
ఎలిగేటి శంకర్ (ఫైల్)
సాక్షి, పెద్దపల్లి: కూతురి పెళ్లిని కళ్లారా చూసిన కాసేపటికే.. ఒక తండ్రి కుప్పకూలి కన్నుమూశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ సంఘటనపై స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఎలిగేటి శంకర్ (55) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన కూతురు వివాహాన్ని బుధవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిపించారు.
పెళ్లితంతు ముగిసిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలారు. బంధువులు అతన్ని హుటాహుటిన గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. వివిధ పత్రికల్లో పాత్రికేయునిగా పనిచేసిన శంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లిబాజాలు మోగిన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
చదవండి: కూతురికి కానుకగా వచ్చిన బంగారంతో పుస్తెలు చేయించి..
Comments
Please login to add a commentAdd a comment