కీవ్: రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరం క్రివి్వ్యరిహ్‌పై రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో పదేళ్ల బాలిక సహా ఆరుగురు చనిపోయారు. ఈ దాడుల్లో ఓ అపార్టుమెంట్, నాలుగంతస్తుల యూనివర్సిటీ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పదేళ్ల బాలిక, ఆమె తల్లి సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 64 మంది గాయాలపాలయ్యారని నీప్రో గవర్నర్ సెర్హీ లిసాక్ తెలిపారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెప్పారు.
పలు వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. రష్యా పాక్షికంగా ఆక్రమించిన డొనెట్‌స్క్ ప్రావిన్స్‌లో జరిగిన దాడిలో ఇద్దరు చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడికి కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. కాగా, మాస్కోపైకి ఆదివారం డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్ సోమవారం రష్యాలోని బ్రియాన్‌స్క్‌పై డ్రోన్ దాడి జరిపింది. ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదని స్థానిక గవర్నర్ చెప్పారు. ఖరీ్కవ్, ఖెర్సన్, డొనెట్‌స్‌్కలపై రష్యా శతఘ్ని కాల్పుల్లో ముగ్గురు చనిపోగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment