Bakery
-
డోకొచ్చేలా.. కేకులు
సాక్షి, సిటీబ్యూరో: ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఎక్కడ తనిఖీలు చేసినా కల్తీ, అపరిశుభ్రత, బొద్దింకలు, ఎలుకల సంచారం, ఇతరత్రా పలు అవాంఛనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. హోటళ్లు, స్వీట్ షాపులు, చికెన్ మార్కెట్లతో పాటు ఆఖరికి కేకుల దుకాణాల్లోనూ డోకొచ్చే పరిస్థితులే కనిపించాయి. సికింద్రాబాద్ జోన్‌లోని అల్వాల్, కార్ఖానా ప్రాంతాల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో లోపాలు బయల్పడ్డాయి. అల్వాల్‌లోని మచ్చ»ొల్లారం మాంగినీస్ కేక్ షాప్‌లో కేకుల తయారీ ప్రాంతాల్లో గుంపుగా సంచరిస్తున్న బొద్దింకలు, స్టోరేజీ ప్రాంతాల్లో ఎలుకల పెంటికలు దర్శనమిచ్చాయి. కేకుల తయారీకి వినియోగించే పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నాయి. కోల్డ్ రూమ్‌లోని ఏసీ లీకేజీతో గదిలోని ట్రేలలో ఉన్న ఆహార పదార్థాలు కలుషి తమయ్యే పరిస్థితులు కనిపించాయి. కేసర్ సిరప్, పైనాపిల్, వెనీలా ఫ్లేవర్లు, ఇతరత్రా పదార్థాలు గడువు ముగిసిపోవడం గుర్తించారు. పలు ఆహార పదార్థాలు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో అపరిశుభ్రంగా కనిపించాయి. రవాణాకు వినియోగించే ఏడు చిల్లర్ వాహనాలకు లైసెన్సుల్లేవు. ఇక సిబ్బంది ఆరోగ్య పరీక్షల వివరాలు, శిక్షణ పొందిన సరి్టఫికెట్లు లేవు. కార్ఖానాలోని వాక్స్ పేస్ట్రీస్ (బేకరీ)లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. సిబ్బంది వైద్య పరీక్షల రిపోర్డుల్లేవు. కేకుల తయారీలో ఆల్కహాల్.. ఎక్సైజ్ అనుమతి లేకుండా ప్లమ్ కేక్ తయారీలో ఆల్కహాల్ (రమ్) వినియోగిస్తుండటం కనిపించింది. కేకుల డబ్బాలపైనా ఆల్కహాల్ వినియోగించినట్లు వివరాల్లేవు. వంట పాత్రలు అధ్వానంగా ఉన్నాయి. కేకుల తయారీలో వినియోగించేందుకు భారీ మొత్తంలో తయారు చేసిన డ్రైఫ్రూట్స్, జామ్ మిక్స్‌ల పల్ప్‌ను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేశారు. దీన్ని ఆర్నెల్ల వరకు వినియోగించవచ్చని నిర్వాహకులు చెప్పినప్పటికీ ఎప్పుడు తయారు చేసింది, ఎప్పటిలోగా వినియోగించవచ్చో వివరాల్లేవు. బేకరీలో తయారు చేసిన ప్లమ్కేక్స్, బిస్కెట్లు, బ్రెడ్, తదితర ఆహార పదార్థాల ప్యాకెట్ల లేబుల్స్‌పై ప్రదర్శించాల్సిన సమాచారం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు, తయారీ కేంద్రం చిరునామా, వెజ్/నాన్‌వెజ్ లోగో వంటివి లేవు. తయారీలో వినియోగించిన పదార్థాలు, వాటి పోషక విలువలు, బ్యాచ్‌నెంబర్ వంటి వివరాల్లేవు. ఆహార పదార్థాలు, కెమికల్స్ వంటి పదార్థాలు, సగం వండిన వెజ్, నాన్‌వెజ్ పదార్థాలు కలగలిపి నిల్వ చేశారు. ఫ్రిజ్‌లలోని కొన్ని పదార్థాలకు మూతలు లేవు, లేబుల్స్ లేవు. తగిన టెంపరేచర్‌తో నిర్వహించడం లేదు. ఇలా పలు లొసుగులు బయటపడ్డాయి. శుక్రవారం తనిఖీలు నిర్వహించిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఈ వివరాల్ని శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడి -
సోషల్ మీడియా గెలిపించింది..!
కోవిడ్ లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింప చేసింది. కానీ కోవిడ్ కాలం కొందరికి కెరీర్ బాటను వేసింది. ఆ బాటలో నడిచిన ఓ సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ముస్కాన్ జైన్. ఇంట్లో టైమ్‌పాస్ కోసం చేసిన డోనట్ ప్రయత్నం ఆమెను డోనటేరియా ఓనర్ని చేసింది. ముస్కాన్ జైన్ ఎంబీఏ చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో యూట్యూబ్‌లో చూసినవన్నీ వండడం మొదలు పెట్టింది ముస్కాన్. ఆమె అప్పటికే యూ ట్యూబ్ స్టార్. ఆమె డాన్స్ కొరియోగ్రఫీ చానెల్‌కు యాభై వేలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వంటగదిలో అడుగుపెట్టిన ముస్కాన్ చేసిన డోనట్స్ ఇంట్లో అందరికీ నచ్చాయి. ఇదే నీకు సరైన కెరీర్ అని ప్రోత్సహించారు. కానీ ముస్కాన్ వెంటనే మొదలు పెట్టలేదు. ‘ఇంట్లో వాళ్లు అభిమానం కొద్దీ ప్రశంసల్లో ముంచేస్తున్నారు. అది చూసి బిజినెస్ ప్రారంభిస్తే కష్టం అనుకున్నాను. కొన్నాళ్లకు ఒకామె ‘‘ఇప్పుడు కూడా డోనట్స్ చేస్తున్నారా, ఆర్డర్ మీద చేసిస్తారా’’ అని అడిగింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అలా 2023లో ‘డోనటేరియా’ స్టార్టప్‌ను ప్రారంభించాను. తక్కువ పెట్టుబడితో ఇంటి కిచెన్లోనే మొదలు పెట్టాను. డోనట్‌ని పరిచయం చేయడానికి బేకరీలు, స్టాల్స్‌కి మొదట ఫ్రీ సాంపుల్స్ ఇచ్చాను’’ అంటూ తన స్టార్టప్ తొలినాళ్ల కష్టాలను వివరించారు ముస్కాన్.ముస్కాన్ జైన్‌ను సూరత్తోపాటే ప్రపంచం కూడా గుర్తించింది. అందుకు కారణం సోషల్ మీడియా. ‘‘నా ప్రతి ప్రయత్నాన్నీ ఇన్‌స్టాలో షేర్ చేసేదాన్ని. డోనట్ల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతిదీ షేర్ చేయసాగాను. ఇన్‌స్టా ద్వారా కూడా ఆర్డర్లు రాసాగాయి. ఇప్పుడు రోజుకు మూడు వందల ఆర్డర్లు వస్తున్నాయి’’ అని సంతోషంగా చెప్పారు ముస్కాన్. ఆమె డోనట్ తయారీ గురించి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు యూఎస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వాళ్లకు కూడా ఆన్లైన్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. తన డోనటేరియాను జాతీయస్థాయి బ్రాండ్‌గా విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. (చదవండి: ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!) -
ఏం ట్విస్ట్..?: కన్నతల్లి పక్కనే ఉన్నా..! పాపం ఆ కొడుకు..
కొన్ని కథల్లో భలే గమ్మత్తైన ట్విస్ట్ ఉంటుంది. ఊహకే అతీతంగా ఉంటుంది. తీరా అసలు విషయం తెలిశాక అబ్బా.. పక్కపక్కనే ఉంటూ గుర్తించలేకపోయామా..! అనిపిస్తుంది. అలాంటి విచిత్రమైన పరిస్థితే.. ఓ తల్లి కొడుకులకు ఎదురయ్యింది. ఇద్దరూ ఎదురుపడుతున్నా..ఒకరికి.. ఒకరూ.. ఏమవుతారో తెలియని స్థితి. ఏ విధి అయితే ఆ తల్లి బిడ్డలు వేరయ్యేలా చేసిందే.. అదే మళ్లీ అత్యంత విచిత్రంగా.. సరైన సమయంలో వారిని కలిపింది. ఆ తల్లికి స్వాంతన కల్పించింది. ఇంతకీ వారిద్దరి మధ్య విధి ఆడిన గమత్తైన కథ ఏంటంటే..అమెరికాలోని చికాగోకి చెందిన 50 ఏళ్ల వామర్ హంటర్ తన ఇంటి సమీపంలో ఉండే 'గివ్ మీ సమ్ సుగా' అనే బేకరీ వద్దకు తరుచుగా వెళ్తుండేవాడు. అది ఆయనకు ఎంతో ఇష్టమైన బేకరీ. కానీ సరదాకి కూడా హంటర్ ఈ బేకరీ తనదవుతుందని, త్వరలో తానే నడుపనున్నానని ఎప్పుడూ ఊహించలేదు హంటర్. ఇక హంటర్‌కి చిన్నతనం నుంచి ఇంట్లోని వాళ్లు తనవాళ్లు కారనే ఫీలింగ్ మనసులో బలంగా ఉంటుండేది. అయితే తనకు 35 ఏళ్ల వయసు వచ్చినప్పుడే.. తనని దత్తత తీసుకున్నారని, వాళ్లంతా తన కుటుంబసభ్యులు కారని తెలుసుకుంటాడు. ఇక అప్పటి నుంచి తన కన్నతల్లి గురించి అన్వేషించడం ప్రారంభించాడు. ఈ విషయంలో కాలిఫోర్నియాకు చెందిన జన్యు శాస్త్రవేత్త గాబ్రియెల్లా వర్గాస్ హంటర్‌కి సహాయం చేశారు. అతడి కన్నతల్లి 'గివ్ మీ సమ్ సుగా' బేకరీ యజమాని 67 ఏళ్ల లెనోర్ లిండ్సే అని కనిపెట్టడమే గాక ఆమెకు హంటర్ వివరాలు తోసహా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సరిగ్గా ఆ సమయంలో లిండ్సే బ్రెస్ట్ కేన్సర్‌కి చికిత్స తీసుకుంటోంది. చెప్పాలంటే కీమోథెరపీ చేయించుకోవడానికి సిద్ధమవుతోంది. తన పరిస్థితి ఎలా ఉన్నా లెక్కచేయక..వెంటనే ఆ జన్యు శాస్త్రవేత్త ఇచ్చిన ఫోన్నెంబర్కి కాల్ చేసి హంటర్‌తో మాట్లాడుతుంది. అయితే ఆ ఫోన్లో తాను తరచుగా విన్న.. కస్టమర్ గొంతులా ఉండటంతో ఆశ్యర్యపోతుంది. ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నాక..లిండ్సే హంటర్ తన కొడుకేనని నిర్ధారించుకుని.. తనను ఎందుకు దత్తతకు ఇవ్వాల్సి వచ్చిందో హంటర్‌కి విరిస్తుంది. నిజానికి 1974లో హంటర్‌కి జన్మనిచ్చే సమయానికి లిండ్సేకి 17 ఏళ్లు. కుటుంబం తీవ్ర దారిద్య బాధల్లో కొట్టుమిట్టాడటంతో గత్యంతర లేక హంటర్ని దత్తతకు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్నాళ్లు పక్కపక్కనే ఉండి..అదికూడా తన తరుచుగా వెళ్లే బేకరీ.. యజమానే తన తల్లి అని తెలుసుకుని హంటర్ ఆనందానికి అవధులు లేవనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ తల్లి కొడుకులిద్దరూ కలిసి ఆ బేకరిని నడుపుతున్నారు. పరిస్థితులు ఆ తల్లి కొడుకులిని వేరే చేస్తే..విధి ఇద్దరిని పక్కపక్కనే ఉంచి.. సరైన సమయానికి చిత్రంగా కలిపింది కదూ..!. ఒకరకంగా ఆ తల్లికి ఈ వయసులో కొడుకు ఆసరా ఎంతో అవసరం కూడా.(చదవండి: మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో..డిజిటల్ స్టార్‌గా ఫోర్బ్స్‌లో చోటు!) -
బాలల దినోత్సవం: నెహ్రూ హైదరాబాద్‌లో ఎక్కడ అల్పాహారం తినేవారో తెలుసా..!
మన భాగ్యనగరం, హైదరాబాద్ అనగానే బిర్యానీ, కేఫ్‌లు, వివిధ కమ్మని వంటకాలు ఒక్కసారిగా గుర్తొస్తాయి. అలాంటి హైదరాబాద్‌లో భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఓ బేకరీలోని బ్రేక్‌ఫాస్ట్‌ని ఇష్టంగా తినేవారట. ఆయన మెనూలో తప్పనిసరిగా ఆ బేకరీ అల్పాహారం ఉంటుందట. బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ నెహ్రూ ఇష్టపడే హైదరాబాద్ బేకరీ, దాని విశేషాలు గురించి చూద్దామా..!మన భారత మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) గారి జన్మదినం రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లలంటే నెహ్రూ గారికి ఎంతో ఇష్టం. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు అని బలంగా విశ్వసించేవారు. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకంగా పిల్లల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. పిల్లల అభివృద్ధికి వారి సంక్షేమానికి ఎంతో కృషి చేయడంతో ఆయన పుట్టిన రోజు అయిన నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన మన భాగ్యనగరంలో మెచ్చిన బేకరీ, దాని కథాకమామీషు ఏంటో చూద్దాం.హైదరాబాద్ బిర్యానీ, హలీమ్‌ల తోపాటు ఉస్మానియా బిస్కెట్లుకు ఫేమస్. ఇక్కడ లాబొనెల్ బేకరీ, కరాచీ బేకరీ వంటి అనేక రకాల బేకరీలు కూడా ప్రసిద్ధిగాంచినవే. వాటిలో మన జవహర్లాల్ నెహ్రూ అల్పాహారంలో భాగమైన బేకరీ బ్రెడ్ ఒకటి ఉంది. అదే సుభాన్ బేకరీ. దీన్ని 1948లో సయ్యద్ ఖాదర్ స్థాపించారు. ఇది ఐకానిక్ బేకరీ దమ్ కే రోట్, ఖరీస్, క్లాసిక్ ఉస్మానియా బిస్కెట్లకు పేరుగాంచింది.ఈ సయ్యద్ బేకరీ ప్రారంభించడానికి ముందు సికింద్రాబాద్‌లో బ్రిటిష్ రెజిమెంట్‌కు బ్రెడ్ సరఫరా చేసే బేకరీలో పనిచేశాడు. ఆ తర్వాత చిన్న గ్యారేజీలో బ్రెడ్ అమ్ముతూ హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌కు వెళ్లాడు. అతడి బ్రెడ్ తయారీలోని నాణ్యతకు విపరీతమైన ప్రజాదరణ రావడంతో ఖాదర్ వ్యాపారం బాగా పెరిగింది. అలా నాంపల్లిలో బేకరీని స్థాపించే స్థాయికి చేరుకున్నాడు. ఆ బేకరీకి తన కొడుకు సుభాన్ పేరు పెట్టాడు. అలా క్రమంగా ఈ సుభాన్ బేకరీ హైదరాబాద్‌లోనే నెంబర్ వన్ బేకరీగా మంచి పేరుతెచ్చుకుంది. ఔ1950వ దశకంలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సుభాన్ బేకరీలోని రొట్టెల రుచికి ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఈ బ్రెడ్‌ని తన అల్పాహారంలో భాగంగా చేసుకుని ఆస్వాదించడం ప్రారంభించారు నెహ్రూ. ముఖ్యంగా మన హైదరాబాద్‌కు వస్తే తన రోజువారీ అల్పాహారంలో భాగంగా ఆ బేకరీ బ్రెడ్‌ని తీసుకురావాలని పట్టుబట్టేవారని సమాచారం. దీంతో సుభాన్ బేకరీ మరింత పేరురావడమే గాక నగరంలోని నవాబులు, ఇతర ప్రముఖులు, సెలబ్రిటీలు కస్టమర్ల అవ్వడం మొదలైంది. అయితే 1960లలో విపరీతమైన పోటీ పెరగడంతో పెద్ద బేకరీలు మార్కెట్లోకి ప్రవేశించడంతో సుభాన్ బేకరీకి పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ఖాదర్ వారుసులు దీన్ని మరింత మెరుగపరిచి విభిన్నమైన రుచులతో కూడిన ఆహారపదార్థాలను అందిస్తూ ఆహార ప్రియుల మన్ననలను అందుకుంటున్నారు.(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..) -
Cancer Disease: తీయని కేక్ తింటే తంటా
సాక్షి, బెంగళూరు: కేక్ అనగానే అందరికీ నోరూరుతుంది. ఏ శుభ సందర్భం వచ్చినా కేక్ ముక్కలు కావాల్సిందే. అంతగా కేక్ జీవితంలో భాగమైపోయింది. అయితే నాణేనికి మరోవైపు ఇంకోలా ఉంది. కేక్‌ల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారక అంశాలు ఉన్నట్లు రాష్ట్ర ఆహార భద్రత, నాణ్యత శాఖ తెలిపింది. కొన్ని రోజుల క్రితమే గోబీ మంచరియా, కబాబ్, పానిపూరీ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఈ శాఖ హెచ్చరించడం తెలిసిందే. ఇప్పుడు కేక్‌ల గురించి ప్రకటన చేసింది. 12 రకాల కేక్‌లలో ముప్పు బెంగళూరులోని కొన్ని బేకరీలలో కేక్‌లను పరీక్షించగా 12 రకాల కేక్‌లల్లో క్యాన్సర్‌ను కలిగించే కారకాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. వాటిలో వాడే రంగులు ప్రమాదకరమని తెలిపింది. కేక్‌ల తయారీలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించాలని బేకరీలకు ఆ సంబంధిత శాఖ హెచ్చరించింది. క్యాన్సరే కాకుండా శారీకర, మానసిక అనారోగ్యాలకూ కారణమవుతాయని తేల్చారు. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్‌లో ఎక్కువ ఈ సమాచారంతో కేక్ ప్రియుల్లో కలవరం ఏర్పడింది. అందరూ కూడా ఎప్పుడో ఒకసారి కేక్‌ను తినేవారే. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ సహా అనేక కేకులు ఆకర్షణీయంగా ఉండేలా పలు రంగులను కలుపుతారు. ఈ కృత్రిమ రంగుల వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ కృత్రిమ రంగులను వాడకూడదని, ఆరోగ్య సూత్రాలను పాటించాలని పలుమార్లు దుకాణ యజమానులను హెచ్చరించినా వాటిని బేఖాతరు చేస్తున్నారని ఆహార భద్రత అధికారులు తెలిపారు. చాలా కేకుల్లో క్యాన్సర్ కారకాలను అధికారులు గుర్తించారు. ప్రధానంగా రెడ్వెల్వెట్ , బ్లాక్‌ఫారెస్ట్ కేకుల్లో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి ప్రతి నెలా ఆహార పదార్థాలను పరీక్షలకు పంపించి నివేదికలు తీసుకుంటాం. హోటల్, బేకరీలల్లో నుంచి శాంపుల్స్‌ను సేకరించి తనిఖీలు చేస్తాం. ఆహారం నాణ్యతగా ఉండాలి. ఒకవేళ నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు చెప్పారు.ఏయే ప్రమాదకర రంగులు, వాటి పర్యవసానాలుఅలూర రెడ్– అలర్జీ, ఆస్తమా, జీర్ణక్రియ సమస్యలు, తలనొప్పి సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సీఎఫ్– అలర్జీ, హైపర్ యాక్టివిటీ, క్రోమోజోమ్ డ్యామేజీ, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి పొనుయా 4ఆర్– పిల్లల ప్రవర్తనలో మార్పులు, అలర్జీ, ఆస్తమా టార్టాజైన్ – చర్మంపై దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పి, ఒత్తిడి, నిరాశ, దృష్టి లోపాలు, నిద్రహీనత, గ్యా్రస్టిక్ సమస్య కార్మొసియాన్ – చర్మంపై వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హైపర్ సెన్సిటివిటీ -
హోం బేకర్స్..! ఇంట్లో కిచెన్లోనే బేకరీ ఏర్పాటు..!
ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో ముందుకు స్పెషల్ థీమ్స్‌తో ఔరా అనిపించుకుంటున్న యువత కాస్తంత సృజనాత్మకతకు ఆలోచన తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చు. పలువురు యువత ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కళల పట్ల ఉన్న ఆసక్తికి, ఆలోచనను జత చేసి ఎంట్రప్రెన్యూర్స్‌గా విజయతీరాలను చేరుకుంటున్నారు. సాధారణంగా బిజినెస్ చేయాలంటే పెట్టుబడి, అనువైన ప్రాంతం దొరకాలి.. అంత కష్టపడి వ్యాపారం చేస్తే, అది సక్సెస్ అవుతుందా అనే అనుమానం ఉంటుంది. అందుకే ఈ తరం యువత సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో ముందడుగు వేస్తున్నారు. ఇటీవల హోం బేకర్స్ నడుపుతూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపలు థీమ్స్‌తో కేక్స్ తయారీ..సాధారణంగా పుట్టినరోజు, పెళ్లి, న్యూఇయర్ ఇలా చాలా సందర్భాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటుంటాం. అయితే ఎప్పుడూ ఒకే రకమైన కేక్ కట్ చేస్తుంటే మజా ఏముంటుందని, కొందరు విభిన్న రకాల కేకులు ఆర్డర్ చేస్తుంటారు. పిల్లల కోసం స్పైడర్‌మ్యాన్, ఏనుగు, బార్బీ, పెళ్లి రోజు, ఎంగేజ్మెంట్ కోసం ప్రత్యేక థీమ్స్‌తో కేకులు తయారు చేస్తుంటారు. కస్టమర్లకు నచి్చన థీమ్స్ తయారు చేసేందుకు తాము ఎంతో కష్టపడుతుంటామని చెబుతున్నారు.పూర్తి సహజంగా.. ఎలాంటి రసాయనాలూ లేకుండా పూర్తిగా సహజ పదార్థాలతో తయారుచేయాలనే ఉద్దేశంతో చాలామంది హోం బేకర్స్‌ను ప్రారంభించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు పరిశుభ్రమైన వాతావారణంలో మన ఇంట్లో తయారు చేసినట్టుగానే కస్టమర్లకు పదార్థాలు తయారు చేసి ఇస్తామని పేర్కొంటున్నారు. చాలా బేకరీల్లో డాల్డాతో తయారుచేస్తారని, అయితే తాము మాత్రం బట్టర్, బ్రౌన్ షుగర్‌ను వాడతామని హోం బేకరీ నిర్వాహకులు చెబుతున్నారు.ఇంట్లో కిచెన్లోనే..సాధారణంగా బేకరీ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ హోం బేకరీని తక్కువ ఖర్చుతోనే ఇంట్లో కిచెన్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలాగూ ఇంట్లో వంటకాలను చాలా పరిశుభ్రమైన పరిసరాల్లోనే తయారు చేస్తుంటారు. కాబట్టి అక్కడే చిన్న ఓవెన్ వంటి చిన్న చిన్న పరికరాలతో కేకులు, కుకీస్ తయారు చేస్తున్నారు. కేక్స్, కుకీస్‌తో పాటు మఫిన్స్, చీజ్ కేకులు, డోనట్స్ వంటి ఉత్పత్తులతో చుట్టు పక్కల వారితో ఔరా అనిపించుకుంటున్నారు.సాధికారత కోసం..చాలా మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ హోం బేకర్స్ ప్రారంభిస్తున్నటు చెబుతున్నారు. ఇంట్లో వారి పై ఆధారపడకుండా సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయమే వారిలో కనిపిస్తోంది. తమలో ఉన్న సృజనాత్మకతను నలుగురూ మెచ్చుకుంటే అంతే చాలు అని చెబుతున్నారు.ఇది కూడా సమాజ సేవే..ఆరోగ్యకరమైన పదార్థాలు అందిస్తే కూడా సమాజానికి సేవ చేసినట్టే అనేది నా నమ్మకం. కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా, మన పనులు భిన్నంగా ఉండి, సమాజంలో గుర్తింపు రావాలనేది నా తాపత్రయం. అందులో భాగంగానే హోం బేకర్స్ కాన్సెప్ట్ ఆలోచన వచి్చంది. నా కేక్స్ డిజైన్స్ బాగున్నాయని అందరూ మెచ్చుకుంటుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. – సాయి శ్రీ, ఓవెన్ కుక్ డిలైట్చాలా టేస్టీగా ఉంటాయి..నేను చాలా సార్లు హోం బేకర్స్ నుంచి కేక్స్ ఆర్డర్ చేసుకున్నాను. సాధారణ బేకరీల కన్నా ఇక్కడ చాలా హైజీనిక్‌తో పాటు రుచికరంగా ఉంటాయి. ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్స్‌లో ఇస్తుంటారు. తక్కువ ధరలోనే మంచి కేక్స్ వస్తున్నాయి. – మెరుగు శివ ప్రకాశ్ నాయుడుఇవి చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్! -
Russia-Ukraine war: ఆక్రమిత ఉక్రెయిన్‌పై దాడి.. 28 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లిసిచాన్స్క్ నగరంలోని ఓ బేకరీపై జరిగిన దాడిలో 28 మంది మృతి చెందారు. రష్యా నియమించిన స్థానిక అధికారి ఈ విషయం వెల్లడించారు. బేకరీ కుప్పకూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన మరో 10 మందిని కాపాడినట్లు చెప్పారు. ఘటనపై ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు. ఈ శీతాకాలంలో సుమారు 930 మైళ్ల మేర విస్తరించి ఉన్న యుద్ధ క్షేత్రంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. రష్యా, ఉక్రెయిన్ సైన్యాలు ఎక్కువగా దీర్ఘ శ్రేణి దాడులపైనే ఆధారపడ్డాయి. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో రష్యా బలగాలు పలు ప్రాంతాల్లో తమ సేనలపైకి పదేపదే దాడులతో ఒత్తిడి తీవ్రతరం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. -
అలా జరిగింది.. రూపాయితో 20 వేలు!
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): కేక్ ఆర్డర్ పేరుతో ఓ మహిళా వ్యాపారవేత్తకు గుర్తుతెలియని వ్యక్తి రూ. 20 వేలు టోకరా వేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని విష్ణు మిడోస్‌లో ఉంటున్న పూజారెడ్డి కాన్‌సీయూ స్టోర్ నిర్వహిస్తోంది. ఈ నెల 2న ఉదయం ఆమెకు ఆర్మీ అధికారి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి కేక్ ఆర్డర్ చేశాడు. ఇందుకు ఆమె అడ్వాన్స్ పేమెంట్ చేయాలని చెప్పడంతో ఒక రూపాయి క్యూఆర్ స్కాన్‌తో గూగుల్‌పే చేశాడు. దీనిని నమ్మిన ఆమె క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా వెంట వెంటనే మూడు దఫాలుగా రూ. 20 వేలు ఆమె ఖాతా నుంచి అపరిచితుడి ఖాతాలోకి బదిలీ అయ్యాయి. దీనిపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీసాలున్నా వెళ్లలేక.. -
యూనివర్సల్ బేకరీ.. ఓ స్వీట్ మెమొరీ.. మూతపడటానికి కారణాలేమిటి?
బర్గర్ ప్రియులకు కేరాఫ్. ఫ్లమ్ కేక్ పేస్ట్రీ లవర్స్‌కు వన్‌స్టాప్. యూత్‌కి మహా క్రేజీగా వర్ధిల్లిన యూనివర్సల్ రెస్టారెంట్ అండ్ కన్ఫెక్షనరీ మూతపడింది. ఇది జరిగి 2 వారాలు కావస్తున్నా ఒకరి తర్వాత ఒకరుగా తెలుసుకుంటున్న నగరవాసులు యూనివర్సల్ బేకరీ జ్ఞాపకాలను నెమరేసుకుంటూనే ఉన్నారు. నగరంలో మున్నెన్నడూ లేని విధంగా ఒక ఫుడ్ జాయింట్ మూసివేత గురించి ట్విట్టర్లో స్పందిస్తుండడం విశేషం. సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో యూనివర్సల్ బేకరీ అంటే తెలియని బర్గర్ ప్రియులు ఉండరు. సికింద్రాబాద్ మహాత్మా గాంధీ రోడ్డులోని దాదాపు ఏభై ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన బేకరీ ఇది. ఇటీవల ఒక్కసారిగా మూతపడడంతో ఆ బేకరీ రుచులను దానితో ముడిపడిన పలు స్నేహాలు, అనుబంధాలను నగరవాసులు మరచిపోలేకపోతున్నారు. డైయిలీ రొటీన్... మహిళా కస్టమర్లు ఎక్కువగా కనపడని ఇరానీ ఫుడ్ జాయింట్స్‌కి భిన్నంగా ఈ బేకరీ తగినంత మంది మహిళా కస్టమర్లతో నిత్యం కళకళలాడేది. కళాశాల విద్యార్థులకు ఇక్కడి బర్గర్ ఒక డైలీ రొటీన్లో భాగం అంటే అతిశయోక్తి కాదేమో. అంతేకాక ఆ రోడ్డుకు షాపింగ్‌కి వెళ్లే వారికి యూనివర్సల్ తప్పనిసరి విజిటింగ్ ప్లేస్‌గా ఉండేది. పోటీని తట్టుకుని.. సన్నగా తరిగిన మటన్, టమాటాలు, ఉల్లిపాయలు, ఛీజ్ వగైరాలు మేళవించిన ఇక్కడి మటన్, చికెన్ బర్గర్లు అందరికీ అందుబాటు ధరలో రూ.50కే దొరికేవి. అసలైన హైదరాబాదీ బర్గర్‌కి సిసలైన చిరునామాగా ఉంటూ మూతపడే నాటికి కూడా పూర్తి స్థాయిలో కస్టమర్లతో కిటకిటలాడిన బేకరీ ఇది. అందుకే బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్స్, సబ్ వే లాంటి ఎన్నో రకాల ఆధునిక ఫుడ్ జాయింట్స్, కాఫీ షాప్స్ నగరంలో ఏర్పాటైనప్పటికీ యూనివర్సల్ బేకరీ తన క్రేజ్‌ను ఏ మాత్రం కోల్పోలేదు. చదవండి: కారు ప్రమాదంపై ట్విస్టుల మీద ట్విస్టులు మూతపడటానికి కారణాలేమిటి? హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన యూనివర్సల్ బేకరీ స్వల్ప కాలంలోనే గత 2016లో మూతపడింది. సరైన పార్కింగ్ సౌకర్యం లేక అది మూతపడిందని, అయితే చాలా పాతదైన దాని మాతృసంస్థ కూడా తాజాగా మూతపడడానికి ప్రత్యేక కారణాలేవీ లేవని తెలుస్తోంది. ఈ బేకరీని ముగ్గురు భాగస్వాములు నిర్వహిస్తుండగా వీరంతా నగరానికి దూరంగా వెళ్లిపోవడం వారసులు ఇతరత్రా వ్యాపారాలతో బిజీ అయిపోవడం వల్ల నిర్వహణ కష్టమై ఈ బేకరీ బిజినెస్‌ను వదులుకున్నట్టు నిర్వాహకుల సంబంధీకులు చెబుతున్నారు. ఓ మధుర జ్ఞాపకం.. గొప్ప జ్ఞాపకం అంటూ యూనివర్సల్ బేకరీని గుర్తు చేసుకుంటున్నారు నగరవాసులు. ట్విట్టర్ వేదికగా మిస్ యూ యూనివర్సల్ అంటూ వీడ్కోలు పలుకుతున్నారు. అంతేకాదు తిరిగి బేకరీని తెరవాలంటూ విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న స్పందన తమకు ఎంతో ఆనందానుభూతినిస్తోందని బేకరీ యజమానులు చెబుతున్నారు. యాభై ఏళ్ల అనుబంధం యూనివర్సల్ బేకరీ పెట్టిన దగ్గర నుంచీ రెగ్యులర్‌గా వెళ్లడం అలవాటు అయింది. దేశీ స్టయిల్ బర్గర్ అక్కడ ఉన్నట్టు ఇంకెక్కడా దొరికేది కాదు. క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్... ఈ మూడింటిలోనూ బెస్ట్. జనరల్ బజారుకు వెళ్లి షాపింగ్ పూర్తి చేసుకుని ఆ బేకరీ దగ్గర లోనే కారు ఆపి స్నాక్స్ తినడం ఫ్యాక్స్ ఇంటికి తెచ్చుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఆ బేకరీ తీసేశారు అంటుంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. – అనురాధారెడ్డి, ఇంటాక్ సంస్థ -
పైనాపిల్, చాక్లేట్, వెనీలా.. నోరూరించే కెవ్వు కేక్స్..
సాక్షి,మంచిర్యాలటౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా కేకులు సులభమైన పద్ధతులలో ఎన్నో రకాలుగా మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. పేస్ట్రీలు, మెరింగ్యూస్, కస్టర్డ్స్, ఫ్రూట్స్, నట్స్, డెజర్ట్ సాస్, బటరక్రీమ్, క్యాండీడ్ ఫ్రూట్స్‌తో ఎన్నో రకాల కేక్‌లను త యారు చేసి, ప్రజలకు అందిస్తున్నారు. రుచితో పాటు, ఇట్టే ఆకర్షించేలా పలు ఆకృతులతో పాటు, మనకు నచ్చిన రూపంలోనూ కేక్‌లను తయారు చేసి ఇస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా లక్షలాది కేక్‌లను కట్ చేస్తుంటారు. పోటీతత్వంతో హైదరాబాద్ వంటి నగరాల్లో లభించే కేక్‌లను మంచిర్యాలలో ప్రజలకు అందిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఒక్కరోజే వేలాది కేక్‌లు అమ్మకా లు సాగితే, సాధారణ రోజుల్లో వందలాది కేక్‌లు అమ్ముడుపోతున్నాయి. ప్రజల్ని ఆకర్షించేందుకు కేక్‌లను ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీలతో సిద్ధం చేస్తున్నారు. రుచిని బట్టి ధరలు పైనాపిల్, బటర్‌స్కాచ్, చాక్లేట్, వెనీలా, బ్లాక్ ఫారెస్ట్, రెడ్విల్వెట్, ఫ్రెష్ఫ్రూట్, చాక్లెట్ చాపర్ చిప్స్, వైట్ ఫారెస్టు, గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్ వంటి రకాల కేకులు రూ.500లకు కేజీ నుంచి రూ. 1200ల వరకు లభిస్తున్నాయి. కొత్త వెరైటీతో వస్తున్న గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్ కేక్‌లు కేజీకి రూ.1000 నుంచి రూ.1200ల వరకు లభిస్తున్నాయి. ఇక వీటితో పాటు రెగ్యులర్ కేక్‌లు కేజీకి రూ.200ల నుంచి రూ.400ల వరకు లభిస్తుండగా, కూల్ కేక్‌లు రూ.500ల నుంచి రూ.1000ల వరకు లభిస్తున్నాయి. చాలా వెరైటీలు చేస్తున్నాం ప్రజలు కొత్తకొత్త వెరైటీ కేక్‌లను ఇష్టపడుతున్నారు. అందుకే ధర ఎక్కువైనా రుచికరమైన కొత్త వాటిని తయారు చేస్తున్నాం. గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్, చాక్లెట్ చాపర్స్ వంటి లేటెస్ట్ రకాలను తయారు చేస్తున్నాం. వీటి ధర రూ. వెయ్యికి పైగా ఉన్నా, వీటినే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. బార్బీ బొమ్మ, బాంబుల రూపంలో ఉన్న కేక్‌లను చేస్తున్నాం. – కొండపర్తి రమేశ్, బేకరీ నిర్వాహకుడు, మంచిర్యాల వెరైటీ కేక్‌లంటే ఇష్టం ఏదైనా శుభసందర్భంలో కేక్‌లను తింటుంటాం. ఎప్పుడో ఒకసారి ఈ కేక్‌లను తింటాం కాబట్టి, వెరైటీ కేక్‌లను తినడం ఇష్టం. అందుకే అప్పుడప్పుడు కొనే కేక్‌లలో వెరైటీగా, కొత్త రుచులతో వచ్చే కేక్‌లను కొంటున్నాం. – మహేందర్, రామకృష్ణాపూర్ చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది -
కొత్త బిజినెస్ మొదలు పెట్టనున్న ఇలియానా!
నటీనటులు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు.. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. గోవా బ్యూటీ ఇలియానా కూడా త్వరలో కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇలియానా కొత్త బిజినెస్ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. అందులో భాగంగానే బేకరీ, రెస్టారెంట్లు వంటి చైన్ బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. హీరోయిన్గా తనకు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని తన పేరుతోనే వీటిని మార్కెట్ చేసుకోవాలనుకుంటున్నారని టాక్. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం అంటే రిస్క్ చేసినట్టే అనే కొందరు అన్నారట. ఇలియానా కూడా ఈ ఆలోచనతోనే లాక్డౌన్ తర్వాతే వ్యాపారం ఆరంభించాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. సో.. భవిష్యత్తులో ఇలియానా బేకరీ, ఇలియానా రెస్టారెంట్‌కి శ్రీకారం జరుగుతుందన్నమాట. -
చంపేస్తే అప్పు తప్పుతుందని..
గోవిందరావుపేట: అప్పు తీసుకున్న డబ్బు ఇప్పుడే ఇవ్వాలంటూ కూర్చున్న దేవేందర్‌రెడ్డిని హత్య చేస్తే మిగతా చిన్నచిన్న అప్పులను తీర్చేయవచ్చని.. ఇదేక్రమంలో హత్య చేశాక మృతదేహాన్ని రాత్రి మాయం చేయాలని భావించాడు.. ఇదే ఆలోచనతో బేకరీ లోపలికి తీసుకెళ్లిన దేవేందర్‌రెడ్డిని తీవ్రంగా కొట్టాక చనిపోయాడనుకుని బయటకు వచ్చాక సునీల్‌రెడ్డి కనిపించాడు.. అంతసేపటి వరకు ఒకటే హత్య చేయాలని అనుకున్న నిందితుడు.. రెండో హత్యకు కూడా సిద్ధమయ్యాడు. దీంతోనే సునీల్‌ను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్యకు పాల్పడ్డాడు. ఇదీ ములుగు జిల్లా పస్రాలో సోమవారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించి నిందితుడు, బేకరీ యజమాని దయానంద్ అలియాస్ దయ పన్నాగంగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. రూ.6లక్షల అప్పు.. కర్ణాటకకు చెందిన దయానంద్ తన మామ ప్రభుతో కలిసి పస్రాలో కొన్నేళ్ల క్రితం బేకరీ ప్రారంభించారు. అయితే, అప్పులు ఎక్కువ కావడంతో కొద్దికాలం క్రితం ఊరు వదిలేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆరునెలల క్రితం వచ్చిన వారు పస్రాలోనే కొత్తగా బేకరీ తెరిచారు. అప్పటికే ఉన్న అప్పులకు తోడు మరికొన్ని అప్పులు చేశారు. ఈ క్రమంలో దయకు రూ.6లక్షలు అప్పు ఇచ్చిన దేవేందర్‌రెడ్డి నుంచి ఒత్తిడి పెరిగింది. సోమవారం కూడా దేవేందర్‌రెడ్డి తన స్నేహితుడైన ఫొటో జర్నలిస్ట్ సునీల్‌రెడ్డితో కలిసి పస్రా వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంతనాలు సాగించినా డబ్బు తిరిగి ఇవ్వడంలో ఎలాంటి పురోగతి కానరాలేదు. తనకు స్థానిక వ్యాపారి ఒకరు డబ్బు ఇవ్వాల్సి ఉందని చెప్పగా.. దేవేందర్, సునీల్ ఆయన వద్దకు వెళ్లి ఆరా తీశారు. అయితే, దయకు తాను డబ్బు పెద్దగా ఇచ్చేది లేదని.. కొంతమొత్తమే ఉన్నా తనకు కుమార్తె వివాహం ముగిశాక ఇస్తానని చెప్పాడు. (ఫొటో జర్నలిస్ట్ దారుణ హత్య) ఇస్తావా.. ఇవ్వవా? వ్యాపారి మొండిచేయి చూపడంతో దేవేందర్, సునీల్ మళ్లీ దయ బేకరీ వద్దకు వచ్చారు. దేవేందర్‌రెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.6లక్షల విషయమై మళ్లీ ప్రశ్నించాడు. ఉదయం నుంచి నచ్చచెప్పినా వినడం లేదని భావించిన దయ.. తొలుత దేవేందర్‌రెడ్డిని హత్య చేసి అప్పు వదిలించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే భావనతో పక్కనే ఉన్న మామ ప్రభుకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి 7–30 గంటలకు బేకరీకి వచ్చిన దేవేందర్‌రెడ్డిని బేకరీలో వెనక ఉన్న బట్టీ వద్దకు తీసుకెళ్లి విచక్షణా రహితంగా తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో చనిపోయాడని భావించి శవాన్ని రాత్రికి మాయం చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా రాగానే సునీల్‌రెడ్డి కనిపించడంతో దయా తన ఆలోచన మార్చుకున్నాడని సమాచారం. ‘ఇంటికి పోయి మాట్లాడుకుందాం.. అక్కడ నీకు అన్ని విషయాలు, నా ఇబ్బందులు చెబుతా’ అంటూ సునీల్‌రెడ్డిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దయ మామ, భార్య బేకరీలో ఉన్నారు. ఈ మేరకు ఇంటికి వెళ్లగానే అక్కడ ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సునీల్‌రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రక్తపు మడుగులో దేవేందర్.. దయ, సునీల్‌రెడ్డి ఇంటికి వెళ్లాక పనిపై ప్రభు బేకరీలోని బట్టీ వద్దకు వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో దేవేందర్‌రెడ్డి కనిపించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన స్థానికుల సాయంతో 108లో ములుగు ఆస్పత్రికి చేర్చాడు. ఇంతలోనే దయ భార్య బేకరీ నుంచి ఇంటికి వెళ్లగా లోపలి నుంచి గొడవ వినిపించినట్లు సమాచారం. ఉదయం నుంచి అప్పు విషయమై జరుగుతున్న గొడవగానే ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దయ రక్తపు మరకలు కడుక్కుంటూ ఇంటి నుంచి బయటకు రావడాన్ని చూసిన ఆమె ఏదో జరిగిందని ఊహించినట్లు సమాచారం. ఆ తర్వాత దయా రోడ్డుపైకి రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇంతలోనే దయ నేరుగా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
కరాచీ బేకరీపై పుల్వామా దాడి ఎఫెక్ట్
బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్రవాదన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై యావత్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత సినీ ఇండస్ట్రీ కూడా పాక్ కళాకారులపై నిషేధం విధించింది. చివరికి నదీ జలాలను కూడా ఆపేశారు. ఇక పాక్ వ్యక్తులను, పేర్లను, అనుకూలమైన వారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (బుద్ధి చూపించుకున్న పాక్) తాజాగా పుల్వామా దాడి ప్రభావం కరాచీ బేకరీపై పడింది. బేకరీ పేరులో పాకిస్తాన్‌కు చెందిన పట్టణం ‘కరాచీ’ ఉందంటూ ఆ బేకరీ ముందు పలువురు ఆందోళనలు చేశారు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. ఈ క్రమంలో తాము పాకిస్తాన్‌కు చెందిన వాళ్లం కాదని భారతీయలమే అంటే బేకరీ యాజమాన్యం ఆందోళనాకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఎంత చెప్పిన వినకపోవడంతో బేకరీ పేరులోని కరాచీ కనపడకుండా క్లాత్‌తో కప్పివేశారు. అంతేకాకుండా బేకరీపై మువ్వన్నెల జెండా కూడా ఎగిరేశారు. దీంతో శాంతించిన ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. (పాక్‌ను తప్పించడం సాధ్యం కాదు) 1953లో హైదరాబాద్ వేదికగా కరాచీ బేకరీ దేశ విభజన సమయంలో ఖాన్ చంద్ రమణి అనే వ్యక్తి భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. 1953లో ఆయన హైదరాబాద్ వేదికగా కరాచీ బేకరీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా శాఖలను విస్తరించారు. బిస్కెట్లకు కరాచీ బేకరీ ఎంతో ప్రసిద్ధిపొందినది. ఇక ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కరాచీ పేరుని పాకిస్తాన్‌తో లింక్ చేయడం పట్ల వ్యాపారులు విస్మయం చెందుతున్నారు. కరాచీ పేరుకి పాకిస్తాన్‌కు ఎలాంటి సంబందం లేదని వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (పాక్‌తో భారత్ ఆడకుంటే నష్టమేనా?) -
కర కరాచీ బిస్కెట్లు
తియ్యటి ఘుమఘుమల సువాసనలు కరిగించిన బటర్, కారమిలైజ్ చేసిన పంచదారల కలయిక నుండి వచ్చే మాధుర్యం.. నైపుణ్యం కలిగిన రెండు మూడు చేతుల మధ్యన మృదువుగా నలుగుతున్న పిండి... క్యాండీడ్ ఫ్రూట్స్‌ను జల్లుతున్న మరో కొన్ని చేతులు... వారి వెనకాలే పెద్ద పెద్ద అవెన్లు... అంతే... ఎంతో ఆదరణ పొందిన కరాచీ బేకరీ బిస్కెట్లు సిద్ధం... దేశవ్యాప్తంగా ఇంత ఆదరణ పొందిన ఈ బిస్కెట్ల ప్రయాణం సుమారు 60 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఈ బేకరీ ఖాన్చంద్ రామ్నాని ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది. కరాచీ బిస్కెట్లు... ఈ పేరుకి, పాకిస్థాన్‌లోని కరాచీకి ఏ మాత్రం సంబంధం లేదు. తన స్వస్థలం మీద మమకారంతో మాత్రమే ఈ పేరు పెట్టుకున్నారు. పుట్టుకతో సింధీ అయిన ఖాన్చంద్ రామ్‌నామీ, దేశ విభజన సమయంలో పాకిస్థాన్ కరాచీ నుంచి ప్రస్తుత ఇండియాకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. 1953లో తనముద్రను ప్రతిబింబించేలా బిస్కెట్లు, కేక్‌లు, పేస్ట్రీల అమ్మకాలలో ప్రఖ్యాతి చెందారు. మొట్టమొదటి ఔట్‌లెట్‌ను ముజాంజాహి మార్కెట్లో ప్రారంభించారు. ఇటీవలే దుబాయ్‌లో కూడా వీరి ఔట్లెట్ తొలి అడుగు వేసింది.1960లో రామ్‌నామీ స్వయంగా తన సొంత బేకింగ్ యూనిట్‌ను ప్రారంభించి, తన మార్కులో ఫ్రూట్ బిస్కెట్లను తయారుచేయడం ప్రారంభించారు. అంతే, హైదరాబాదీల మనసులను ఇట్టే దోచేసుకున్నారు. నోటికి లవణ రుచిని కూడా చూపిస్తున్నారు. టూటీ ఫ్రూటీతో బిస్కెట్ల మీద నక్షత్రాల్లా మిణుకుమిణుకు మంటూ నోరూరేలా చేస్తున్నారు. టీ టైమ్ తినడానికి అనువుగా కాజు బిస్కెట్లు, ఉప్పు బిస్కెట్లు తయారుచేస్తున్నారు. ‘‘మా నాన్నగారు నాణ్యత మీదే మనసు లగ్నం చేశారు. ఆ నాణ్యతనే నేటికీ కొనసాగిస్తున్నాం. నా సోదరులిద్దరూ గతించారు. నా మేనల్లుళ్లు సోషల్‌మీడియాలో మా బేకరీ వస్తువుల గురించి ప్రచారం చేస్తుంటారు. నేను నిత్యం పనులలో బిజీగా ఉన్నా కూడా అందరికీ సకాలంలో డెలివరీలు అందేలా జాగ్రత్తపడుతుంటాను’’ అంటారు లేఖ్‌రాజ్ రామ్నాని. ఇక్కడి ప్రత్యేకతలు... ఎగ్‌లెస్ కుకీస్ కరాచీ బేకరీ ప్రత్యేకత. అలాగని వీరు కొత్తరకాలు తయారుచేయడంలేదని కాదు. ఇక్కడ పదిరకాల బిస్కెట్లు, షెర్మాల్ నుంచి ఒరిజానో వరకు 40 రకాల కుకీలు తయారుచేస్తున్నారు. కాజు, ఫ్రూట్స్, ఉస్మానియా... అన్నీ అప్పటికప్పుడు అమ్ముడైపోతాయి. హైదరాబాద్‌లో వీరికి విశేష ఆదరణ రావడంతో, నాణ్యత విషయంలో మరింత జాగ్రత్తలు పాటిస్తున్నారు. 2018 లో ముంబైలో కొత్తబ్రాంచ్ తెరిచారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 ఔట్లెట్లు పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. స్థానిక దుకాణాలు మొదలు, అమెజాన్.కామ్ వంటి ఆన్లైన్ సంస్థల వరకు కరాచీ బిస్కెట్లను అమ్ముతున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించేవారు ఈ బిస్కెట్లను తమ బంధువులకు తప్పనిసరిగా తీసుకువెళ్తారు. నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణతో ఈ ఔట్లెట్ల సంఖ్య పెరుగుతోంది. లేఖరాజ్ మాటల ప్రకారం. ... నిజమైన హైదరాబాదీకి ఉదయం టీతో పాటు కరాచీ బిస్కెట్లతోనే తెల్లవారుతుంది. మా కుటుంబీకులకు ఒక నమ్మకం ఉంది. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. అందువల్లే మేం ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడం. చేతలతోనే మాట్లాడతాం. – లేఖ్‌రాజ్ రామ్నాని (ఖాన్చంద్ రామ్నాని కుమారుడు) కారం బిళ్లలు కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; సెనగ పిండి – ఒక కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగ పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరపకారం, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙నువ్వులు వేసి మరోమారు కలపాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙చేతికి నూనె పూసుకుని పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండలా చేసి, చేతితో వడ మాదిరిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ∙ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న కారం బిళ్లలను అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙ఇవి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి. -
అయ్యంగార్ బేకరీ
పొట్ట చేత పట్టుకుని హసన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు... కోట్లకు అధిపతి అయినా, వినయమే ఆభరణంగా ఎదిగారు... సంప్రదాయాన్ని పాటిస్తూ, శుచిశుభ్రతలతో రంగరించిన రుచులను అందిస్తున్నారు... బేకరీ వస్తువులకు భారతదేశంలోనే ఐకాన్‌గా నిలిచారు... ఆయనే హెచ్ఆర్ తిరుమలాచార్... మొట్టమొదటి అయ్యంగార్ బేకరీ బిబి (బెంగళూరు బ్రదర్స్) బేకరీ పేరున 1898లో సోదరుడితో కలిపి స్థాపించారు తిరుమలాచార్. చిక్పేట్ ప్రాంతంలో ప్రారంభించిన కొత్తల్లో్ల స్వీట్స్ మాత్రమే అమ్మేవారు. ఆ స్వీట్ల రుచులను ఆస్వాదించడానికి అక్కడకు ప్రతిరోజూ ఒక ఇంగ్లిష్ వ్యక్తి వచ్చేవారు. ఆయన స్వీట్లు తింటూ, తిరుమలాచార్తో పిచ్చాపాటీ మాట్లాడుతూ, మాటల మధ్యలో బేకింగ్ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. తిరుమలాచార్ మనసులో బేకింగ్ ఉత్పత్తులను ప్రారంభించాలనే ఆలోచన కలిగింది. అంతే, ఏవిధంగా బేక్ చేయాలి అనే విషయాన్ని ఆ ఇంగ్లిష్ వ్యక్తి దగ్గర నేర్చేసుకున్నారు తిరుమలాచార్. రుచికరమైన బ్రెడ్, బన్, బిస్కెట్ల అమ్మకంతో బేకరీకి లాభాలు రావడం ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా బేకరీ పేరుప్రఖ్యాతులు నగరమంతా వ్యాపించాయి. 1970లో ఈ బేకరీని ‘బెంగళూరు బ్రాహ్మణ బేకరీ’ గా పేరు మార్చారు. బేకరీ లాభాల బాటలో నడుస్తుండటంతో, చాలామంది అయ్యంగార్లు హసన్ నుంచి బెంగళూరు వలస వచ్చి, బేకరీ వస్తువుల తయారీ నేర్చుకోవడం ప్రారంభించారు. చిన్న వీధి చివరన ప్రారంభమైన అయ్యంగార్ బేకరీ కొన్ని దశాబ్దాలుగా గర్వంగా తల ఎత్తుకుని నిలబడే స్థాయికి చేరుకుంది. ఒక తీపి జ్ఞాపకాన్ని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది. సువాసనల కూడలి... బెంగళూరులోని జయానగర్ నాలుగో బ్లాక్ గుండా నడుస్తుంటే, అప్పుడే తాజాగా తయారవుతున్న బ్రెడ్ ఘుమఘుమలు ఆ వీధి చివరి దాకా వ్యాపించేస్తాయి. బటర్ కుకీస్ నుంచి వస్తున్న సువాసనలు మనలను ఒక్కసారిగా అక్కడ నిలబెట్టేస్తాయి. అక్కడ దొరికే వెజిటబుల్ పఫ్ కోసం లోపలకు అడుగులు వేస్తారు ఆహార ప్రియులు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బేకరీని పరిశీలిస్తే, గంటన్నర రెండు గంటల లోగా ఆహారపదార్థాలన్నీ కస్టమర్ల కడుపులు నింపేసి కనిపిస్తాయి. బెంగళూరులో ఉన్న అయ్యంగార్ బేకరీలలో నిత్యం కనిపించే సన్నివేశం ఇది. అయ్యంగార్ బేకరీలు నగరానికి కలికితురాయిగా నిలుస్తాయి. సుమారు వంద సంవత్సరాలుగా ఈ బేకరీలు కస్టమర్లను ఎంతో మర్యాదగా చూసుకుంటున్నాయి. ఎన్ని కొత్త రుచులు పుట్టుకొస్తున్నా, అయ్యంగార్ బేకరీ రుచులకు దీటుగా నిలబడవంటారు కస్టమర్లు. పెద్దలు ఏర్పరచిన సంప్రదాయాన్ని అనుసరిస్తూనే, అవసరాలకు అనుగుణంగా కొత్తదనాన్ని కూడా అందిపుచ్చుకుంటున్నాయి ఈ బేకరీలు. అయ్యంగార్ బేకరీలు బెంగళూరులో అంతర్భాగంగా మారిపోయాయి. తాజాగా... రుచిగా... బేకరీ ఐటతమ్స్ని సాయంత్రం తయారుచేసి, మరుసటి రోజు సాయంత్రంలోగా అమ్మేస్తుంటారు. బటర్, ఖారా, కొబ్బరి బిస్కెట్లు, రకరకాల పఫ్‌లు, బన్స్, బ్రెడ్స్, కేక్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వెజిటబుల్ పఫ్, పొటాటో బన్స్, సుగరీ స్వీట్ హనీ కేక్స్ వంటి డెజర్ట్స్, దిల్పసంద్... వంటివి ఇక్కడ మాత్రమే తినాలి అనేంత రుచిగా ఉంటాయి. ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఆ రుచిని కాపాడుకుంటూ వస్తున్నారు. నాణ్యత కలిగిన వస్తువులను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పేరుతో ఉన్నవన్నీ వీరివే అని చెప్పడానికి వీలు లేదు అంటారు బెంగళూరులోని గాంధీ బజార్లో 62 సంవత్సరాలుగా శ్రీనివాస బ్రాహ్మణ బేకరీని నడుపుతున్న రామ్‌ప్రసాద్.. ఈ బేకరీలలో పనిచేస్తూ, వీటిని తయారుచేయడంలో నైపుణ్యం సాధించిన కొంతమంది, అక్కడ నుంచి విడిగా వెళ్లి, సొంతంగా ప్రారంభించుకున్నారు. అయ్యంగార్ల నుదుటన ఉండే నామమే వారికి గుర్తింపు. మేం ‘అష్టగ్రామ’ ప్రాంతం నుంచి వలస వచ్చాం. 1950–1960 ప్రాంతంలో అక్కడ కరువుకాటకాలు రావడంతో, మా తండ్రిగారు వ్యవసాయం చేయలేకపోయారు. చాలామంది అక్కడ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉండేవి. అందువల్ల చాలామంది బేకరీ ఉత్పత్తుల తయారీని వృత్తిగా ఎంచుకున్నారు. సుమారు 120 సంవత్సరాలుగా ఈ వ్యాపారం నడుస్తోంది. తాజాగా, నాణ్యతతో ఉండే ఉత్పత్తులను మాత్రమే తయారుచేయడం అయ్యంగార్ బేకరీ విజయ రహస్యం. – హెచ్ఆర్ రామ్‌ప్రసాద్, శ్రీనివాస బ్రాహ్మణ బేకరీ, బెంగళూరు -
కరాచీ బేకరీ స్వీట్స్‌లో పురుగులు
సాక్షి, హైదరాబాద్: పండుగ రోజు షాకింగ్ న్యూస్. దీపావళి అంటేనే స్వీట్స్‌కు ప్రత్యేకం. బిజీబిజీ గందరగోళ జీవితంలో పండుగలకు, పబ్బాలకు స్వీట్ షాప్‌లు, బేకరీలపైనే ఆధారపడటం నగరవాసులకు తప్పనిసరి. అందులోనూ పేరున్న షాపులను ఎంచుకోవడం కూడా పరిపాటి. అయితే అలాంటి పెద్ద పేరున్న కంపెనీల్లోనే చెడిపోయిన, అనారోగ్యకరమైన పదార్థాలను వినియోగదారులకు అంటగడితే.. వినియోగదారుల పరిస్థితి బెంబేలే. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే హైదరాబాద్ కస్టమర్‌కు ఎదురైంది. అతి పెద్ద పేరున్న కరాచీ బేకరిలో. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని కరాచీ బేకరీనుంచి దీపక్ అనే వినియోగదారుడు చాకొలెట్ స్వీట్లు కొనుగోలు చేశారు. తీరా ఇంటికెళ్లి పరిశీలిస్తే...పురుగులు పలకరించాయి. దీంతో దీపక్ ఫ్రెండ్ దోనితా జోష్ ట్విటర్లో పోస్ట్ చేశారు. హ్యాపీ వార్మీ దివాలీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు స్పందించారు. జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ కమీషనర్ హరిచందన ఈ విషయాన్నిసీరియస్‌గా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించారు. కలుషితమైన స్వీట్లు ఇచ్చినట్టుగా తేలిందనీ, నిబంధనలను ఉల్లంఘించినందుకు బేకరీ యజమానికి 25వేలరూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా హైదరాబాద్ 65 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐకానిక్ కరాచీ బేకరీ అంటే హైదరాబాదీయులకు ఎనలేని నమ్మకం. కానీ ఇదే ఆరోపణలతో, నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ 2014లో, బంజారా హిల్స్ బేకరీ ఔట్‌లెట్‌ను అధికారులు మూసివేయడం గమనార్హం. అలాగే కేవలం రెండు నెలల క్రితం, హైదరాబాదులోని ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఐకియా షోరూంలోని రెస్టారెంట్ బిర్యానీలో గొంగళి పురుగు కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. Happy wormy Diwali from @KarachiBakery Found these worms in at least 4 chocolate pieces. They even move... Not sure how many batches are even impacted by this 😞@GHMCOnline pic.twitter.com/nwK7So1Z8y — Donita Jose (@DonitaJose) November 6, 2018 #TeamGHMC Penalty imposed & samples of the same collected pic.twitter.com/I38tOIbhRa — Musharraf Faruqui (@musharraf_ias) November 6, 2018 -
ఫ్యూచర్ కేక్స్
కంటికి ఇంపుగా కనిపించాలి. నాలుకకు హితవుగా ఉండాలి. దేహానికి ఆరోగ్యాన్నివ్వాలి. ఇదీ ఆహారానికి శిల్ప, మాధవి చెప్పే భాష్యం. ఆహార ప్రియుల జఠరాగ్నిని శాంతింప చేయడం ద్వారా కెరీర్‌లోని తమ లక్ష్యాగ్నిని జ్వలింపజేసుకుంటున్న ఈ యువతులు.. విజయవంతమైన ఆంట్రప్రెన్యూర్లుగా నిలవాలనే ఒక ఫైర్‌తో పనిచేస్తున్నారు. అందుకేనేమో.. తమ రెస్టారెంట్‌కి ‘ఫ్యూ’ అని పేరు పెట్టుకున్నారు. ‘ఫ్యూ’ అంటే ఫ్రెంచిలో ‘మంట’ అని అర్థం. ఆహారం అంటే ఏదో మనకి వచ్చినట్లు వండుకుని, ఆకలైనప్పుడు తిన్నట్లు కాదు. ఇదొక ఆర్ట్, అందులో రాకెట్ సైన్స్ అంత శాస్త్రీయత దాగి ఉంటుందని చెబుతున్నారు శిల్పా దాట్ల, మాధవి. ప్రకృతి ఇచ్చిన ముడిసరుకును ఆరోగ్యకరంగా ప్రాసెస్ చేయడం, ఆ దినుసులతోనే ప్రకృతిని ప్రతిబింబించేటట్లు రుచులను రూపొందించడం తమ ప్రత్యేకత అంటూ వైట్ చాకొలెట్‌తో తయారు చేసిన ఆకును చూపిస్తారు. గులాబీ రంగు లిచీ కేక్ మీద అమర్చిన వైట్ చాకొలెట్ ఆకు అప్పుడే చెట్టు నుంచి రాలిపడిన పారిజాతం పువ్వును తలపిస్తోంది. తినకుండా దానిని చక్కగా గాజు జాడీలో అలంకరించుకోవాలన్నంత నాజూకుగా ఉందా చాకో లీఫ్. ‘‘రెండు నిమిషాల్లో తినేసే పేస్ట్రీ మీద అలంకరణ కోసం ఇంత మనసు పెట్టడమా!’’ అంటే అదే ఫ్రెంచ్ వాళ్ల ప్రత్యేకత అంటారు. అక్కడ రుచిగా, శుచిగా, ఆరోగ్యకరంగా తయారు చేయడంతోపాటు గార్నిషింగ్ కూడా అంతే శ్రద్ధగా చేస్తారట. ఆ ఫ్రెంచ్ సంప్రదాయాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు శిల్ప, మాధవి. ఇద్దరూ తెలుగమ్మాయిలే శిల్ప, మాధవి ఇద్దరూ తెలుగమ్మాయిలే. ప్రపంచంలో చాలా దేశాలను చూశారు. రకరకాల రుచులను, అభిరుచులను గమనించారు. మన దగ్గరి ఆహారప్రియులు ముంబై, ఢిల్లీ వెళ్లినప్పుడు కొత్త రుచుల కోసం ప్రయత్నిస్తున్న వైనాన్ని తెలుసుకున్నారు. వాటిని ఇక్కడికి తీసుకురావడం గురించి ఆలోచించారు. ‘ఫ్యూ’ అనే ఫ్రెంచ్ పట్టిసెరీ (మామూలు భాషలో బేకరీ షాపు)ని ప్రారంభించారు. ‘‘మనవాళ్లు యూరప్ టూర్ వెళ్లడం బాగా ఎక్కువైంది. అక్కడి రుచులకు ఫిదా అయిపోవడం కూడా. పారిస్ నుంచి ఈఫిల్ టవర్‌ను ఇక్కడికి తేలేం, కానీ అక్కడి డెజర్ట్‌ల రుచిని ఇక్కడ చూపించవచ్చు. ఈ రుచులతో టూర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు. అలా ఒకసారి వచ్చిన వాళ్లు మా ’ఫ్యూ’ను ఇక మర్చిపోరు. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తారు’ అన్నారు మాధవి. సొంతంగా చేయడమే ఆనందం మాధవి పదేళ్లకు పైగా అమెరికాలో ఉద్యోగం చేసి గత ఏడాది ఇండియాకి వచ్చారు. శిల్పకి పందొమ్మిదేళ్లకే పెళ్లయింది. తండ్రి ఎన్.సి.ఎల్. గ్రూప్ ఎం.డి. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలోనే ఉద్యోగం చేశారామె. సిమెంట్, స్టీల్ వంటి బిల్డింగ్ మెటీరియల్ నిర్వహణతో పాటు తమ కుటుంబానికి ఉన్న కెమికల్ కంపెనీ బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వర్తించినప్పటికీ అవేవీ తనకు సంతృప్తినివ్వలేదంటారు. ‘‘నాకు ఇంటీరియర్ డెకరేషన్ చాలా ఇష్టం. ఆ తర్వాత అంతే ఇష్టమైన అంశం ఆహారం. మా ఇంటికి లంచ్‌కి వచ్చిన అతిథులు కూడా ఇంటిని అలంకరించిన తీరును, నేను వడ్డించిన రకరకాల వంటకాలను ప్రత్యేకంగా మెచ్చుకునేవాళ్లు. కన్స్రక్షన్ కంపెనీ బాధ్యతల్లో వచ్చిన ప్రశంసల కంటే ఇంటికి వచ్చిన అతిథుల ప్రశంసలు నాకు చాలా సంతోషాన్నిచ్చేవి. కొన్నాళ్లకు నాకంటూ సొంతంగా ఏదైనా చేయాలనిపించింది. ఫ్యామిలీ బిజినెస్‌లో ఎంత కష్టపడినా, ఎంత విజయవంతంగా నడిపించినా సరే... ‘బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్’, ‘తాతలు, తండ్రి పరిచిన కార్పెట్ మీద నడవడమే కదా’ అంటారు. అంతే తప్ప నా దీక్ష, శ్రమ కనిపించవు. అలా కాకుండా నాకు నేనుగా ఏదైనా స్థాపించి, దానిని విజయవంతంగా నడిపించాలి అనుకున్నాను. అది కుటుంబ వ్యాపారానికి సంబంధం లేకుండా పూర్తిగా భిన్నంగా, నా అభిరుచులకు అనుగుణంగా ఉండాలనుకున్నాను. దాంతో నా హజ్బెండ్ బిజినెస్‌లో కూడా పాల్పంచుకోకుండా సొంతంగా ‘ఫ్యూ పట్టిసెరీ’ని స్థాపించాను. మాధవి, నేను కజిన్స్‌మి. ఇద్దరం ఐడియాస్ షేర్ చేసుకున్న తర్వాత దాదాపుగా ఎనిమిది నెలల పాటు ఈ ప్రాజెక్ట్ మీద వర్కవుట్ చేశాం. షెఫ్ టీమ్‌ని ముంబై పంపించి సంజనా పటేల్ (పేస్ట్రీ క్వీన్ ఆఫ్ ఇండియా) దగ్గర శిక్షణ ఇప్పించాం. కలినరీలో ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏది లేదో దానిని మేము పరిచయం చేస్తున్నాం. కలినరీ స్టూడియో, లైవ్ డెజర్ట్ మాకు మాత్రమే ప్రత్యేకం. లైవ్ డెజర్ట్ అంటే కస్టమర్ కోరిన పదార్థాలతో షెఫ్‌లు అప్పటికప్పుడు తయారు చేసిస్తారు. బ్రెడ్ కోసం సొంత బేకరీ పెట్టడంలో ఉద్దేశం కూడా క్వాలిటీలో తేడా రాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌ని మెయింటెయిన్ చేయడం కోసమే. ఫ్రెంచ్ రుచులను నేర్చుకోవాలనే వాళ్ల కోసం రెండు– మూడు రోజుల కోర్సులు, రోజుకు రెండు–మూడు గంటల పాటు వారం రోజుల కోర్సులను ప్రవేశపెట్టాం. ఎన్.సి.ఎల్. కోసం పని చేసిన టైమ్కంటే రెండింతలు ఫ్యూ కోసం పని చేస్తున్నాను. సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది’’ అంటారు శిల్ప. అత్తింటికి తోడు వచ్చే అమ్మ తరళా దలాల్ మనదేశంలో తొలితరం కమర్షియల్ చెఫ్. 1966 నుంచి ముంబైలో వంట క్లాసులు మొదలు పెట్టారు. ఆ తర్వాత వంటల పుస్తకాలు రాయడం ప్రారంభించి రెండు వందల పుస్తకాలు రాశారు. టీవీ షోలలో వండుతూ ప్రేక్షకులకు వంటలు నేర్పించారు. ‘అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు తరళా దలాల్ వంటల పుస్తకం కూడా వెంట పంపించండి’ అని చెప్పుకునేటంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆమె పుస్తకాలు. ఐదేళ్ల కిందట ఆమె మరణించినప్పటికీ కుకరీ షోలతో ఇప్పటికీ భారతీయ మహిళల మనసుల్లో జీవించే ఉన్నారు. - తరళా దలాల్ ఇది మెదడు చేసే పని వీణా అరోరా ద ఇంపీరియల్‌లో ఎగ్జిక్యూటివ్ షెఫ్. హోటల్ ఇండస్ట్రీలో లెజెండ్ షెఫ్ ఆమె. టూరిజం మంత్రిత్వ శాఖ నుంచి బెస్ట్ లేడీ షెఫ్ అవార్డు అందుకున్నారు. ఆమె కలినరీ ట్రైనింగ్ ఎక్కడా తీసుకోలేదు. వండడం చేతులతో చేసే పని కాదు, మెదడు ఉపయోగించి చేయాల్సిన పని అంటారామె. కొందరు నేర్చుకుని మెళకువలు సాధిస్తే, కొందరిలో సహజంగా ఈ మెళకువ ఉంటుంది. ఆమె ఆ రెండో కోవకి చెందుతారు. - వీణా అరోరా అభి‘రుచి’ సంజనా పటేల్‌కి రకరకాల డెజర్ట్‌లు చేయడం ఇష్టం. పారిస్‌లో కన్ఫెక్షనరీ టెక్నాలజీలో డిప్లొమా, లండన్‌లో ఫుడ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ముంబైలో సొంతంగా ‘లాఫోలి’ పేరుతో పాట్టిసెరీ ప్రారంభించారు. ఇండియాలో ఈ తరహా డెజర్ట్ ఎటెలియర్లలో ఇదే తొలిది. ఫుడ్ ఇండస్ట్రీలో ఆమె చేస్తున్న ప్రయత్నాలకు పేస్ట్రీ క్వీన్ ఆఫ్ ఇండియా, ద సైంటిస్ట్, గేమ్ చేంజర్, ద ఒరిజినల్’ అనే బిరుదులు వచ్చాయి. - సంజనా పటేల్ ఫస్టే కాదు బెస్ట్ కూడా ఫ్రాన్స్‌లో ఉండే క్వాలిటీ కోసం ముడిసరుకులన్నీ విదేశాల నుంచే తెప్పిస్తున్నాం. రసాయన ఉత్పత్తులు లేకుండా పూర్తిగా సహజమైన దినుసులనే వాడుతున్నాం. కలర్స్ కూడా మొత్తం వెజిటబుల్ కలర్సే. పేస్ట్రీ అనగానే మైదా పిండి గుర్తుకువస్తుంది. కానీ మైదాను తగ్గించి బాదం పొడి వంటి రకరకాల పొడులను చేరుస్తున్నాం. ప్రత్యేకించి పెరిగే పిల్లలకు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఆరోగ్యకరమైన పదార్థాలు చేరుస్తున్నాం. హైదరాబాద్‌లో ఇదే తొలి ఫ్రెంచ్ పాట్టిసెరీ. మా ప్రయత్నం ఫస్ట్ మాత్రమే కాదు బెస్ట్ కూడా అయ్యేటట్లు శ్రమిస్తున్నాం. – మాధవి, శిల్పాదాట్ల, ఉమెన్ ఆంట్రప్రెన్యూర్లు – వాకా మంజులారెడ్డి -
కేక్ కొంటే పెట్రోల్ ఫ్రీ
సాక్షి, చెన్నై: పెట్రో ధరలు వినియోగదారులకు సెగ పుట్టిస్తోంటే.. వినియోగదారులకు ఆకట్టుకునేందుకు సంస్థలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇపుడు ఈ కోవలోకి ఒక బేకరీ సంస్థ వచ్చి చేరింది. ఒక కిలో కేక్ కొంటే లీటరు పెట్రోలు ఉచితంగా ఇస్తామంటూ ఒక బేకరీ వినూత్న ఆఫర్ అందిస్తోంది. తమిళనాడులోని ఒక బేకరీ దుకాణం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక కిలో పుట్టినరోజు కేక్ లేదా రూ .495 బిల్లు చేస్తే 1 లీటరు పెట్రోలు ఉచితమని అని ప్రకటించింది. దీంతో ఇది వైరల్‌గా మారింది కాగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. రికార్డు ధరలతో వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక పెళ్లి వేడుకలో వధూవరులకు 5 లీటర్ల పెట్రోలును బహుమతిగా ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా దేశంలో పెట్రోలు ధర మండుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. శుక్రవారం రాష్ట్ర రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 86.01 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై రెండింటిలో 10 పైసలు పెరిగి రూ. 82.32 , 89.92 రూపాయలుగా ఉంది. -
వారమంటే....వడ్డింపే
పారిస్ : కష్టపడి పనిచేస్తే ఎవరికైనా జీతం పెరుగుతుంది లేదా ప్రమోషన్ వస్తుంది...కానీ ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తికి జరిమానా పడింది. అదేంటి కష్టపడి పనిచేస్తే.. జరిమానా ఎందుకు విధించారు అనుకుంటున్నారా? ఫ్రాన్స్‌లో అంతేనట. వివరాల్లోకి వెళ్తే ఫ్రాన్స్‌లో ప్రతి ఒక్కరూ వారానికి ఆరు రోజులు మాత్రమే పనిచేయాలి. కచ్చితంగా ఒక రోజు సెలవు తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికీ ఇదే నియమం వర్తిస్తోంది. అయితే ఈ నియమం పాటించని బేకరీ యజమాని సెడ్రిక్ వైవ్రికి అక్కడి ప్రభుత్వం 3వేల యూరోల జరిమానా విధించింది. వెవ్రి పారిస్‌కు 120 మైళ్ల దూరాన ఉన్న లూసిగ్ని సర్ బార్స్‌లో లెక్ బెకరీని నిర్వహిస్తున్నాడు. రాబోయే వేసవి రద్ధీ దృష్టా ముందుగానే పెద్ద మొత్తంలో క్రిసాంట్స్, బగెట్స్ని తయారు చేసి పెట్టుకోవాలని భావించాడు. అందుకోసం వారంలో ఏడురోజుల పాటు పనిచేయడం ప్రారంభించాడు. కానీ అక్కడి స్థానిక చట్టాల ప్రకారం చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా వారంలో ఆరు రోజులు మాత్రమే పనిచేయాలి. ఈ చట్టాన్ని రోజువారి వేతనం కోసం పనిచేసే కూలీలకు ఒక రోజు పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించడానికి, శ్రమ దోపిడి నుంచి కాపాడటం కోసం రూపొందించారు. సాధరణంగా బేకరిల్లో పని మొత్తం రాత్రిపూటే జరుగుతుంది. యజమానుల పని ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. అందుకని యజమానులు వారంలో ఏడు రోజులు పని చేస్తానంటే అందుకు అక్కడి చట్టాలు ఒప్పుకోవు. ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకే వైవ్రీకి జరిమానా విధించింది అక్కడి ప్రభుత్వం. దీనిపై టౌన్ మేయర్ క్రిస్టియాన్ బ్రాన్లే స్పందిస్తూ... ‘వేసవిలో వచ్చే సందర్శకులే మాకు ప్రధాన ఆదాయ వనరు. ఒక్క రోజు వ్యాపారాన్ని మూసివేస్తే మాకు వచ్చే లాభాలు తగ్గిపోతాయి. ఇలాంటి చట్టాలన్నీ మా వ్యాపారాలకు ఆటంకంగా మారాయి’ అని అన్నారు. ఇక్కడి ప్రజలు కూడా వైవ్రీకే మద్దతు ఇస్తున్నారు. వారంలో ఏడు రోజులు పనిచేయాలనే వైవ్రీ వాదనను సమర్థిస్తూ దాదాపు 500 మంది సంతకాలు చేశారు. అయినప్పటికీ వైవ్రీ జరిమాన చెల్లించాల్సి వచ్చింది. -
బేకరీ నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్, అబిడ్స్ : నగరంలో పేరుగాంచిన ఓ బేకరీ నిర్లక్ష్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీహెచ్ఎంసీ ఫుడ్ విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షించే బేకరీలు, హోటళ్లలో నాణ్యతతో పాటు కనీసం ప్యాకింగ్ తేదీలను కూడా సక్రమంగా ముద్రించడంలేదు. ఇందుకు ఉదాహరణే బుధవారం ఎంజే మార్కెట్ సమీపంలోని ఓబేకరీ నిర్వాకం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బిల్క్‌బ్రెడ్‌పై ముందుగా ప్యాకింగ్ తేదీని 05–10–2017 అని ప్రచురించి బేకరీ యాజమాన్యం పప్పులో కాలేసింది. ఇలా ఒకరోజు ముందుగా ఎలా తేదీని ప్యాకెట్‌పై ఎలా వేస్తారని వాట్సాప్, ఫేస్బుక్లో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ కేసు నమోదయ్యేనా... బహిరంగంగా నిర్లక్ష్యంగా వహించిన బేకరీ యాజమాన్యం జీహెచ్ఎంసీ ఫుడ్ అధికారులుగానీ, పోలీసులుగానీ ఏ మేరకు కేసు నమోదు చేస్తారో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై బేగంబజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును వివరణ కోరగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. -
అంబరాన్నంటిన ‘నూతన’ సంబరాలు
► నోరూరించే వంటలు..వెరైటీ కేక్‌లు ►అర్ధరాత్రి దాటే వరకూ సంబరాలు ► వేడుకలు ఘనంగా జరుపుకున్న ప్రజానీకం నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజానీకం ఘనంగా జరుపుకుంది. అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. కొత్త సంవత్సరానికి నోరూరించే రుచులు..వెరైటీ కేక్‌లు స్వాగతం పలికాయి. జిల్లా యావత్ ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. 2016కు వీడ్కోలు చెబుతూ 2017కు స్వాగతం పలికారు. నిర్మల్‌రూరల్ : ‘హ్యాపీ న్యూ ఇయర్...’ అంటూ జిల్లావాసులు జోష్‌గా 2017కు స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం నుంచే మొదలయిన న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగాయి. కేక్‌లు కట్ చేస్తూ ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మార్కెట్లో సందడి నెలకొంది. బేకరీలు కిటకిటలాడాయి. నోరూరించే నాన్ వెజ్ వంటకాలను తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. జిల్లా కేంద్రంలోని శాస్రీ్తనగర్, దివ్యనగర్‌లో గల వాసవి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌లు తినిపించుకుంటూ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలల ప్రిన్సిపాల్లు సుహాసిని, రాందాస్, డైరెక్టర్ జగదీశ్‌రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీక్ష డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ప్రిన్సిపాల్ మెంగ శ్రీధర్ కేక్ కట్ చేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖానాపూర్ : నూతన సంవత్సర వేడుకలను పట్టణ ప్రజానీకం స్వాగతం పలికింది. బేకరీ దుకాణాలు కేక్‌ల కొనుగోలుదార్లతో సందడిగా మారాయి. ఇదే అదనుగా నిర్వహకులు వివిధ రకాల ఆఫర్లు పెట్టి వ్యాపారం చేసుకున్నారు. యువత అర్ధరాత్రి దాటే వరకూ సంబరాల్లో మునిగితేలారు. -
బేకరీలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
పుణే: పుణేలోని కోండ్వాలో ఓ బేకరీలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ‘బేకరీ అండ్ కేక్స్’ బేకరీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బయటకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం ప్రమాద సమయంలో బయటి నుంచి మూసివేసి ఉన్నట్లు తెలిసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. వారు బేకరీలో ఓ గదిలో నిద్రిస్తుండగా ప్రమాదం సంభవించడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారని, ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 4.45 గంటలకు బేకరీలో మంటలు రేగడంతో అగ్ని మాపక యంత్రాలను హుటాహుటిన రప్పించారు. సిబ్బంది దుకాణం షట్టర్ బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తుండగా యజమాని వచ్చి దాన్ని తెరిచారు. ప్రధాన షట్టర్ మూసివేసి ఉండటంతో బాధితులు మంటల్లో చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కోండ్వా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బస్సు కాలువలో పడి పది మంది మృతి సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో లెహర్‌పూర్ బిశ్వా రోడ్డులోని శారదా కాలువలో ఓ ప్రైవేటు బస్సు పడిన దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. -
బేకరి బాయ్ నుంచి మేయర్ వరకు
ఆయనది చిన్నప్పటి నుంచి ముళ్లబాటే. చదువుకునే రోజుల్లోనే తండ్రి దూరమయ్యాడు. అందరికంటే చిన్నవాడైనా ఇంటి బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఇది.. అదీ అని చూడకుండా బేకరీలో, కూరగాయల మార్కెట్లో ఇలా.. అన్ని పనులూ చేశాడు. వైన్‌షాప్‌లో బిల్రైటర్గా చేరి.. వర్కింగ్ పార్ట్నర్ అయ్యూడు. అదే ఆయన వ్యాపారానికి తొలి మెట్టు. తప్పుని సహించని తత్వంతో రాజకీయంలోకి వచ్చాడు. జీవిత భాగస్వామి ఆయనకు పెద్ద ఆస్తి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నానుడి ఆయన జీవితంలో నిజమైంది. ఎంత సంపాదించినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా లారీ డ్రైవర్ కొడుకుననే విషయూన్ని మరిచిపోనంటున్న గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ -
కూలిన చిన్న విమానం
-
బలి తీసుకున్న బర్గర్
-
‘స్వచ్ఛత’ సమరం
హోటళ్లు,రెస్టారెంట్లలో పరిశుభ్రతపై సూచికలు మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక శాఖ నేటి నుంచి జిల్లాలోని అన్ని పట్టణాల్లో అమలు జిల్లాలో ఆహార పదార్థాల విక్రయాల వ్యాపారంలో పరిశుభ్రత కనిపించడం లేదు. రోగకారక అంగళ్లుగా మారిన హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై పురపాలక అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఇకపై ఆహార పదార్థాల తయారీ, నాణ్యతా ప్రమాణాల విషయంలో తగిన జాగ్రత్తలు వహించకపోతే ఇబ్బందులు తప్పవుని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని కోసం మున్సిపాలిటీలు మంగళవారం నుంచి అపరిశుభ్రతపై ‘స్వచ్ఛత’ సమరానికి సిద్ధమవుతున్నాయి. సత్తెనపల్లి, న్యూస్‌లైన్ ప్రజారోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలు,ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బయట విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రత, నాణ్యతపై అవగాహన కోసం పురపాలక, నగర పాలక సంస్థల్లో మంగళవారం నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని పురపాలక శాఖ సంచాలకుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ‘స్వచ్ఛత’పేరుతో ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 3 వరకు వారం రోజులపాటు గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఆహార పదార్థాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు మున్సిపల్ సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు చేపడతారు. 25న మున్సిపాలిటీల పరిధిలో ఉన్న హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాటరింగ్ గ్రూప్స్, కమ్యూనిటీ హోటళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్కిస్తారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు వాటిని ప్రజారోగ్య అధికారి, మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేయాలి. ఇందులో వంటశాలలు, ఆహార పదార్థాల నిల్వ, తయారీ, మంచినీటి వసతి, పాలిథిన్ వాడకం, మలమూత్ర విసర్జన శాలలు, ఇతర విషయాలను పరిశీలించి నమోదు చేయాల్సి ఉంటుంది. 26 నుంచి నాలుగు రోజుల పాటు వంటగదుల నిర్వహణ, వంట చేసే తీరు, నిల్వ ఉంచుతున్న తీరును పరిశీలిస్తారు. అనంతరం ఆయా హోటళ్ళ యజమానులతో సమావేశం నిర్వహిస్తారు. 28న వంట సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు మార్చి 1 నుంచి అన్ని హోటళ్లు, బార్ అండ్ రెస్టాంట్లలో ఆహారం తీసుకునేటప్పుడు తీసు కోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు, ఆహారం వృథాతో జరిగే నష్టాలను తెలియజేసేలా సూచికలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. హోటళ్ళను పరిశీలించాలి హోటళ్ళు, రెస్టారెంట్లు, కళ్యాణమండపాలు తది తర వాటిల్లో ప్రజలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, వంటశాలలను మున్సిపల్ సిబ్బంది పరిశీ లించాలి. 26న ఆయా నిర్వాహకుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేస్తాం. ఏమాత్రం హోటళ్ళల్లో పరిశుభ్రత లేకపోయినా, నిల్వ ఆహార పదార్థాలను విక్రయించినా సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్య విషయంలో ఆయా నిర్వాహకులు సహకరించాలి. - సిరిసిల్ల సత్యబాబు, మున్సిపల్ కమిషనర్, సత్తెనపల్లి -
బేకరీలో పేలిన గ్యాస్ సిలిండర్
మూడంతస్తుల భవనానికి వ్యాపించిన మంటలు 10 లక్షల ఆస్తి నష్టం నగరం నడిబొడ్డున.. నిత్యం రద్దీగా ఉండే శ్రీనివాస థియేటర్ సమీపంలోని ఓ బేకరీలో శనివారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మూడంతస్తులపైకి వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల దుకాణాలను మూసేశారు. భయంతో జనం పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణనష్టమూ కలగలేదు. తిరుపతి క్రైం,న్యూస్‌లైన్ : తిరుపతిలోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని సాయిబాబా గుడికి ఎదురుగా న్యూ బెంగళూరు బేకరీ ఉంది. దీన్ని హెచ్డీ శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. బేకరీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. మొదటి అంతస్తులో బేకరీకి సంబంధించిన ఐటమ్స్,ఫుడ్‌ఐటమ్స్‌ను తయారు చేస్తారు. ఇక్కడ కొన్ని మిషన్లు కూడా ఉన్నాయి. బేకరీలో ఆరుగురు వర్కర్లు పనిచేస్తున్నారు. బేకరీకి కుడివైపున పసుపర్తి సూపర్‌మార్కె ట్, ఎడమవైపున శ్రీరామ్ సిటీ ఫైనాన్స్, గ్రామీణ బ్యాంక్ శాఖతో పాటు ఇతర కార్యాలయాలు ఉన్నా యి. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బేకరీ ఉన్న మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మొదటి అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వ్యాపించాయి. సిలిండర్ పేలడంతో చుట్టుపక్కల ఉన్న దుకాణాలను మూసేశారు. జనం పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. సిలిండర్ పేలిన సమయంలో మొదటి అంతస్తులో వర్కర్లు లేక పోవడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. ఆ సమయంలో బేకరీ యజమాని శ్రీనివాస్ భోజనానికి ఇంటికి వెళ్లారు. వర్కర్లు బేకరీలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మొదటి అంతస్తులో 60 లీటర్ల డీజిల్ ఉన్నట్టు తెలిసింది. ఉదయం నుంచీ శ్రీనివాస థియేటర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా లేదు. స్పందించిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక అధికారి రమణయ్య సిబ్బంది తో కలసి రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు గంటలు పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. వెస్ట్,ఈస్ట్ ఎస్ఐలు వినోద్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు ఈశ్వర్, రామయ్య, రవితేజ,దేవ సకాలంలో స్పందించి గ్యాస్ సిలిండర్ పేలిన ప్రాంతంలోని దుకాణదారులను అప్రమత్తం చేశారు. వాహనదారులను, ప్రజలను అటువైపు రాకుండా కట్టడి చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మంటల ను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిం చారు. 10 లక్షల రూపాయలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లిందని బేకరీ యజమాని శ్రీనివాస్ ఈస్ట్ ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేరళ కేటుగాడు..
పరిగి, న్యూస్‌లైన్: పదమూడేళ్ల క్రితం వలస వచ్చాడు. చిన్నాచితక వ్యాపారాలు చేశాడు. అనంతరం ఓ బేకరీ ప్రారంభించి మంచి సేవలు అందిస్తూ స్థానికులకు నమ్మకంగా మెలిగాడు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద దాదాపు రూ. 50 లక్షల వరకు అప్పులు చేసి ఉడాయించాడు. ఆదివారం అసలు విషయం తెలుసుకున్న బాధితులు నిందితుడి బేకరీ వద్ద ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన ముజీబ్(35) పదమూడు సంవత్సరాల క్రితం పరిగికి వలస వచ్చాడు. మొదట్లో చిన్నచిన్న వ్యాపారాలు చేశాడు. దాదాపు ఐదేళ్ల క్రితం పరిగి పట్టణంలోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ పక్కన రాయల్ పేరుతో ఓ బేకరీ ప్రారంభించాడు. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ స్థానికులకు మంచి సేవలు అందించాడు. చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. అనంతరం ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద దాదాపు రూ. 50 లక్షల వరకు అప్పులు చేశాడు. కొందరి వద్ద చిట్టీలు వేసి పాడుకున్నాడు. ఇటీవల బక్రీద్ పండుగకు మందుకు స్వస్థలానికి వెళ్తున్నట్లు స్థానికులకు చెప్పి వెళ్లాడు. పండుగ దాటి దాదాపు 15 రోజులు గడిచినా అతడి జాడ లేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు ఫోన్లు చేయడం ఆరంభించారు. ‘నేను దుబాయ్ వెళ్తున్నాను.. అక్కడికి వెళ్లాక మీ ఖాతాల్లో డబ్బులు వేస్తాను.. పరేషాన్ అవసరం లేదు’ అని నమ్మబలికాడు. ఆ తర్వాత ముజీబ్ ఫోన్లకు స్పందించడం మానేశాడు. దీంతో ముజీబ్ తమకు టోకరా వేశాడని అనుమానించిన బాధితులు ఆదివారం సాయంత్రం అతడి బేకరీ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న సామగ్రిని కొందరు తీసుకెళ్లారు. కేరళ కేటుగాడి టోకరా విషయం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.