
‘పెళ్లినాటి ప్రమాణాలు పెళ్లయిన మరుసటి రోజే కనిపించవు’ అనే చమత్కారం మాట ఎలా ఉన్నా నవ వధువు సుచీత ముఖర్జీ మాత్రం పెళ్లినాటి ప్రమాణాల విషయంలో పక్కాగా ఉంది. పెళ్లిమండపంలో ఆహ్వానితుల సమక్షంలో చాంతాడంత పొడవు ఉన్న పెళ్లి ప్రమాణాల లిస్ట్ చదవడం మొదలు పెట్టింది.
‘ఇవి నెరవేర్చడం అంత సులువేమీ కాదు’ అని చదవడం మొదలు పెట్టింది. అవి విని పెళ్లికి వచ్చిన వాళ్లు నవ్వులే నవ్వులు. చివరికి వరుడు కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 17.5 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది.
‘ఈ వీడియో సరదాగా చేశారో, సీరియస్‌గా చేశారో తెలియదుగానీ పెళ్లి మండపంలో ఇలా చదవడం ఒక ట్రెండ్‌గా మారనుంది’ అంటూ నెటిజనులు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment