బెంగళూరులో పలు బేకరీలలో ఆహార
భద్రతా శాఖ తనిఖీలలో వెల్లడి
కృత్రిమ రంగులతో అపాయం
సాక్షి, బెంగళూరు: కేక్ అనగానే అందరికీ నోరూరుతుంది. ఏ శుభ సందర్భం వచ్చినా కేక్ ముక్కలు కావాల్సిందే. అంతగా కేక్ జీవితంలో భాగమైపోయింది. అయితే నాణేనికి మరోవైపు ఇంకోలా ఉంది. కేక్‌ల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారక అంశాలు ఉన్నట్లు రాష్ట్ర ఆహార భద్రత, నాణ్యత శాఖ తెలిపింది. కొన్ని రోజుల క్రితమే గోబీ మంచరియా, కబాబ్, పానిపూరీ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఈ శాఖ హెచ్చరించడం తెలిసిందే. ఇప్పుడు కేక్‌ల గురించి ప్రకటన చేసింది.
12 రకాల కేక్‌లలో ముప్పు
బెంగళూరులోని కొన్ని బేకరీలలో కేక్‌లను పరీక్షించగా 12 రకాల కేక్‌లల్లో క్యాన్సర్‌ను కలిగించే కారకాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. వాటిలో వాడే రంగులు ప్రమాదకరమని తెలిపింది. కేక్‌ల తయారీలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించాలని బేకరీలకు ఆ సంబంధిత శాఖ హెచ్చరించింది. క్యాన్సరే కాకుండా శారీకర, మానసిక అనారోగ్యాలకూ కారణమవుతాయని తేల్చారు.
రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్‌లో ఎక్కువ
ఈ సమాచారంతో కేక్ ప్రియుల్లో కలవరం ఏర్పడింది. అందరూ కూడా ఎప్పుడో ఒకసారి కేక్‌ను తినేవారే. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ సహా అనేక కేకులు ఆకర్షణీయంగా ఉండేలా పలు రంగులను కలుపుతారు. ఈ కృత్రిమ రంగుల వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ కృత్రిమ రంగులను వాడకూడదని, ఆరోగ్య సూత్రాలను పాటించాలని పలుమార్లు దుకాణ యజమానులను హెచ్చరించినా వాటిని బేఖాతరు చేస్తున్నారని ఆహార భద్రత అధికారులు తెలిపారు. చాలా కేకుల్లో క్యాన్సర్ కారకాలను అధికారులు గుర్తించారు. ప్రధానంగా రెడ్‌వెల్‌వెట్ , బ్లాక్‌ఫారెస్ట్ కేకుల్లో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి
ప్రతి నెలా ఆహార పదార్థాలను పరీక్షలకు పంపించి నివేదికలు తీసుకుంటాం. హోటల్, బేకరీలల్లో నుంచి శాంపుల్స్‌ను సేకరించి తనిఖీలు చేస్తాం. ఆహారం నాణ్యతగా ఉండాలి. ఒకవేళ నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు చెప్పారు.
ఏయే ప్రమాదకర రంగులు, వాటి పర్యవసానాలు
అలూర రెడ్– అలర్జీ, ఆస్తమా, జీర్ణక్రియ సమస్యలు, తలనొప్పి
సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సీఎఫ్– అలర్జీ, హైపర్ యాక్టివిటీ, క్రోమోజోమ్ డ్యామేజీ, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి
పొనుయా 4ఆర్– పిల్లల ప్రవర్తనలో మార్పులు, అలర్జీ, ఆస్తమా
టార్టాజైన్ – చర్మంపై దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పి, ఒత్తిడి, నిరాశ, దృష్టి లోపాలు, నిద్రహీనత, గ్యా్రస్టిక్ సమస్య
కార్మొసియాన్ – చర్మంపై వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హైపర్ సెన్సిటివిటీ
Comments
Please login to add a commentAdd a comment