హోం బేకర్స్‌..! ఇంట్లో కిచెన్‌లోనే బేకరీ ఏర్పాటు..! | A Bakery Is Set Up In The Kitchen Itself Sakshi City Plus Stories | Sakshi
Sakshi News home page

హోం బేకర్స్‌..! ఇంట్లో కిచెన్‌లోనే బేకరీ ఏర్పాటు..!

Published Wed, Jul 31 2024 12:15 PM | Last Updated on Wed, Jul 31 2024 12:15 PM

A Bakery Is Set Up In The Kitchen Itself Sakshi City Plus Stories

ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి క్లౌడ్‌ కిచెన్‌ కాన్సెప్‌్టతో ముందుకు స్పెషల్‌ థీమ్స్‌తో ఔరా అనిపించుకుంటున్న యువత కాస్తంత సృజనాత్మకతకు ఆలోచన తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చు. పలువురు యువత ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కళల పట్ల ఉన్న ఆసక్తికి, ఆలోచనను జత చేసి ఎంట్రప్రెన్యూర్స్‌గా విజయతీరాలను చేరుకుంటున్నారు. సాధారణంగా బిజినెస్‌ చేయాలంటే పెట్టుబడి, అనువైన ప్రాంతం దొరకాలి.. అంత కష్టపడి వ్యాపారం చేస్తే, అది సక్సెస్‌ అవుతుందా అనే అనుమానం ఉంటుంది. అందుకే ఈ తరం యువత సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. క్లౌడ్‌ కిచెన్‌ కాన్సెప్‌్టతో ముందడుగు వేస్తున్నారు. ఇటీవల హోం బేకర్స్‌ నడుపుతూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

పలు థీమ్స్‌తో కేక్స్‌ తయారీ..
సాధారణంగా పుట్టినరోజు, పెళ్లి, న్యూఇయర్‌ ఇలా చాలా సందర్భాల్లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటుంటాం. అయితే ఎప్పుడూ ఒకే రకమైన కేక్‌ కట్‌ చేస్తుంటే మజా ఏముంటుందని, కొందరు విభిన్న రకాల కేకులు ఆర్డర్‌ చేస్తుంటారు. పిల్లల కోసం స్పైడర్‌మ్యాన్, ఏనుగు, బార్బీ, పెళ్లి రోజు, ఎంగేజ్‌మెంట్‌ కోసం ప్రత్యేక థీమ్స్‌తో కేకులు తయారు చేస్తుంటారు. కస్టమర్లకు నచి్చన థీమ్స్‌ తయారు చేసేందుకు తాము ఎంతో కష్టపడుతుంటామని చెబుతున్నారు.

పూర్తి సహజంగా.. 
ఎలాంటి రసాయనాలూ లేకుండా పూర్తిగా సహజ పదార్థాలతో తయారుచేయాలనే ఉద్దేశంతో చాలామంది హోం బేకర్స్‌ను ప్రారంభించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు పరిశుభ్రమైన వాతావారణంలో మన ఇంట్లో తయారు చేసినట్టుగానే కస్టమర్లకు పదార్థాలు తయారు చేసి ఇస్తామని పేర్కొంటున్నారు. చాలా బేకరీల్లో డాల్డాతో తయారుచేస్తారని, అయితే తాము మాత్రం బట్టర్, బ్రౌన్‌ షుగర్‌ను వాడతామని హోం బేకరీ నిర్వాహకులు చెబుతున్నారు.

ఇంట్లో కిచెన్‌లోనే..
సాధారణంగా బేకరీ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ హోం బేకరీని తక్కువ ఖర్చుతోనే ఇంట్లో కిచెన్‌లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలాగూ ఇంట్లో వంటకాలను చాలా పరిశుభ్రమైన పరిసరాల్లోనే తయారు చేస్తుంటారు. కాబట్టి అక్కడే చిన్న ఓవెన్‌ వంటి చిన్న చిన్న పరికరాలతో కేకులు, కుకీస్‌ తయారు చేస్తున్నారు. కేక్స్, కుకీస్‌తో పాటు మఫిన్స్, చీజ్‌ కేకులు, డోనట్స్‌ వంటి ఉత్పత్తులతో చుట్టు పక్కల వారితో ఔరా అనిపించుకుంటున్నారు.

సాధికారత కోసం..
చాలా మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ హోం బేకర్స్‌ ప్రారంభిస్తున్నటు చెబుతున్నారు. ఇంట్లో వారి పై ఆధారపడకుండా సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయమే వారిలో కనిపిస్తోంది. తమలో ఉన్న సృజనాత్మకతను నలుగురూ మెచ్చుకుంటే అంతే చాలు అని చెబుతున్నారు.

ఇది కూడా సమాజ సేవే..
ఆరోగ్యకరమైన పదార్థాలు అందిస్తే కూడా సమాజానికి సేవ చేసినట్టే అనేది నా నమ్మకం. కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా, మన పనులు భిన్నంగా ఉండి, సమాజంలో గుర్తింపు రావాలనేది నా తాపత్రయం. అందులో భాగంగానే హోం బేకర్స్‌ కాన్సెప్ట్‌ ఆలోచన వచి్చంది. నా కేక్స్‌ డిజైన్స్‌ బాగున్నాయని అందరూ మెచ్చుకుంటుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. – సాయి శ్రీ, ఓవెన్‌ కుక్‌ డిలైట్‌

చాలా టేస్టీగా ఉంటాయి..
నేను చాలా సార్లు హోం బేకర్స్‌ నుంచి కేక్స్‌ ఆర్డర్‌ చేసుకున్నాను. సాధారణ బేకరీల కన్నా ఇక్కడ చాలా హైజీనిక్‌తో పాటు రుచికరంగా ఉంటాయి. ఎలాంటి డిజైన్‌ కావాలంటే అలాంటి డిజైన్స్‌లో ఇస్తుంటారు. తక్కువ ధరలోనే మంచి కేక్స్‌ వస్తున్నాయి. – మెరుగు శివ ప్రకాశ్‌ నాయుడు

ఇవి చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement