మాస్కో: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లిసిచాన్‌స్క్ నగరంలోని ఓ బేకరీపై జరిగిన దాడిలో 28 మంది మృతి చెందారు. రష్యా నియమించిన స్థానిక అధికారి ఈ విషయం వెల్లడించారు. బేకరీ కుప్పకూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన మరో 10 మందిని కాపాడినట్లు చెప్పారు. ఘటనపై ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు.
ఈ శీతాకాలంలో సుమారు 930 మైళ్ల మేర విస్తరించి ఉన్న యుద్ధ క్షేత్రంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. రష్యా, ఉక్రెయిన్ సైన్యాలు ఎక్కువగా దీర్ఘ శ్రేణి దాడులపైనే ఆధారపడ్డాయి. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో రష్యా బలగాలు పలు ప్రాంతాల్లో తమ సేనలపైకి పదేపదే దాడులతో ఒత్తిడి తీవ్రతరం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment