వేలాడుతూ.. వేదికకు! | wedding at yosemite national park of california | Sakshi
Sakshi News home page

వేలాడుతూ.. వేదికకు!

Published Mon, Nov 18 2013 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

వేలాడుతూ.. వేదికకు!

వేలాడుతూ.. వేదికకు!

ఇంతవరకూ కనీవినీ ఎరగని రీతిలో, అత్యంత అరుదైన వేదికలో వివాహం చేసుకోవాలని భావించిందో యువజంట. వివాహబంధం ద్వారా తామిద్దరం ఒకటవుతున్నామన్న ఆనందంలో వారు ఎంతో సాహసం చేసి తమ పెళ్లిని రికార్డు పుటల్లో ఎక్కించారు. పెళ్లి వేదిక దిశగా వారు చేసిన ప్రయాణం ఔరా అనిపించేలా ఉంది.

స్ట్రిఫ్రాన్, సునా అనే ఆ జంట కాలిఫోర్నియాలోని యోసెమైట్ నేషనల్ పార్క్‌లోని ‘లాస్ట్ యారోస్పైర్ హైలైన్’ అనే శిలను తమ పెళ్లివేదికగా నిర్ణయించుకొన్నారు. రాళ్లదారి వెంబడి నడుస్తూ... తాళ్లకు వేలాడుతూ భూమికి మూడువేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ఏకశిలను చేరారు. ఈ జంట ప్రతిపాదన విని చాలామంది కెమెరామెన్ వెనుకడుగు వేశారట.

అంత రిస్క్ చేయలేమని నిర్మొహమాటంగా చెప్పారట. అయితే బెన్‌హర్టన్ అనే ఒక ఫోటోగ్రాఫర్ మాత్రం ధైర్యంగా... ఉత్సాహంగా ముందుకొచ్చాడు. వీరికన్నా ఎక్కువగా సాహసం చేసి మరీ వీరి పెళ్లి ప్రయాణాన్ని తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటోలు చూశాక... ముందు కుదరదని తెగేసి చెప్పిన ఫొటోగ్రాఫర్లు మాత్రం తాము రికార్డు మిస్సయినందుకు ఉసూరుమన్నారట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement