ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం మధ్యే క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్న కీవ్‌వాసులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా 76 క్షిపణులతో జరిపిన దాడుల బీభత్సం అంతా ఇంతా కాదు. విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా చేసిన దాడులతో పలు నగరాలు అంధకారంలో మగ్గిపోయాయి. గడ్డకట్టించే చలిలో విద్యుత్ సదుపాయం లేకుండా చేస్తే ఆ చలిని తట్టుకోలేక సైనికులు, పౌరులు ఉక్రెయిన్ వీడి వెళ్లిపోతారన్న వ్యూహంతో రష్యా ఈ దాడులకు దిగింది. 76 క్షిపణుల్లో ఎన్నింటిని ఉక్రెయిన్ వాయు సేన అడ్డుకోగలిగిందో స్పష్టమైన అంచనాలు లేవు.
క్రివీయ్ రియా ప్రాంతంలో రాకెట్ దాడిలో ఒక ఇల్లుపూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న కుటుంబసభ్యులు నలుగురు మరణించారు. వారిలో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఉండడం అందరినీ కంట తడిపెట్టిస్తోంది. నికోపోల్, మార్హానెట్స్, చెర్వోనోహ్రిహోరి్వకా వంటి నగరాల్లో విద్యుత్ లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా నగరాల్లో జీరో కంటే తక్కువకి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విపరీతమైన చలి వణికిస్తూ ఉన్న సమయంలో విద్యుత్ లేకపోవడంతో హీటర్లు పని చేయక ప్రజలు గడ్డకట్టుకుపోతున్నారు. ప్రస్తుతం అధికారులు విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. మరోవైపు రష్యా మరిన్ని క్షిపణి దాడులు చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.
ఇదీ చదవండి: చైనాలో వచ్చే ఏడాది కోవిడ్‌తో 10 లక్షల మంది మృతి?
Comments
Please login to add a commentAdd a comment