పుణే: పుణేలోని కోండ్వాలో ఓ బేకరీలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ‘బేకరీ అండ్ కేక్స్’ బేకరీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బయటకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం ప్రమాద సమయంలో బయటి నుంచి మూసివేసి ఉన్నట్లు తెలిసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. వారు బేకరీలో ఓ గదిలో నిద్రిస్తుండగా ప్రమాదం సంభవించడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారని, ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించినట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 4.45 గంటలకు బేకరీలో మంటలు రేగడంతో అగ్ని మాపక యంత్రాలను హుటాహుటిన రప్పించారు. సిబ్బంది దుకాణం షట్టర్ బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తుండగా యజమాని వచ్చి దాన్ని తెరిచారు. ప్రధాన షట్టర్ మూసివేసి ఉండటంతో బాధితులు మంటల్లో చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కోండ్వా పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
బస్సు కాలువలో పడి పది మంది మృతి
సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో లెహర్‌పూర్ బిశ్వా రోడ్డులోని శారదా కాలువలో ఓ ప్రైవేటు బస్సు పడిన దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు.
బేకరీలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
Published Sat, Dec 31 2016 2:18 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement