Wedding venue
-
రాష్ట్రపతి భవన్‌కు పెళ్లి కళ
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి వేడుక జరగనుంది. ఈ నెల 12న జరిగే ఈ వేడుక కోసం యంత్రాంగం రాష్ట్రపతి భవన్‌ను ముస్తాబు చేసింది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇంతకీ పెళ్లెవరిది? అని కదా మీ సందేహం! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుటుంబసభ్యులదీ, సంబంధీకులదీ మాత్రం కాదు! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో) పూనమ్ గుప్తా పెళ్లి. పూనమ్ వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతినిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్, పూనమ్ గుప్తా ఓ ఇంటి వారు కానున్నారు. రాష్ట్రపతి ముర్ము సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే కానుక మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పూనమ్‌గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఆర్ఎఫ్) విభాగంలో 81వ ర్యాంకు సాధించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా బిహార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పని చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి పీఎస్ఓగా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న అవ్నీశ్ కుమార్‌తో ఈమె వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లేదా కశ్మీర్లో వివాహం చేయాలని యోచిస్తుండగా కాబోయే వధువు పూనమ్ మాత్రం సరికొత్తగా ఆలోచించారు. ‘మీకు పీఎస్ఓగా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నాకు వివాహం నిశ్చయమైంది. రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. నా కోరికను మీరు తీరుస్తారని ప్రారి్థస్తున్నాను’అంటూ రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందించారు. ‘డియర్, పూనమ్ గుప్తా(పీఎస్వో) మీకు వివాహ శుభాకాంక్షలు. విధుల్లో మీరు కనబరుస్తున్న శ్రద్ద, బాధ్యత నాకెంతో నచ్చాయి. మీ వివాహ వేడుకను రాష్ట్రపతి భవన్లో జరిపేందుకు అనుమతి ఇస్తున్నాను’అంటూ బదులిచ్చారు. దీంతో పూనమ్గుప్తాకు రాష్ట్రపతి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ఇచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముస్తాబవుతున్న రాష్ట్రపతి కార్యాలయం పూనమ్ అవ్నీశ్ల పెళ్లి వేడుకకు రాష్ట్రపతి కార్యాలయంలోని మదర్ థెరిస్సా క్రౌన్కాంప్లెక్స్ సిద్దమైంది. భారతీయ, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికను అలంకరించారు. వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు వంద మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీస్ ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు తెలిసింది. చారిత్రక కట్టడం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి భవన్ చరిత్రల సమ్మేళనంతో కూడిన ఓ కళాఖండమే. మొత్తం నాలుగు అంతస్తుల్లో 340 గదులు ఉంటాయి. గదులు, కారిడార్లు, కోర్టులు, గ్యాలరీలు, సెలూన్లు, వంటశాలలు, ప్రింటింగ్ ప్రెస్, థియేటర్లు... ఇలా వీటన్నింటినీ కాలినడకన తిరుగుతూ చూడాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఇటలీలోని క్విరినల్ ప్యాలస్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశాధినేత భవనంగా రాష్ట్రపతి భవనం నిలుస్తుంది. ప్రఖాత్య అమృత ఉద్యాన్, ఒక మ్యూజియం, గణతంత్ర, అశోక మండపాలు, రాగి ముఖం గల గోపురాలు ఉన్నాయి. ఈ భవన్లో మొట్టమొదటిగా 1948లో స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నివసించారు. రాష్ట్రపతి భవన్లో నివసించిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. -
పెళ్లినాటి ప్రమాణాలు
‘పెళ్లినాటి ప్రమాణాలు పెళ్లయిన మరుసటి రోజే కనిపించవు’ అనే చమత్కారం మాట ఎలా ఉన్నా నవ వధువు సుచీత ముఖర్జీ మాత్రం పెళ్లినాటి ప్రమాణాల విషయంలో పక్కాగా ఉంది. పెళ్లిమండపంలో ఆహ్వానితుల సమక్షంలో చాంతాడంత పొడవు ఉన్న పెళ్లి ప్రమాణాల లిస్ట్ చదవడం మొదలు పెట్టింది. ‘ఇవి నెరవేర్చడం అంత సులువేమీ కాదు’ అని చదవడం మొదలు పెట్టింది. అవి విని పెళ్లికి వచ్చిన వాళ్లు నవ్వులే నవ్వులు. చివరికి వరుడు కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 17.5 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘ఈ వీడియో సరదాగా చేశారో, సీరియస్‌గా చేశారో తెలియదుగానీ పెళ్లి మండపంలో ఇలా చదవడం ఒక ట్రెండ్‌గా మారనుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా 9 మంది మృతి
-
‘అమ్మ’ ఆశీస్సుల కోసం అక్కడే వివాహం
-
‘అమ్మ’ ఆశీస్సుల కోసం అక్కడే వివాహం
చెన్నై: తమిళ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు ప్రత్యేక స్థానం ఉంది. జనాకర్షక పథకాలతో ప్రజల్లో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు జయలలిత. తమిళ రాజకీయాల్లో జనాల చేత ‘అమ్మ’ అని పిలిపించుకున్న వ్యక్తి జయలలిత మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మరణించి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి అభిమానులు మాత్రం ఆమెను ఇంకా మరచిపోలేదు. ఈ క్రమంలో జయలలిత అభిమాని, ఏఐఏడీఎంకే పార్టీ నాయకుడు ఒకరు అమ్మ సమాధి వేదికగా తన కుమారుడి వివాహం జరిపించాడు. ఆ వివరాలు.. ఏఐడీఏంకే నాయకుడు ఎస్ భవానీశంకర్ తన కుమారుడు సాంబశివరామన్ వివాహాన్ని అమ్మ సమాధి దగ్గర జరిపించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన కుమారుడికి అమ్మ ఆశీస్సులు అందాలనే ఉద్దేశంతోనే పెళ్లి ఏర్పాట్లు ఇక్కడ చేశానని తెలిపాడు భవానీశంకర్. అయితే అమ్మ సమాధి వద్ద వివాహం జరపించడానికి అధికారుల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకకు పలువురు పార్టీ ప్రముఖులతో పాటు కార్యకర్తలు కూడా హాజరయ్యారు. వివాహం సందర్భంగా అమ్మ సమాధిని అందంగా అలంకరించారు. -
‘ఇదొక అందమైన, అరుదైన అనుభూతి’
ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి వేడుకను రొటీన్‌గా కాకుండా కాస్త ప్రత్యేకంగా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు. ముంబైకి చెందిన ప్రబీర్, సయాలీ కొర్రియాలు కూడా ఆ కోవకు చెందిన వారే. అందుకే ‘ఆంగ్రియా’ వేదికగా సముద్రం మధ్యలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ‘ఇదొక అందమైన, అరుదైన అనుభూతి. ఇది నా కల. మొదటిసారిగా క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్నా’ అంటూ వధువు సయాలీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. భర్తతో కలిసి కేక్ కట్‌చేసి తియ్యని వేడుక చేసుకున్నారు. ఆంగ్రియా.. ది క్రూయిజ్! భారత తొలి లగ్జరీ క్రూయిజ్ షిప్ పేరే ఆంగ్రియా. ముంబై నుంచి గోవాల మధ్య ప్రయాణించే ఈ తొలి దేశీయ నౌక వేదికగా.. ‘సముద్రంలో అరుదైన అనుభూతితో ఓ జంట ఒక్కటైంది. ఇలా పెళ్లి వేడుకకు ఆంగ్రియా వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. నౌక కెప్టెన్‌గా నాకు పెళ్లి నిర్వహించే అవకాశం ఉంది’ అంటూ కెప్టెన్ ఇర్విన్ సీక్వెరియా ఆనందం వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల కెరీర్లో 60 నౌకలకు కెప్టెన్‌గా వ్యవహరించిన తనకు ఇది కొత్త అనుభూతి అన్నారు. కాగా ఆంగ్రియా ఆరు డెక్‌లు, 104 క్యాబిన్లతో చాలా విశాలంగా ఉంటుంది. ఒకేసారి 399 మంది ప్యాసింజర్లను తీసుకువెళ్లగలదు. వర్షాకాలంలో తప్ప మిగతా అన్ని కాలాల్లో వారానికి నాలుగు సార్లు ఈ నౌక ముంబై- గోవాల మధ్య ప్రయాణిస్తుంది. టికెట్ ధర 7 నుంచి 12 వేల వరకు ఉంటుంది. -
సీన్ రివర్స్.. ఆమెనే గుర్రంపై వచ్చింది
సాక్షి, లక్నో : సాధారణంగా పెళ్లి కూతురును తీసుకెళ్లేందుకు పెళ్లి కొడుకు అతడి మంది మార్బలం బ్యాండ్ బాజా బారత్‌తో దర్జాగా హుందాగా వస్తాడు. వచ్చి రాగానే అతిథ్య మర్యాదలను పిల్లనిచ్చేవారు చేస్తారు. వాటిలో ఏమాత్రం లోటుపాట్లు జరిగినా అలిగి అవతలికి పోతారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని నయేపూర్ అనే గ్రామంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. సుమన్ రాణి పటేల్ అనే వధువే గుర్రం ఎక్కి వరుడు ఇంటికి వచ్చి ట్రెండ్ సెట్ చేసింది. తన అత్తమామలు బంధువులు ఇచ్చే మర్యాదలు స్వీకరించింది. వరుడిని త్వరగా తీసుకెళ్లాలి సిద్ధం చేయండంటూ ఆర్డర్స్ వేసింది. అయితే, ఈ ఐడియాను ఇచ్చింది పెళ్లి కుమారుడి తండ్రేనట. డాక్టర్ కశ్యప్ అనే ఆయన సమాజంలో లింగ సమానత్వం ఉండాలని, పురుషుడు, స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని ఒప్పించే క్రమంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఇరు కుటుంబాలను అంగీకరించేలా చేశాడు. రాజ్‌లక్ష్మీ గ్రామ్యాంచల్ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో పెళ్లి కూతురు సుమన్ రాణి ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. అయితే, ఆమెకు టీచర్ ఉద్యోగం అంటేనే మక్కువ అంట. ఇక పెళ్లి కుమారుడు రాజా థాకుర్ మాత్రం రైల్వేశాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. -
వేలాడుతూ.. వేదికకు!
ఇంతవరకూ కనీవినీ ఎరగని రీతిలో, అత్యంత అరుదైన వేదికలో వివాహం చేసుకోవాలని భావించిందో యువజంట. వివాహబంధం ద్వారా తామిద్దరం ఒకటవుతున్నామన్న ఆనందంలో వారు ఎంతో సాహసం చేసి తమ పెళ్లిని రికార్డు పుటల్లో ఎక్కించారు. పెళ్లి వేదిక దిశగా వారు చేసిన ప్రయాణం ఔరా అనిపించేలా ఉంది. స్ట్రిఫ్రాన్, సునా అనే ఆ జంట కాలిఫోర్నియాలోని యోసెమైట్ నేషనల్ పార్క్‌లోని ‘లాస్ట్ యారోస్పైర్ హైలైన్’ అనే శిలను తమ పెళ్లివేదికగా నిర్ణయించుకొన్నారు. రాళ్లదారి వెంబడి నడుస్తూ... తాళ్లకు వేలాడుతూ భూమికి మూడువేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ఏకశిలను చేరారు. ఈ జంట ప్రతిపాదన విని చాలామంది కెమెరామెన్ వెనుకడుగు వేశారట. అంత రిస్క్ చేయలేమని నిర్మొహమాటంగా చెప్పారట. అయితే బెన్హర్టన్ అనే ఒక ఫోటోగ్రాఫర్ మాత్రం ధైర్యంగా... ఉత్సాహంగా ముందుకొచ్చాడు. వీరికన్నా ఎక్కువగా సాహసం చేసి మరీ వీరి పెళ్లి ప్రయాణాన్ని తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటోలు చూశాక... ముందు కుదరదని తెగేసి చెప్పిన ఫొటోగ్రాఫర్లు మాత్రం తాము రికార్డు మిస్సయినందుకు ఉసూరుమన్నారట!