wedding hall
-
అతిథుల డ్యాన్స్.. కూలిపోయిన రిసెప్షన్ వేదిక
వధువరులు, బంధువులు ఆనందంతో ఎంజాయ్ చేసే వివాహ రిసెప్షన్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. వేడుకలో భాగంగా డ్యాన్స్ చేసే క్రమంలో అకస్మాత్తుగా వెడ్డింగ్ హాల్ ఫ్లోర్ కూలిపోయింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వధువరులతో పాటు సుమారు 30 మంది అతిథులు 25 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లోర్‌ను నుంచి కిందకు పడిపోయారు. దీంతో గాయపడిన వారిని స్థానిక అస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... వరుడు పాలో ముగ్నైనీ, వధువు వలేరియా యబరా తమ వివాహాన్ని ఇటలీలోని పిస్టోయాలో ఉన్న ఓ వెడ్డింగ్ హాల్లో ఏర్పాటు చేశారు. హాల్లోని వేదికపై నూతన వధూవరులతో పాటు సుమారు 30 మంది అతిథులు ఉన్నారు. ఆనందంతో వారంతా డ్యాన్స్ చేయటం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. అందరూ వేదిక చెక్కల మధ్య ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడ్డవారంతా పిస్టోయాలోని శాన్ జకోపో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై పెళ్లి కొడుకు ముగ్నైని మాట్లాడుతూ.. ‘రిసెప్షన్ వేదిక కుప్పకూలే ముందు అంతా సంతోషంగా ఉన్నాం. అతిథులు డాన్స్ చేసేసరికి ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. నేను కూడా వాళ్లతోపాటు పడిపోయాను. నాపై చాలా మంది పడ్డారు. వెంటనే నా భార్య వలేరియా ఎక్కడ ఉందో వెతికాను. ఆమె కనిపించకపోయే సరికి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. చివరకు ఇద్దరం కలిసి ఆస్పత్రిలో చేరాం.. పక్కపక్క బెడ్లో ఉండి చికిత్స పొందుతున్నాం’ అని ముగ్నైని తెలిపారు. చదవండి: Pakistan: పార్టీ జెండాపై గొడవ.. కన్న కొడుకును హతమార్చిన తండ్రి -
పెళ్లినాటి ప్రమాణాలు
‘పెళ్లినాటి ప్రమాణాలు పెళ్లయిన మరుసటి రోజే కనిపించవు’ అనే చమత్కారం మాట ఎలా ఉన్నా నవ వధువు సుచీత ముఖర్జీ మాత్రం పెళ్లినాటి ప్రమాణాల విషయంలో పక్కాగా ఉంది. పెళ్లిమండపంలో ఆహ్వానితుల సమక్షంలో చాంతాడంత పొడవు ఉన్న పెళ్లి ప్రమాణాల లిస్ట్ చదవడం మొదలు పెట్టింది. ‘ఇవి నెరవేర్చడం అంత సులువేమీ కాదు’ అని చదవడం మొదలు పెట్టింది. అవి విని పెళ్లికి వచ్చిన వాళ్లు నవ్వులే నవ్వులు. చివరికి వరుడు కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 17.5 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘ఈ వీడియో సరదాగా చేశారో, సీరియస్‌గా చేశారో తెలియదుగానీ పెళ్లి మండపంలో ఇలా చదవడం ఒక ట్రెండ్‌గా మారనుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు!
పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే ఓ వేడక. అందుకే జీవితంలో ఇది మర్చిపోలేని రోజుల్లో ఒకటిగా పేర్కొంటుంటారు. అంతటి విశిష్టత ఉంది కనుకే పెళ్లి రోజు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఇక భారతీయ వివాహాలపై ఓ లుక్కేస్తే అందులో జరిగే హడావుడి మామూలుగా ఉండదు. వధూవరుల కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు, తతంగాలను చేస్తూ అలిసిపోతే, వధూవరులు మాత్రం పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని అలిసిపోతారు. ఇక రాత్రివేళ ముహూర్తాలు ఉన్న సమయంలో వధూవరుల అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓ వధువు తన పెళ్లిరోజు మండపంలో చేసిన పని అందరికీ నవ్వ తెప్పించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఆ వీడియో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆ మండపంలో వరుడు వివాహ కార్యక్రమాలలో తతంగాలలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వధువు కూడా బిజీగా ఉందనుకుంటే పొరపడినట్లే. అంతవరకు జరిగిన కార్యక్రమాల్లో వధువు పాల్గొని అలిసిపోయిందేమో గానీ ఆమె మాత్రం ఓ కూర్చీలో పడుకుని ఆదమరిచి నిద్రపోతోంది. పెళ్లికి వచ్చిన వారిలో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. పవర్ నాప్ అంటే ఇదే అంటూ వీడియోలో కామెంట్ కూడా ఆ వీడియోకి జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట హల్ చల్ చేస్తోంది. ఇక నెటిజన్లు వధువు పరిస్థితి చూసి పడిపడీ నవ్వుకుంటున్నారు. పాపం నిద్ర వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం పెళ్లికూతురిని ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి పెట్టుకుని ఇదేం పనంటూ సెటైర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Candid Impressions🧿📸 (@candid_impressions) చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే -
కూతురు పెళ్లి చూసి..పెళ్లి పందిట్లోనే కుప్పకూలిన తండ్రి
సాక్షి, పెద్దపల్లి: కూతురి పెళ్లిని కళ్లారా చూసిన కాసేపటికే.. ఒక తండ్రి కుప్పకూలి కన్నుమూశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ సంఘటనపై స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఎలిగేటి శంకర్ (55) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన కూతురు వివాహాన్ని బుధవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిపించారు. పెళ్లితంతు ముగిసిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలారు. బంధువులు అతన్ని హుటాహుటిన గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. వివిధ పత్రికల్లో పాత్రికేయునిగా పనిచేసిన శంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లిబాజాలు మోగిన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: కూతురికి కానుకగా వచ్చిన బంగారంతో పుస్తెలు చేయించి.. -
వరుడికి ట్రాఫిక్ కష్టాలు... కాలినడకన వెళ్లిన తాళి కట్టాడు
కర్ణాటక(యశవంతపుర): ఓ వైపు ముహూర్తం దగ్గర పడుతోంది... రోడ్డంతా ట్రాఫిక్ జామ్... కల్యాణ మంటపం చేరుకోవడానికి పెళ్లి కుమారుడితో బయలుదేరిన బంధువులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఇక లాభం లేదనుకున్న పెళ్లి కుమారుడు కాలినడకన కల్యాణ మంటపానికి వెళ్లి వధువు మెడలో మూడుముళ్లు వేశారు. చామరాజనగరకు చెందిన వధువుకు, తమిళనాడులోని సత్యమంగళకు చెందిన వరుడికి వివాహం నిశ్చయమైంది. సత్యమంగల సమీపంలోని బన్నారి ఆలయంలో శుక్రవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. గురువారం రాత్రి కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో సత్యమంగలం అటవీ ప్రాంతం వద్ద రాత్రి సమయంలో వాహన సంచారాన్ని నిషేధించారు. దీంతో మరుసటిరోజు ఉదయం రోడ్డు పొడవునా వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇదే సమయంలో ఓ పెళ్లి కుమారుడు, బంధువులు కారులో వచ్చారు. ట్రాఫిక్ పునరుద్ధరణకు గంటల కొద్ది సమయం పడుతుందని తెలియడంతో పెళ్లి కుమారుడు కాలినడకన మంటపానికి బయలుదేరాడు. సకాలంలో అక్కడికి చేరుకుని వధువు మెడలో తాళికట్టాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వైరల్: పెళ్లంటే ఇదేరా.. వంట పాత్రలో వెడ్డింగ్ హాల్‌కి వచ్చిన కొత్త జంట
అలప్పజ( కొచ్చి): కేరళను వరదలు ముంచెత్తడంతో అక్కడి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల రవాణా కూడా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఓ జంట పెద్దలు నిశ్చయించిన ముహుర్తానికే తమ పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకుని, ఆటంకాలను దాటుకుంటూ వివాహ తంతుని పూర్తి చేశారు. అయితే ఇందులో ఏముందనుకుంటున్నారా.. వానలు కాబట్టి పడవ మీద వచ్చుంటారు అనుకుంటే పొరపాటే. పెండ్లి మంటపానికి వారిద్దరు అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని వచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో స్థానిక టీవీ చానెల్లో ప్రసారమవడంతో పాటు ఆ జంట సెలబ్రిటీగా మారంది. వివరాల్లోకి వెళితే.. ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్న ఆకాష్, ఐశ్వర్యల వివాహం సోమవారం జరపాలని పెద్దలు నిశ్చయించారు. అయితే ప్రస్తుతం కేరళలోని వరదల కారణంగా అది వీలుపడదని అనుకున్నారంతా. కానీ తమ జీవితంలో ముఖ్యమైన రోజుని వాయిదా వేయడం ఇష్టంలేని ఆ వధూవరులు మాత్రం ధైర్యంతో ముందుకు కదిలారు. చుట్టూ ఎటు చూసిన నీళ్లు ఉండడంతో వారు ఏకంగా ఓ భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని తలవడిలోని ఫంక్షన్ హాల్‌కు అతి కష్టం మీద చేరుకున్నారు. అఖరికి పెండ్లి మంటపం సైతం నీటితో నిండిపోయింది అయినా అవేవి వారి నిర్ణయాన్ని ఆపలేకపోయింది. ఈ పెళ్లికి పరిమిత అతిధులు, బంధువులను ఆహ్వానించి వారి సమక్షంలోనే తమ వివాహ తంతు ముగించేశారు. ఇక నవ దంపతులు ఇద్దరూ చెంగనూర్‌లోని దవాఖానలో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. #Kerala couple uses a huge cooking vessel as a makeshift boat to reach their wedding venue amidst #heavyrains #KeralaFloods #KeralaRains pic.twitter.com/NiIUpRcrnc — Diksha Yadav (@DikshaY62646349) October 18, 2021 చదవండి: లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది -
పెళ్లి మంటపంపైనే నగలు చోరీ
డిచ్పల్లి : వివాహ వేదికపైనే సుమారు 35 తులాల బంగారు ఆభరణాలను దొంగలు రెప్పపాటులో దోచుకెళ్లారు. ఆనందంగా పెళ్లి వేడుకలో మునిగిన వరుడు, వధువు, వారి బంధువులు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. సిద్దిపేటకు చెందిన ఫణీంద్రకు, మహారాష్ట్ర ఉమ్రికి చెందిన కావ్యతో డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని బృందావనం గార్డెన్స్‌లో బుధవారం పెళ్లి జరిగింది. పెళ్లి జరగుతున్న సమయంలో 25, 30 ఏళ్ల వయసున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి ముందు వరస కుర్చీల్లో కూర్చున్నారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వధువు ఫొటోలు దిగేందుకు తన బంగారు నగలను తరచూ మార్చుతూ ఉంది. నగలను సమీప బంధువైన ఓ మహిళ వద్ద ఉన్న బ్యాగులో ఉంచారు. ఇంతలో ఇద్దరు దొంగల్లో ఒకరు స్టేజీ పైకి చేరుకుని నగలు పట్టుకున్న మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ మహిళ మైకంలో ఉన్న సమయంలోనే ఆమె వద్ద ఉన్న నగల బ్యాగును ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని ఇద్దరు దొంగలు క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించారు. కొద్దిసేపటికి మైకం నుంచి కోలుకున్న మహిళ నగల బ్యాగు కన్పించక పోవడంతో ఆందోళనగా విషయాన్ని పెళ్లి వారికి తెలిపింది. దీంతో అప్పటివరకు ఎంతో హుషారుగా సాగుతున్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కలకలం రేగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేశ్‌కుమార్ సీసీ టీవీ పుటేజీలతో పాటు పెళ్లి వేడుకల్లో రికార్డు చేసిన వీడియోలను పరిశీలించి ఇద్దరు అనుమానితులను గుర్తించారు. -
పెళ్లి మండపం కుప్పకూలి పదిమంది మృతి
చైనాలోని ఝీజియాంగ్ రాష్ట్రంలో పెళ్లిమండపం కుప్పకూలి పదిమంది మరణించారు. యాజువాయంగ్ గ్రామంలో దాదాపు 200 మంది వరకు అతిథులు ఓ పురాతన భవనంలో పెళ్లికి హాజరైనప్పుడు ఈ భవనం కూలిపోయింది. దాదాపు 91 మంది తీవ్రంగా గాయాలపాటు కావడంతో వారిని ఆస్పత్రులకు తరలించారు. వారిలో 11 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తాను భోజనం చేయడానికి కూర్చోగానే చెక్కలు విరుగుతున్న చప్పుడు వినిపించిందని, తాను పైకి చూసేసరికి పైకప్పు కూలి కింద పడిందని చెన్న డియాన్ జాంగ్ అనే క్షతగాత్రుడు తెలిపాడు. అతడికి నడుము, కాళ్లు విరిగాయి. భవనం పైకప్పు మీద భారీగా మంచు పేరుకుపోవడం వల్ల కూడా భవనం కూలి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.