తమిళ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు ప్రత్యేక స్థానం ఉంది. జనాకర్షక పథకాలతో ప్రజల్లో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు జయలలిత. తమిళ రాజకీయాల్లో జనాల చేత ‘అమ్మ’ అని పిలిపించుకున్న వ్యక్తి జయలలిత మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మరణించి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి అభిమానులు మాత్రం ఆమెను ఇంకా మరచిపోలేదు. ఈ క్రమంలో జయలలిత అభిమాని, ఏఐఏడీఎంకే పార్టీ నాయకుడు ఒకరు అమ్మ సమాధి వేదికగా తన కుమారుడి వివాహం జరిపించాడు.