను సూరత్‌తోపాటే ప్రపంచం కూడా గుర్తించింది. అందుకు కారణం సోషల్ మీడియా. ‘‘నా ప్రతి ప్రయత్నాన్నీ ఇన్‌స్టాలో షేర్ చేసేదాన్ని. డోనట్‌ల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతిదీ షేర్ చేయసాగాను. ఇన్‌స్టా ద్వారా కూడా ఆర్డర్‌లు రాసాగాయి. ఇప్పుడు రోజుకు మూడు వందల ఆర్డర్‌లు వస్తున్నాయి’’ అని సంతోషంగా చెప్పారు ముస్కాన్.
ఆమె డోనట్ తయారీ గురించి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు యూఎస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వాళ్లకు కూడా ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. తన డోనటేరియాను జాతీయస్థాయి బ్రాండ్‌గా విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
(చదవండి: ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!)
Comments
Please login to add a commentAdd a comment