బాలీవుడ్ నటి రిచా చద్దా ఈ మధ్యనే జూలై లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. నిజానికి, ఏడాది క్రితం వరకు ఆమె – పిల్లల్ని అస్సలు కనకూడదనే అనుకున్నారు! ఆమెలోని ఎకో యాంగ్జైటీనే అందుకు కారణం. ‘ఇంతటి విపరీతమైన వాతావరణ మార్పుల్లో పిల్లల్ని భూమి మీదకు తెచ్చిపడేయటం ఎలారా దేవుడా.. ‘అని ఆకాశం వైపు దీనంగా చూసేవారట రిచా.
ఉదయ లేస్తూనే భూతాపం గురించి ఆలోచించటం, లేచాక కిటికీ లోంచి పొల్యూషన్ లోని తీవ్రతను అంచనా వేయటం రిచాకు అలవాటైపోయింది. ‘మొన్నటి వరకు అతి వేడి. ఇప్పుడు అతి చలి. ఈ మార్పులు నా బిడ్డపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నాను. తనకు వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ వే. అలాంటి కొన్ని బేబీ ఐటమ్స్ ని నా స్నేహితురాళ్లు దియా మీర్జా, సోహా అలీ ఖాన్, ఇంకా నా పేరెంటల్ యోగా ఇన్‌స్ట్రక్టర్ నాకు కానుకగా ఇచ్చారు.
నా చుట్టూ వాళ్లంతా నా ఆందోళనను కనిపెట్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా పాప పెంపకంలో నాకు తోడ్పడుతున్నారు. టిప్స్ ఇస్తున్నారు’ అని ‘ఓగ్స్ ఇండియా‘కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు రిచా. ఇక ఆమె భర్త అలీ ఫజల్ గురించి చెప్పే పనే లేదు. ఈ ’మీర్జాపుర్ ’ యాక్టర్.. సింగిల్ యూస్ లాస్టిక్‌కి ఎప్పట్నుంచో వ్యతిరేకి.
భార్యాభర్తలు షాపింగ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వాళ్ళ యాకేజీల్లో ఏ రూపంలోనూ ప్లాస్టిక్ అన్నదే ఉండదు. బిడ్డ పుట్టాకయితే వాళ్ళు మరీ మరీ జాగ్రత్తగా ఉంటున్నారు. పిల్లలు పుట్టక ముందు నుంచే, పుట్టబోయేవారి సంరక్షణ గురించి, వారి కోసం భూతాపాన్ని తమ వంతుగా తగ్గించటం గురించి ఆలోచించే ఇటువంటి తల్లిదండ్రుల వల్లనే రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. భూమి తల్లి వారిని చల్లగా చూస్తుంది.
(చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!)
Comments
Please login to add a commentAdd a comment