samadhi
-
సమాధి ఆక్రమణపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్(డీసీడబ్ల్యూఏ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. 700 ఏళ్ల చరిత్ర ఉన్న లోధి హయాం నాటి సమాధిని ఆక్రమించుకోవడం పట్ల మండిపడింది. ఆ సమాధిని ఎందుకు పరిరక్షించకపోతున్నారని భారత పురావస్తు పరిశోధన విభాగాన్ని(ఏఎస్ఐ) ప్రశ్నించింది. ఆ ప్రాచీన కట్టడానికి ఎంత మేరకు నష్టం జరిగిందో అధ్యయనం చేయడానికి, పునరుద్ధరణకు అవసరమైన చర్యలను సూచించడానికి పురావస్తు నిపుణుడిని నియమిస్తామని వెల్లడించింది. 15వ శతాబ్దంలో నిర్మించిన సమాధికి చెందిన స్థలాన్ని, కట్టడాలను 1960వ దశకంలో డీసీడబ్ల్యూఏ ఆక్రమించుకుంది. ఓ గదిలో కార్యాలయం సైతం ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రాచీన కట్టడాన్ని సంఘ విద్రోహ శక్తులు చాలావరకు ధ్వంసం చేశామని, అందుకే తాము ఆ«దీనంలోకి తీసుకున్నామని డీసీడబ్ల్యూఏ వాదించింది. ప్రాచీన కట్టడాన్ని ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ డిఫెన్స్ కాలనీకి చెందిన రాజీవ్ సూరీ తొలుత ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. ఆ సమాధిని రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని, దాన్ని పరిరక్షించేలా ప్రభుత్వ అధికారులకు ఆదేశించాలని కోరారు. ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మానం బుధవారం విచారణ చేపట్టింది. సమాధికి చెందిన గదిలో ఏసీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని ఆక్షేపించింది. దానికి అద్దె చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించింది. ప్రాచీన కట్డడాలను కాపాడాల్సిన ఏఎస్ఐ ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమాధి స్థలాన్ని ఖాళీ చేయాలని డీసీడబ్ల్యూఏను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. -
సజీవ సమాధికి స్వామీజీ యత్నం
మద్దూరు: ఓ స్వామీజీ ఐదురోజులు సమాధికి ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న పోలీసులు నిలువరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్లలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రెనివట్ల గ్రామానికి చెందిన సత్యానందస్వామి అలియాస్ హనుమంతు కొద్దిరోజులుగా వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడిగా చెలామణి అవుతున్నాడు. ఈయన భార్య ఏడాది క్రితం పొలంలో ఎద్దు పొడవడంతో మృతిచెందింది. దీంతో ఆమెకు పొలంలోనే సమాధి కట్టించి పూజిస్తున్నాడు.అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కొంతమందిని శిష్యులుగా చేసుకున్నాడు. శుక్రవారం అమావాస్య రోజున ‘తాను ఐదు రోజులు సమాధిలోకి వెళతానని.. బయట అఖండభజనలు చేయాలని’ భక్తులకు చెప్పి సమాధిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని సమాధిలో ఉన్న స్వామీజీని బయటకు రప్పించారు. అనంతరం డాక్టర్ స్వామీజీకి వైద్య పరీక్షలు చేయగా, ఆర్యోగం నిలకడగా ఉంది. కొన్నేళ్ల క్రితం స్వగృహంలోనే ఒక అమావాస్య రోజు హనుమంతు మౌనదీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటక చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుండటంతో సొంత పొలంలోనే జీవ సమాధి కోసం ఒక ఆలయం నిర్మించినట్టు గ్రామస్తులు చెప్పారు. -
తనువు చాలించిన విద్యాసాగర్ మహారాజ్ .. ప్రధాని మోదీ నివాళి!
ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ శనివారం తనువు చాలించారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు తన దేహాన్ని విడిచిపెట్టారు. దీనికి ముందు ఆయన ఆచార్య పదవిని వదులుకున్నారు. మూడు రోజులపాటు ఉపవాసం ఉంటూ, మౌనం పాటించారు. అనంతరం ప్రాణాలు విడిచారు. విద్యాసాగర్ మహారాజ్ మరణవార్త తెలియగానే జైన సమాజానికి చెందిన పలువురు చంద్రగిరి జైన దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. My thoughts and prayers are with the countless devotees of Acharya Shri 108 Vidhyasagar Ji Maharaj Ji. He will be remembered by the coming generations for his invaluable contributions to society, especially his efforts towards spiritual awakening among people, his work towards… pic.twitter.com/jiMMYhxE9r — Narendra Modi (@narendramodi) February 18, 2024 -
చంద్రబాబూ ఆత్మవిమర్శ చేసుకో
ఖైరతాబాద్(హైదరాబాద్): ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. 74 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్‌ను అవమానాలకు గురిచేసి, చివరకు ఆయన చనిపోయేలా చేశావో, అదే 74వ ఏట మీరు చేసిన పాపాలు పండి అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన ఈ ఉద్వేగభరిత క్షణాల్ని నా భర్త సమాధితో పంచుకోవాలని ఇక్కడకు వచ్చి నివాళులు అర్పించినట్టు చెప్పారు. చంద్రబాబు ఎప్పటికీ తప్పించుకోలేడని ఎన్టీఆర్ ఆనాడు చెప్పిన మాటల్ని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నా భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలనే ఇంతకాలం బతికున్నానని, నా ఆశయం నా భర్త నిర్దేశించారని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశాడు. ప్రజల సొమ్ము దోచుకొని, అవినీతి కేసుల్లో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, అధికారం అడ్డుపెట్టుకొని వ్యవస్థలను కొనుక్కోవడం చేస్తూ వచ్చాడని, చివరికి అదే వ్యవస్థలో చిక్కుకుపోయి జైలు పాలయ్యాడని, ఇప్పుడు నా కోపం అంతా తీరిపోయిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఇప్పటికైనా ఆలోచించాలని, చంద్రబాబు అక్రమాలను మీరు సహిస్తారా... ప్రజాధనం లూటీ చేస్తూ దొరికిపోయాడు, ఆలోచించండన్నారు. నిప్పులాగా బతికిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఎక్కడ, అధికారం కోసం తడిగుడ్డతో గొంతులు కోసే మనస్తత్వం ఉన్న చంద్రబాబు గురించి తెలుసుకోవాలన్నారు. -
ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహం పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని వైఎస్సా ర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అల్వాల్ భూదేవి నగర్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లిన ఆమె ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, సమాధి వద్ద నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెల్పిన షర్మిల... ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించాల్సిన అవసరం ఉందని, గద్దర్ సొంత ఊరు తూప్రాన్‌లో ఆయన పేరిట స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. గద్దర్ చేత కంటతడి పెట్టించిన కేసీఆర్, ఆయ న కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నా రు. 9 ఏళ్లలో ఒక్కసారి కూడా గద్దర్‌కి కేసీఅర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. ఆయన విష యంలో కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరించారన్నారు. ప్రగతి భవన్ దగ్గర రోజంతా ఎదురు చూసినా లోపలకు పిలవకపోవడంతో.. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని గద్దర్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ అంటే గద్దర్‌కి చాలా ప్రేమ అని, నాతో చాలాసార్లు వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారన్నారు. -
యువకుడు సజీవ సమాధి...పోలీస్ ఎంట్రీతో తప్పిన ప్రమాదం
ఇంకా కొన్నిచోట్ల అమాయక భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు వారిచే అమానుష పనులు చేయిస్తున్నారు. మనల్ని మనం ఆత్మర్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడని, లేదా శరీరా భాగాలను దేవుడికి సమర్పిస్తే కనిపిస్తాడంటూ కొందరు స్వామీజీలు, బాబాలు తమ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు ఒక పూజారి మాయ మాటలు నమ్మి...ఒక పిచ్చిపని చేయబోయాడు. కానీ పోలీసులు సమయానికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని తాజ్పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు మాయమాటలు నమ్మి ఒక యువకుడు దారుణమైన పనికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉన్నావ్‌లోని తాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. తాజ్పూర్ గ్రామానికి చెందిన శుభమ్ గోస్వామీ అనే యువడకుడు నవరాత్రుల సందర్భంగా ఆరడగుల గోతులో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని ఆ సమాధి నుంచి బయటకు తీసి కాపాడారు. ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో ఆ యువకుడు..తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు. శివకేశవ్ దీక్షిత్, మున్నాలాల్ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే సఫలం అవుతుందని చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు తాను తన తండ్రి వినీత్ గోస్వామీ మరొకందరు సాయంతో భూమి లోపల ఆరుడుగుల గోతిలో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమైనట్లు వివరించాడు. ఐతే గ్రామంలో ఒక యువకుడు సజీవ సమాధి అయ్యాడంటూ వార్తలు గుప్పుమన్నాయని, దీంతో తాము చాలా భయందోళనలకు గురయ్యామని పోలీసులు తెలిపారు. నిందితులు మున్నాలాల్, శివ కేశవ్ దీక్షిత్ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐతే ఆ నిందితులు బాధితుడి నమ్మకాన్ని సోమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఇలా భూసమాధి కావాలనే కుట్రను పన్నినట్లు పేర్కొన్నారు. (చదవండి: అది రిసార్టు కాదు ..వ్యభిచార కూపం) -
‘అమ్మ’ ఆశీస్సుల కోసం అక్కడే వివాహం
-
‘అమ్మ’ ఆశీస్సుల కోసం అక్కడే వివాహం
చెన్నై: తమిళ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు ప్రత్యేక స్థానం ఉంది. జనాకర్షక పథకాలతో ప్రజల్లో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు జయలలిత. తమిళ రాజకీయాల్లో జనాల చేత ‘అమ్మ’ అని పిలిపించుకున్న వ్యక్తి జయలలిత మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మరణించి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి అభిమానులు మాత్రం ఆమెను ఇంకా మరచిపోలేదు. ఈ క్రమంలో జయలలిత అభిమాని, ఏఐఏడీఎంకే పార్టీ నాయకుడు ఒకరు అమ్మ సమాధి వేదికగా తన కుమారుడి వివాహం జరిపించాడు. ఆ వివరాలు.. ఏఐడీఏంకే నాయకుడు ఎస్ భవానీశంకర్ తన కుమారుడు సాంబశివరామన్ వివాహాన్ని అమ్మ సమాధి దగ్గర జరిపించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన కుమారుడికి అమ్మ ఆశీస్సులు అందాలనే ఉద్దేశంతోనే పెళ్లి ఏర్పాట్లు ఇక్కడ చేశానని తెలిపాడు భవానీశంకర్. అయితే అమ్మ సమాధి వద్ద వివాహం జరపించడానికి అధికారుల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకకు పలువురు పార్టీ ప్రముఖులతో పాటు కార్యకర్తలు కూడా హాజరయ్యారు. వివాహం సందర్భంగా అమ్మ సమాధిని అందంగా అలంకరించారు. -
కలియుగ కల్పవృక్షం
తెలుగువారు గొప్ప పుణ్యం చేసి ఉంటారు. కాకపోతే మరేంటి! దేశమంతా గోవిందా గోవిందా అని తల్చుకుంటూ చేరుకునే ఏడుకొండల శ్రీనివాసుడు మన దగ్గరే ఉన్నాడు. వైష్ణవులంతా అవతార పురుషునిగా భావించే రాఘవేంద్రుడూ ఇక్కడే ఉన్నాడు. ఈ శ్రావణ బహుళ విదియనాటికి (ఆగస్టు 17), రాఘవేంద్రస్వామివారు సజీవసమాధిని పొంది సరిగ్గా 348 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి గురించి... మానవ కళ్యాణం కోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటికాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే’’ అని చెప్పే ద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించిన మధ్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారం చేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మధ్వ సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మధ్వ సిద్ధాంత ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణం కోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాయలు. క్రీ.శ.1595 సంవత్సరం, మన్మథ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి. శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మధ్వప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేకమంది పండితులను ఓడించాడు. రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక’ అనే గ్రంథానికి ‘ప్రకాశం’ అనే వివరణ రాశారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక’సుధ, పరిమళ అనే మున్నగు గ్రంథాలను వ్రాసారు. భక్తులకు అనేక మహిమలు కూడ చూపాడు. ఆదోని పర్యటనలో స్వామి వున్నప్పుడు, ఆదోనిని పాలించే సిద్ధిమసూద్‌ఖాన్ అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు. స్వామిని పరీక్షించటానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ కప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రజలం చల్లగా మాంసం పువ్వులుగా మారాయి. దాంతో సిద్దిమసూద్‌ఖానే స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోర్కె మేరకు ‘మంచాల’ గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలువై వున్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటుచేసుకొని భక్తులకు మహిమలు చూపుతూ, మరోవైపు మధ్వప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1671, విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయరోజున రాఘవేంద్రులు సశరీరంతోనే బృందావనం ప్రవేశం చేసారు. స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయ నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఆనాటి నుంచి ఈ బృందావనం నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు. కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు. అందుకే ఆయన దేవుడయ్యాడు... శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి. గురువుల ఆనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. రాఘవేంద్ర స్వామివారి మూల మంత్రం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఆ అక్షతలే లక్షింతలుగా... పూజ్య రాఘవేంద్ర స్వామి వారి బృందావన దర్శనానికి వచ్చిన భక్తులకు మఠాధిపతులు పరిమళ భరితమైన మంత్రాక్షతలను లేదా మృత్తికను ఇచ్చి ఆశీర్వదిస్తుంటారు. స్వామివారు భౌతిక శరీర ధారులై ఉన్నప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. స్వామి తన భక్తులకు స్వయంగా ఇచ్చిన మృత్తిక కూడా ఎంతో మహిమాన్వితమైనదిగా పేరొందింది. పవిత్రమైన ఈ కుంకుమాక్షతలను భక్తులు ఇళ్లకు తీసుకువెళ్లి శుభకార్యాలలోనూ, ఇతరత్రా ఏమైనా ఆపత్సమయంలోనూ శిరస్సున ధరిస్తుంటారు. మహా రథోత్సవం ప్రతి యేటా శ్రావణ మాసంలో జరిగే రాఘవేంద్రుల ఆరాధనోత్సవానికి భక్తులు భారీ ఎత్తున హాజరవుతారు. ఇప్పటికే బుధవారం నాడు అంకురార్పణతో ఆరంభమైన ఈ ఉత్సవాలు శుక్ర, శని వారాలలో జరిగే పూర్వారాధన, మధ్యారాధన, నేడు జరగనున్న ఉత్తరారాధనగా జరుగుతాయి. ఈ రోజున మంత్రాలయంలో జరిగే మహా రథోత్సవం అత్యంత వైభవంగా... కన్నుల పండువగా జరుగుతుంది. ఆఖరిరోజైన 20వ తేదీన అనుమంత్రాలయంగా పేరొందిన తుంగభద్ర గ్రామంలో జరిగే రథోత్సవంతో స్వామివారి ఆరాధనోత్సవాలు ముగుస్తాయి. -
జైన సన్యాసిని జీవసమాధి
టీ.నగర్(తమిళనాడు): ఏడు రోజులపాటు సల్లేఖన వ్రతం చేపట్టిన 65 ఏళ్ల జైన సన్యాసిని శుక్రవారం జీవసమాధి పొందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. సల్లేఖన వ్రతంలో భాగంగా జైనులు క్రమంగా ఆహర స్వీకరణ తగ్గించి, చివరకు అన్నపానీయాల పూర్తిగా మానివేసి ప్రాణాలు విడుస్తారు. జైన సాంప్రదాయంలో ఈ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంది. కర్ణాటక రాష్ట్రం హవారి ప్రాంతానికి చెందిన శ్రీ సుబ్రబావుమతి 2012 సంవత్సరంలో కుటుంబ జీవనాన్ని విడనాడి సన్యాసం చేపట్టారు. తర్వాత మాతాజీగా దీక్ష పొంది శ్రీసుబ్రబావుమతి మాతాజీగా వ్యవహరించబడ్డారు. పలు ప్రాంతాల్లో ఉన్న జైన ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించిన ఈమె జైనుల ప్రధాన కేంద్రమైన మేల్‌సిత్తామూరులోని మఠంలో సల్లేఖన వ్రతం చేపట్టి జీవసమాధి పొందేందుకు నిర్ణయించారు. దీంతో ఒకటిన్నర నెల క్రితం మాతాజి ఇద్దరు దిగంబరస్వాములు, 9 మంది మాతాజీల తో విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోగల మేల సిత్తామూరు మఠం చేరుకున్నారు. ఈమె ఏప్రిల్ 27నుంచి ఆహారం, నీరు సేవించకుండా శుక్ర వారం రాత్రి 8.50 గంటలకు జీవసమాధి పొందారు. మాతాజీ అంత్యక్రియలు శనివారం జరిగాయి. అనేక మంది భక్తులు పూలమాలలు, నెయ్యితో పూజలు నిర్వహించారు. -
చరిత్రాత్మక ప్రాంతంగా మన్యం వీరుడి సమాధి
గొలుగొండ(నర్సీపట్నం): స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధులను చరిత్రాత్మక ప్రాంతాలుగా బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధుల వద్ద మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర పరిపాలనా విభాగం కార్యదర్శి(ఇన్చార్జి) శ్రీకాంత్ నాగులపల్లి నుంచి ఆదేశాలు అందాయి. అల్లూరి పోరా టాలు, ఆయన సంచరించిన ప్రాంతాలపై 2011లో పురావస్తుశాఖ అధ్యయనం చేసింది. అయితే అప్పటిలో కచ్చితమైన సమాచారం లేకపోవడంతో చరిత్రాత్మక ప్రాంతంగా గుర్తించేకపోయారు. తరువాత మళ్లీ అధ్యయనం చేసి, ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం అల్లూరి, గంటందొర పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన ప్రాంతాలు, కృష్ణదేవిపేటలోని సర్వే నంబర్ 120–3–బిలో , 129– 3లో 1.28 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. -
‘వాట్సాప్’ సందేశాలతో సమాధి కూల్చారు
సాక్షి, న్యూఢిల్లీ : పుణెకు సమీపంలోని ‘భీమా కోరేగావ్’లో ఘర్షణలు చెలరేగినప్పుడే ఆ గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘వాడు బుద్రుక్’ గ్రామంలో కూడా ఘర్షణలు చెలరేగాయి. బుద్రుక్ గ్రామానికి కూడా చారిత్రక విశేషం ఉంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు సంభాజీ మహరాజ్ సమాధి ఈ గ్రామంలో ఉంది. (సాక్షి ప్రత్యేకం) వారి ప్రగతిశీల భావాలకుగాను ఈ ఇద్దరు రాజులను మరాఠాలతోపాటు దళితులు కూడా సమంగా ఆరాధిస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రచారంలో ఉన్న ఓ చారిత్రక కథ ప్రకారం మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్‌కు బద్ద శత్రువైన సంభాజీ మహరాజ్‌ను 1689లో హత్య చేయగా, ఆయన శరీర భాగాలు వాడు ముద్రుక్ గ్రామంలో చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ రాజుకు ఎవరు దహన సంస్కారాలు కూడా చేయకూడదంటూ ఢిల్లీ సుల్తాన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులకు స్థానిక ప్రజలు కూడా ఎక్కువ మంది భయపడి పోయారు. (సాక్షి ప్రత్యేకం) అప్పుడు బుద్రుక్ గ్రామానికే చెందిన మహర్ అనే దళితుడు గోవింద్ గైక్వాడ్ ముందుకు వచ్చి ధైర్యంగా మహరాజ్‌కు దహన సంస్కారాలు నిర్వహించారు. అందుకని ఆయన పేరిట గ్రామంలో ఓ స్మారక గహం వెలిసింది. భీమా కోరేగావ్ స్థూపాన్ని సందర్శించే వారంతా ఈ వాడు బుద్రుక్ గ్రామాన్ని కూడా సందర్శిస్తారు. ముందుగా సంభాజీ మహరాజ్ సమాధిని సందర్శించి, ఆ తర్వాత గైక్వాడ్ స్మారక భవనాన్ని సందర్శకులు సందర్శిస్తారని స్థానికులు తెలియజేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈసారి తమ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులను చూశామని పూర్తి పేరు వెల్లడించడానికి ఇష్టపడని గ్రామానికి చెందిన ఓ గైక్వాడ్ తెలిపారు. ఆరెస్సెస్ లాంటి సంస్థలు వాట్సాప్ ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయని తాము గ్రహించామని ఆయన చెప్పారు. (సాక్షి ప్రత్యేకం) ఘర్షణలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా డిసెంబర్ 28వ తేదీనే గ్రామంలో ఓ శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఎట్టి పరిస్థితుల్లో గొడవలు జరుగకుండా చూడాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ చేతుల్లోకి రాళ్లు, ఇతర ఆయుధాలు తీసుకోరాదని యువకులకు పిలుపునిచ్చామని గైక్వాడ్ తెలిపారు. శివప్రతిష్టాన్ నాయకుడు మనోహర్ అలియాస్ సంభాజీ భిడే (గురూజీ–85 ఏళ్లు), సమస్త హిందూ అఘదీ నాయకుడు మిలింద్ ఎక్బోటే (60) పిలుపుతో కొంత మంది ఆరెస్సెస్ కార్యకర్తలు డిసెంబర్ 30వ తేదీన వాడు ముద్రుక్‌లోని గోవింద్ గైక్వాడ్ సమాధిని ధ్వంసం చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ సుల్తానుల చేతుల్లో మరణించిన సంభాజీ మహరాజ్‌కు దళితుడైన గోవింద్ గైక్వాడ్ అంత్యక్రియలు నిర్వహించారని, అందుకే అక్కడ ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారన్న విషయాన్ని జీర్ణించుకోలేకనే ఈ ఇద్దరు వద్ధ హిందూ నాయకులు గోవింద్ గైక్వాడ్ సమాధి ధ్వంసానికి ఆరెస్సెస్ కార్యకర్తలను వాట్సాప్ సందేశాల ద్వారా రెచ్చగొట్టినట్లు తెలుస్తోందని గైక్వాడ్ అభిప్రాయపడ్డారు. (సాక్షి ప్రత్యేకం) బీసీ నాయకుల డిమాండ్ మేరకు మహారాష్ట్ర పోలీసులు ఈ ఇరువురు హిందూ నాయకులపై కేసులు పెట్టారు. అయితే వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎక్బోటే, బిడేలు ఆరెస్సెస్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్నవారు. అల్లర్లు నివారించేందుకు తాము ఎంత కషి చేసినా ఫలితం లేకపోవడం బాధాకరంగా ఉందని గైక్వాడ్ అన్నారు. దళితులే ముందుగా దాడికి దిగారని, అందుకే తాము ఎదురుదాడికి దిగాల్సి వచ్చిందని మరాఠాలు చెబుతున్నారని, తమ గ్రామంలో వంద మంది దళితులు ఉండగా, ఏడువేల మంది మరాఠాలు ఉన్నారని, అలాంటప్పుడు దళితులు దాడి చేయడం అటుంచి, రెచ్చగొట్టే పరిస్థితి కూడా లేదని గైక్వాడ్‌తోపాటు గ్రామంలో శాంతిని కోరుకుంటున్న కొందర పెద్దలు మీడియాతో వ్యాఖ్యానించారు. (సాక్షి ప్రత్యేకం) -
వానరం మృతి.. అన్న సంతర్పణ
లింగాల : వృద్ధ వానరం చనిపోతే మనకెందుకులే అనుకుని మృతదేహాన్ని అవతల పారేయలేదు.. భక్తితో మృతదేహాన్ని ఊరేగించి ఖననం చేయడమేగాక సమాధి కట్టి అన్నదానం కూడా జరిపారు ఆ గ్రామస్తులు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో జరిగింది. ఈనెల 19వ తేదీన ఓ వృద్ధ వానరం మృతిచెందింది. ఆ మర్నాడు దాని మృతదేహాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఖననం చేశారు. ఆ ప్రదేశంలో సమాధి కట్టి శనివారం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రశేఖరరెడ్డి, చెన్నకేశవరెడ్డి, వీరారెడ్డిల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయసహకారాలతో గ్రామ ప్రజలందరికీ అన్న సంతర్పణ నిర్వహించి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భర్త సారెడ్డి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వృషభాలపై మమకారం
పుట్లూరు : వ్యవసాయ రంగంలో ఇంత కాలం కీలకంగా ఉన్న పశుసంపదపై పుట్లూరు మండల వాసులు మమకారాన్ని వీడలేకున్నారు. పంట సాగులో సేద్యం మొదలు... దిగుబడులు ఇంటికి.... అనంతరం మార్కెట్‌కు చేర్చే వరకూ తమ కష్టంలో పాలు పంచుకున్న వృషభాలను ఇక్కడి రైతులు ప్రత్యేకంగా చూస్తుంటారు. ఎంతగా అంటే ఆఖరుకు అవి కాలం చేసిన తర్వాత సగౌరవంగా ఖననం చేసి, సమాధులు కట్టి పూజిస్తున్నారు. వృlషభాలు లేనిదే ఒక్కప్పుడు సేద్యం చేయలేకపోయేవారు. రైతు అనేబడే ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ఓ జత వృlషభాలు తప్పనిసరిగా ఉండేవి. అయితే వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు నెలకొనడంతో వాటిని పోషించుకోలేక రైతులు మదనపడుతూ వచ్చారు. అర్ధాకలితో అలమటిస్తున్న పశుసంపదను కాపాడుకునే మార్గం కానరాక... మరోకరి పంచనైనా వాటికి గ్రాసం దక్కుతుందన్న ఆశతో మనసు చంపుకుని విక్రయాలు సాగించారు. అయితే తమ ఆశయాలను వమ్ము చేస్తూ మధ్య దళారీలు పశుసంపదను కబేళాలకు తరలిస్తుండడంతో అన్నదాతలు కంగు తిన్నారు. దీంతో ఎంతటి కష్టనైనా భరిస్తూ తమ వద్ద ఉన్న పశువులు బతికున్నంత వరకూ మంచిగా చూసుకుంటూ... అవి కాలం చేసిన తర్వాత ఖననం చేసి, సమాధులు కట్టారు. పుట్లూరు గ్రామ పొలాల్లో ఇలాంటి సమాధులు కొకొల్లలుగా కనిపిస్తున్నాయి. -
చనిపోయిన స్వామి బతికొస్తారని భక్తుల హడావిడి
ఇంతకీ ఆయన బతికున్నట్టా? లేనట్టా? కోర్టులు ఆయన చనిపోయారని అంటూంటే, భక్తులు మాత్రం గురువుగారు సమాధిలో ఉన్నారు. కాస్సేపట్లో లేచి వస్తారని వాదిస్తున్నారు. ఆరు వారాలుగా ఆయన భౌతిక కాయాన్ని ఎవర్నీ ముట్టనీయడం లేదు. పోలీసులు, సర్కారు స్వాములోరి సంగతేమి చేయాలో తెలియక తికమకపడుతున్నారు. పంజాబ్ లోని నూర్ మహల్ అనే కుగ్రామాన్ని కేంద్రంగా చేసుకుని దేశ విదేశాల్లో దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్ అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతున్న అశుతోష్ మహారాజ్ ఆరు వారాల క్రితం జనవరి 29న గుండెపోటుతో చనిపోయారు. ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించేశారు. కానీ భక్తులు మాత్రం ఆయన బతికే ఉన్నారని, ప్రస్తుతం సమాధి స్థితిలో ఉన్నారని వాదిస్తున్నారు. అంతే కాదు, కళ్లు మూసుకుంటే చాలు ఆయన కనిపించి సందేశాలు పంపుతున్నారని కూడా చెబుతున్నారు. 'నా శరీరాన్ని కాపాడండి. నేను త్వరలో వస్తున్నాను' అని కూడా చెబుతున్నారట. అందుకే ఆయన్ని శవాలను ఉంచే ఫ్రీజర్ లో భద్రపరిచి ఉంచారట. ప్రభుత్వం, పోలీసులు శవానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. భక్త సమూహం మాత్రం ఏమాత్రం పడనీయడం లేదు. అశుతోష్ మహారాజ్ కి దేశ విదేశాల్లో భక్తులున్నారు. ఆయన ఆశ్రమాలు అన్ని చోట్లా ఉన్నాయి. ఒక పదిహేనేళ్ల క్రితం పశ్చిమబెంగాల్ లో వామపక్షాలకు సన్నిహితుడైన బాలక్ బ్రహ్మచారి విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చనిపోయిన 60 రోజుల వరకూ భౌతికకాయాన్ని అలాగే వుంచి, స్వామి వారు వస్తారని భక్తులు భజనలు చేశారు. చివరికి ఓ రాత్రి పోలీసులు రంగప్రవేశం చేసి అంతిమ సంస్కారాలు చేసేశారు. ఇవన్నీ చూస్తుంటే 'ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా' అనుకోవాల్సిందే కదూ!!