చైనాలోని ఝీజియాంగ్ రాష్ట్రంలో పెళ్లిమండపం కుప్పకూలి పదిమంది మరణించారు. యాజువాయంగ్ గ్రామంలో దాదాపు 200 మంది వరకు అతిథులు ఓ పురాతన భవనంలో పెళ్లికి హాజరైనప్పుడు ఈ భవనం కూలిపోయింది. దాదాపు 91 మంది తీవ్రంగా గాయాలపాటు కావడంతో వారిని ఆస్పత్రులకు తరలించారు.
వారిలో 11 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తాను భోజనం చేయడానికి కూర్చోగానే చెక్కలు విరుగుతున్న చప్పుడు వినిపించిందని, తాను పైకి చూసేసరికి పైకప్పు కూలి కింద పడిందని చెన్న డియాన్ జాంగ్ అనే క్షతగాత్రుడు తెలిపాడు. అతడికి నడుము, కాళ్లు విరిగాయి. భవనం పైకప్పు మీద భారీగా మంచు పేరుకుపోవడం వల్ల కూడా భవనం కూలి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పెళ్లి మండపం కుప్పకూలి పదిమంది మృతి
Published Fri, Feb 14 2014 3:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement